socia media
-
కూటమి ప్రభుత్వంపై మా పోరాటం ఆగదు: తాటిపర్తి
సాక్షి,ప్రకాశం జిల్లా : యర్రగొండపాలెం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌కి పోలీసులు నోటీసులు అందించారు. ఎక్స్ వేదికగా నారా లోకేష్‌పై పెట్టిన పోస్టింగ్‌తో పాటు ఎన్నికల సమయంలో పెట్టిన నాలుగు కేసులకు సంబంధించి ఎర్రగొండపాలెం ఎస్సై చౌడయ్య నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులపై ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా.. ఎన్నికుట్రలు చేసినా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను నొక్కేయాలనే కుట్రతోనే వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై విచ్చలవిడిగా కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. అయినప్పటికీ కూటమి ప్రభుత్వంపై తమ పోరాటం ఆగదని అన్నారు. -
ట్రోలర్స్‌కు మంచు విష్ణు హెచ్చరిక
సోషల్ మీడియా కీచకుడు ప్రణీత్ హనుమంతును పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్నేళ్లుగా తన స్నేహితులతో వీడియో చాటింగ్ చేస్తూ అసభ్యకర మాటలతో రెచ్చిపోతున్న ప్రణీత్ హనుమంతు తీరుపై టాలీవుడ్ హీరో సాయి దుర్గ తేజ్ మొదటిసారి రియాక్ట్ అయ్యాడు. ఆయన తీరును తప్పుబడుతూ ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులకు సోషల్ మీడియా ద్వారా విషయాన్ని షేర్ చేశారు. దీంతో ఈ విషయం నెట్టింట వైరల్ అయింది. ఇలాంటి చిల్లర కామెంట్లు చేస్తున్న వ్యక్తుల గురించి తాజాగా 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు.సోషల్ మీడియాలో డార్క్ కామెడీ పేరుతో నటీనటులపై ట్రోలింగ్ చేస్తూ ఎవరైనా వీడియోలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంచు విష్ణు తెలిపారు. ప్రపంచంలో తెలుగు వాళ్లకు మంచి పేరు ఉంది. కానీ ఈ మధ్య కొంత మంది సోషల్ మీడియాలో డార్క్ కామెడీ, ఫన్నీ ట్రోలింగ్ వీడియోలతో చెడ్డ పేరు తీసుకొస్తున్నారని ఆయన అన్నారు. కామెడీ పేరుతో ఇలాంటి వీడియోలు చేయడం సరికాదని విష్ణు సూచించారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వాళ్లపై సైబర్ సెక్యూరిటీ వాళ్లకు పిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఇకనుంచి సోషల్ మీడియాలో ఉన్న వారందరూ తమ తీరును మార్చుకోవాలని మంచు విష్ణు కోరారు. సోషల్ మీడియాలో ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులకు మంచు విష్ణు అప్పీల్ చేశారు. -
భార్యను దారుణంగా చంపిన భర్త..కారణమిదే..
కోల్‌కతా : సోషల్ మీడియా ఆ దంపతుల జీవితాల్లో విషాదం నింపింది. భార్య సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడం భర్తకు నచ్చలేదు. ఈ విషయమై రోజూ ఇద్దరి మధ్య తీవ్ర గొడవ జరుగుతూ ఉండేది. ఈ క్రమంలోనే భర్త కూరగాయలు కోసే కత్తితో భార్య గొంతు కోసి చంపాడు. చంపిన తర్వాత ఇంట్లో నుంచి పారిపోయాడు. ఈ ఘటన పశ్చిమబెంగాల్లోని సౌత్ 24 పరగణాల జిల్లాలోని హరియాణాపూర్‌లో జరిగింది. ఈ దారుణమైన ఘటన గురించి ఆ దంపతుల మైనర్ కుమారుడు మీడియాతో మాట్లాడాడు. ‘మా అమ్మ, నాన్న పరిమల్, అపర్ణ బైద్య ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేవారు. నాన్న అమ్మ గొంతు కోస్తామని చాలాసార్లు బెదిరించాడు. హత్య జరిగిన రోజు నేను ఇంటికి వచ్చి చూసేసరికి అమ్మ రక్తంతో కింద పడి ఉంది. వెంటనే పక్కింటివారికి విషయం చెప్పాను’ అని దంపతుల కుమారుడు తెలిపాడు. ‘అపర్ణ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడంపై పరిమల్ తరచూ గొడవ పడుతుండేవాడు. సోషల్ మీడియాలో అపర్ణకు కొందరు ఆన్లైన్ ఫ్రెండ్స్ కూడా ఏర్పడ్డారు. ఈ కారణంతోనే పరిమల్ అపర్ణను చంపాడు. హత్య తర్వాత పరిమల్ పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకోవడానికి గాలింపు జరుగుతోంది’ అని పోలీసులు తెలిపారు. ఇదీచదవండి..దేశంలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు -
వీళ్లు గోడ కట్టడం చూస్తే..‘ఇదేందయ్యా..ఇది’ అనకుండా ఉండలేరు!
సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని వీడియోలు చూపరులకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఆ వీడియోలను చూస్తే జనానికి ఇటువంటి ఐడియాలు ఎలా వస్తాయో అంటూ ముక్కున వేలేసుకుంటాం. కొందరు కార్లను హెలీకాప్టర్లుగా మార్చేస్తూ ఉంటే, మరికొందరు ఇటుకలతో కూలర్ తయారు చేస్తారు. @TansuYegen పేరుతో ట్విట్టర్లో ఈ కోవకు చెందిన ఒక వీడియో ఇప్పుడు నెటిజన్లను కట్టిపడేస్తోంది. దీనిని చూసినవారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో @TansuYegen పేరుతో ట్విట్టర్లో షేర్ అయ్యింది. ఈ వీడియోలో కొందరు కూలీలు గోడ నిర్మించడం కనిపిస్తుంది. ఇద్దరు కూలీలు రెండు కర్ర చెక్కలపై కూర్చుని కనిపిస్తారు. వారు కిందకు మీదకు కదులుతుంటారు. ఈ చెక్కలకు మరోవైపున ఉన్న కూలీలు ఆ చెక్కలను పైకి కిందకు కదుపుతుంటారు. ఒక కూలీ ఇటుక, సిమెంట్లను పైనున్న కూలీకి అందిస్తుండగా అతను వాటిని పైనున్న కూలీకి అందిస్తుంటాడు. వాటిని అందుకున్న ఆ కూలీ గోడను వేగంగా నిర్మిస్తుంటాడు. Everything can be automated.., pic.twitter.com/VOow1m1b55 — Tansu YEĞEN (@TansuYegen) July 6, 2023 సూపర్ ఐడియా అంటూ.. ఈ వీడియోను ఇప్పటివరకూ 2.5 మిలియన్లమందిపైగా నెటిజన్లు వీక్షించారు. చాలామంది దీనిని సూపర్ ఐడియా అంటూ ఆ కూలీలను మెచ్చుకుంటున్నారు. ఈ టెక్నిక్ నిర్మాణ పనిని మరింత వేగవంతం చేస్తుందనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: బైక్ హెల్మెట్ ధరించి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్.. కారణం తెలిస్తే షాకవుతారు.. -
'నువ్వేమీ పెద్ద హీరోయిన్ కాదు'.. అనుపమ రిప్లై అదిరిందిగా
తెలుగులో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న మలయాళీ భామ అనుపమ పరమేశ్వరన్. సౌత్ ఇండస్ట్రీలో అత్యధికంగా ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో ఈమె ఒకరు. 'అఆ' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ కేరళ కుట్టికి టాలీవుడ్లో విపరీతమైన క్రేజ్ ఉంది. తెలుగుతోపాటు.. తమిళం, మలయాళంలోనూ అనేక చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ఈ బ్యూటీ. కానీ ఆమెకు పెద్ద హీరోలతో నటించే అవకాశం దక్కలేదు. ఈ ఏడాది కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హిట్ ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత 18 పేజీస్ చిత్రంలో నటించింది. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లకు టట్‌లో ఉంటుంది. (ఇదీ చదవండి : కారు ప్రమాదం... షాక్‌లోకి వెళ్లిపోయానన్న నటి) తాజాగా ఒక నెటిజన్ 'నువ్వు పెద్ద హీరోయిన్‌వి ఏమీ కాదు.. అందుకే భారీ సినిమాల్లో నటించే అవకాశం రావడం లేదు.. అసలు మీరు హీరోయిన్ మెటీరియలే కాదు' అని కామెంట్ చేశాడు. దీంతో అనుపమ ఎంతో వినయంగా సమాధానం ఇచ్చింది. 'మీరు చెప్తుంది కరెక్టే అన్నా.. నేను హీరోయిన్ టైప్ కాదు, నేను యాక్టర్ టైప్' అని చాచి చెంపపై కొట్టినట్లు బదులిస్తూనే స్మైలీ ఎమోజీలను జత చేసింది. ఇది చూసిన నెటిజన్లు అనుపమకు మద్ధతుగా కామెంట్స్ చేస్తున్నారు. బ్యూటీతో పాటు టాలెంట్ ఉన్న నటి అంటూ ఆమెను పొగుడుతున్నారు. ఇది ఇలా ఉంటే అనుపమ ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డ హీరోగా వస్తున్న డిజే టిల్లూ స్క్వేర్తో పాటు.. రవితేజ రాబోయే భారీ యాక్షన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. (ఇదీ చదవండి: అలాంటి వ్యక్తినే మనువాడతా: టాప్ హీరోయిన్) -
అది నాకు చాలా సరదా.. కేవలం ఈఎమ్ఐల కోసమే.. జాన్వీకపూర్ కామెంట్స్ వైరల్
బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ధడక్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. ఇటీవలే ఆమె నటించిన థ్రిల్లర్ సినిమా థియేటర్లలో విడుదలైంది. మలయాళంలో సూపర్ హిట్ మూవీ హెలెన్‌కు రిమేక్‌గా తెరకెక్కించారు. ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ అభిమానుల్లో స్థానం సంపాదించుకుంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ డోస్ ఫోటోలను షేర్ చేస్తూ యూత్‌కు మరింత దగ్గరైంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ కపూర్ ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. సోషల్ మీడియాలో చేసే పోస్టులపై షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు. వాటిని తానేప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదని.. అవి కేవలం ఫన్ కోసం మాత్రమేనంటూ కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ ఫోటో షూట్ చేయడం వల్ల మరింత మంది అభిమానులకు దగ్గరవుతానని తెలిపింది. ఇది తన ఈఎమ్ఐలు చెల్లించేందుగకు సహాయపడుతుందని జాన్వీ కపూర్ షాకింగ్ కామెంట్స్ చేసింది. జాన్వీ కపూర్ మాట్లాడుతూ..'నేను వాటిని అంత సీరియస్‌గా తీసుకోను. సోషల్ మీడియా అంటే నాకు చాలా సరదాగా ఉంటుంది. నేను క్యూట్‌గా కనిపించడంతో నా చిత్రాలను అభిమానులు ఇష్టపడతారు. వాటివల్ల వచ్చే ఆదాయంతో సులభంగా ఈఎమ్ఐలు కడుతున్నా." అని జాన్వీ కపూర్ పేర్కొంది. -
వీడియో: శ్రీ చైతన్య కాలేజీలో షాకింగ్ ఘటన.. మరీ ఇంత దారుణమా?
లబ్బీపేట (విజయవాడ తూర్పు): తరగతి గదిలో మాట్లాడాడని ఓ విద్యారి్థని అధ్యాపకుడు చెంపలు వాయించడంతో పాటు, కాలితో తన్నిన ఘటన శుక్రవారం కలకలం రేపింది. విజయవాడ బెంజిసర్కిల్ సమీపంలోని శ్రీ చైతన్య కళాశాల భాస్కర్ భవన్ క్యాంపస్‌లో గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించడంతో జిల్లా విద్యాశాఖ అధికారులతో పాటు, చైల్డ్‌లైన్ వారు కూడా రంగంలోకి దిగారు. ఇంటర్ బోర్డు ప్రాంతీయ తనిఖీ అధికారి రవికుమార్, జిల్లా విద్యాశాఖాధికారి రేణుక కళాశాలకు వెళ్లి విచారించారు. విద్యార్థి ఇయర్‌ఫోన్స్‌లో పాటలు వింటుంటే ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో క్షణికావేశంలో అలా చేసినట్లు అధ్యాపకుడు చెబుతుండగా.. తమ అబ్బాయి వద్ద ఫోన్లేదని విద్యార్థి తల్లిదండ్రులు చెబుతున్నారు. అధ్యాపకుడ్ని కళాశాల యాజమాన్యం శుక్రవారం తొలగించినట్లు ఆర్ఐవో తెలిపారు. Sri chaithanya Bhaskar bhavan #Vijayawada.@ysjagan@AndhraPradeshCM@APPOLICE100 pic.twitter.com/yKyAKzvHdJ — 𝐇𝐚𝐫𝐢𝐤𝐫𝐢𝐬𝐡𝐧𝐚 𝐁𝐡𝐞𝐞𝐦𝐚𝐧𝐢 (@hari_bheemani) September 16, 2022 -
అల్లుకుంటున్న 'ఈ' స్నేహం.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ స్టోరీ!
అల్లుకుంటున్న ఈ స్నేహం స్నేహం... చెప్పేది కాదు.. చేసేది! వర్ణించే వీలు లేనిది.. ఆస్వాదనలో మాత్రమే అందేది! కష్టాన్ని తీర్చేది.. సంతోషాన్ని పెంచేది! మంచి.. చెడులు ఎంచకుండా ఎల్లకాలం వెంట ఉండేది! తప్పుల్ని కాస్తూ ఒప్పుల్లో నడిపించేది.. జనం మెప్పు అందించేది! దీని గుణం ఇంత గొప్పది కాబట్టే ఫ్రెండ్ లేని జీవన ప్రయాణం ఎడారిని తలపిస్తుంది! ఈ ప్రస్తావనకు సందర్భం ‘ఫ్రెండ్షిప్ డే’ అని అర్థమయ్యే ఉంటుంది! ఇరుగు,పొరుగు ఆవరణలు.. వీథులు.. బడులు.. కాలేజీలు.. ప్రయాణాలు ఎట్సెట్రా ఎట్సెట్రా.. స్నేహం కుదరని చోటు లేదు ఈ లోకంలో. కరోనా వచ్చి మనిషిని ఏకాకిని చేద్దామని ప్రయత్నించింది. ఆ పరీక్షకూ నిలబడింది స్నేహం.. సోషల్ మీడియా ద్వారా వర్చువల్ రూపం తీసుకుని. నిజానికి ఈ వర్చువల్ ఫ్రెండ్షిప్.. సోషల్ మీడియా పరిచయం అయిన నాటి నుంచే ఉనికిలో ఉంది. దాన్ని కరోనా బలోపేతం చేసింది. ఆ మాటకొస్తే కలం స్నేహాల కాలంలోనే వర్చువల్ ఫ్రెండ్షిప్లు ఊపిరి పోసుకునుంటాయి. ఉత్తరాలు.. లాంగ్ డిస్టెన్స్ స్నేహాలను పదిలంగా ఉంచాయి. వీటన్ని భర్తీ చేస్తోంది సోషల్ మీడియా! మార్పులు మనుషుల మీద ప్రభావం చూపిస్తున్నా తాను ఇగిరిపోకుండా జాగ్రత్త పడుతూనే ఉంది స్నేహం. ఏ కొత్త మీడియం వచ్చినా దాన్ని తనకు వేదికగా మలచుకుంటోంది మనిషిని వదిలి వెళ్లిపోకుండా! ఈమెయిల్స్ మొదలు ఆర్కుట్.. ఫేస్బుక్.. ట్విట్టర్.. ఇన్స్టాగ్రామ్.. వాట్సాప్ ఇలా ఏ నెట్‌వర్క్‌లోనైనా ముందు ఇమిడిపోయింది స్నేహమే. బిజీ లైఫ్.. సాయంత్రాలు వీథి మలుపుల్లో.. ఇరానీ చాయ్ సెంటర్లలో.. థియేటర్లలో.. బాతాఖానీ కొట్టే వెసులుబాటును ఇవ్వలేకపోయినా ‘ఆన్లైన్’లో కావలసినంత స్పేస్ తీసుకుంటోంది ఫ్రెండ్షిప్. Hai.. Hwru, 5n అనే పొడి పొడి పదాల దగ్గర్నుంచి బాల్య స్నేహితుల గ్రూప్, స్కూల్, కాలేజ్ గ్రూప్స్, వర్క్ ప్లేస్ ఫ్రెండ్స్ గ్రూప్, ట్రావెల్ ఫ్రెండ్స్ గ్రూప్, కామన్ ఇంటరెస్ట్స్ ఫ్రెండ్స్ గ్రూప్ దాకా రకరకాల సమూహాల రూపంలో స్నేహం పలకరిస్తూనే ఉంది. నైతికంగా మద్దతిస్తూనే ఉంది. సోషల్ నెట్వర్క్ సిస్టమ్ వల్ల వ్యక్తిగతంగా కంటే వర్చువల్‌గా నడుస్తున్న స్నేహాలే ఇప్పుడు మనిషికి ఊరటనిస్తున్నాయనడంలో సందేహం లేదు. ఆన్లైన్ స్నేహితులనే ఎక్కువగా కోరుకుంటున్న వాళ్లూ పెరిగిపోతున్నారు. అందుకే ఆన్లైన్ స్నేహం పాత జాన్ జిగ్రీలను బ్లెస్ చేస్తూనే కొత్త దోస్తుల జాబితానూ తయారు చేస్తోంది. ఫేస్బుక్ ద్వారా 40 ఏళ్లకు.. నలభై ఏళ్ల కిందట.. విడిపోయిన బాల్యమిత్రులు ఫేస్బుక్ ద్వారా తిరిగి కలుసుకున్న ఘటన ఇది. వాళ్లది ఇరవై ఏళ్ల స్నేహం. ఒకరికి ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం రావడంతో కుటుంబసమేతంగా వేరే ప్రాంతానికి వెళ్లిపోయారు. అడ్రస్ మిస్సయ్యింది. పైగా అప్పట్లో ఫోన్ సౌకర్యం కూడా పెద్దగా లేకపోవడంతో ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి. ఎయిర్‌ఫోర్స్ మిత్రుడు రిటైర్మెంట్ తర్వాత ఇంట్లోనే ఉండిపోయాడు. ఒకరోజు.. ఫేస్బుక్లో తన చిన్ననాటి స్నేహితుడు తారసపడ్డాడు. రాజకీయవేత్తగా ఎదగడంతో సంతోషం వ్యక్తం చేసి.. ఫేస్బుక్లో అతని వాల్ మీద ఉన్న ఫోన్ నెంబర్‌కు ఫోన్ చేశాడు. ఆ ఫోన్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి.. ‘ముంబై నుంచి జాకబ్ అనే వ్యక్తి ఫోన్ చేశాడ’ని అవతలి స్నేహితుడికి చెప్పాడు. అతను ఎవరో కాదు టీఆర్ఎస్ నేత పద్మారావు. తనకు ఫోన్ చేసిన వ్యక్తి 40 ఏళ్ల కిందట దూరమైన తన బాల్యమిత్రుడు జాకబ్ అని తెలియడంతో పద్మారావు ఆనందంతో తబ్బిబ్బయ్యారు. ప్రాణ సఖి వేలు నాచియార్.. పద్దెనిమిదో శతాబ్దానికి చెందిన మహారాణి. బ్రిటిషర్స్ మీద మొట్టమొదటిసారిగా తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సాహసి. నిజానికి ఆమె చేసిన పోరును ప్రథమ స్వాతంత్య్ర సమరం అనొచ్చు. అయితే కుయిలీ అనే యోధ లేకపోతే వేలు నాచియార్ ఆ పోరాటం అంత సులవయ్యేది కాదు. కుయిలీ.. వేలు నాచియార్‌కు ప్రాణ స్నేహితురాలు. బ్రిటిష్ పాలకుల మీద స్నేహితురాలు తలపెట్టిన యుద్ధంలో ఆమెకు అండగా నిలిచి పోరాడింది. తన ఒంటి మీద నెయ్యి, నూనె పోసుకుని, నిప్పంటించుకుని మానవ బాంబుగా కదనరంగంలోకి దూకింది. తన స్నేహితురాలి కోటను కాపాడింది. భారతదేశ చరిత్రలో తొలి మానవ బాంబు కుయిలేనట. తుది శ్వాస వరకు.. కొప్పెరుంచోళుడు .. చోళుల తొలితరం రాజుల్లో ఒకడు. పిసిరంతైయార్ కవి. ఈ ఇద్దరూ తమ జీవితకాలంలో ఒకరినొకరు చూసుకోలేదు. కొప్పెరుంచోళుడి పరిపాలనకు ముగ్ధుడయ్యాడు పిసిరంతైయార్. అతని కవిత్వానికి ఆరాధకుడయ్యాడు కొప్పెరుంచోళుడు. కాలం గడుస్తోంది. కొప్పెురుంచోళుడి ఇద్దరు కొడుకులకు పరిపాలనా కాంక్ష పెరిగింది. తండ్రిని హింసించసాగారు. కొడుకులను ఏం చేయలేక.. అలాగని ప్రజల బాధ్యతను దుర్మార్గులైన తన కొడుకుల చేతుల్లో పెట్టలేక తాను ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు అన్నపానీయాలు మానేసి. తను ప్రాణత్యాగానికి సిద్ధమవుతున్నానని.. తానుంటున్న గదికి పక్కనున్న గదిలోకి వచ్చి ఉండాల్సిందిగా తన మిత్రుడు పిసిరంతైయార్కు వర్తమానం పంపాడు చోళరాజు. అయితే.. పిసిరంతైయార్ బయలుదేరి వచ్చేసరికే కొప్పెరుంచోళుడు ప్రాణాలు వదిలేశాడట. అప్పుడు ఆ కవి.. తనను తన స్నేహితుడు కూర్చోమన్న గదిలో కూర్చుని అతనూ అన్న, పానీయాలు మానేసి.. ప్రాణాలను వదిలేశాడట స్నేహితుడిలాగే. అలా చివరికి ప్రాణాలు విడిచే సమయంలోనూ ఆ ఇద్దరూ ఒకరినొకరు చూసుకోలేదు. హిస్టరీ మెన్ జధునాథ్ సర్కార్, జీఎస్ సర్దేశాయి, రఘుబీర్ సింగ్.. ఈ ముగ్గురూ చరిత్రకారులు. చక్కటి స్నేహితులు. ఎలాంటి పొరపొచ్చాలకు తావీయని యాభై ఏళ్ల స్నేహ బంధం వాళ్లది. ముందు ఉత్తరప్రత్యుత్తరాల ద్వారానే వీళ్ల మధ్య స్నేహం కుదిరింది. నాలుగేళ్ల ఆ లెటర్ కరెస్పాండెన్స్ అనంతరం 1909లో సర్దేశాయి, సర్కార్ మొదటిసారి కలుసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు రఘుబీర్ సింగ్ కూడా తోడయ్యాడు. అప్పటి నుంచి ఈ ముగ్గురూ తరచుగా కలుసుకుంటూ చరిత్ర నుంచి ప్రాపంచిక విషయాల దాకా ఎన్నిటినో చర్చించుకునేవాళ్లు. ఈ చర్చలు, వాళ్ల స్నేహం భారతదేశ చరిత్రలో కొత్త కోణాలు శోధించడానికి.. సరికొత్త అధ్యాయాలను రచించడానికి దోహదపడ్డాయి. వాళ్ల మైత్రిని ‘హిస్టరీ మెన్’ అనే పుస్తకంగా మలచాడు టీసీఏ రాఘవన్ అనే రచయిత. జాన్ జిగ్రీస్ మహ్మద్ అలీ జిన్నా.. లోకమాన్య బాల గంగాధర్ తిలక్.. సిద్ధాంతాలు, అభిప్రాయ భేదాలకు అతీతంగా చక్కటి స్నేహం చేయొచ్చని నిరూపించిన మంచి మిత్రులు. తీరిగ్గా తిలక్ వాళ్లింట్లో .. పనిలో ఉన్నప్పుడు హైకోర్ట్‌లోని జిన్నా చాంబర్లో కూర్చుని ఈ ఇద్దరూ గంటల కొద్దీ మాట్లాడుకునేవాళ్లట. ఆ సంభాషణల్లో వాళ్ల రోజూవారి పనుల నుంచి దేశ స్వాతంత్య్రం వరకు ఎన్నో విషయాలుండేవట. తిలక్‌తో తన స్నేహం గురించి తన దగ్గరి వాళ్లతోనే కాదు బహిరంగ సమావేశాల్లోనూ ప్రస్తావించేవాడు జిన్నా. తర్వాత కాలంలో జిన్నా తన రాజకీయ వైఖరిని మార్చుకున్నప్పటికీ తిలక్‌తో స్నేహంలో మాత్రం రవ్వంత తేడా కూడా రానివ్వలేదట. మైత్రీ మధురిమలు జార్జ్ హ్యారిసన్.. పండిట్ రవిశంకర్ల స్నేహం చెప్పుకుని తీరాల్సిందే. ఏషియన్ మ్యూజిక్ సర్కిల్ ద్వారా పండిట్ రవిశంకర్ పరిచయమయ్యాడు హ్యారిసన్‌కు. అప్పుడు మొదలైన స్నేహం.. మ్యూజిక్ ఫ్యూజన్‌గా సంగీతాభిమానులకే కాదు.. యావత్ స్నేహ ప్రపంచానికి మైత్రీ మధురిమలను పంచింది. తోడు నీడ ఇందిరా గాంధీ, పుపుల్ జయకర్.. ఇద్దరూ అలహాబాద్‌లోనే పుట్టి.. కలసి పెరిగారు. కష్టాల్లో, సుఖాల్లో, దుఃఖంలో, సంతోషంలో ఈ ఇద్దరూ ఒకరినొకరు వీడలేదు. ఇందిరా గాంధీ రాజకీయ జీవితం వాళ్ల స్నేహాన్ని ఏ మాత్రం చెక్కుచెదరనీయలేదు. ఇందిరాగాంధీ విజయాల్లోనే కాదు ఆపత్కాలంలోనూ ఆమె వెన్నంటే ఉంది జయకర్. ఆపరేషన్ బ్లూస్టార్ సమయంలోనూ ఇందిరాగాంధీనే సపోర్ట్ చేసింది. తన ఆత్మకథ రాయమని చాలాసార్లు జయకర్‌ను కోరిందట ఇందిరా. ఎందుకో రకరకాల కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిందట. చివరకు ఇందిరా గాంధీ చనిపోయాక ఆమె బయోగ్రఫీ రాసింది పుపుల్ జయకర్. బాబాయ్.. అబ్బాయ్ స్నేహం.. కుల, మత, ప్రాంత, కలిమిలేములకు మాత్రమే కాదు .. వయసు క్కూడా అతీతమే అనిపిస్తుంది రతన్ టాటా, శంతను నాయుడుల ఫ్రెండ్షిప్ చూస్తే. ఈ ఇద్దరి మధ్య స్నేహాన్ని కుదిర్చిన కామన్ పాయింట్ మూగజీవాల పట్లæ ఇద్దరికీ ఉన్న ప్రేమ. స్ట్రే డాగ్స్ కోసం శంతను నాయుడు చేసిన వర్క్ గురించి తెలిశాక అతనికి ఈ మెయిల్ పంపాడు రతన్ టాటా. బదులు ఇచ్చాడు శంతను. అలా వాళ్ల ఫ్రెండ్షిప్ మొదలైంది. కార్నెల్ యూనివర్శిటీలో శంతను కాన్వొకేషన్‌కు రతన్ టాటా హాజరయ్యారు. చిత్రమేంటంటే రతన్ టాటా ఆ యూనివర్శిటీ పూర్వ విద్యార్థి. ఈతరం ప్రతినిధి శంతను.. నాటి విలువల మనిషి రతన్ టాటాకు సాంఘిక మాధ్యమాలను ఎలా ఉపయోగించాలో నేర్పించాడు. అప్పటి నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటున్నాడట రతన్ టాటా. బాధ్యతలను పంచుకున్నాడు గాంధీ దక్షిణాఫ్రికా జీవితం ఆయన బయోగ్రఫీలో భాగంగానే కాదు.. చాలా కథలుగానూ ఎంతో ప్రచారంలో ఉంది. అయినా ఆయనకు సంబంధించి బయటి ప్రపంచానికి తెలియని విషయాలున్నాయి ఇంకా. వాటిల్లో ఒకటే హెన్రీ పోలాక్, మిల్లీ దంపతులతో ఆయనకున్న స్నేహం. విప్లవభావాలున్న యూదుడు హెన్రీ. క్రైస్తవాన్ని పాటించే స్త్రీవాది మిల్లీ. ఈ ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పరస్పర విరుద్ధ మతాలు వీళ్ల పెళ్లికి అడ్డం పడ్డాయి. ఇరు పెద్దలూ ఒప్పుకోలేదు. కోకపోగా మిల్లీని మరచిపోవడానికని హెన్రీని దక్షిణాఫ్రికా పంపించారు అతని పెద్దలు. జోహాన్నెస్ బర్గ్‌లోని ఓ శాకాహార హోటల్లో హెన్రీకి గాంధీ పరిచయమయ్యాడు. అనతికాలంలోనే అది స్నేహంగా మారింది. గాంధీతో తన గోడంతా వెళ్లబుచ్చుకున్నాడు హెన్రీ. మిల్లీ తల్లిదండ్రులను ఒప్పించే బాధ్యత తీసుకున్నాడు గాంధీ. ఒప్పించి మిల్లీని దక్షిణాఫ్రికా రప్పించాడు. హెన్రీ, మిల్లీ పెళ్లికి ప్రధాన సాక్షిగా సంతకం కూడా చేశాడు గాంధీ. దాంతో హెన్రీ దంపతులకు గాంధీ అప్తమిత్రుడుగా మారాడు. ఎంతలా అంటే మన దేశ స్వాతంత్య్ర సమరంలో గాంధీ జైల్లో ఉన్నప్పుడు గాంధీ మొదలుపెట్టిన ఉద్యమాలను తాను ముందుండి నడిపించాడు హెన్రీ. ఫ్రెండ్.. గురు, గైడ్ అన్నీ! సోషల్ మీడియా ఒకరకమైన గ్రూప్ థెరపీ సెషన్. ఎలాంటి భావోద్వేగాలను అయినా.. సోషల్ మీడియాలో పంచుకుంటే ఊరట దక్కుతోంది అంటున్నారు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే వాళ్లు. ఏదైనా విషయాన్ని షేర్ చేసుకున్నప్పుడు ఆ మాధ్యమంలో లేదా ఆ గ్రూపుల్లో జరిగే చర్చలు.. వచ్చే జవాబులతో ఎంతోకొంత ధైర్యం, ఉపశమనం కలుగుతుందంటారు వాళ్లు. కరెంట్ టాపిక్స్ దగ్గర్నుంచి వ్యక్తిగత సమస్యలు, ఉద్యోగ విషయాలు, వ్యాపారలావాదేవీలు, ఆరోగ్యం ఒక్కటేంటి సమస్త అంశాల మీదా సలహాలు, సూచనలు దగ్గర్నుంచి అనుభవాలు, అభిప్రాయాల దాకా అన్నీ అందుతున్నాయి. ఏదైనా విషయం మీద మద్దతు దొరకాలన్నా.. అవగాహన పెంచుకోవాలన్నా ఇప్పుడు సోషల్ మీడియానే ఫ్రెండ్, గురు, గైడ్, ఫిలాసఫర్ అన్నీ! ‘రోజూ కలిసే ఫ్రెండ్స్ కంటే.. సోషల్ నెట్వర్క్ స్నేహాలే మెదళ్లకు పదును పెట్టిస్తున్నాయి. చర్చల ద్వారా ఎక్కువ మందిని స్నేహితులను తయారు చేసుకునేందుకు చాన్స్ ఇస్తున్నాయి’ అంటున్నారు ఆన్లైన్ ఫ్రెండ్ షిప్‌ను ఇష్టపడేవారు. స్నేహ బంధాన్ని బలంగా ఉంచడంలో సోషల్ మీడియా చేస్తున్న మరో సాయం.. పాత స్నేహాలను పైకి తేవడం. ఎప్పుడో విడిపోయిన స్నేహితులు, బంధువులు సైతం దీని ద్వారా తిరిగి దగ్గరవుతున్నారు. సోషల్ మీడియాలోని అకౌంట్లలో సెర్చింగ్ ద్వారా, ఫోన్ నెంబర్లను సంపాదించడం ద్వారా తిరిగి ఆ పాత స్నేహాలను పునరుద్ధరించుకుంటు న్నారు. పలుచబడ్డ బంధాలను మళ్లీ బలోపేతం చేసుకుంటున్నారు. కామన్ స్నేహితులు లేదంటే గ్రూపుల ద్వారా మళ్లీ పాత స్నేహాలను.. పాత రోజుల్ని గుర్తు చేసుకునే అవకాశం కలుగు తోంది. గెట్ టు గెదర్, ఔటింగ్స్ వంటివన్నీ ఇప్పుడు వాట్సాప్ గ్రూపుల ద్వారానే నిర్వహించుకుంటున్నారు. అయినా అప్రమత్తం సోషల్ మీడియాను వాడే ప్రతీ వందలో 80 మంది.. దీన్నొక ఫ్రెండ్షిఫ్ ప్లాట్‌ఫామ్‌గానే అభివర్ణిస్తున్నారు. ఆన్లైన్ స్నేహితులు.. తమ క్రియేటివిటీకి తోడుగా ఉంటున్నారని కొందరు, గ్రూపు స్నేహాలు పెంపొందడానికి వీలుగా ఉంటోందని ఇంకొందరు, కష్టకాలంలో మద్దతు దొరుకుతోందని మరికొందరు చెబుతున్నారు. నాణేనికి రెండు వైపులున్నట్లే.. ఆన్లైన్ స్నేహాలకూ రెండు కోణాలు ఉన్నాయి. వాస్తవ ప్రపంచ స్నేహంలోనే కాదు.. వర్చువల్ ఫ్రెండ్‌షిప్‌లోనూ గొడవలు సహజం. మోసాలకు, వెన్నుపోట్లకు ఆస్కారం ఎక్కువే. అలాగని సోషల్ మీడియా చెడ్డది కాదు. ఆన్లైన్ స్నేహాలన్నీ మోసాలే కావు. అయితే అప్రమత్తం గా ఉండడం మాత్రం అవసరమే. అనుమానా స్పదంగా ఉన్న వ్యక్తులను, పూర్తి అపరిచితులను ఫ్రెండ్స్లిస్ట్లోకి చేర్చుకోకపోవడమే ఉత్తమం. అలాగే సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలను ఎంత తక్కువగా షేర్ చేసుకుంటే అంత మంచిది. కనిపించిన వాళ్లందరినీ కలుపుకుని వెళ్లడమే సోషల్ నెట్వర్క్ సిస్టం. నమ్మకాన్ని, వంచనను వేరు చేసే గుణం దానికి లేదు. అసలు అది దాని ప్రోగ్రామే కాదు. కాబట్టి మనమే ఆ జాగ్రత్త తీసుకోవాలి. స్నేహానికి చేయి చాచాలి.. స్నేహితులను అండగా ఉండాలి. కానీ మోసాన్ని పసిగట్టే పరిశీలనను అలవర్చుకోవాలి. అదీ స్నేహమే నేర్పిస్తుంది. నేర్చుకోవాలి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే!! ∙భాస్కర్ శ్రీపతి -
బీచ్‌లో ఎంజాయ్ చేస్తుండగా ఊహించని షాక్.. భయంతో పరుగో పరుగు
వీకెండ్ కావడంతో ఎంజాయ్ చేసేందుకు పర్యాటకులు బీచ్‌కు వెళ్లారు. ఇంతలో వారికి ఊహించని ప్రతి ఘటన ఎదురైంది. బీచ్‌లో ఉన్న పర్యాటకులను రెండు సముద్ర సింహాలు వెంటపడి మరీ తరిమాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. శాన్ డియాగోలోని లాజోల్లా ప్రాంతంలో ఉన్న ఓ బీచ్‌లో పర్యాటకులు సేద తీరుతున్నారు. నీటిలో ఈత కొడుతూ కోరింతలతో ఎంజాయ్ చేస్తున్నారు. బీచ్‌లో పెద్దగా అరుస్తూ పరుగులు తీశారు. కాగా, అదే సమయంలో అక్కడే రెండు సముద్ర సింహాలు నిద్రపోతున్నాయి. ఇంతలో ఓ మహిళ వాటిని ఫొటోలు తీసుకేందుకు ప్రయత్నించింది. గాఢ నిద్రలో ఉన్న సముద్ర సింహాలను డిస్టర్బ్ చేసింది. దీంతో, రెచ్చిపోయిన సముద్ర సింహాలు ఆవేశంతో మహిళతో పాటుగా అక్కడున్న వారి వెంటపడ్డాయి. బీచ్‌లో పర్యటకులను తరిమాయి. దాడి చేసే ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలో భయపడిన పర్యాటకులు పరుగులు తీశారు. ఇంతలో బీచ్ వద్ద ఉన్న సెక్యూర్టీ సిబ్బంది రంగంలోకి దిగి వాటిని సముద్రంలోకి వెళ్లేలా రూట్ మళ్లించారు. ఎవరూ గాయపడకుండా.. జాగ్రత్తపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయగా ట్రెండింగ్‌లో నిలిచింది. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. Sea lions fed up, chase beach goers off their turf in La Jolla, California. pic.twitter.com/tC7AvQrj0I — Mike Sington (@MikeSington) July 10, 2022 ఇది కూడా చదవండి: బ్రిటన్ పీఎం రేసులో భారత సంతతి రిషి.. పాత వీడియోతో విమర్శలు -
మామూలు డేరింగ్ కాదుగా.. వంతెన పైనుంచి గంగా నదిలో దూకి..
సోషల్ మీడియా అనగానే ఎన్నో వింతలు, విశేషాలు కనిపిస్తుంటాయి. కొన్ని వినూత్న వీడియోలు, ఫన్నీలు నెటిజన్లను ఆకర్షిస్తుంటాయి. మరికొన్ని వీడియోలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. తాజాగా ఓ బామ్మ(73) చేసిన ఫీట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. వివరాల ప్రకారం.. హర్యానాలోని సోంపేట్కు చెందిన ఓంవతి(73) హరిద్వార్‌లోని హర్ కీ పౌరి వద్ద 40 అడుగుల ఎత్తైన వంతెన పై నుంచి గంగా నదిలో దూకింది. ఆ తర్వాత నది అవతల ఒడ్డునకు ఈదుకుంటూ వెళ్లింది. ఆమె గంగా నదిలో దూకే సమయంలో కొందరు యువకులు ఆమెకు సహాయం అందించారు. అంత ఎత్తు నుంచి ఆమె నదిలో దూకడం అక్కడున్న వారందరినీ షాక్‌కు గురిచేసింది. हर हर गंगे...🙏 70 years old dadi jumping into the Ganges river from the bridge of Har Ki Pauri, Haridwar and she swimming comfortably. Really this is unexpected.@ActorMadhavan @ShefVaidya @amritabhinder @bhumipednekar @VidyutJammwal @divyadutta25 @ImRaina @harbhajan_singh pic.twitter.com/kaCpXH8hy1 — Rajan Rai (@RajanRa05092776) June 28, 2022 కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. అనంతరం, ఓంవతి మాట్లాడుతూ.. తాను చిన్నప్పటి నుంచి నదుల్లో ఈత కొడుతున్నానని తెలిపింది. ఎత్తైనా వంతెనల నుంచి దూకి ఈత కొట్టడం అలవాటేనని పేర్కొంది. ఓంవతికి డ్యాన్స్ అంటే కూడా చాలా ఇష్టమని చెప్పింది. ఆమె డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోలు కూడా వైరల్‌గా మారాయి. Joie de vivre! The 73-year-old who went viral for her dive into Ganga is also fond of dancing... pic.twitter.com/dtlOokNndp — Boris A.K.A Bread & Circuses (@BorisPradhan) June 30, 2022 ఇది కూడా చదవండి: కప్పు ఛాయ్ రూ. 70 వసూలు! రైల్వే ప్యాసింజర్ షాక్.. రైల్వేస్ వివరణ -
లక్కీ ఫెలో.. భార్య వద్దన్నా లాటరీ టికెట్ కొన్నాడు.. ఇలా జాక్‌పాట్..
ఏదో ఓ రోజు తనకు లాటరీ తగలకపోతుందా అని 34 ఏళ్లుగా లాటరీ టికెట్స్ కొంటున్న వ్యక్తి బంపర్ ప్రైజ్ కొట్టేశాడు. లాటరీలో ఏకంగా రూ.2.5 కోట్ల ప్రైజ్ మనీని దక్కించుకున్నాడు. ఈ ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. భటిండా జిల్లాకు చెందిన రోషన్ బట్టల దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. రోషన్‌కు లాటరీ టికెట్స్ కొనడం అలవాటు.. అందులో భాగంగానే 34 ఏళ్ల నుంచి లాటరీ టికెట్లు కొంటూనే ఉన్నాడు. వీటిల్లో అప్పుడప్పుడూ రూ. 100, రూ. 200 ప్రైజ్‌లు వచ్చాయి. కానీ, అతడి ఆశ మాత్రం తీరలేదు. ఇలా ఎప్పుడూ లాటరీ టికెట్స్ కొనడంతో రోషన్ భార్య తరచూ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసేది. ఇదిలా ఉండగా.. తాజాగా పంజాబ్ స్టేట్ డియర్ వైశాఖి బంపర్ లాటరీలో మెగా ప్రైజ్ గెలుపొందడంతో రోషన్ సింగ్ ఆనందం వ్యక్తం చేశాడు. మొదట బంపర్ ప్రైజ్ గెలుచుకున్నట్టు రోషన్‌కు డీలర్ నుంచి ఫోన్ కాల్ రాగా అది ఫ్రాంక్ కాల్ అనుకున్నాడు. అనంతరం తాము రాంపుర ఫుల్ లాటరీ సెంటర్ నుంచి ఫోన్ చేస్తున్నామని ఏజెంట్ చెప్పడంతో ఎగిరి గంతేశాడు. ఈ సందర్భంగా రోషన్ మాట్లాడుతూ.. లాటరీ ప్రైజ్ గెలుచుకున్నానని తెలుసుకున్న రోజు రాత్రంతా నిద్రపోలేదని తెలిపాడు. లాటరీలో వచ్చిన డబ్బులపై పన్నులన్నీ తీసాక తమకు రూ 1.75 కోట్లు వస్తాయని లెక్కలేసుకున్నానని అన్నాడు. లాటరీ మనీ మొత్తాన్ని తన ఫ్యామిలీ కోసం, కొత్త వ్యాపారం కోసం ఖర్చు చేస్తానని చెప్పుకొచ్చాడు. ఇది కూడా చదవండి: బైక్‌పై లవర్స్ హల్చల్.. వీడియో వైరల్ -
ఉక్రెనియన్ తల్లుల ఆవేదన...తమ పిల్లలైన బతికి ఉండాలని..
Ukrainian families who fear they will be killed by Russian Forces: ఉక్రెయిన్ పై రష్యా గత నెలరోజులకు దాడి కొనసాగిస్తోంది. ఉక్రెయిన్‌ని తలవంచకపోయేసరికి ఆగ్రహంతో రష్యా బలగాలు ఊహించని విధంగా పౌరులపై కాల్పుల జరిపి నరమేథానికి పాల్పడుతున్నాయి. ఇప్పటికే బుచా నగరాన్ని శవాల దిబ్బగా మార్చేసింది. అదీగాక రష్యా బలగాలు ఒక్కొక్క నగరాన్ని స్వాధీనం చేసుకుంటూ ఉక్రెయిన రాజధాని కైవ్‌కి సమీపంగా వచ్చేస్తున్నాయి. ఈ తరుణంలో ఉక్రెయిన్ కుటుంబాల్లో భయాలు మొదలయ్యాయి. తాము రష్యాన్ దళాల చేతిలో హతమైతే తమ పిల్లలు బతికి క్షేమంగా ఉండాలని వారి శరీరాలపై ఫోన్ నెంబర్లతో సహా కుటుంబ వివరాలను రాస్తున్నారు. ఆ ఘటనలకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఉక్రెయిన్‌లోని ఒక బాలిక తల్లి సాషా మకోవియ్ ఇలానే తన కూతురు శరీరంపై కుటుంబ వివరాలను రాసిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అంతేకాదు తమకు ఏమైన అయితే తమ పాపను మంచిగా చూసుకోవాలనే ఆశతో ఇదంతా చేస్తున్నట్లు వివరించింది. అంతేగాదు గత నెలలో యుద్ధం మొదలైనప్పుడు వేలాది మంది పౌరులు ఉక్రెయిన్ సరిహద్దులకు దాటి వెళ్లారు. ఈ క్రమంలో ఒక పదేళ్ల బాలుడు తన తల్లి ఇచ్చిన చిన్న కాగితం ముక్కతో ఉక్రెయిన్ పొరుగు దేశమైన పోలాండ్ సరిహద్దుకు చేరిన ఉదంతం తెలిసిందే. రష్యన్ బలగాల దాడులకు భయపడి పారిపోతున్న పిల్లలను, పౌరులను మావన కవచాలుగా ఉపయోగిస్తున్నారని ఆరోపణ వెలువెత్తాయి. అంతేకాదు నోవీ బైకివ్ గ్రామంలో యుద్ధ ట్యాంకుల ముందు బస్సులలో పిల్లలను ఉంచుతున్నారని నివేదిక పేర్కొంది. పుతిన్ అరాచకాలకు అంతేలేకుండా పోతుందంటూ ప్రపంచ దేశాల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అంతేగాదు యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ ఈ దాడులన ఖండించడమే కాకుండా పుతిన్‌ని యుద్ధ నేరస్తుడిగా అభివర్ణించారు. Ukrainian mothers are writing their family contacts on the bodies of their children in case they get killed and the child survives. And Europe is still discussing gas. pic.twitter.com/sK26wnBOWj — Anastasiia Lapatina (@lapatina_) April 4, 2022 (చదవండి: యజమాని కోసం నిరీక్షిస్తున్న కుక్క!) -
పండుగ వేళ ఆకాశంలో అద్భుతం.. వీడియో వైరల్
ఉగాది పండుగ వేళ ఆకాశంలో అద్భుత దృశ్యం కనిపించింది. రాత్రి వేళ ఆకాశంలో పదుల సంఖ్యలో ఉల్కలు భూమి మీదకు పడిపోతూ చూపరులను ఆకట్టుకున్నాయి. శనివారం రాత్రి.. మహారాష్ట్రలోని నాగపూర్, మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటు మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు జిల్లా అయిన కొమురం భీమ్ ఆసిఫాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఉల్కలు పడిపోతున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో ప్రజలు సెల్ఫోన్లతో వీడియోలు తీస్తూ ఎంజాయ్ చేశారు. #WATCH | Maharashtra: In what appears to be a meteor shower was witnessed over the skies of Nagpur & several other parts of the state. pic.twitter.com/kPUfL9P18R — ANI (@ANI) April 2, 2022 -
‘కశ్మీర్ ఫైల్స్’ మూవీ ఎఫెక్ట్.. ఢిల్లీలో కశ్మీర్ వ్యక్తికి చేదు అనుభవం..
సాక్షి, న్యూఢిల్లీ: కశ్మీర్ పండిట్లపై 1990లో జరిగిన మారణకాండ ఆధారంగా ‘ద కశ్మీర్ ఫైల్స్’ సినిమా రూపొందించిన విషయం తెలిసిందే. ఈ సినిమా అంచనాలకు మించి ఆడుతూ పలు రికార్డులను బద్దలుకొడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా జమ్మూకశ్మీర్‌కు చెందిన ఓ వ్యక్తికి ఢిల్లీలో చేదు అనుభవం ఎదురైంది. ఐడీ ఫ్రూప్స్ ఉన్నప్పటికీ హోటల్లో అతడికి రూమ్ ఇచ్చేందుకు సదరు హోటల్ సిబ్బంది అంగీకరించలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. కశ్మీర్‌కు చెందిన ఓ వ్యక్తి ఆన్లైన్లో ఓయో ద్వారా ఢిల్లీలోని హోటల్లో రూమ్ బుక్ చేసుకున్నాడు. అనంతరం ఆ హోటల్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో హోటల్ రిసెప్షన్లో ఉన్న మహిళా ఉద్యోగి అతడికి రూమ్ ఇచ్చేందుకు నిరాకరించింది. సదరు వ్యక్తి తన ఆధార్ కార్డుతో సహా మరికొన్ని ఐడీ ఫ్రూప్స్ చూపించినప్పటికీ ఆమె అతడికి రూమ్ ఇవ్వలేదు. Impact of #KashmirFiles on ground. Delhi Hotel denies accommodation to kashmiri man, despite provided id and other documents. Is being a kashmiri a Crime. @Nidhi @ndtv @TimesNow @vijaita @zoo_bear @kaushikrj6 @_sayema @alishan_jafri @_sayema @manojkjhadu @MahuaMoitra pic.twitter.com/x2q8A5fXpo — Nasir Khuehami (ناصر کہویہامی) (@NasirKhuehami) March 23, 2022 అయితే, సదరు వ్యక్తి ఆమెను ప్రశ్నించడంతో.. ఆమె తన సీనియర్ అధికారికి ఫోన్ చేసి మాట్లాడిన అనంతరం.. కశ్మీర్‌కు చెందిన వ్యక్తులకు రూమ్ ఇవ్వకూడదని ఢిల్లీ పోలీసులు చెప్పినట్టు వివరణ ఇచ్చింది. దీంతో షాకైన సదరు వ్యక్తి తనకు జరిగిన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో వివరిస్తూ తన ఆవేదన వ్యక్తం చేశాడు. అనంతరం తాను వేరే హోటల్లో రూమ్ తీసుకున్నట్టు తెలిపాడు. A purported video is viral on social media wherein a person is being denied hotel reservation due to his J&K ID. The reason for cancellation is being given as direction from police. It is clarified that no such direction has been given by Delhi Police.(1/3)@ANI @PTI_News — Delhi Police (@DelhiPolice) March 23, 2022 ఈ నేపథ్యంలో ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. జమ్మూ కశ్మీర్‌కు చెందిన వ్యక్తులకు రూమ్ ఇవ్వకూడదనే ఆదేశాలేవీ తాము ఇవ్వలేదని స్పష్టం చేశారు. పోలీసులపై ఇలాంటి తప్పడు ప్రచారాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇది చదవండి: గుడిలో దళితుడికి ఘోర అవమానం.. దేవుళ్లను కించపర్చాడని.. -
కీపింగ్ చేస్తూ సూపర్ క్యాచ్ పట్టిన హర్భజన్ సింగ్.. వీడియో వైరల్..
Harbhajan Singh Celebrates After Taking Catch In Gully Cricket: భారత వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పడు అభిమానుల కోసం ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూనే ఉంటాడు. అయితే ఓ అసక్తికరమైన వీడియోను హర్భజన్ ట్విట్టర్లో షేర్ చేశాడు. ఆ వీడియోలో అంత ఆసక్తికరం ఏముందంటే.. తన ఇంటికి సమీపంలో హర్భజన్ గల్లీ క్రికెట్ ఆడాడు. మీరు అనుకున్నట్టు బ్యాటర్‌గానో, బౌలర్‌గానో కాదు.. ఈ సారి టర్బోనేటర్ వికెట్ కీపర్ అవతారం ఎత్తాడు. వికెట్ కీపింగ్ చేయడమే కాకుండా ఒక క్యాచ్ కూడా పట్టాడు. అది ఇప్పడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా ఈవీడియోకు భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కామెంట్రీ చెప్పడం గమనార్హం. ఈ వీడియోపై నెటజన్లు స్పందిస్తూ.. సింగ్ ఈజ్ కింగ్ అని, పాకిస్తాన్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మాల్ కంటే బాగా కీపింగ్ చేస్తున్నావ్ అని కామెంట్ చేస్తున్నారు. చదవండి: Mahela Jayawardene: శ్రీలంక కోచ్‌గా మహేల జయవర్ధనే! View this post on Instagram A post shared by Harbhajan Turbanator Singh (@harbhajan3) -
భర్త చేసిన పనిని సోషల్ మీడియాలో పెట్టిన భార్య!
‘గతంలో మా వాళ్లు అలా ఉండేవారు.. పూర్వం ఇంటిపనులన్నీ భార్యలే చూసుకునేవారు’ అనుకుంటే అది నేటి సమాజంలో కుదరదు. ప్రస్తుత జీవన విధానంలో భార్యా-భర్తలు తమ తమ విధులతో బిజీగా ఉండటమే కాదు.. భార్యదే శ్రమాధిక జీవనమని ఎన్నో సర్వేలు చెబుతున్నాయి. అటువంటి తరుణంలో చిన్న చిన్న పనులు కూడా భర్త చేసుకోలేకపోతే అది కాపురంలో చిచ్చుపెట్టడమే కాకుండా, సోషల్ మీడియా వరకూ వెళుతుంది కూడా. ఒక జంట విషయంలో ఇదే పరిస్థితి తలెత్తింది. ఒక భర్త ఇలా చేసేనందుకే అతని బండారాన్ని సోషల్ మీడియా వేదికగా బయటపెట్టేసింది భార్య. భార్యాభర్తలు బాధ్యతగా ఉండటమంటే ఒకరి పనుల్లో మరొకరు సహకరించుకోవడమే. ప్రధానంగా ఇంటిపనుల్లో ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి. ఒక పని భార్య చేస్తే, మరొక పని భర్త చేయాలి. అలా కాకపోతే ఇద్దరి మధ్యలోకి గొడవలు రావడం అతి సాధారణం. కనీసం తను తినడానికి వాడిన వస్తువుల్ని కూడా భర్త శుభ్రం చేయకుండా భార్యే చూసుకుంటుందులే అనుకుంటే అది పొరపాటే. ఇండోనేసియాలో భర్త విషయంలో ఇది రుజువైంది కూడా. ప్లేట్లు కడగలేదని సోషల్ మీడియాలో.. ఇండోనేషియాకు చెందిన ఆ జంట కాపురం సోషల్ మీడియాకు ఎక్కడానికి భర్త తిని కడగకుండా వదిలేసిన ప్లేట్, కప్ కారణం. ఏ రోజు కూడా తినడం, వెళ్లిపోవడమే చేస్తున్నాడు భర్త. కనీసం వాటిని సింక్‌లో వేయాలి.. వాటిని శుభ్రం చేయాలనే సోయి కూడా లేకుండా పోయింది. దాంతో విసిగిపోయిన భార్య.. ఒకరోజు తిరుగుబాటుకు దిగింది. భర్త తిని పక్కనే పడేసిన వస్తువుల్ని విసిరి కొట్టడమే కాకుండా ఆ విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టేసింది. పనిలో పనిగా ఇలా చేసే పురుషుల్నికూడా నిలదీసింది. మీ భార్యను అర్థం చేసుకోండి.. ‘మీ భార్యను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వారు ఉపయోగించిన వంట వస్తువుల్నిఎందుకు పురుషులు కడగరు. పురుషులారా.. మీరు తినడం పూర్తి చేసిన అనంతరం వాటికి వాడిన వస్తువుల్ని వదిలేయడం ఎందుకు. మీరు ఉపయోగించిన ప్లేట్ కానీ ఏ వస్తువునైనా కడగడంలో తప్పు ఏముంది‘ అని ప్రశ్నించింది. ఇది ఆన్లైన్ చర్చకు దారి తీసింది. ఆ వస్తువుల్ని భర్త వాష్ చేసే ఉద్దేశం లేకపోతే కనీసం సింక్‌లో ఉంచాలని కొందరు సూచించగా, దీనికి అరటి ఆకుల్ని వాడటం మరొక ఉత్తమ మార్గమని కొంతమంది సలహాలు ఇచ్చిపడేస్తున్నారు. -
‘బాహుబలి’లో బల్లాల దేవుడిలా బిల్డప్ ఇచ్చాడు.. కానీ చివరకి
సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని కొన్ని వీడియోలు మన మనసుకు హత్తుకుంటాయి. మరికొన్ని ఆహ్లాదాన్నిస్తాయి. ఇంకొన్నిసార్లు షాకింగ్‌ని కలిగిస్తాయి.కానీ కొంత మంది సోషల్ మీడియా పాపులర్ అయ్యేందుకు ఎలాంటి సాహసానికైనా తెగిస్తున్నారు. చివరికి ప్రాణాల మీదకు సైతం తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు అలాంటి ప్రయత్నమే చేశాడు. బాహుబలి సినిమాలో బల్లాల దేవుడిలా ఎద్దును లొంగదీసుకునేందుకు ప్రయత్నం చేశాడు. కానీ ఆతని ప్రయత్నం బెడిసికొట్టింది. ఎద్దు కొమ్ములు పట్టుకుని వంచేందుకు ప్రయత్నిస్తుండగా దానికి ఒక్కసారిగా కోపం వచ్చి ఎత్తి పడేసింది. ఈ మొత్తం సంఘటనను తన స్నేహితులు సెల్ఫోన్లో రికార్డు చేశారు.అదృష్టవశాత్తూ అతడుకి ఎటువంటి గాయాలు కాలేదు. అయితే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియోలో తెగ వైరల్ అవుతుంది.ఈ వీడియో పై నెటిజన్లు స్పందిస్తూ .. నీవు ఏమైనా బహుబలి సినిమాలో బల్లాల దేవుడివి అనుకుంటున్నావా అని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రాణాలు జాగ్రత్త.. ఏదైనా అతి చేస్తే.. పర్యావసనాలు ఇలానే ఉంటాయని మరి కొందరు హెచ్చరిస్తున్నారు. -
వైరల్ వీడియో: పాపం పానీ పూరి కోసం..
జీవితంలో చాలా మంది పెళ్లి అనేది ఒక మధురమైన ఘట్టంగా భావిస్తుంటారు. పెళ్లి సమయంలో బంధువుల సందడులు, బావ మరదలు సరసాలు, చిన్నపిల్లల అల్లర్లు ఇలా చూసేందుకు కన్నుల పండుగగా అనిపిస్తుంది. కొన్ని సార్లు వధూవరులు ఒకరినొకరు ఆట పట్టించడం లాంటివి జరుగుతుంటాయి. ఈ తరహాలోనే పానీ పూరి తినడం కోసం ఆశగా ఎదురు చూస్తున్న వరుడుని వధువు ఆటపట్టించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. వధువు పానీ పూరి తినిపిస్తుందని ఆశగా నోరు తెరుస్తాడు వరుడు, కానీ ఆమె నోటి దగ్గరకు తీసుకు వచ్చి వరుడుకి తినిపించుకుండా తానే తింటుంది. రెండోసారి ఏమైనా తినిపిస్తుందని మళ్లీ ఎదురుచూడగా, పాపం ఈసారి కూడా అతనికి నిరాశే ఎదురవుతుంది. ఇలా ఆ వధువు అతడిని సరదాగా ఆట పట్టిస్తున్న ఘటన ఉత్తర భారత దేశంలో జరిగింది. ఈ వీడియోను వధువు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది ప్రస్తుతం చక్కర్లు కొడతోంది. ఇప్పటకే ఈ వీడియోను 1.2 మిలియన్ల మంది వీక్షించారు. View this post on Instagram A post shared by Shivani Sharma Singh ▪Creator (@shivanisharmasinghh) చదవండి:41 ఏళ్లుగా అడవిలోనే.. స్త్రీలంటే ఎవరో తెలియదు -
అరుదైన చిత్రాన్ని ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన నాసా
అమెరికా: ప్రపంచంలోనే ఎత్తైన పర్వతశ్రేణులు ఏవంటే వెంటనే గుర్తుకు వచ్చేవి హిమాలయాలు. ఎప్పడూ మంచుతో కప్పబడి ఉండే హిమాలయాకు సంబంధించి తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ఓ అరుదైన చిత్రాన్ని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘అంతరిక్షం నుంచి చూస్తే.. దట్టమైన తెల్లని మంచుతో కప్పబడిన హిమాలయ పర్వతశ్రేణులు అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం సిబ్బంది తీసింది’ అని కాప్షన్ జతచేసింది. అదే విధంగా ఈ చిత్రంలో హిమాలయాలతో పాటు ప్రకాశవంతమైన కాంతులతో కూడిన న్యూఢిల్లీ నగరం, లాహోర్, పాకిస్తాన్ దర్శనమిసున్నాయని పేర్కొంది. చదవండి: చల్లని ‘రాజా’ ఓ చందమామ ఫొటోలోని కుడివైపు లేదా హిమాలయాలకు దక్షిణ భాగంలో ఉత్తర భారతదేశం, పాకిస్తాన్‌లోని సారవంతమైన వ్యవసాయ భూమి కనిపిస్తోందని పేర్కొంది. నాసా విడుదల చేసిన ఈ చిత్రం సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. లక్షల మంది ఈ ఫొటోను సోషల్ మీడియాలో వీక్షించగా వేలాది మంది అద్భుతంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. ‘వావ్.. ఇది చాలా అందమైన ఫొటో’, కచ్చితంగా ఆశ్చర్యపరిచే అద్భుతమైన చిత్రం’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇటువంటి చిత్రాలను నాసా గతంలో కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by NASA (@nasa) -
నేడు గురునానక్ జయంతి
నేడు గురుపూరబ్ సిక్కు మతంలో అత్యంత పవిత్రమైన రోజు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులు, ఇతరులు గురునానక్ జయంతిని జరుపుకుంటారు. ప్రతీ సంవత్సరం అక్టోబర్, నవంబర్ నెలలో గురునానక్ జయంతిని పురస్కరించుకుంటారు. ఈరోజు గురుద్వారాలలో సిక్కుల పవిత్ర గ్రంథమైన గురుగ్రంథ్ సాహిబ్‌ను పఠిస్తారు. ఇది 48 గంటలపాటు నిరంతరంగా సాగుతుంది. దీనిని అఖండపఠనం అంటారు. జయంతి నాడు ఉదయాన్నే కీర్తనలతో, ప్రార్థనలు చేస్తూ ఊరేగింపు నిర్వహిస్తారు. చదవండి: (భారత రాజకీయాల్లో లైలా, మజ్నూ..) గురు గ్రంథసాహిబ్‌ను పల్కిలో చుట్టి, పూలతో అలంకరించి రథంలో తీసుకెళ్తారు. ఈ సంవత్సరం 551 వ గురునానక్ జయంతిని జరపుకుంటున్నారు. గురునానక్ దేవ్‌జీ కి సబంధించిన ఫోటోలు, సందేశాలు వాట్సాప్ , ఫేస్బుక్, ట్విట్టర్లలో పంచుకుంటున్నారు. ఈ సందర్బంగా మీరు, మీకుటుంబ సభ్యులు ఆనందంగా ఉండాలంటూ సోషల్ మీడియా వేదికగా గురునానక్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. -
వైరల్: కూతురు స్కూల్ వీడియోలో తండ్రి డ్యాన్స్
స్కూల్ హోంవర్క్ చేస్తున్న ఓ అమ్మాయిని తన తండ్రి, సోదరుడు ఆటపట్టించాలకునే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ చిన్నారి తల్లి జెన్నిఫర్ ఈ వీడియోను సోషల్ మీడియాతో పంచుకోగా అది నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటుంది. కాగా.. ఆ అమ్మాయి పేరు డెలానీ జోన్స్. ఆమె తను చేస్తున్న హొంవర్క్ను వీడియోను తీసి స్కూల్ టీచర్‌కు పంపడానికి కెమెరాను ఫిక్సింగ్ చేసింది. తర్వాత, ఆమె అలెక్సాను ఒక పాటను ప్లే చేయమని అడిగింది. ఆర్ట్ వర్క్ చేస్తుండగా, చిన్నారి తండ్రి, సోదరుడు వీడియోలో డ్యాన్స్ చేస్తూ పలు రకాలుగా ఆటపట్టించే ప్రయత్నాలు చేశారు. కాగా.. డెలానీ తల్లి జెన్నిఫర్ ఈ వీడియోను ఫేస్బుక్లో పోస్ట్ చేస్తూ "నేను డెలానీ చేసిన వీడియో ను పాఠశాల యాప్ (సీసా)ను పంపిస్తున్నాను. డెలానీ తరచుగా ఏదో ఒక వీడియో తీసి ఉపాధ్యాయులకు పంపి.. వాళ్లను పలకరించడం, గుడ్‌నైట్ చెప్పడం, సరదాగా మాట్లాడటం లాంటివి చేస్తుంది. అయితే ఈ వీడియో మాత్రం మరికాస్త ఫన్నీగా ఉండబోతుంది. నేను అయితే చాలా నవ్వుకున్నాను. మీకు కూడా నచ్చుతుందని భావిస్తున్నా" అని క్యాప్షన్ జత చేశారు. అయితే.. తన కుమార్తె టీచర్స్ కోసం వీడియోను చేస్తుందని డెలానీ తండ్రికి తెలియదు. సరదాగా ట్యుటోరియల్ ఏదో వీడియో చేస్తుందనుకొని సరదాగా తనను ఆటపట్టించాలనుకోగా, చివరికి ఆయనే నవ్వులపాలయ్యాడు. కాగా.. నవంబర్ 18న పోస్ట్ చేసిన ఈ వీడియోకు 14 మిలియన్లకు పైగా వ్యూస్ రాగా 11వేలకు పైగా కామెంట్లు వచ్చాయి. -
కప్ప మిణుగురును మింగితే : వైరల్ వీడియో
సాక్షి, ముంబై: సోషల్ మీడియా అనేకవింతలకు విశేషాలకు నెలవు. ఆటవిడుపుగా, అసక్తికరంగా ఉండే ఇలాంటి వీడియోలు నెటిజనులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. తాజాగా ఎపుడూ చూడని ఒక వింత వీడియో వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఒక కప్ప మిణుగురును మింగితే.. ఎలా ఉంటుంది.. ఆ మిణుగురు పురుగు కప్ప పొట్టలో మిణుకు మిణుకుమంటూ కనిపిస్తే..ఎలాంటి ఉంటుంది. సరిగ్గా ఇలాంటి వీడియోనే ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. 14 సెకన్ల వీడియోను నేచర్ ఈజ్ లిట్ ట్వీట్ చేసిన తర్వాత సంచలనంగా మారిపోయింది. 60.8 లక్షల కంటే ఎక్కువ వ్యూలు, 4.3 వేల లైక్‌లను సంపాదించింది. దీనికి మించిన యూజర్లు కామెంట్లు, పిట్ట కథలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఒక ట్విటర్ యూజర్ మాయ ఏంజెల్‌తో పోలుస్తూ.. మనలో ఉన్న వెలుగును ఎవరూ చంపలేరు అంటూ ఒకరు, బీకన్ లైటు వెలుగుతున్న విమానంలా ఉందని మరొకరు కామెంట్ చేశారు. When a frog eats a firefly pic.twitter.com/31m6ZcurWP — Nature is Lit🔥 (@NaturelsLit) September 10, 2020 "Nothing can dim the light that shines from within." Maya Angelou 😉 — gabrielle (@drgabrielnn) September 10, 2020 it's like an airplane with it's beacon light — Thank You, Messi. (@RifqiAthallah13) September 11, 2020 -
అలా సరదాగా రేసుకు వెళ్దామా!
ఒహియో: జంతువులు ఆనందంతో ఉన్నప్పుడు పరుగులు తీస్తాయి. అంలాటి సందర్భంలో దానికి సంబంధించిన మరో జంతువు జతకూడితే ఆ పరుగుకు జోరు పెంచుతాయి. సాధారణంగా జిరాఫీలు అరుదైన సందర్భాల్లో మాత్రామే పరుగెత్తుతాయి. భారీ శరీరం, ఎతైన మెడను కలిగి ఉండే ఇవి గుంపులు గుంపులుగా నడుచుకుంటూ వెళ్తాయి. అయితే తాజాగా ఓ చిన్న జిరాఫీ ఆనందంతో పరుగులు తీసిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో ఉన్న సిన్సినాటి జూలోని థియో అనే చిన్న జిరాఫీ సంతోషంగా పరుగెత్తుకుంటూ జూలో తిరుగుతుంది. అదే సమయంలో దాని సోదర జిరాఫీ ఫెన్ జతచేరడంతో మరింత వేగంగా పరుగుతీస్తుంది. ఈ వీడియోను సన్సినాటి జూ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘బేబీ జిరాఫీ థియో తనలోని శక్తి కూడదీసుకుని తన సోదర జిరాఫీ ఫెన్తో సరదాగా పరుగులు తీసింది’ అని కాప్షన్ జతచేసింది. ఈ వీడియోను ఇప్పటి వరకు 15వేల మంది నెటిజన్లు వీక్షించారు. బేబీ జిరాఫీ పరుగును చూసిన నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ‘థియో జిరాఫీ చాలా అందంగా ఉంది. అది తన సోదర జిరాఫీ ఫెన్ వద్దకు వెళ్లి అలా సరదాగా రేసుకు వెళ్దామా! అని అడిగింది’ అని ఓ నెటిజన్ ఫన్నీగా కామెంట్ చేశాడు. ‘ఈ వీడియోను చూసిన నాకు ఉదయం చాలా సంతోషం కలిగింది’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. -
ఈ బుడ్డోడు నిజంగా సూపర్
ఈ రోజుల్లో పిల్లలు నటించమంటే జీవించేస్తున్నారు. పిల్లలు ఎంత నవ్వించనా ఒక్కోసారి నవ్వరు. అదే వాళ్లు ఇతరులను నవ్వించడానికి మాత్రం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. చిన్న యాక్టింగ్ చేస్తే చాలు. వారి యాక్టింగ్‌ను తల్లి కూడా పసిగట్టలేదు. తాజాగా ఒక బుడ్డోడు చేసిన పని అందరికి నవ్వు తెప్పిస్తుంది. ఒక పాత వీడియోను మాజీ ఫుట్‌బాల్ ప్లేయర్ రెక్స్ చాప్మన్ రీట్వీట్ చేశారు.(‘అక్కడికి వచ్చి నన్ను పిలవండి.. వస్తాను’) 21 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోలో బుడ్డోడి తల్లి వాడిని ఊయల ఊగమని చెప్పింది. తల్లి మాటకు కట్టుబడి ఊయల దగ్గరకు వెళ్లిన ఆ బుడ్డోడు దానిమీద కూర్చోకుండానే ఊయలను ఊపాడు. అయితే ఇక్కడే ఆ బుడ్డోడు ఏం చేశాడో తెలుసా.. జస్ట్ అలా ఊయల తాకిందో లేదో ఏదో గట్టిగా తగిలినట్లు కిందపడి దొర్లడం ప్రారంభించాడు. ఎవరైనా చూస్తే అయ్యో.. చాలా గట్టిగా తగిలినట్లుందే అనుకుంటారు. బుడ్డోడు చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు 2.6 మిలియన్లకు పైగా వీక్షించారు. My son be fakiiiiing 😂😂 pic.twitter.com/Pz7kbCyAjE — M. Dot (@jordeeenie) July 8, 2020 -
సోషల్ మీడియాకు సంకెళ్లా?..ట్రంప్ ఉత్తర్వులపై వికీపీడియా
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై నియంత్రణకు ట్రంప్ త్వరలో ఆదేశాలిస్తారన్న వార్తలపై వికీపీడియా వ్యవస్థాపకుడు జిమ్మీ వేల్స్ ఆందోళన వ్యక్తం చేశారు. అలా చేయడానికి అధ్యక్షుడికి అధికారాల్లేవని, ఒకవేళ ట్రంప్ అలాంటి ఆదేశాలిస్తే అవి న్యాయబద్ధం కావని చెప్పారు. యూఎస్ రాజ్యాంగానికి జరిగిన తొలి సవరణ భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు అధిక ప్రాధాన్యమిస్తుందని గుర్తు చేశారు. అయితే రాజకీయకారణాలతో ఏదైనా సాకులు చెప్పి భావస్వేచ్ఛను నియంత్రించేందుకు ప్రయత్నించే జిత్తులు ప్రభుత్వాల వద్ద ఉంటాయన్నారు. కానీ ఇలా నియత్రించే యత్నాలు ప్రజాస్వామ్యానికి మంచివి కాదని, ప్రమాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అనేవి ప్రజలు తమ అభిప్రాయాలను, ఆలోచనలను వ్యక్తం చేసుకునేందుకు సాధనాలని చెప్పారు. గతంలో ప్రజాభిప్రాయాన్ని కంట్రోల్ చేయాలని పరోక్షంగా యత్నించిన ఫేస్బుక్ ప్రస్తుతం ప్రజాభిప్రాయ స్వేచ్ఛ గురించి మాట్లాడడం విడ్డూరమన్నారు. ఇదే సమయంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను దుర్వినియోగం చేయడం కూడా మనం చూశామన్నారు. ఇలాంటివి జరగకుండా సదరు ప్లాట్‌ఫామ్స్ చర్యలు తీసుకోవాలని సూచించారు. వికీపీడియాలో ఉంచే సమాచారాన్ని పూర్తిగా నమ్మదగిన వర్గాల నుంచే సేకరిస్తామని, ఇందుకు తాము అధిక ప్రాధాన్యమిస్తామని చెప్పారు. ఇందుకోసం టాప్ ర్యాంకింగ్ ఉన్న పత్రికలు, మ్యాగజైన్ల నుంచి రిఫరెన్స్ తీసుకుంటామన్నారు. ఉదాహరణకు ప్రెసిడెంట్ ట్రంప్ ఏదైనా చెత్త మాట్లాడితే దాన్ని సోర్స్‌గా అంగీకరించమన్నారు. -
ఎంఐఎం టిక్ టాక్
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియా యాప్ ‘టిక్ టాక్’లో అధికారిక ఖాతా ఉన్న తొలి రాజకీయ పార్టీగా ఎంఐఎం రికార్డుకెక్కింది. ఈ మేరకు మంగళవారం ఆ పార్టీ కేంద్ర కార్యాలయమైన దారుస్సలాం నుంచి ఒక ప్రకటన విడుదలైంది. దేశంలోని యువ ఇంటర్నెట్ వినియోగదారులను టిక్‌టాక్ ద్వారా చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టం చేసింది. పార్టీ అధికారిక ‘టిక్‌టాక్’ఖాతాను సుమారు 7000 మంది అనుసరిస్తుండగా, 60 వేల మంది లైక్‌లు, 75 వీడియోలు వచ్చాయన్నారు. యువత తమ భావ స్వేచ్ఛను పంచుకునేందుకు ఇది ఒక వేదికగా పనిచేస్తోందని పేర్కొంది. -
అదే మొసలి.. అప్పుడు నాన్న ఉన్నాడు, కానీ
ఆస్ట్రేలియా: స్టీవ్ ఇర్విన్.. జంతు ప్రేమికులకు పరిచయం అక్కర్లేని పేరు. స్టీవ్ ఆస్ట్రేలియా వన్యప్రాణి సంరక్షుడిగా, ప్రముఖ టీవీకారునిగా (టెలివిజన్) ప్రపంచానికి సుపరిచితుడు. కానీ, అతను స్టింగ్రే ప్రమాదంలో ప్రాణాలు కోల్పొయి విషాదం మిగిల్చాడు. స్టీవ్ మరణించే సమయంలో అతని కొడుకు రాబర్ట్ ఇర్విన్ వయసు కేవలం 2 సంవత్సరాలు. ప్రస్తుతం 15 ఏళ్లు నిండిన రాబర్ట్ స్టీవ్.. బుధవారం తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. జంతు ప్రేమికులను ఈ పోస్ట్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. రాబర్ట్ తన తండ్రి మాదిరిగానే జూ యూనిఫాం ధరించి, అతనిలాగానే మొసలికి ఆహారం విసిరిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో పంచుకున్నాడు. ‘అప్పుడు నాన్నా, నేను ముర్రేకు ఆహారం ఇస్తున్నాం. ఇప్పుడు అదే స్థలం, అదే మొసలి. కానీ, రెండు ఫోటోల నడుమ 15 సంవత్సరాల దూరం’ అని ఫోటోకు శీర్షిక పెట్టాడు. రాబర్ట్ చేసిన పోస్ట్ తన తండ్రిని గుర్తు చేసిన కారణంగా వేలాది మంది ఉద్వేగానికి లోనయ్యారు. ‘నీ తండ్రి జీవించి ఉంటే ఎంత మురిసిపడేవారో..! రాబర్ట్’ అని ఆస్ట్రేలియా టీవీ ప్రజెంటర్ లిసా విల్కిన్సన్ పేర్కొనగా.. ‘నువ్వు అక్షరాల అతని అడుగుజాడల్లో నడవడం చూసి మీ నాన్న సంతోషించేవారు‘ అని నటి ఎమ్మీ పెర్రీ అన్నారు. కాగా, స్టీవ్ ఇర్విన్ ఇద్దరు పిల్లలు రాబర్ట్, బిందీ వన్యప్రాణి సంరక్షణకై సేవలందిస్తున్నారు. రాబర్ట్ వైల్డ్ లైఫ్ ప్రజెంటర్‌గా పనిచేస్తున్నాడు. ఇక ‘క్రైకీ ఇట్స్ ద ఇర్విన్’ రియాలిటీ షో- 2018లో ఇర్విన్ భర్యా, పిల్లలు పాల్గొన్నారు. View this post on Instagram Dad and me feeding Murray... same place, same croc - two photos 15 years apart ❤️🐊 A post shared by Robert Irwin (@robertirwinphotography) on Jul 3, 2019 at 4:20am PDT -
‘పిల్లి’మంత్రి ప్రెస్‌మీట్.. నవ్వలేక చచ్చిన నెటిజన్లు
న్యూఢిల్లీ: కిర్జిస్తాన్ బిష్కెక్లో జరిగిన ఎస్సీవో సదస్సు సందర్భంగా దౌత్యపరమైన మర్యాదలు పాటించకుండా పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ విమర్శల పాలైన సంగతి తెలిసిందే. తాజాగా పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ ప్రభుత్వం అంతకుమించి కితకితలను నెటిజన్లకు పంచింది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ కేబినెట్ సమావేశం శనివారం జరిగింది. కేబినెట్ సమావేశం అనంతరం ఆ ప్రావిన్స్ సమాచార మంత్రి షౌకత్ అలీ యూసఫ్జాయి విలేకరులతో మాట్లాడారు. ఈ విలేకరుల సమావేశాన్ని ఫేస్బుక్లో లైవ్ స్ట్రీమింగ్ చేశారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చేటప్పుడు క్యాట్ ఫిల్టర్స్‌ను ఆన్ చేశారు. అంతే, మంత్రి, ఇతర అధికారులు మాట్లాడుతుండగా.. వాళ్ల ముఖాల మీద ‘డిజిటల్ పిల్లి స్టిక్కర్లు’ దర్శనమిచ్చాయి. లైవ్ ప్రసారాన్ని వీక్షించిన నెటిజన్లు వెంటనే దీనిని గుర్తించి.. కామెంట్లు కూడా చేశారు. కొంతసేపటివరకు ఇది సాగింది. ఏకంగా మంత్రి లైవ్‌లో డిజిటల్ స్టిక్కర్లతో పిల్లిలాగా కనిపించడంతో నెటిజన్లు జోకుల మీద జోకులు వేశారు. ఈ కామెడీ చూడలేక నవ్వి నవ్వి చచ్చిపోయామంటూ కామెంట్ చేశారు. ఫిల్టర్ తీసేయండి.. మంత్రిగా పిల్లిగా మారిపోయాడని ఒకరు కామెంట్ చేస్తే.. పిల్లి డిజిటల్ మాస్క్ల్లో వాళ్లు భలే క్యూట్‌గా ఉన్నారని, కామెడీలో దీనిని బీట్ చేసే వారే లేరని, కేబినెట్లో పిల్లి కూడా ఉందని నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు. You can't beat this! Khyber Pakhtunkhwa govt's live presser on Facebook with cat filters.. 😹 pic.twitter.com/xPRBC2CH6y — Naila Inayat नायला इनायत (@nailainayat) June 14, 2019 According to KP government’s social media team we now have a cat in the cabinet #Filter pic.twitter.com/LNl7zwOfLU — Mansoor Ali Khan (@_Mansoor_Ali) June 14, 2019 🤣🤣❤️Cutest politician pic.twitter.com/3ToUEAFPDM — Manas 🇮🇳 মানস (@ManasBose_INDIA) June 14, 2019 -
యోగి కేసులో జర్నలిస్టుల అక్రమ అరెస్ట్‌లు
సాక్షి, న్యూఢిల్లీ : జర్నలిస్ట్ ప్రశాంత్ కనోజియాను ఢిల్లీలో శనివారం నాడు ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గత ఏడాది కాలంగా తనతో వీడియో కాల్స్ ద్వారా మాట్లాడుతున్నారని, రాజకీయ నేతగా మారిన సన్యాసి తన జీవితాంతం తనతో ఉండేందుకు సిద్ధ పడతారా ? అంటూ ఓ మహిళ సోషల్ మీడియాలో పెట్టిన వీడియో క్లిప్‌ను షేర్ చేశారన్న అభియోగంతో కనోజియాను అరెస్ట్ చేశారు. ప్రధానంగా మహిళల అభిప్రాయాలను ప్రసారం చేసే ‘నేషనల్ లైవ్’ అనే టీవీ ఛానల్ ఎడిటర్‌ను కూడా కొన్ని గంటల తర్వాత యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు మహిళ వీడియో క్లిప్పును ప్రసారం చేసినందుకే ఛానల్ ఎడిటర్‌ను కూడా అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కనోజియాపై భారతీయ శిక్షాస్మృతిలోని 500 సెక్షన్, సమాచార సాంకేతిక చట్టంలోని 66వ సెక్షన్ ప్రకారం కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఐపీఎస్ 500 సెక్షన్ ప్రకారం అది ‘నాన్‌కాగ్నిజబుల్’ నేరం. అంటే పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని అర్థం. ఈ సెక్షన్ కింద పోలీసులు ఎవరిని నేరుగా అరెస్ట్ చేయడానికి వీల్లేదు. ఎవరైనా కచ్చితమైన ఫిర్యాదు ఇచ్చిన పక్షంలోనే స్పందించాలి. ఈ కేసులో పరువు పోయే అవకాశం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ కనుక, ఆయన వ్యక్తిగతంగా పరువు నష్టం దావా వేసినప్పుడు మాత్రమే చట్ట నిబంధన ప్రకారం పోలీసులు స్పందించాలి. ఆయన ఫిర్యాదు లేకుండానే పోలీసులు స్పందించారంటే చట్టాన్ని ఉల్లంఘించడమే కాకుండా ఆయన వ్యక్తిగత ప్రజా సంబంధాల టీమ్‌గా వ్యవహరించడమే. ఇక సమాచార సాంకేతిక చట్టంలోని 66వ సెక్షన్ ఎవరి మీద దాఖలు చేయాలంటే మొత్తం ‘కంప్యూటర్ వ్యవస్థ స్తంభించడం’కు కారకుడైన వారిపైన. ఇక్కడ జర్నలిస్ట్ ప్రశాంత్ ఒకామీ వీడియో క్లిప్పింగ్‌ను ట్వీట్ ద్వారా షేర్ చేశారు. ఆయన ట్వీట్ ద్వారా మొత్తం కంప్యూటర్ వ్యవస్తే ఎలా స్తంభించిపోతుంది? ఇలా పోలీసులు అత్యుత్సాహంతో అన్యాయంగా భారతీయ పౌరులను అరెస్ట్ చేయడం దేశంలో ఇదే మొదటిసారి కాదు. అందుకనే భావ ప్రకటనా స్వేచ్ఛకు సంబంధించి 180 దేశాల్లో భారత్‌కు 138వ స్థానం లభించింది. వీటిలో దాదాపు 90 శాతం కేసులు కోర్టుల ముందు నిలబడవు. గత మేనెలలోనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫొటోను మార్ఫింగ్ చేసి పెట్టినందుకు అరెస్టయిన బీజేపీ కార్యకర్తను కోర్టు జోక్యం చేసుకొని వదిలేసింది. కోణార్క్ దేవాలయంపై బూతు బొమ్మలున్నాయంటూ వ్యాఖ్యానించి అరెస్టయిన కేంద్ర రక్షణ శాఖ విశ్లేషకుడిని కూడా కోర్టు విడుదల చేసింది. -
బాబుగారి ‘ఘన కార్యాలు’ బట్టబయలు!
ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ అధికార టీడీపీ ప్రచారం నవ్వుల పాలవుతోంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి టీవీల్లో ‘పచ్చ’ ప్రకటనలు హోరెత్తున్నాయి. బాబుగారి ‘ఘన కార్యాల’ను చూపిస్తూ టీవీలో వస్తున్న ప్రకటనలోని డొల్లతనాన్ని సోషల్ మీడియా వేదికగా సామాన్యులు బట్టబయలు చేస్తున్నారు. (లోకేష్.. పసుపు కుంకుమ మాకు రాలే!) టీడీపీ ప్రచారం చేసుకుంటున్నట్టుగా వాస్తవ పరిస్థతులు లేవని ఆధారాలతో బయటపెడుతున్నారు. నారా వారి అసత్య ప్రచారాన్ని నికార్సైన నిజాలతో ప్రజలకు చూపిస్తున్నారు. రాయలసీమకు నీళ్లు పారించామని చంద్రబాబు కొట్టుకుంటున్న ‘సెల్ఫ్ డబ్బా’ను సామాన్యుడు ఎలా ఛేదించాడో మీరే చూడండి. -
∙మీటూ; ద వే ఫార్వార్డ్ చనిపోతే తప్ప నమ్మరా?
హైదరాబాద్, బేగంపేటలో ఉంది ది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌కు వేదిక ఆ స్కూలే. ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్. ఇది తొమ్మిదో ఎడిషన్. నిన్న మొదలైన ఈ మూడు రోజుల పండుగ రేపటితో ముగుస్తుంది. ఈ ఏడాది ఫెస్టివల్‌కి అతిథి చైనా దేశం. గాంధీజీ 150వ జయంతి ఏడాది కావడంతో గుజరాత్ సాహిత్యం సాహిత్యం, గాంధీజీ ప్రధానాంశాలుగా రూపొందిందీ ప్రోగ్రామ్. సాహిత్య సభలో సిరాచుక్క సాక్షిగా ‘మీటూ’ సామాజికాంశం ప్రధానమైన చర్చనీయాంశమైంది. అనేక ఆవేదనలకు సంగ్రహరూపంగా ‘మీటూ; ద వే ఫార్వార్డ్’ ప్యానల్ డిస్కషన్ జరిగింది. ఇందులో చిన్మయి శ్రీపాద, సంధ్య మెనన్, సుతప పాల్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ న్యాయవాది వసుధా నాగరాజ్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఎవరికి చెప్పుకోవాలి ‘బ్రేవ్ హార్ట్స్ ఆఫ్ ద కంట్రీ’ అంటూ ప్రశంసపూర్వకంగా ఆహ్వానించారు వసుధ. ‘‘సమాజం అధికార సమీకరణల మీద నడుస్తోందని, అది విద్యార్థిని– టీచర్ నుంచి అధికారి – ఉద్యోగిని వరకు అన్ని చోట్లా విస్తృతంగా రాజ్యమేలుతోందని నిరసించారామె. ‘మీటూ’ ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ ‘నా దేహాన్ని పణంగా పెట్టడం ఎందుకు’ అంటూ శ్రీరెడ్డి గళం విప్పినప్పుడు తెలిసింది సినిమా ఇండస్ట్రీకి విశాఖ గైడ్‌లైన్స్ గురించి తెలియదని. ధైర్యంగా బయటకు వచ్చిన తనుశ్రీదత్తా నుంచి ఎవరు కూడా కంప్లయింట్ ఫైల్ చేసే అవకాశమే లేని విధంగా నడుస్తోంది మన వ్యవస్థ. పని ప్రదేశంలో సెక్సువల్ హెరాస్మెంట్ ప్రివెన్షన్ సెల్ ఉండాలనే నిబంధన అమలు చేయించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి’’ అన్నారు వసుధ. ‘‘మగవారికి ప్రతికూలమైన అంశాల మీద కనీస చర్చ లేకుండా వీలయినంత త్వరగా తుడిచేయడానికే చూస్తుంది సమాజం. బేటీ బచావో, బేటీ పడావో అనే నినాదం మంచి ఫలితాలనివ్వాలంటే మహిళలకు ఉద్యోగం చేసే చోట సురక్షితమైన వాతావరణం ఉండాలి. ఆ వాతావరణం కల్పించే వరకు ప్రభుత్వాలు పర్యవేక్షిస్తూనే ఉండాలి’’ అని రచయిత సంధ్యా మెనన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అసత్యపు ఆరోపణలు అంటూ గొంతుచించుకోవడం మీద తన అధ్యయనాన్ని వివరిస్తూ ‘‘నేపాల్ నుంచి కేరళ వరకు రకరకాల మహిళలను కలిశాను. వారి అనుభవాలను తెలుసుకున్నాను. నా ఫోన్‌కు 250 మెసేజ్‌లు వచ్చాయి. వాటిలో మూడు మాత్రమే పెద్దగా ప్రాధాన్యం లేనివి. మిగిలినవన్నీ ఏ మాత్రం సందేహం లేకుండా వేధింపు అని అంగీకరించాల్సినవే. ఆ మూడింటిని కూడా అసత్యపు ఆరోపణలు అనడానికి వీల్లేదు. చిన్నపాటి అపార్థాల కారణంగా లేవనెత్తిన ఆరోపణలవి.మీటూ ఉద్యమంలో స్పందించే గొంతుకలు ఉన్నాయి. ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఒక స్పష్టమైన విధానాన్ని రూపొందించుకోవాలి’’ అన్నారు సుతప పాల్. గళం విప్పినందుకు.. సమంత, భూమిక, కాజల్, త్రిష, పూజా హెగ్డే, సోనాక్షి సిన్హా, నయనతార, లావణ్య త్రిపాఠి... వంటి అనేక మంది హీరోయిన్ల ద్వారా మనకు స్వర పరిచితురాలు చిన్మయి శ్రీపాద. సింగర్‌గా సింగిల్ కార్డుతో పాటలు పాడిన అమ్మాయి. నంది, ఫిలింఫేర్, స్టేట్ అవార్డు వంటి లెక్కలేనన్ని అవార్డులందుకున్న అమ్మాయి. బ్లూ ఎలిఫెంట్ కంపెనీ సీఈవోగా విజయవంతంగా నడుస్తున్న కెరీర్ ఆమెది. తమిళనాడు నుంచి ఫార్చ్యూన్ గ్లోబల్ ఉమెన్స్ మెంటరింగ్ పార్ట్నర్ షిప్ ప్రోగ్రామ్‌కు ఎంపికైన తొలి మహిళ. ఒకప్పుడు గడియారంతో పాటు పరుగులు తీస్తూ... రోజుకు ఐదారు పాటలు పాడిన అమ్మాయి. ఇప్పుడు రోజుకు ఒక పాటకు మించడం లేదు. దీనంతటికీ కారణం తమిళ కవి, పాటల రచయిత వైరముత్తు అకృత్యాలను బయటపెట్టడమే. ‘మీటూ’ అంటూ బయటకొచ్చిన బాధితులకు ఆలంబనగా నిలిచినందుకు ఆమె చెల్లిస్తున్న మూల్యం ఇది. ‘‘సక్సెస్‌లో ఉన్నావు కెరీర్‌ని కోల్పోవద్దు... అని చెప్పింది మా అమ్మ. కెరీర్ కంటే స్త్రీగా ఆత్మగౌరవం ముఖ్యం కదా అమ్మా అన్నాను. వైరముత్తు మీద నోరు తెరిచిన క్షణం నుంచి ఈ క్షణం వరకు వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. వైరముత్తు వేసుకున్న జెంటిల్మన్ ముసుగును తొలగిస్తూ వందల మంది బయటకు వచ్చారు. అప్పటివరకు నా కులం ప్రస్తావన రాలేదు, వాళ్ల అఘాయిత్యాలను బయటపెట్టినప్పటి నుంచి కుల సమీకరణలు మొదలయ్యాయి. అవి రాజకీయ సమీకరణలకు దారితీశాయి. వాటంతటగా అవి దారి తీయలేదు. అలా తీయించారు. ‘పబ్లిసిటీ కోసం సమాజంలో పేరున్న వాళ్ల మీద ఇలాంటి ఆరోపణలు చేయడం మామూలే’ అన్నాడా పెద్దమనిషి. పదిహేడేళ్లపాటు నిర్మించుకున్న కెరీర్ నాది. నేనందుకున్న అవార్డులకు లెక్కేలేదు. అలాంటి నేను పబ్లిసిటీ కోసం అర్థరహితమైన ఆరోపణలు చేయడం నాకవసరమా? పద్మశ్రీలు, పద్మభూషణ్‌లు అందుకున్న వ్యక్తి (వైరముత్తు) అనాల్సిన మాటలు కావవి. సోషల్ మీడియాలో నా మీద ట్రోలింగ్ ఎక్కువైంది. ప్రాణ హాని ఉంటుందని, ఒక్కదానినే ప్రయాణం చేయవద్దని స్నేహితులు, బంధువులు జాగ్రత్తలు చెబుతున్నారు. ఏరోజు ఏదైనా జరగవచ్చనేటంతగా భయానక వాతావరణం ఏర్పడి ఉంది. ఇది కూడా పవర్ ఉన్న వాళ్లు వ్యూహాత్మకంగా సృష్టించినదే.ఇలాంటి విషయాల్లో భారతీయ సమాజం మారాలి. పితృస్వామ్య భావజాలంతోపాటు స్త్రీ అంటే తేలిక భావం, ఏదైనా అనవచ్చు అనే ఆధిక్య భావన కరడు గట్టుకుని ఉంది. మహిళను నమ్మరు, ఆమె మాటను విశ్వసించరు. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి ఏమిటంటే... వివాదాన్ని ఎదుర్కొంటున్న మహిళ తాను చెప్పదలచుకున్న విషయాన్ని రాసి పెట్టి ఆత్మహత్య చేసుకున్నప్పుడే ఆమె మాటను విశ్వసిస్తారు. బతికి ఉండి చేసే పోరాటానికి మద్దతు ఇవ్వడానికి పురుష సమాజానికి మనసు రాదు. ఈ పోకడ మారనంత వరకు ఈ పోరాటాలు తప్పవు’’ అన్నారు గాయని చిన్మయి శ్రీపాద. – వాకా మంజులారెడ్డిఫొటోలు: అనిల్ కుమార్ మహిళ తాను చెప్పదలుచుకున్న విషయాన్ని రాసి పెట్టి ఆత్మహత్య చేసుకున్నప్పుడే ఆమె మాటను విశ్వసిస్తారు. బతికి ఉండి చేసే పోరాటానికి మద్దతు ఇవ్వడానికి పురుష సమాజానికి మనసు రాదు. మంచి పరిణామం కోసమే ‘‘నా మీద ఏ క్షణాన అయినా దాడి జరగవచ్చు. దాడి జరుగుతుందని వెనక్కి పోవడం ఉండదు. ఇప్పటి వరకు జరిగిన దాని పట్ల నాకు ఎటువంటి విచారమూ లేదు. జరగాల్సినదే జరిగింది. జరగాల్సిన మంచి పరిణామానికి వేసిన అడుగు ఇది. ఒక మంచి జరగాలంటే కొంత ఘర్షణ తప్పదు. అలాంటి ఘర్షణే ఇది. లక్ష్యాన్ని చేరే వరకు ప్రయాణం కొనసాగుతుంది. – చిన్మయి శ్రీపాద, గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ -
సూపర్ 'షీ'రోస్
మగాడు చాలా తెలివైనోడు... మగాడు మోసగాడు. ‘‘బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్.. దేర్ ఈజ్ ఏ ఉమన్’’ అంటూ మహిళను తెరవెనకే బందీ చేశాడు.. సూపర్ మ్యాన్.. స్పైడర్ మ్యాన్..టార్జాన్... బ్యాట్ మ్యాన్.. హెర్క్యూలస్.. హీ మ్యాన్.. ఫాంటమ్.. శక్తిమాన్.. ప్రపంచాన్ని ఉద్ధరించేవాళ్లంతా మగానుభావులే! అని తెలుసుకున్న కొందరు ఆర్టిస్టులు కలిసి కొంతమంది సూపర్ ఉమన్లను సృష్టించారు.. మహిళల గొప్పతనానికి గుర్తింపు లేని సమాజంలో తాటతీసే ఇలాంటి హీరోయిన్లను క్రియేట్ చేయడమంటే నవ సమాజానికి సూపర్ షీరోస్ పరిచయమవడమే! బాయీ సెక్సువల్... ముంబైలోని కామటిపురాలోని ఓ సెక్స్వర్కర్కు పుట్టిన కూతురు. జీవితంలోని చీకటి కోణాలను చూస్తూ పెరుగుతుంది. బాయీని అదే దారిలో నడిపించాలనుకుంటుంది తన తల్లి ఉంటున్న బ్రోతల్ హౌజ్ యజమాని. బాయి కూడా ఆ దారినే ఎంచుకుంటుంది కాని బ్రోతల్ హౌజ్ యజమాని అనుకున్న రీతిలో కాదు. బాయి ఆధునిక యువతి. సోషల్ మీడియాను ఫాలో అవుతూ ఉంటుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అకౌంట్లను మెయిన్టైన్ చేస్తుంటుంది. పగలంతా కామటిపురాకు దగ్గర ప్రాంతాల్లోని ఇళ్లల్లో పని చేస్తూ.. రాత్రంతా మోటర్‌బైక్ మీద బస్తీల్లో గస్తీ తిరుగుతుంది. ఏ అమ్మాయిని.. ఎవడు ఏడ్పించినా.. పిల్లలను, టీనేజర్స్‌ని ట్రాఫికింగ్ చేస్తున్నట్టు అనుమానం వచ్చినా ఆ మగవాళ్లను చీల్చి చెండాడుతుంది. మొబైల్‌ఫోన్ ఆమె ప్రధాన ఆయుధం. వనితా ఫెయిర్‌నెస్ తెల్లగా.. చక్కటి శరీరాకృతితో మెరిసిపోయే బొమ్మలాంటి అమ్మాయి కాదు వనిత. పేదరికం, నిరుద్యోగం, అవినీతి, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడే ధీర. ఎక్కడ అవినీతి ఉన్నా తన దగ్గరున్న వైట్‌వాష్ గన్‌తో పారదోలి.. వ్యవస్థను ఫెయిర్ చేసేస్తుంది. మోహ్ మాయా ఆమె పురుషాధిపత్యాన్ని సహించదు. ఆడపిల్ల కంట కన్నీరొలికితే చాలు కారణమైన వాళ్ల పట్ల కాళీలా మారుతుంది. మహిళల మీద, చిన్న పిల్లల మీద జరిగే హింసకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఆంఖ్‌మారీ జాన్ స్త్రీని రెండో పౌరురాలిగా చూడడాన్ని క్షమించదు. మహిళ ఇబ్బందులు ఎలాంటివో.. తనెన్ని అవమానాలకు గురవుతోందో వాటిని పురుషుడి అనుభవంలోకీ తెచ్చి చూపిస్తుంది . కన్నుగీటి స్త్రీ సమస్యలను పురుషులకు బదిలీ చేసేంత శక్తిమంతురాలు ఆంఖ్‌మారీ జాన్. పూనమ్ 3000 సాధారణ యువతి. సింగిల్ పేరెంట్. అద్భుతాలు చేతకావు. రోజువారీ జీవితంలోని ఇబ్బందులను ఎదుర్కోవడమే ఆమె టాస్క్. తన కొడుకును మంచి స్కూల్లో చేర్పించడమే ఆమె లక్ష్యం. ‘మన సమస్యలను తీర్చడానికి ఎవరూరారు.. అసలు ఎవరూ ఉండరు. ఎవరి జీవితం వాళ్లదే. స్ట్రగులే లైఫ్ అని చెప్తుంది. పోరాడడమే మనం చేయగల అద్భుతం అంటుంది. నింజా నానీ చాదస్తం, సంప్రదాయంతో ఇంట్లో వాళ్లను తిప్పలు పెడ్తున్నా.. మోరల్ సపోర్ట్, ఆర్థిక ఇబ్బందులను గట్టెక్కించే చిట్కాలు, పిల్లల పెంపకంలో ఇచ్చే సలహాలు.. క్లిష్ట పరిస్థితుల నుంచి కుటుంబాన్ని బయటపడేసే పెద్దరికం.. నింజా నానీ నైజం. మిస్ పమేలా ఓ చేత్తో బేకరీ నిర్వహిస్తూనే ఇంకో చేత్తో సమాజంలోని అవలక్షణాలతో ఫైట్ చేస్తుంటుంది. ఆ ఫైట్ ఎక్కడికి దారితీసినా వెరవదు. వెనకడుగు వేయదు. అవతలి పక్షం వాళ్లను మైదా ముద్దలా చేసి ఫుట్‌బాల్ ఆడుతుంది. విజయంతో నిలబడుతుంది. లేడీ నైట్ (యోధురాలు) స్కాలర్.. వీరురాలు.. శూరురాలు.. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె ఒక సూపర్ పవర్. బైక్, కారు, లారీ.. అన్నీ డ్రైవ్ చేస్తుంది. గుర్రాన్నయితే గాల్లో కూడా పరిగెత్తిస్తుంది. అదీ లేడీ నైట్ ప్రత్యేకత. ఈ మహిళల గురించి చదువుతుంటే.. ఇన్స్పైరింగ్గా ఉంది కదా! ప్రేరణ కూడా వస్తోంది.. అవునా?! మనమూ ఇలా అవ్వాలి అనీ అనిపిస్తోంది కదూ.. బట్ సారీ.. ఇవి రియల్ లైఫ్ స్టోరీస్ కాదు! కామిక్ క్యారెక్టర్స్! ఒహ్హో.. దీర్ఘమైన నిట్టూర్పు.. మూతి ముడిచేసుకునే ఎమోజీలు వద్దు. ఇలాంటి ఎమోషన్స్‌తో బలహీనపడొద్దనే చెప్పే స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ విమెన్ రోల్స్ ఇవి! సూపర్ హీరోయిన్స్ క్యారెక్టర్స్!వాటి పేర్లు వేరైనా ఈ పాత్రలన్నిటి వెనక ఉన్న లక్ష్యం ఒకటే.. మహిళ ఇండిపెండెంట్‌గా ఉండాలి.. సాధికారత సాధించాలి. ఆత్మస్థయిర్యం, హాస్య చతురత, చాకచక్యం, లౌక్యం.. ఇవన్నీ ప్రతి మనిషికీ ఉండాల్సినవి.. జీవితంలో గెలవాలంటే ఇవి తప్పనిసరి కూడా. వీటిని ప్రతి అమ్మాయికీ ఓ మెస్సేజ్‌లా ఇవ్వాలనే ఈ పాత్రలను క్రియేట్ చేశాం’’ అంటారు ఈ నాయికలకు రూపం ఇచ్చిన ఆర్టిస్టులు. ఇంతకీ ఆర్టిస్టుల ప్రస్తావనే రాలేదు... బాయీ సెక్సువల్కు ప్రాణం పోసింది మహారాష్ట్రకు చెందిన రుచా దయార్కర్. వనితా ఫెయిర్నెస్కు రూపమిచ్చింది టిన్టిన్ క్వారంటినో . ‘మోహ్ మాయా’ కృతికా సుసర్ల సృష్టి. ‘ఆంఖ్‌మారీ జాన్’.. అరుంధతీ ఘోష్, జార్జ్ మ్యాథన్ల బ్రెయిన్ హీరోయిన్. ‘పూనమ్ 3000’ విష్ణు ఎమ్ నాయర్ కథానాయిక. అమ్మమ్మ, నానమ్మల స్ఫూర్తితో ‘నింజా నానీ’కి ఊపిరి పోసింది లావణ్యా కార్తిక్. ‘మిస్ పమేలా’ ఆనందా మీనన్ ఇష్ట సఖి. ‘లేడీ నైట్’ మంజులా పద్మనాభన్ ఊహల్లోంచి వచ్చిన స్ట్రాంగ్ లేడీ. సండే అబ్జర్వర్, పయోనీర్, హిందూ బిజినెస్ లైన్ వంటి పత్రికల్లో వచ్చే ‘సుకి’ అనే కామిక్ క్యారెక్టర్ గురించి తెలిసిన వాళ్లకు మంజులా పద్మనాభన్ సుపరిచితురాలు. సుకికి జన్మనిచ్చింది ఆమే. ఇప్పుడు లేడీ నైట్‌తో ఓ సూపర్ హీరోయిన్ను తయారు చేసింది. అసలు ఇవన్నీ ఎందుకు పుట్టాయంటే సూపర్ హీరోయిన్ క్యారెక్టర్స్ వెలితిని గ్రహించిన ‘బ్రెయిన్‌డెడ్ ఇండియా’ అనే ఆర్టిస్ట్స్ కలెక్టివ్ గ్రూప్ ఒక ఆన్లైన్ ప్రాజెక్ట్ కోసం.. సృజనాత్మకమైన పోటీని నిర్వహించింది. దాని పేరు ‘‘స్త్రీ స్త్రీ సెప్టెంబర్’’.మోడర్న్ ఇండియా సూపర్ హీరోయిన్స్ ఎలా ఉండాలో... గుణాలను అభివర్ణిస్తూ.. కాస్ట్యూమ్స్‌ను కూడా డిజైన్ చేస్తూ.. వాటి బలాబలాలను కూడా చెప్తూ పాత్రలను రూపొందిచమని దేశ వ్యాప్తంగా ఎంట్రీలను ఆహ్వానించింది. చాలామంది ఆర్టిస్టులు స్పందించారు. 25 ఎంట్రీలను ఎంపిక చేసింది బ్రెయిన్‌డెడ్ గ్రూప్. అందులోని కొన్నిటినే ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశాం. ఈ సూపర్ హీరోయిన్స్‌ని బ్రెయిన్‌డెడ్ నిర్వాహకులు ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్స్ ద్వారా ఇప్పటికే నెటిజన్లకు పరిచయం చేసేశారు. ‘‘సోషల్ మీడియాలో ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. మాకు వచ్చిన ఎంట్రీలన్నిటిలో సాహసం.. సరదా కలగలసి ఉన్నారు సూపర్ హీరోయిన్స్. కామిక్ అండ్ సీరియస్ రెండూ అన్నమాట. అయితే ఎక్కడా వాస్తవానికి అతీతంగా లేవు. డే టు డే లైఫ్‌లో ఆడవాళ్లు ఫేస్ చేసే వాటి మీదే కాన్సన్ట్రేట్ చేశారు ఆర్టిస్టులు. ఆ హార్డిల్స్‌ను ఓవర్‌కమ్ చేసుకోవడానికి కావల్సిన ధైర్యం, స్థితప్రజ్ఞతను ఇంజెక్ట్ చేసేలా ఉన్నాయి ఈ క్యారెక్టర్స్’’ అంటున్నారు.. నిర్వాహకులు అరుంధతీ ఘోష్, జార్జ్ మ్యాథన్. మంచి ప్రయత్నం.. ఫెయిరీ టేల్స్.. ప్లేస్‌లో పై పాత్రలతో కొత్త తరానికి సరికొత్త కథలు వినిపించాలి. – శరాది -
పీడకలపై పిడికిలి మీ టూ
లైంగిక పీడనకు వ్యతిరేకంగా మహిళలు పిడికిలి బిగిస్తున్నారు.సామాజిక మాధ్యమాలే వేదికగా తమ గళం వినిపిస్తున్నారు.‘మీ టూ’ ఉద్యమం ధాటికి ఎందరో ‘మగా’నుభావులు అదిరిపడుతున్నారు. ‘మీ టూ’ పెనుగాలుల తాకిడికి ఒక్కొక్కరి ముసుగులే తొలగిపోతున్నాయి.ఇప్పటికే కొందరు ప్రముఖుల పేర్లు బజారునపడ్డాయి... రానున్న రోజుల్లో ఇంకెందరి అసలు రంగులు బయటపడతాయో చూడాల్సిందే! ‘నేను సైతం’ అంటూ ముందుకొస్తున్నారు మహిళలు. తమకు జరిగిన లైంగిక వేధింపులపై ‘మీ టూ’ అంటూ సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని ముక్తకంఠంతో నినదిస్తున్నారు. డబ్బు, అధికారం, పలుకుబడి కలిగి సమాజంలో పెద్దమనుషులుగా చలామణీ అవుతున్న పురుషపుంగవుల అసలు రంగును బట్టబయలు చేస్తున్నారు. ‘మీ టూ’ సోషల్ మీడియాలో ఒక అక్టోబర్ విప్లవం. హాలీవుడ్ మొదలుకొని బాలీవుడ్, టాలీవుడ్ వరకు ‘మీ టూ’ సెగలు వ్యాపించాయి. ‘మీ టూ’ దెబ్బకి సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖుల బాగోతాలు బజారున పడ్డాయి. ‘మీ టూ’ ధాటికి బజారున పడ్డవారిలో ఆర్థికరంగ ప్రముఖులు, మతగురువులు, క్రీడా ప్రముఖులు, సంగీత ప్రముఖులు, వైద్య ప్రముఖులు, సైనిక ఉన్నతాధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. తాజాగా ‘మీ టూ’ మంటలు మీడియాకూ వ్యాపించాయి. సమాజానికి సుద్దులు చెప్పే పలువురు ప్రముఖ పాత్రికేయుల అసలు రంగులు ప్రపంచానికి తేటతెల్లమైపోతున్నాయి. ‘మీ టూ’ పెనుగాలులకు రానున్న రోజుల్లో ఎందరు పెద్దమనుషుల నిజస్వరూపాలు బయటపడతాయో వేచిచూడాల్సిందే. సోషల్ మీడియాలో నిప్పురవ్వలా మొదలైన ‘మీ టూ’ ఉద్యమం అనతికాలంలోనే దావానలంలా మారింది. హాలీవుడ్ నటి అలీసా మిలానో తనకు ఎదురైన లైంగిక వేధింపులపై గత ఏడాది అక్టోబర్ 15న ‘మీ టూ’ హ్యాష్‌ట్యాగ్‌తో ‘ట్విట్టర్’లో ఒక పోస్టు పెట్టింది. ఆ రోజు గడిచేలోగానే ‘ట్విట్టర్’లో రెండులక్షల మందికి పైగా యూజర్లు ‘మీ టూ’ హ్యాష్‌ట్యాగ్‌తో తాము ఎదుర్కొన్న అనుభవాలను ఏకరువు పెడుతూ ‘ట్విట్టర్’ను హోరెత్తించారు. ‘మీ టూ’ హ్యాష్‌ట్యాగ్ మొదలైన తొలి ఇరవైనాలుగు గంటల్లో ‘ఫేస్బుక్’లోనైతే ఏకంగా 47 లక్షల మందికి పైగా యూజర్లు తమకు ఎదురైన లైంగిక వేధింపులపై దాదాపు 1.20 కోట్ల పోస్టులు పెట్టారు. ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో తొలి ఇరవైనాలుగు గంటల్లో మార్మోగిన ట్వీట్లు, పోస్టుల్లో దాదాపు 45 శాతం అమెరికా నుంచే వచ్చాయి. గత ఏడాది అక్టోబర్ నుంచి ప్రతిరోజూ వేలాదిగా ‘మీ టూ’ పోస్టులు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ‘మీ టూ’ పోస్టుల ఆధారంగా పత్రికల్లో, టీవీ చానళ్లలో దాదాపు ప్రతిరోజూ కథనాలు వెలువడుతున్నాయి. పన్నెండేళ్ల కిందటే ‘మీ టూ’ మూలాలు సోషల్ మీడియాలో ‘మీ టూ’ కథనాలు వైరల్ కావడం మొదలై ఏడాదవుతోంది. అయితే, పన్నెండేళ్ల కిందటే సోషల్ మీడియాలో ‘మీ టూ’ మూలాలు ఏర్పడ్డాయి. ఆఫ్రికన్ సంతతికి చెందిన అమెరికన్ సామాజిక కార్యకర్త తరానా బుర్కే తొలిసారిగా ‘మీ టూ’ పదబంధంతో తనకు తారసపడిన ఒక పదమూడేళ్ల బాలిక కథనాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘మై స్పేస్’ అనే సోషల్ నెట్వర్కింగ్ సైట్లో ఆమె పెట్టిన పోస్ట్ అప్పట్లో అంతగా వైరల్ కాలేదు. అమెరికాలో నల్లజాతి బాలికలు, మహిళలపై జరుగుతున్న లైంగిక అఘాయిత్యాలకు వ్యతిరేకంగా ఆమె పోరాటం సాగిస్తున్నారు. ‘మీ టూ’ ఉద్యమం ఊపందుకోవడంతో బుర్కే ఇదే పేరుతో ఒక డాక్యుమెంటరీని రూపొందిస్తున్నారు. న్యాయ వ్యవస్థపైనా మరకలు ‘మీ టూ’ ఉద్యమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ‘మీ టూ’ కథనాల్లో చాలావరకు చట్టపరమైన ఫిర్యాదుల వరకు వెళ్లడం లేదు. కేవలం అఘాయిత్యాలకు పాల్పడిన ‘పెద్దమనుషుల’ పేర్లు బయటపెట్టడానికే పరిమితమవుతున్నాయి. ఈ ఉద్యమంలో సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందినవారు, మత గురువులు అత్యధికంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.లైంగిక వేధింపుల బాధితులు తమకు చట్టబద్ధంగా న్యాయం దక్కాలనుకుంటే న్యాయవ్యవస్థను ఆశ్రయించాల్సి ఉంటుంది. అయితే, ఈ వ్యవహారంలో న్యాయవ్యవస్థపై కూడా మరకలు ఉండటం గమనార్హం. ‘మీ టూ’ హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో వ్యాపించడానికి కొన్నేళ్ల ముందే, 2013లో ఒక మహిళ తన బ్లాగులో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఒకరిపై ఆయన పేరు బయటపెట్టకుండానే ఆరోపణలు ఎక్కుపెట్టారు. బ్లాగులో రాసిన విషయంపై మీడియా కథనాలు న్యాయవ్యవస్థలో కలకలం రేపాయి. మీడియా కథనాలు వెలువడిన తర్వాత ప్రముఖ న్యాయవాది ఇందిరా జైసింగ్ సదరు న్యాయమూర్తి పేరును బయటపెట్టారు. న్యాయమూర్తి పేరు కూడా బయటకు రావడంతో ఈ విషయమై విచారణ కోసం హడావుడిగా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. విచారణ కమిటీ ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఏకే గంగూలీని దోషిగా తేల్చింది. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టడానికి ఉద్దేశించిన చట్టం అదే ఏడాది అమలులోకి వచ్చింది. చట్టం ఏం చెబుతోందంటే... పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వైధింపులను నిరోధించడానికి 2013లో అమలులోకి వచ్చిన చట్టం లైంగిక వేధింపులకు స్పష్టమైన నిర్వచనం ఇచ్చింది. ‘అవతలి వ్యక్తి నుంచి అభ్యంతరం వచ్చినప్పటికీ, పనిచేసే చోట మహిళలను తాకడం, సెక్స్ కోరడం, పోర్నోగ్రఫీ చూపించడం, అసభ్య పదజాలాన్ని ప్రయోగించడం వంటి చర్యలను లైంగిక వేధింపులుగానే పరిగణించాలి’ అని ఈ చట్టం చెబుతోంది.ఈ చట్ట ప్రకారం పని ప్రదేశంలో మహిళలను ఉద్దేశించి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అశ్లీల వ్యాఖ్యలు చేసినా, మహిళల ఆమోదం లేకుండా అనవసరంగా తాకినా, లైంగికవాంఛ తీర్చాలని ప్రాధేయపడినా లేదా డిమాండ్ చేసినా, మాటల ద్వారా లేదా చేతల ద్వారా లైంగిక ఉద్దేశాన్ని బయటపెట్టేలా ఎలాంటి చర్యలకు పాల్పడినా, మహిళలను వెంబడించినా, అశ్లీల చిత్రాలను వారికి చూపించినా, సెల్ఫోన్లు, ఈ–మెయిల్స్ ద్వారా వాటిని పంపినా అలాంటి చర్యలను నేరంగానే పరిగణించడం జరుగుతుంది. బాధితుల ఫిర్యాదు మేరకు జరిపిన విచారణలో నేరం రుజువైతే మూడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి. పని ప్రదేశంలో ఒక మహిళపై లైంగిక వేధింపులు జరిగినట్లుగా ఎవరు నిర్ధారించాలనే దానిపై కూడా ఈ చట్టం తగిన నిబంధనలను రూపొందించింది. పదిమంది కంటే ఎక్కువ మంది సిబ్బంది కలిగిన ప్రతి సంస్థా అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ కమిటీకి ఒక సీనియర్ మహిళా ఉద్యోగి నాయకత్వం వహించాలి. కమిటీలో సగానికి పైగా మహిళా సభ్యులే ఉండాలి. మహిళల కోసం పనిచేసే ఏదో ఒక ఎన్జీవో ప్రతినిధికి కూడా ఈ కమిటీలో సభ్యత్వం ఉండాలి. పదిమంది కంటే తక్కువ మంది సిబ్బంది ఉన్న సంస్థల్లో మహిళా ఉద్యోగులు ఎవరైనా లైంగిక వేధింపులకు గురైనట్లయితే, వారు జిల్లా స్థాయి కమిటీకి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఫిర్యాదులపై కమిటీలు విచారణ జరిపి అవి నిజమో, కాదో నిర్ధారిస్తాయి. ఒకవేళ ఫిర్యాదు నిజమేనని విచారణలో రుజువైతే అంతర్గతంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలా లేక పోలీసులకు ఫిర్యాదు చేయాలా అనే విషయాన్ని కూడా ఈ కమిటీలే నిర్ణయిస్తాయి. అలాగే, అబద్ధపు ఫిర్యాదులపై నిర్ణయాలు తీసుకునే అధికారం కూడా ఈ కమిటీలకే ఉంటుంది. మహిళా పాత్రికేయులకు బాసటగా ‘సిస్టర్హుడ్’ ఉద్యమం సోషల్ మీడియాలో ‘మీ టూ’కు తోడుగా ‘సిస్టర్హుడ్’ హ్యాష్‌ట్యాగ్‌తో ఉద్యమం మొదలైంది. మహిళా పాత్రికేయులకు బాసటగా రుతుపర్ణ ఛటర్జీ అనే పాత్రికేయురాలు ‘ట్విట్టర్’ వేదికగా ‘సిస్టర్హుడ్’ హ్యాష్‌ట్యాగ్‌తో ఉద్యమం ప్రారంభించారు. ‘సిస్టర్హుడ్’ క్యాంపెయిన్ ద్వారా తన సమస్యకు పరిష్కారం దొరికిందని దీప్శిఖ అనే పాత్రికేయురాలు వెల్లడించారు. వేధింపుల సమస్యల నుంచి గట్టెక్కడానికి తగిన అనుభవజ్ఞుల సలహాలు ‘సిస్టర్హుడ్’ క్యాంపెయిన్‌లో లభిస్తున్నాయని, ఇది మహిళా పాత్రికేయులకు చాలా ఉపయోగకరంగా ఉంటోందని రాజేశ్వరీ గణేశన్ అనే ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ చెబుతున్నారు. మీ టూ కంటే ముందే... సోషల్ మీడియా అందుబాటులో లేని కాలంలోనే, ‘మీ టూ’ ఉద్యమం ఏమిటో తెలియని కాలంలోనే చాలామంది ప్రముఖులు లైంగిక వేధింపుల ఆరోపణల్లో చిక్కుకున్న సందర్భాలు ఉన్నాయి. పాప్ ప్రపంచానికి తిరుగులేని రారాజుగా చలామణీ అయిన మైకేల్ జాక్సన్ ఒక పదమూడేళ్ల బాలుడిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడంటూ 1993లో ఆరోపణలు గుప్పుమన్నాయి. ఆ బాలుడి తల్లి స్వయంగా మైకేల్ జాక్సన్‌కు వ్యతిరేకంగా మీడియాకెక్కింది. బాలుడి కుటుంబానికి ఆర్థిక పరిహారం చెల్లించిన మైకేల్ జాక్సన్ ఆ వివాదాన్ని సర్దుబాటు చేసుకున్నాడు. బాక్సింగ్ చాంపియన్ మైక్ టైసన్ ఒక అత్యాచారం కేసులో 1992లో దోషిగా తేలి, జైలు శిక్ష అనుభవించాడు. ఇంగ్లిష్ సంగీతకారుడు గ్యారీ గ్లిట్టర్ బాలలపై అఘాయిత్యాలు, చైల్డ్ పోర్నోగ్రఫీ కేసుల్లో 1999, 2006 సంవత్సరాల్లో జైలు శిక్ష పొందాడు. హాలీవుడ్ నటుడు జెఫ్రీ జోన్స్‌కు చైల్డ్ పోర్నోగ్రఫీ కేసులో ఐదేళ్ల శిక్ష పడింది. సోషల్ మీడియా పెద్దగా పరిచయం లేని రోజుల్లో దాదాపు రెండు దశాబ్దాల కిందట పంజాబ్ మాజీ డీజీపీ కేపీఎస్ గిల్ లైంగిక వేధింపుల కేసులో దోషిగా తేలారు. రూపన్దేవల్ బజాజ్ అనే సీనియర్ ఐఏఎస్ అధికారిపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఆమె సాగించిన న్యాయపోరాట ఫలితంగా గిల్‌కు శిక్ష పడింది. ఇన్ఫోసిస్ డైరెక్టర్లలో ఒకరైన ఫణీష్‌మూర్తి 2002లో లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. తనపై ఫణీష్‌మూర్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఆయన వద్ద ఎగ్జిక్యూటివ్ కార్యదర్శిగా పనిచేసే మహిళ ఫిర్యాదు చేశారు. శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఫణీష్‌మూర్తి ఆమెకు 30 లక్షల డాలర్లు (రూ.22 కోట్లు) పరిహారంగా చెల్లించి, వివాదాన్ని సర్దుబాటు చేసుకున్నారు. మీడియా రంగంలో సంచలన పాత్రికేయుడిగా పేరుపొందిన ‘తెహల్కా’ వ్యవస్థాపకుడు తరుణ్ తేజ్‌పాల్ లైంగికదాడి కేసులో న్యాయవిచారణ ఎదుర్కొంటున్నారు. తెహల్కాలోనే పనిచేసే ఒక మహిళా ఉద్యోగి 2013లో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసుపై విచారణ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. లెక్కలేనంతగా జరుగుతున్న సంఘటనల్లో ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. వివిధ రంగాల్లో ఇలాంటి వివాదాలు చాలానే ఉంటున్నా, చాలామంది ప్రముఖుల పేర్లు వార్తాకథనాల్లో బయటకు వస్తున్నా, వారికి శిక్షలు పడ్డ సందర్భాలు మాత్రం తక్కువగానే ఉంటున్నాయి. వేధింపులు ఈనాటివి కావు మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు ఈనాటివి కావు. నాగరికత మొదలైన నాటి నుంచే మహిళలపై అఘాయిత్యాలు సాగుతూనే ఉన్నాయి. మహిళలపై అణచివేతకు ఫలితంగానే మాతృస్వామ్య వ్యవస్థ అంతరించి, పితృస్వామ్య వ్యవస్థ ఉనికిలోకి వచ్చింది. మహిళలపై వేధింపులు, అత్యాచారాలకు సంబంధించి మన పురాణాల్లోనే కొల్లలుగా ఉదాహరణలు ఉన్నాయి. మహిళలపై అఘాయిత్యాలకు తెగబడే వారిని ఇప్పటి ఆధునిక ప్రసారసాధనాలు సైతం కీచకుడితో పోలుస్తుంటాయి. ఇంతకూ కీచకుడికి ఎందుకు అంతటి బరితెగింపు, బలుపు అంటారా..? కీచకుడు స్వయంగా ఏ రాజ్యానికీ రాజు కాడు.మత్స్య దేశాన్ని ఏలే విరాటరాజుకు బావమరిది. అమిత బలసంపన్నుడు. ‘సింహబలుడు’ అనేది అతగాడి ముద్దుపేరు. అంతటి బలవంతుడు బావమరిది అయినందుకు సంబరపడ్డ విరాటరాజు అతగాడికి సర్వసేనాధిపతిగా పట్టంకట్టాడు. కీచకుడు సర్వసేనాని అయిన తర్వాత విరాటరాజు కేవలం ఉత్సవవిగ్రహంగా మాత్రమే మిగిలాడు. రాజ్యంలో కీచకుడే పెత్తనం చలాయించేవాడు. కంటికి నదరుగా కనిపించే స్త్రీలను చెరచడం అతగాడికి ఆటవిడుపుగా ఉండేది. విరాటరాజ్యంలో పరిస్థితులు ఇలా ఉన్న రోజుల్లోనే పన్నెండేళ్ల అరణ్యవాసం పూర్తి చేసుకున్న పాండవులు మారువేషాల్లో అతడి పంచన చేరుతారు.రకరకాల ఉద్యోగాల్లో కుదురుకుంటారు. విరాటుని భార్య సుధేష్ణ వద్ద ద్రౌపది ‘సైరంధ్రి’గా కుదురుకుంటుంది. ఆమెపై కన్నేసిన కీచకుడు ఆమెను లోబరచుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తారు.నిండు సభ వరకు ఆమెను వెంటాడతాడు. ద్రౌపదిని తరుముతూ కీచకుడు సభలోకి రావడం చూసి వలలుడి పేరుతో వంటవాడిగా ఉన్న భీముడు ఆగ్రహోదగ్రుడవుతాడు. సభలో అతడిని ఏమీ చేయలేక, ద్రౌపదితో కలసి ఉపాయం పన్నుతాడు. కీచకుడిని రాత్రివేళ నర్తనశాలకు రప్పించి, అతడిని అంతం చేస్తాడు. ‘మహాభారతం’ పుణ్యాన మహిళలను వెంటాడి వేధించే దుర్మార్గులకు ‘కీచకుడు’ పర్యాయపదంగా మారిపోయాడు. అలాగని పురాణాల్లో కీచకుడొక్కడే మహిళల పాలిటి దుర్మార్గుడనుకోవడానికి వీల్లేదు. దుర్యోధనుడి ప్రోద్బలంతో ద్రౌపదిని నిండుసభలోకి జుట్టుపట్టుకుని ఈడ్చుకొచ్చి, ఆమెను వివస్త్రను చేయడానికి ప్రయత్నించిన దుశ్శాసనుడు సైతం కీచకుడికి ఏమీ తీసిపోడు. పాండవులు అరణ్యవాసంలో ఉన్నకాలంలో వారు ఉండే పర్ణశాలలో ఎవరూ లేనప్పుడు చొరబడిన సైంధవుడు ద్రౌపదిపై అత్యాచారయత్నానికి తెగబడ్డాడు. సైంధవుడి దురాగతాన్ని దూరం నుంచి గమనించిన భీముడు ఒక్క ఉదుటన అక్కడకు చేరుకుని, వాడితో తలపడ్డాడు. అతడిని అక్కడికక్కడే చంపబోయిన భీముడిని ధర్మరాజు వారించడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుని, అతడిని విడిచిపెడతారు. సైంధవుడి అసలుపేరు జయద్రథుడు. నూరుగురు కౌరవుల ఏకైక సోదరి దుస్సలకు భర్త. నిజానికి ద్రౌపది అతడికి వరుసకు సోదరి అవుతుంది. అయినా వావివరుసలు చూసుకోకుండా ఆమెపై అఘాయిత్యానికి తెగబడ్డ నీచుడు అతడు. కురుక్షేత్ర యుద్ధంలో దుశ్శాసనుడు భీముడి చేతిలోను, సైంధవుడు అర్జునుడి చేతిలోను మరణిస్తారు. మహిళలపై దారుణాలు సాగించిన పురాణపురుషుల్లో నరకాసురుడి గురించి తప్పక చెప్పుకోవాల్సిందే. ప్రాగ్జ్యోతిషపురాన్ని పరిపాలించే నరకుడు తొలిరోజుల్లో మంచిగానే ఉండేవాడు. తన రాజ్యాన్ని చక్కగా పరిపాలించుకునేవాడు. నియమ నిష్ఠలతో అమ్మవారిని పూజించేవాడు. కొన్నాళ్లకు అతడికి పొరుగు రాజ్యమైన శోణితపురాన్ని ఏలే బాణాసురుడితో స్నేహం కుదిరింది. బాణాసురుడి దృష్టిలో స్త్రీ భోగవస్తువు మాత్రమే. మహిళలను తల్లిలా భావించడాన్ని అతడు హేళన చేసేవాడు. నరకుడు నెమ్మదిగా బాణుడి ప్రభావంలో పడ్డాడు. అమ్మవారి పూజలు నిలిపివేశాడు. ఇరుగు పొరుగు రాజ్యాలపై దండెత్తి నచ్చిన యువతులందరినీ బలవంతంగా ఎత్తుకొచ్చి బంధించేవాడు. అలా పదహారువేల మంది రాకుమార్తెలను చెరబట్టాడు. చివరకు శ్రీకృష్ణుడి చేతిలో హతమయ్యాడు. -
మళ్లీ వార్తల్లో నిలిచిన ప్రియా వారియర్
ఒక్క కన్నుగీటుతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది ప్రియా ప్రకాష్ వారియర్. ఒరు ఆదార్ లవ్ సినిమాలోని మాణిక్య మలరాయ సాంగ్‌లో కన్నుకొట్టి, గన్నుతో పేల్చి కుర్ర హృదయాలను కొల్లగొట్టేసిందీ భామ. ఈ ఒక్క సాంగ్‌తో బాలీవుడ్లో చాన్స్ కొట్టేసింది. ఇక ప్రస్తుతం ఒరు అదార్ లవ్ సినిమాలోని మరో సాంగ్‌ను రిలీజ్చేశారు మేకర్స్. ఈ సాంగ్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ఇది కూడా మరో కొత్త రికార్డును సెట్ చేస్తోంది. యూట్యూబ్‌లో అతి తక్కువ కాలంలో ఎక్కువ డిస్‌లైక్‌లు సాధించిన సాంగ్‌గా రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పటికే ఈ పాటను పది లక్షలకు పైగా వీక్షించగా, రెండు లక్షలకు పైగా డిస్‌లైక్‌లతో ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పుడు ఈ పాటే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ప్రియకు ఇంతటి వ్యతిరేకతకు గల కారణాలు ఏంటో తెలియడం లేదు. తన అభిమానులు సైతం ఈ డిస్లైక్లకు గల కారణాలేంటని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా మళ్లీ ప్రియా వారియర్ వార్తల్లోకెక్కేసింది. -
సోషల్ వార్నింగ్
-
చంద్రబాబు మళ్లీ వేసేశారు..!
-
రారండోయ్‌పండగచేద్దాం!
చిన్నా పెద్దా తేడా లేదు. అక్కడ, ఇక్కడ అన్న బేధాలు లేవు. కామన్ మేన్ అయినా సెలబ్రిటీ అయినా.. ఎవరైనా ఒకటే. అందరి ఆలోచనా ఒకటే. పండగ చేసుకోవాలి. ‘రారండోయ్ సంక్రాంతి పండగ చేద్దాం’ అంటూ, ప్రేక్షకులకు పండగ శుభాకాంక్షలు చెబుతూసోషల్ మీడియాలో వారి ఫొటోలు పోస్ట్ చేశారు కొందరు నటీనటులు. నాగశౌర్య, రష్మిక మండన్న జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఛలో’. ‘‘ఈ నెల 25న జరగనున్న ‘ఛలో’ ప్రీ–రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా రావడానికి చిరంజీవిగారు ఒప్పుకున్నారు. థ్యాంక్స్ సర్. భోగి రోజున నా ఆనందానికి అవధులు లేవు’’ అన్నారు నాగశౌర్య. ఈ చిత్రాన్ని వచ్చే నెల 2న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పండగ రోజు మా నాన్నగారితో టైమ్ స్పెండ్ చేయడం చాలా హ్యాపీగా ఉందన్నారు మంజుల. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి సెలబ్రేషన్లో భాగంగా రామ్‌చరణ్, నిహారిక, వైష్ణవ్ తేజ్‌లతో తాము ఉన్న గ్రూప్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ.. నివేథా థామస్, అనుపమా పరమేశ్వరన్, రీతూ వర్మ తమ లేటెస్ట్ ఫొటోలను షేర్ చేశారు. భోగి మంట సంబరాల్లో సంపూర్ణేష్ బాబు, హృదయ కాలేయం దర్శకుడు–కొబ్బరిమట్ట నిర్మాత సాయి రాజేష్. ఆదివారం ఉదయం జై సల్మీర్‌లో హిందీ చిత్రం ‘అయ్యారీ’ టీమ్‌తో కలిసి భోగి పండగ వేడుకల్లో పాల్గొన్నారు హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్. -
‘సెల్’మోహన రంగ
సాక్షి, ఇబ్రహీంపట్నం: సెల్ మోహనరంగా ఎక్కడ చూసిన సెల్‌ఫోన్ వినియోగం విఫరీతంగా పెరిగిపోయింది. సెల్‌ఫోన్ ప్రభావం వల్ల మానవ విలువలు, మానవ సంబంధాలు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. గత కొద్ది సంవత్సరాల క్రితం నలుగురు ఒక చోట ఉన్నారంటే సామాజీక , రాజకీయ , కుటుంబ, గ్రామాభివృద్ధి వివరాలు గురించి చర్చించుకునే వారు. ఎవరికి తొచింది వారు మాట్లాడి ఒకరికి ఒకరు పరిచయాలు పెంచుకునే ప్రయాత్నం చేసేవారు. ప్రస్తుతం అలాంటి మానవ సంబంధాలను సెల్పోన్లు వచ్చి చేస్తున్నాయి. ఇంట్లో ఎంత మంది ఉంటే అందరికి సెల్‌ఫోన్ ఉంది. దీంతో ఒకరికొకరు మాట్లాడుకొని చర్చించుకునే అవకాశం లేకుండా పోయింది. యువత ఎప్పుడూ సోషల్ మీడియాలో మునిగి తేలుతున్నారు. సెల్‌పోన్ చేతిలో ఉంటే చాలు ఎవరికి వారే యమునతీరే అన్నట్లుగా ఉంటుంది. సెల్‌పోన్ పై చేయి పెట్టి గీకడం లేదంటే చెవిలో ఇయర్‌పోన్స్ పెట్టుకోని అందులోని మునిగి తేలడం జరుగుతుంది. ఈ చిత్రాన్ని చూస్తే మీకే అర్థమౌతొంది. నలుగురు విద్యార్థులు ఒకే సీట్లో ఎదురురేదురుగా కుర్చున్నారు. కాని ఎవరి జోలి ఎవరికి పట్టకుండా చెవుల్లో ఇయర్‌పోన్స్ పెట్టుకోని పోన్లమైకంలో మునిగితేలారు. చదువుకొని విషయపరిజ్ఞానం నేర్చుకొవాల్సిన భావిభారత పౌరులే ఇలా ఉన్నారంటే పోరపాటే అందరి పరిస్థితి ఇలాగే ఉంది. -
అయ్యోపాపం.. ఆ శునకం.. ఆదుకున్న కాప్స్!
ఆపదలో ఉన్న ప్రజలను కాపాడేందుకు పోలీసు బలగాలు ప్రాణాలకు తెగించి సహాయం అందించే సంగతి తెలిసిందే. తాజాగా సాటి మానవులను కాదు మూగ జంతువులను సైతం ఆదుకుంటామని బెంగళూరు పోలీసులు చాటారు. బెంగళూరు పోలీసులకు ట్విట్టర్లో విశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సింగిల్‌లైన్ పంచ్ డైలాగ్ పోస్టులతో నెటిజన్లను ఆకట్టుకుంటున్న బెంగళూరు కాప్స్.. తాజా చర్యతో ప్రశంసలు అందుకుంటున్నారు. ఓ వీధికుక్క అనుకోకుండా ప్లాస్టిక్ బిందెలో తల దూర్చి.. అందులో తల ఇరుక్కోవడంతో చాలాసేపు నరకాన్ని అనుభవించింది. ఈ విషయం తెలియడంతో ఏకంగా 15మంది పోలీసులు రంగంలోకి దిగి.. ఆ కుక్కకు విముక్తి కల్పించారు. శునకం తలకు ఇరుక్కున ప్లాస్టిక్ బిందెను తొలగించి.. అది అనుభవిస్తున్న నరకం నుంచి విముక్తి కల్పించారు. ఈ విషయాన్ని బెంగళూరు ఈస్ట్ ట్రాఫిక్ డీసీపీ అభిషేక్ గోయల్ ట్విట్టర్లో పంచుకున్నారు. ఈ పోస్ట్ వెంటనే వైరల్‌గా మారింది. నెటిజన్లు బెంగళూరు పోలీసుల చర్యను ప్రశంసిస్తున్నారు. మూగజీవాల పట్ల సానుభూతి చూపుతున్న పోలీసులపై తమకు గౌరవం పెరిగిందని కొనియాడుతున్నారు. -
హీరోయిన్ అఫిషియల్ యాప్
చెన్నై: ప్రముఖ హీరోయిన్ ఎమీ జాక్సన్ తన అఫిషియల్ యాప్‌ను చెన్నైలోని ఓ హోటల్లో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ న్యూయార్క్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ ఎస్కాపెక్స్ ఈ యాప్‌ను రూపొందించిందని చెప్పారు. ఈ కొత్త యాప్‌తో అభిమానులు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్‌ల ద్వారా తనతో నేరుగా చాట్ చేయవచ్చన్నారు. పుష్ నోటిఫికేషన్స్, ఫీచర్డ్ వీడియోస్, సూపర్‌ఫ్యాన్ బ్యాడ్జెస్, సబ్స్క్రిప్షన్, లైవ్ బ్రాడ్కాస్ట్ వంటి వినూత్నమైన అంశాలు ఈ యాప్‌లో ఉన్నాయని వివరించారు. తాను భవిష్యత్తులో మరెన్నో ప్రణాళికలు రూపొందించనున్నానని, ఇవన్నీ అభిమానులు ముందుగా తెలుసుకునేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందన్నారు. ఈ యాప్ ద్వారా సోషల్ మీడియా కార్యకలాపాల్లో తనను మరో మెట్టుకు తీసుకువెళ్లినట్టు ఆమె పేర్కొన్నారు. దీని ద్వారా అభిమానులకు మరింత చేరువయ్యే అవకాశం ఉందన్నారు. డబ్బు సంపాదన కోసం తాను ఈ యాప్ పెట్టలేదని ఎమీ జాక్సన్ స్పష్టం చేశారు.