వర్ణం: ఈతకాలం!
వేసవి కాలాన్ని అందరూ వేసవి కాలమనే పిలుస్తారు. కానీ యువకులు మాత్రం ‘ఈత కాలం’ అని పిలుచుకుంటారు సరదాగా. మరి వారికి ఇలాంటి స్విమ్మింగ్ పూల్ దొరికితే? ఇది సాల్వడార్ నగరానికి దగ్గర్లోని ఎకో రిసార్ట్ కొలను. ఫిఫా వరల్డ్ కప్‌కు వచ్చే క్రీడాకారులకు ఏర్పాటుచేసిన విడిది ఇది. స్విమ్మింగ్ పూల్, ఆ పక్కనే సముద్రం! ఓహ్.
బాల్యమంటే బొమ్మలే!
పిల్లలు ఎక్కడైనా పిల్లలే కదా... జపాన్ పిల్లలు అయినంత మాత్రాన వారు బొమ్మలతో కాకుండా మెషీన్లతో ఆడుకుంటారా? జపాన్‌లోని కనోసు నగరంలో నిర్వహించిన ఓ బొమ్మల ప్రదర్శనలో ఓ చిన్నారి తన తల్లితో కలిసి బొమ్మలు చూస్తున్న చిత్రమిది. 1800 బొమ్మలున్న పిరమిడ్ కొలువు ఇది.
మాతృత్వం విశ్వజనీనం!
మాతృత్వం మనిషికే కాదు, జంతువులకూ అపురూపమే. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ శివారులోని జంతు ప్రదర్శన శాలలో దృశ్యమిది. రోజుల వయసున్న పిల్ల జిరాఫీ పాలు తాగుతున్న దృశ్యం. ఇది ప్రేమికుల రోజున పుట్టిందట. దాని ఒంటిపై మూడు చోట్ల హృదయాల గుర్తులున్నాయట.
నిజంగా పులిని చూసినట్లే!
ఈ చిత్రంలోని టీవీ ఎంత అద్భుతమైన పిక్చర్ క్లారిటీని ఇస్తుందంటే... లైవ్‌లో చూసినట్లే అనుభూతి చెందుతాం. దక్షిణా కొరియా రాజధాని సియోల్‌లో శాంసంగ్ కంపెనీ సినిమా స్క్రీన్‌లాగా వంపు తిరిగిన ‘యుహెచ్‌డీ’ టీవీలను ఇటీవల విపణిలోకి వదిలింది. అత్యద్భుతమైన పిక్చర్ క్వాలిటీతో, ఇంట్లో ఏ మూలన కూర్చున్నా అత్యంత నాణ్యమైన సౌండ్స్‌తో ఒక థియేటర్ అనుభూతిని కల్పిస్తాయి ఈ టీవీలు. వీటిల్లో ఒకేసారి వివిధ ఛానళ్లు చూసే అవకాశం ఉంది.