giraffe
-
జూలో జంతువులకు ఆయుషు ఎక్కువ.. ఎందుకంటే..?
సాక్షి, హైదరాబాద్: వేళకు తిండి..సేద తీరేందుకు ఆవాసం ఉంటే ఏ జీవి అయినా పదికాలాలు బాగా ఉంటుందనే సామెత మన జూ పార్కులోని జంతువులకు సరిగ్గా సరిపోతుంది. అడవి జంతువులకంటే.. జంతు ప్రదర్శనశాలలోనే పుట్టి.. ఇక్కడే పెరిగిన ఆనేక జంతువులు తమ జీవితకాలంటే ఎక్కువగా జీవిస్తున్నాయి. పోషకాహారం.. అలనాపాలన బాగుండడంతో ఈ జీవులు సంపూర్ణ ఆరోగ్యంతో జీవితాన్ని గడుపుతున్నాయి. అడవుల్లో స్వేచ్ఛగా పెరిగే జంతువులు వయోభారంతో వేటను కొనసాగించలేవు. ఒంట్లో సత్తువ తగ్గడం.. ఇతర ప్రాణులతో పోటీపడలేక ఆకలితో అలమటిస్తాయి. నీరసంతో కన్నుమూస్తాయి. అదే జూలో అయితే.. సహజసిద్ధమైన ఆహారానికి కొరత ఉండదు. బలవర్ధకమైన ఆహారం.. సప్లిమెంట్లు, ఆనారోగ్యానికి గురైతే ఔషధాలు అందిస్తుండడంతో ఈ ప్రాణుల జీవనకాలం పెరుగుతుందని జూ క్యూరేటర్ రాజశేఖర్ ‘సాక్షి’కి తెలిపారు. జూలో వేట లేదు, ఇతర జంతువులతో పోరాటాలు ఉండకపోవడం కూడా వీటి జీవితకాలం పెరగడానికి కారణమని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో అడవిలో పెరిగే జంతువులకంటే అధికకాలం సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న కొ న్ని జంతువుల వివరాలు మీ కోసం... ఆహార ఆవసరాలకు అనుగుణంగా డైట్ జూలో వివిధ రకాల వన్యప్రాణులు ఉన్నాయి. వాటి ఆహార అవసరాలకు అనుగుణంగా పోషకాలతో కూడిన ఆహారం అందిస్తాం. ఆహారంలో నాణ్యత ప్రమాణాలు తప్పక పాటిస్తాం. ఒక్కో వన్యప్రాణి ఒక్కోతీరుగా ఆహారం తీసుకుటుంది. సమయం, సరిపడా మోతాదులో ఆహారం అందజేస్తాం.ఆడవుల్లో ఉండే వన్యప్రాణుల కంటే జూలో ఉంటున్న వన్యప్రాణుల వయో పరిమితి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాటికి ఆహారం సమయానికి అందుతుంది. రోగాల బారినపడకుండా చూసుకుంటాం. – డాక్టర్ మహ్మద్ అబ్దుల్ హకీం, జూ డిప్యూటీ డైరెకర్ట్ (వెటర్నరీ) ఆపర్ణ (బెంగాల్ టైగర్) పుట్టినరోజు : డిసెంబర్ 3, 2001 వయసు : 20 ఏళ్లు సగటు జీవితకాలం : 15 ఏళ్లు జిరాఫీ ( సునామీ బసంత్) పుట్టినరోజు : ఫిబ్రవరి 13, 2005 వయసు : 17 ఏళ్లు సగటు జీవితకాలం : 15 ఏళ్లు కునాల్, సమీరా (తెల్లపులులు) పుట్టినరోజు : సెప్టెంబర్ 9, 2006 వయసు : 16 ఏళ్లు సగటు జీవితకాలం : 12–15 ఏళ్లు సులేమాన్ (జాగ్వార్) పుట్టినరోజు : ఏప్రిల్ 5, 1998 వయసు : 24 ఏళ్లు సగటు జీవితకాలం : 20 ఏళ్లు బారసింగా (చిత్తడి జింక) పుట్టినరోజు : 27, ఏప్రిల్ 2005 వయసు : 17 ఏళ్లు సగటు జీవితకాలం : 12 ఏళ్లు ఎలుగుబంటి పుట్టినరోజు : ఫిబ్రవరి 18, 2001 వయసు : 20 ఏళ్లు సగటు జీవితకాలం : 15 ఏళ్లు 30 ఏళ్ల నుంచి పక్షుల్లో కూడా హరన్బెల్ పక్షి, తెల్ల కొకాటో పక్షి వయస్సు కూడా దాదాపు 30 ఏళ్లు ఉంటుందని జూ అధికారులు చెబుతున్నారు. సాధారణంగా 20–25 ఏళ్లు వరకు ఈ సంతతి పక్షులు జీవిస్తాయి. (క్లిక్ చేయండి: డాక్టర్ల ఫొటోలే వైద్యం చేస్తుంటాయ్!) -
గుండెలు బరువెక్కేలా, కళ్లు చెమ్మగిల్లేలా..
Giraffe Death In Kenya: ఆరు జిరాఫీలు.. నీటి కోసం గట్లు, గుట్టలు, చెట్లు, పుట్టలు.. అడవంతా తిరిగాయి. ఒంట్లో సత్తువ నశిస్తున్నా, నిలబడటానికి కూడా ఓపిక లేకున్నా దాహం తట్టుకోలేక వెతికాయి. కాస్త దూరంలో ఏదో బురదలా కనిపించగానే నీళ్లుంటాయని పరుగున అక్కడికెళ్లాయి. అంతే.. ఆ బురదలోనే చిక్కుకుని నీరు లేక గొంతెండి.. తిండిలేక పేగులు మండి చనిపోయాయి. (చదవండి: హృదయ విదారకం.. చనిపోయిన తల్లి ఫోటోతో వధువు కన్నీళ్లు) గుండెలు బరువెక్కేలా, కళ్లు చెమ్మగిల్లేలా ఉన్న ఈ సంఘటన కెన్యాలోని సబూలీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఇటీవల జరిగింది. ఈ ఫొటోలను డిసెంబర్ 10న తీశారు. కొంతకాలంగా కెన్యా ఉత్తర ప్రాంతంలో వర్షాల్లేక కరువు పరిస్థితులు నెలకొన్నాయి. నీటి కోసం ఆ ప్రాంతంలోని ప్రాణులు అల్లాడుతున్నాయి. ఈ ఆరు జిరాఫీలు చనిపోయిన ప్రాంతానికి దగ్గర్లోని గరిస్సా కౌంటీలో 4 వేలకు పైగా జిరాఫీలున్నాయని, నీరు దొరక్కపోతే వీటికీ ప్రమాదం తప్పదని అక్కడి మీడియా చెబుతోంది. (చదవండి: అగ్ని పర్వతం బద్దలై.. బూడిదగా మారి‘నది’) -
ఇది జిరాఫీ కాదు!! కుక్క.. అత్యంత అరుదైన బ్రీడ్!! కానీ కారు ప్రమాదంలో..
అతిపెద్ద మెడ జిరాఫీకి మాత్రమే ఉంటుందని అనుకుంటే పొరపాటే..! ఇంకెవరికుంటుందబ్బా.. అని ఆలోచిస్తున్నారా? పొడవాటి మెడ, శరీరంపై మచ్చలతో ఉన్న ఓ వింత కుక్కను జిరాఫీతో పోలుస్తున్నారందరు. దీని అందం వెనుక తీవ్ర విషాదం కూడా దాగి ఉంది. అసలేం జరిగిందంటే.. లూయిసా క్రూక్ అనే యువతి 2016లో కారు ప్రమాదంలో గాయపడిన బ్రాడీ అనే అజ్వాక్ జాతి కుక్కను రక్షించింది. అప్పుడు బ్రాడీ వయస్సు 6-7 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఐతే ఈ ప్రమాదంలో బ్రాడీ ఒక కాలు, చెయ్యి కోల్పోయింది. సాధారణంగా అజ్వాఖ్ జాతి కుక్కల మెడలు పొడవుగా ఉంటాయి. ఐతే కారు ప్రమాదం తర్వాత బ్రాడీ రూపం గణనీయంగా మారింది. లూయిసా మాటల్లో.. ‘బ్రాడీ నేను చూసిన అత్యంత అందమైన కుక్కపిల్ల. బ్రాడీని మొదటిసారి చూసినప్పుడు రక్తపు మడుగులో విపరీతమైన బాధతో కదలలేకపోయింది. బ్రాడీ మెడ చాలా పొడవుగా ఉండటం గమనించాను. కానీ దాని తెగిపోయిన భుజం, మెడతో ముడిపడి ఉన్నట్లు అనిపిస్తుంది. అది చాలా పొడవుగా ఉన్నట్లు కూడా కనిపించిందని తెల్పింది. ఐతే అన్ని అజ్వాక్ జాతి కుక్కలకు మచ్చలు ఉండవని లూయిసా పేర్కొంది. ఇది బ్రాడీ ప్రత్యేక లక్షణాల్లో ఒకటి. ప్రస్తుతం బ్రాడీ చాలా ఆరోగ్యంగా ఉందని, మా ఇద్దరికీ మంచి స్నేహం కుదిరిందని స్థానిక మీడియాకు తెలిపింది. చదవండి: శీతాకాలంలో చలిని తట్టుకోవాలంటే ఇది ఎక్కువగా తినాలి..! -
భార్యకు వాలెంటైన్స్ డే గిఫ్ట్‌గా ఓ ప్రాణం
కేప్‌టౌన్ : ఎదుటి వ్యక్తి మీదున్న ప్రేమను తెలియజేయటానికి కానుకలు ఇవ్వటం పరిపాటి. వాలెంటైన్స్ డే రోజున ఇష్టమైన వారికోసం ఏమివ్వాలా అని ఆలోచించి.. వారికిష్టమైనదేదో తెలుసుకుని దాన్ని బహుమతిగా ఇస్తుంటారు. సౌత్ ఆఫ్రికాకు చెందిన ఓ భర్త కూడా అలానే చేశాడు. ఓ జంతువు ప్రాణాన్ని ఆమెకు కానుకగా ఇచ్చాడు. దాన్ని వేటాడి చంపే అవకాశాన్ని కలిగించాడు. వివరాల్లోకి వెళితే.. సౌత్ ఆఫ్రికా, లిమ్పోపో ప్రావిన్స్‌కు చెందిన మెరెలిజె వాన్ డెర్ మెర్వే(32)కు జంతువులను వేటాడ్డం అంటే మహా సరదా. తనకు ఐదేళ్ల వయసు ఉన్నప్పటినుంచి వేటాడుతోంది. ఓ బలిష్టమైన నల్ల జిరాఫీని చంపాలని 2016నుంచి అనుకుంటోంది. 2017లో అవకాశం చేతి వరకు వచ్చి జారిపోయింది. అప్పటినుంచి వెయ్యి కళ్లతో జిరాఫీకోసం వెతకసాగింది. రెండు వారాల క్రితం ఓ వ్యక్తి ఆమెకు ఫోన్ చేసి జిరాఫీ ఆచూకీ చెప్పాడు. ( వైరల్: మీరు ఊహించని టైటానిక్ మరో క్లైమాక్స్) వేటాడిన జిరాఫీతో మెరెలిజె వాన్ డెర్ మెర్వే దీంతో తన కోరిక గురించి భర్త గెర్హర్డెన్ట్ నెల్కు వివరించింది. వాలెంటైన్స్ డే రోజు భార్యను సన్ సిటీలోని ఫైవ్ స్టార్ హోటల్‌కు తీసుకెళదామనుకున్న అతడు.. తన ప్లాన్‌ను రద్దు చేసుకున్నాడు. అందుకు బదులు జిరాఫీని చంపటానికి భార్యకు అవసరమైన డబ్బులు ఇచ్చాడు. మెరెలిజె వాన్ డెర్ మెర్వే జిరాఫీ ఉంటున్న అడవిలోకి వెళ్లి దాన్ని వేటాడి చంపింది. దాని గుండెను బయటకు తీసిన తర్వాత చేతుల్తో పట్టుకుని ఫొటోలకు ఫోజులిచ్చింది. -
ప్రపంచంలోనే అరుదైన జిరాఫీ ఇది
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలో శ్వేత వర్ణ జిరాఫీలు చాలా చాలా అరదు. అలా అరుదైన జాతికి చెందిన ఓ జింకను రక్షించడం కోసం ప్రపంచంలో తొలిసారిగా ఓ శ్వేత జిరాఫీకి జీపీఎస్ ట్రాకింగ్ పరికరాన్ని అమర్చారు. కెన్యాలోని గరిస్సా అటవి ప్రాంతంలో గత మార్చి నెల వరకు ఓ మగ, ఆడ, వాటికి ఓ పిల్ల జిరాఫీ ఉండేదట. వేటగాళ్లు ఆడ, పిల్ల జింకను చంపేయడంతో ఇప్పుడు ఆ ఒక్క మగ జిరాఫీ మాత్రమే బ్రతికి ఉందట. అలాంటి జిరాఫీ అది ఒక్కటే ఉన్నప్పటికీ దానికి ఇంతవరకు ఏ పేరు పెట్టలేదని, అయితే దాని రక్షణార్థం అది ఎప్పుడు, ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి వీలుగా దాని కొమ్ముల్లో ఒకదానికి జీపీఎస్ ట్రాకింగ్ పరికరాన్ని అమర్చినట్లు ‘ఇషాక్బినీ హిరోలా కమ్యూనిటీ కన్సర్వెన్సీ’ ఓ ప్రకటనలో తెలియజేసింది. ఆ అరుదైన జిరాఫీకి ప్రత్యేక జన్యు లక్షణం వల్ల తెల్ల రంగు వచ్చిందని, జన్యు లక్షణాన్ని ‘లూసిజమ్’ అని వ్యవహరిస్తారని కన్సర్వెన్సీ వర్గాలు తెలిపాయి. సోమాలియా సరిహద్దు ప్రాంతంలో నివసిస్తున్న ఈ జిరాఫీని దాని అరుదైన చర్మం కోసం మట్టుపెట్టడానికి వేటగాళ్లు పొంచి ఉన్నందున దానికి జీపీఎస్ ట్రాకర్‌ను ఏర్పాటు చేయాల్సి వచ్చిందని ఆ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు ఆ జిరాఫీకి ఏ ఆపద రాకుండా ‘కేన్యా వైల్డ్ లైఫ్ సర్వీస్, నార్తర్న్ రేంజ్ ల్యాండ్స్ ట్రస్ట్, సేవ్ జిరాఫీస్’ సంస్థలు పర్యవేక్షిస్తున్నాయి. -
వైరల్ వీడియో: వ్యాయామం చేస్తోన్న జిరాఫీ!
మీరు జిరాఫీ గడ్డి తినే విధానాన్ని ఎప్పుడైనా చూశారా? అబ్బో దాంట్లో ఏముంది చాలా సార్లు చూశాం అనుకుంటున్నారా. అయితే ఇప్పుడు మీరు చూడబోయే వీడియో మిమ్మల్ని ఆశ్చర్యపోయేలా చేయకతప్పదు. ఎందుకంటే జిరాఫీ సాధారణంగా తన పొడుగాటి మెడను వంచి గడ్డిని తింటుంది. అయితే 7 సెకన్ల నిడివిగల ఈ వీడియోలో మాత్రం ఒక జిరాఫీ భిన్నంగా కాళ్లను విడిగా జరిపి మెడను వంచి గడ్డిని తింటోంది. ఈ వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారి మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఎవరికి తోచినట్లు వారు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. ఇది మ్యానుఫక్చర్ డిఫెక్ట్ ఏమో అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, వాళ్ల పీటీ టీచర్ దీన్ని చూసి నిజంగా గర్వ పడతారు అని మరో వ్యక్తి వ్యాఖ్యానించారు. ఇక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుధారామన్ కూడా ఈ వీడియోను షేర్ చేస్తూ ఈ జిరాఫీ వ్యాయమం చేయకుండా గడ్డి తింటోంది అంటూ కామెంట్ చేశారు. చదవండి: వైరల్: తల్లిని కాపాడేందుకు ఐదేళ్ల పిల్లాడు.. -
రేసుకు వెళ్దామా!
-
అలా సరదాగా రేసుకు వెళ్దామా!
ఒహియో: జంతువులు ఆనందంతో ఉన్నప్పుడు పరుగులు తీస్తాయి. అంలాటి సందర్భంలో దానికి సంబంధించిన మరో జంతువు జతకూడితే ఆ పరుగుకు జోరు పెంచుతాయి. సాధారణంగా జిరాఫీలు అరుదైన సందర్భాల్లో మాత్రామే పరుగెత్తుతాయి. భారీ శరీరం, ఎతైన మెడను కలిగి ఉండే ఇవి గుంపులు గుంపులుగా నడుచుకుంటూ వెళ్తాయి. అయితే తాజాగా ఓ చిన్న జిరాఫీ ఆనందంతో పరుగులు తీసిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో ఉన్న సిన్సినాటి జూలోని థియో అనే చిన్న జిరాఫీ సంతోషంగా పరుగెత్తుకుంటూ జూలో తిరుగుతుంది. అదే సమయంలో దాని సోదర జిరాఫీ ఫెన్ జతచేరడంతో మరింత వేగంగా పరుగుతీస్తుంది. ఈ వీడియోను సన్సినాటి జూ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘బేబీ జిరాఫీ థియో తనలోని శక్తి కూడదీసుకుని తన సోదర జిరాఫీ ఫెన్తో సరదాగా పరుగులు తీసింది’ అని కాప్షన్ జతచేసింది. ఈ వీడియోను ఇప్పటి వరకు 15వేల మంది నెటిజన్లు వీక్షించారు. బేబీ జిరాఫీ పరుగును చూసిన నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ‘థియో జిరాఫీ చాలా అందంగా ఉంది. అది తన సోదర జిరాఫీ ఫెన్ వద్దకు వెళ్లి అలా సరదాగా రేసుకు వెళ్దామా! అని అడిగింది’ అని ఓ నెటిజన్ ఫన్నీగా కామెంట్ చేశాడు. ‘ఈ వీడియోను చూసిన నాకు ఉదయం చాలా సంతోషం కలిగింది’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. -
జిరాఫీని రెచ్చగొడితే ఇలానే ఉంటుంది!
న్యూఢిల్లీ : తలుపులు మూసి కొడితే పిల్లి కూడా పులిలా విరుచుకుపడుతుందన్నట్లు.. కోపం వస్తే ఏ జంతువైనా తిరగబడటం కామన్. సాధు జంతువులు కూడా ఇందుకేమీ మినహాయింపు కాదు. పొడుగు కాళ్ల జీవి జిరాఫీకి కోపం తెప్పిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. దాన్నుంచి తప్పించుకుని పరిగెడదామన్నా కూడా ఆ ఛాన్స్ మనకు ఉండదు. ఎందుకంటే మనం 20 అడుగులు వేస్తే అది ఒక అడుగు వేస్తుంది! పిక్కబలంతో టక్కున పట్టేసుకుంటుంది. తాజాగా జిరాఫీ కోపానికి సంబంధించిన ఓ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుధా రమెన్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. దీంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ( వైరల్: పాము నీళ్లు తాగడం ఎప్పుడైనా చూశారా? ) దీనిపై ఆమె స్పందిస్తూ..‘‘ జిరాఫీ కాళ్లు ఎంత దృఢమైనవో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ఒక్క దెబ్బతో మనిషిని మట్టి కరిపిస్తుంది. అలుపు లేకుండా అవి చాలా వేగంగా పరిగెత్తగలవు. ఫేస్బుక్లో చూసిన వీడియో’’ అని పేర్కొన్నారు. ఈ వీడియోపై నెటిజన్లు..‘‘తర్వాత ఏమైంది? సగం వీడియోతో ఆత్రుత ఎలా వస్తుంది.. జురాసిక్ పార్క్ సినిమా చూసినట్లుంది. జిరాఫీతో గొడవ పెట్టుకోకండి. జిరాఫీని రెచ్చగొడితే ఇలానే ఉంటుంది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ( పీక్కుతింటున్నా.. 5 గంటల పాటు ఓపికగా ) -
పీక్కుతింటున్నా.. 5 గంటల పాటు ఓపికగా
జోహన్నెస్‌బర్గ్ : మనం ఏ పనైనా సరే ఓపికతో ఎదురుచూస్తే ఫలితం తప్పకుండా వస్తుంది. అయితే అన్నిసార్లు ఈ ప్రయత్నం సఫలం కాకపోవచ్చు. అయితే ఒక జిరాఫి మాత్రం 5గంటల సేపు ఓపికగా నిలబడి తన ప్రాణాలను దక్కించుకొంది. ఇంతకీ 5 గంటల సేపు అది ఏం చేసిందో తెలుసా.. ఒక సింహాల గుంపు దాని దాడి చేసి పీక్కుతుంటున్నా ఏమి అనకుండా అలాగే ఓపికగా నిల్చుండిపోయింది. ఎంతసేపటికి ఆ జిరాఫి సింహాలకు తలొగ్గకపోవడంతో చేసేదేం లేక అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఈ ఘటన దక్షిణాఫ్రికాలోని క్రూగర్ జాతీయ పార్కులో చోటుచేసుకుంది. ఈ వీడియోనూ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి నవీద్ ట్రంబూ తన ట్విటర్లో షేర్ చేశారు.(గ్రహాంతరవాసులపై మరోసారి చర్చ లేపిన వీడియో) 'ఈ వీడియో మనందరికి ఒక పాఠంగా నిలుస్తుంది. తనపై క్రూరంగా దాడికి పాల్పడుతున్న సింహాలకు జిరాఫి ఏ మాత్రం బెదరకుండా 5 గంటల పాటు ఓపికగా నిల్చుంది. చివరకు ఎంతకీ లొంగకపోవడంతో సింహాలు జిరాఫిని వదిలేసి వెళ్లిపోయాయి.అందుకే మనం ఏదైనా సాధించాలంటే ఓపిక ఎంత అవసరమో జిరాఫి చూపించిందంటూ' పేర్కొన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోనూ 11వేలకు పైగా వీక్షించగా, వేల కొద్ది లైక్స్ వస్తున్నాయి. 'ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు' .. 'ప్రాణం మీదకు వస్తున్న జిరాఫి ఓపికగా నిలబడినందుకు ఇదే మా సలాం' అంటూ తమదైన శైలిలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. (ఫోన్‌కు మూడుముళ్లు వేసిన వరుడు) -
ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్
-
సీరియస్‌గా ఫోటోషూట్.. తర్వాత ఏం జరిగిందంటే
కాలిఫోర్నియా : ప్రతీ ఒక్కరు తమ పెళ్లి వేడుకలను ప్రత్యేకమైనదిగా మలుచుకోవాలని భావిస్తారు. అందులో భాగంగానే పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ తీసుకోవడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. ఇంకా చెప్పాలంటే ఈ ఆనవాయితీ భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తుంది. తాజాగా ఇండో-అమెరికన్ దంపతులు తమ ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ తీసుకోవాలనుకున్నారు. అందుకు కాలిఫోర్నియాలోని మలీబు ప్రాంతంలో ఉన్న సాడల్రాక్ రాంచ్‌ను ఎంచుకొన్నారు. ఇంతవరకు బాగానే ఉంది. దంపతులిద్దరు తమ ఫోటోషూట్‌ను తీసుకోవడానికి జిరాఫీ ఎన్‌క్లోజర్ వద్దకు వచ్చారు. ఇంతలో జిరాఫీ.. నేనున్నానంటూ వాళ్ల దగ్గరకు వచ్చి నిల్చుంది. అయితే దాన్ని గమనించకుండా వారిద్దరు తమ ఫొటోషూట్‌లో బిజీగా ఉన్నారు. పెళ్లికొడుకు తలపాగాను గమనించిన జిరాఫీ అది తినేది అనుకుందో ఏమో తెలీదు కాని ఒక్కసారిగా తలపాగాను తన నోటితో పైకి లాగేసింది. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన పెళ్లికూతురు తలపాగాను జిరాఫీ నోటి నుంచి లాగడానికి ప్రయత్నించింది. ఇంతలో ఫొటోషూట్ తీస్తున్న వ్యక్తి తలపాగాను కిందకు లాక్కున్నాడు. అయితే ఈ ఘటనతో ఉలిక్కిపడిన పెళ్లికొడుకు కాసేపటికి తాను చేసిన పనికి నవ్వుకున్నాడు. అయితే ఈ వీడియోనూ అపెరినా స్టూడియో సోషల్‌మీడియాలో షేర్ చేసింది. 'ఇలా జరుగుతుందని మేము ఊహించలేదు.. కానీ నిజంగా ఈ ఫొటోషూట్‌ను మాత్రం చాలా ఎంజాయ్ చేశాము. వెడ్డింగ్ ఫొటోషూట్‌లో జిరాఫీ కూడా పాల్గొనడం మాకు ప్రత్యేకంగా అనిపించింది' అంటూ తమ అనుభవాన్ని వివరించారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. -
తాగి.. జిరాఫీతో గేమ్స్.. తగిన శాస్తి జరిగింది!
-
తాగి.. జిరాఫీతో గేమ్స్.. తగిన శాస్తి జరిగింది!
ఎవరైనా జూపార్కుకు వెళితే.. అక్కడి జంతువులను చూసి.. వాటితో కాసేపు సరదాగా గడిపి వస్తారు. కానీ, ఓ వ్యక్తి మాత్రం తాగిన మైకంలో జూపార్కులో హల్చల్ చేశాడు. జిరాఫీ ఉన్న బోను దగ్గరికి వెళ్లి.. అది ఫెన్సింగ్ సమీపంలోకి రాగానే.. అమాంతం దానిపైకెక్కి కూర్చొని.. కాసేపు అటు-ఇటు స్వారీ చేశాడు. మొదటిసారి జిరాఫీ కొంచెం మృదువుగా వ్యవహరించి.. అతన్ని కిందికి విదిలించింది. అయినా, తాగిన మైకంలో ఉన్న సదరు వ్యక్తికి జిరాఫీపై మీద ఊరేగాలన్నా కోరిక తీరలేదేమో.. ఫెన్సింగ్ సాయంతో మరోసారి ఇదే దుస్సాహసానికి అతడు ఒడిగట్టాడు. జిరాఫీ మీద కూర్చొని.. స్వారీ చేయాలని చూశాడు. ఈసారి జిరాఫీ సదరు వ్యక్తిని గట్టిగా విదిలించి దభేల్న పడేలా చేసింది. దెబ్బకు మైకం నుంచి తేరుకున్న ఆ ఆకతాయి.. బతుకు జీవుడా అనుకుంటూ.. ఫెన్సింగ్‌ను ఎక్కి అక్కడినుంచి బయటపడ్డారు. ఒకింత సరదాగా, మరొకింత వికృతంగా ఉన్న ఈ ఘటన కజకిస్థాన్‌లోని స్కైమెట్ జూలో చోటుచేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ జూలో జిరాఫీపై స్వారీ చేసేందుకు ప్రయత్నించి.. ఆకతాయి కిందపడిపోయిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. సదరు దుండగుడిని పట్టుకొని తగిన శాస్తి చేసేందుకు ఇటు జూ అధికారులూ ప్రస్తుతం ప్రయత్నిస్తున్నారు. -
ఆరు సింహాలతో.. నాలుగు గంటల పోరాటం..
-
ఆరు సింహాలతో.. నాలుగు గంటల పోరాటం..
ఓ జిరాఫీ ప్రదర్శించిన ధైర్యం ఎందరికో స్ఫూర్తి కలిగించేలా ఉంది. ఆకలితో ఉన్న ఆరు సింహాలు వెంటపడుతన్నా... నాలుగు గంటల పాటు వాటితో పోరాడిన జిరాఫీ చివరకు తన ప్రాణాలను దక్కించుకుంది. సౌతాఫ్రికాలోని ఓ ప్రైవేటు నేచర్ రిజర్వ్‌లో జరిగిన ఈ ఘటనను సఫారీ గైడ్ ఎమిలీ వైటింగ్ తన కెమెరాలో బంధించాడు. తన జీవితంలో ఇలాంటి ఘటనను చూడలేదని ఎమిలీ పేర్కొన్నారు. జిరాఫీని ఒక్కసారిగా ఆరు సింహాలు ముట్టడించాయి. అందులో ఒక్క సింహం అయితే.. జిరాఫీ వీపుపైకి ఎక్కి గట్టిగా కోరకడం ప్రారంభించింది. మరో సింహాం దాని కాలును తీవ్రంగా గాయపర్చింది. అయితే వాటి నుంచి తప్పించుకోవడానికి జిరాఫీ తీవ్రంగా ప్రయత్నించింది. తన కాలితో వాటిని భయపెడుతూ పోరాటం కొనసాగించింది. చివరకు నాలుగు గంటల పాటు ధైర్యంగా పోరాట పటిమను ప్రదర్శించి తన ప్రాణాలను నిలబెట్టుకుంది. ఈ ఘటనలో జిరాఫీ తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. -
దంపతులకు జిరాఫీ షాక్..!!
సాక్షి, వెబ్ డెస్క్ : విహారయాత్రకు వెళ్లిన ఓ జంటకు జిరాఫీ షాక్ ఇచ్చింది. సఫారీ టూర్‌కు వెళ్లిన ఓ జంట కారుకు చేరువలో ఉన్న జిరాఫీని చూస్తోంది. జిరాఫీ కూడా వారి వైపు చూడటంతో దంపతులు తొలుత ఉత్సాహపడ్డారు. కారు అద్దం సగం తెరచి ఉండటంతో అక్కడికి వచ్చిన జిరాఫీ తల లోపలికి దూర్చింది. దీంతో భయాందోళనలకు గురైన దంపతులు పెద్ద పెట్టున కేకలు వేశారు. జిరాఫీ ఒక్కసారిగా తల బయటకు తీయడంతో కారు అద్దం పగిలిపోయింది. ఇంగ్లండ్‌లోని వార్సెస్టర్షైర్లో గల పశ్చిమ మిడ్‌ల్యాండ్స్ సఫారీ పార్కులో ఈ ఘటన చోటు చేసుకుంది. జంతువులకు ఆహారం అందించేందుకు కారు అద్దాలను సగం తెరచివుంచడానికి సఫారీ అనుమతి ఇస్తుంది. దంపతుల చేతిలో తినుబండారాలు ఉండటంతోనే జిరాఫీ తల లోపలికి పెట్టిందని సఫారీ అధికారులు తెలిపారు. ఘటనలో జిరాఫీకి ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు. -
సివంగి వేటకు బలైంది!
మాటు వేసిన మృత్యువు.. తమ మానాన తాము చెట్ల ఆకులను తింటున్న పిల్ల జిరాఫీలు.. వాటికి రక్షణగా తల్లి జిరాఫీ.. మృత్యువు తమ ముంగిట్లోనే ఉందన్న విషయాన్ని అవి గమనించలేదు.. అంతే.. మాటు వేసిన మృత్యువు ఒక్కసారిగా విరుచుకుపడింది. పిల్ల జిరాఫీని బలిగొంది. ఓ సివంగి జిరాఫీని వేటాడిన ఈ దృశ్యాన్ని దక్షిణాఫ్రికాకు చెందిన ఫొటోగ్రాఫర్ అంజా క్రూగర్ క్లిక్‌మనిపించారు. అనుకోకుండా తన కెమెరాకు ఈ చిత్రం చిక్కిందని.. చాలా అరుదుగా ఇలాంటి ఫొటోలు తీయగలుగుతామని అంజా తెలిపారు. ‘అప్పటివరకూ ఎలాంటి అలజడి లేదు. జంతువులంతా ప్రశాంతంగా ఉన్నాయి. అక్కడ ఓ సివంగి పొదల చాటున మాటువేసి ఉందన్న విషయాన్ని మేము కూడా గమనించలేదు. ఆ జిరాఫీలు ఆహారం కోసం అక్కడికి వెళ్లాయి. సివంగికి ఆహారమైపోయాయి. అరుదైన చిత్రమైనా.. చాలా బాధాకరమైనది’ అని అంజా అన్నారు. దక్షిణాఫ్రికాలోని క్రూగర్ జాతీయ పార్కులో ఈ సన్నివేశం చోటుచేసుకుంది. -
వర్ణం: ఈతకాలం!
వేసవి కాలాన్ని అందరూ వేసవి కాలమనే పిలుస్తారు. కానీ యువకులు మాత్రం ‘ఈత కాలం’ అని పిలుచుకుంటారు సరదాగా. మరి వారికి ఇలాంటి స్విమ్మింగ్ పూల్ దొరికితే? ఇది సాల్వడార్ నగరానికి దగ్గర్లోని ఎకో రిసార్ట్ కొలను. ఫిఫా వరల్డ్ కప్‌కు వచ్చే క్రీడాకారులకు ఏర్పాటుచేసిన విడిది ఇది. స్విమ్మింగ్ పూల్, ఆ పక్కనే సముద్రం! ఓహ్. బాల్యమంటే బొమ్మలే! పిల్లలు ఎక్కడైనా పిల్లలే కదా... జపాన్ పిల్లలు అయినంత మాత్రాన వారు బొమ్మలతో కాకుండా మెషీన్లతో ఆడుకుంటారా? జపాన్‌లోని కనోసు నగరంలో నిర్వహించిన ఓ బొమ్మల ప్రదర్శనలో ఓ చిన్నారి తన తల్లితో కలిసి బొమ్మలు చూస్తున్న చిత్రమిది. 1800 బొమ్మలున్న పిరమిడ్ కొలువు ఇది. మాతృత్వం విశ్వజనీనం! మాతృత్వం మనిషికే కాదు, జంతువులకూ అపురూపమే. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ శివారులోని జంతు ప్రదర్శన శాలలో దృశ్యమిది. రోజుల వయసున్న పిల్ల జిరాఫీ పాలు తాగుతున్న దృశ్యం. ఇది ప్రేమికుల రోజున పుట్టిందట. దాని ఒంటిపై మూడు చోట్ల హృదయాల గుర్తులున్నాయట. నిజంగా పులిని చూసినట్లే! ఈ చిత్రంలోని టీవీ ఎంత అద్భుతమైన పిక్చర్ క్లారిటీని ఇస్తుందంటే... లైవ్‌లో చూసినట్లే అనుభూతి చెందుతాం. దక్షిణా కొరియా రాజధాని సియోల్‌లో శాంసంగ్ కంపెనీ సినిమా స్క్రీన్‌లాగా వంపు తిరిగిన ‘యుహెచ్డీ’ టీవీలను ఇటీవల విపణిలోకి వదిలింది. అత్యద్భుతమైన పిక్చర్ క్వాలిటీతో, ఇంట్లో ఏ మూలన కూర్చున్నా అత్యంత నాణ్యమైన సౌండ్స్‌తో ఒక థియేటర్ అనుభూతిని కల్పిస్తాయి ఈ టీవీలు. వీటిల్లో ఒకేసారి వివిధ ఛానళ్లు చూసే అవకాశం ఉంది. -
జిరాఫీని కాల్చి చంపిన జూ సిబ్బంది