ఒహియో: జంతువులు ఆనందంతో ఉన్నప్పుడు పరుగులు తీస్తాయి. అంలాటి సందర్భంలో దానికి సంబంధించిన మరో జంతువు జతకూడితే ఆ పరుగుకు జోరు పెంచుతాయి. సాధారణంగా జిరాఫీలు అరుదైన సందర్భాల్లో మాత్రామే పరుగెత్తుతాయి. భారీ శరీరం, ఎతైన మెడను కలిగి ఉండే ఇవి గుంపులు గుంపులుగా నడుచుకుంటూ వెళ్తాయి. అయితే తాజాగా ఓ చిన్న జిరాఫీ ఆనందంతో పరుగులు తీసిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో ఉన్న సిన్సినాటి జూలోని థియో అనే చిన్న జిరాఫీ సంతోషంగా పరుగెత్తుకుంటూ జూలో తిరుగుతుంది. అదే సమయంలో దాని సోదర జిరాఫీ ఫెన్ జతచేరడంతో మరింత వేగంగా పరుగుతీస్తుంది.
ఈ వీడియోను సన్సినాటి జూ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘బేబీ జిరాఫీ థియో తనలోని శక్తి కూడదీసుకుని తన సోదర జిరాఫీ ఫెన్‌తో సరదాగా పరుగులు తీసింది’ అని కాప్షన్ జతచేసింది. ఈ వీడియోను ఇప్పటి వరకు 15వేల మంది నెటిజన్లు వీక్షించారు. బేబీ జిరాఫీ పరుగును చూసిన నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ‘థియో జిరాఫీ చాలా అందంగా ఉంది. అది తన సోదర జిరాఫీ ఫెన్ వద్దకు వెళ్లి అలా సరదాగా రేసుకు వెళ్దామా! అని అడిగింది’ అని ఓ నెటిజన్ ఫన్నీగా కామెంట్ చేశాడు. ‘ఈ వీడియోను చూసిన నాకు ఉదయం చాలా సంతోషం కలిగింది’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment