japan childrens
-
May-5: 'జపాన్‌లో బాలల దినోత్సవం'! ఎలా జరుగుతుందో తెలుసా!
జపాన్‌లో బాలల దినోత్సవం ఏటా మే 5న జరుగుతుంది. జపాన్ రాచరిక సంప్రదాయం ప్రకారం ఏటా జరిగే ఐదు వార్షిక ఉత్సవాలలో ఇది ఒకటి. జపాన్‌లో దేశవ్యాప్తంగా జరిగే వేడుకల్లో పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటారు. రకరకాల ప్రదర్శనలు చేస్తారు. జపాన్‌లో బాలల దినోత్సవం పన్నెండో శతాబ్దిలో పరిపాలించిన కమకురా వంశస్థుల హయాం నుంచి జరుగుతూ వస్తోంది.తొలినాళ్లలో బాలల దినోత్సవాన్ని ఏటా చాంద్రమానం ప్రకారం ఐదో నెలలోని పున్నమి తర్వాత వచ్చే ఐదో రోజున జరుపుకొనేవారు. తర్వాత పంతొమ్మిదో శతాబ్ది నుంచి ఈ వేడుకను గ్రెగేరియన్ కేలండర్ ప్రకారం ఏటా మే 5న జరుపుకోవడం మొదలుపెట్టారు. ఈ వేడుకలో ఊరూరా ఆరుబయట ఎత్తుగా నిలిపిన స్తంభాలకు కట్టిన దండాలకు చిత్ర విచిత్రమైన రంగురంగుల గాలిపటాలను ఎగురవేస్తారు. వీటిని ‘కొయినొబొరి’ అంటారు.అలాగే, ఇంటింటా బయటి ఆవరణల్లో గాని, పెరటి స్థలాల్లోగాని నిలిపిన స్తంభాలకు సంప్రదాయకమైన ‘నొబోరి’, ‘ఫుకునుకె’ జెండాలను ఎగురవేస్తారు. బహిరంగ వేదికల మీద సమురాయ్ బొమ్మలను ప్రదర్శనతో పాటు చిన్నారుల విచిత్ర వేషధారణలు, సంగీత, నృత్య ప్రదర్శనలు, మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో జనాలు ఆరుబయట విందుభోజనాలు చేస్తారు.ఈ విందుభోజనాల్లో ఓక్ ఆకుల్లో చుట్టిన రెడ్బీన్స్ జామ్ నింపిన బియ్యప్పిండి ముద్దలను ఆవిరిపై ఉడికించిన వంటకం ‘కషివామొచి’, గంజితో తయారు చేసే మద్యం ‘సాకె’లను తప్పనిసరిగా వడ్డిస్తారు. ఓక్ ఆకులను అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. అందువల్ల ఈ వేడుకల్లో ఓక్ ఆకుల వినియోగానికి అత్యంత ప్రాధాన్యమిస్తారు.ఇవి చదవండి: రేటే 'బంగారమాయెనే!' -
వర్ణం: ఈతకాలం!
వేసవి కాలాన్ని అందరూ వేసవి కాలమనే పిలుస్తారు. కానీ యువకులు మాత్రం ‘ఈత కాలం’ అని పిలుచుకుంటారు సరదాగా. మరి వారికి ఇలాంటి స్విమ్మింగ్ పూల్ దొరికితే? ఇది సాల్వడార్ నగరానికి దగ్గర్లోని ఎకో రిసార్ట్ కొలను. ఫిఫా వరల్డ్ కప్‌కు వచ్చే క్రీడాకారులకు ఏర్పాటుచేసిన విడిది ఇది. స్విమ్మింగ్ పూల్, ఆ పక్కనే సముద్రం! ఓహ్. బాల్యమంటే బొమ్మలే! పిల్లలు ఎక్కడైనా పిల్లలే కదా... జపాన్ పిల్లలు అయినంత మాత్రాన వారు బొమ్మలతో కాకుండా మెషీన్లతో ఆడుకుంటారా? జపాన్‌లోని కనోసు నగరంలో నిర్వహించిన ఓ బొమ్మల ప్రదర్శనలో ఓ చిన్నారి తన తల్లితో కలిసి బొమ్మలు చూస్తున్న చిత్రమిది. 1800 బొమ్మలున్న పిరమిడ్ కొలువు ఇది. మాతృత్వం విశ్వజనీనం! మాతృత్వం మనిషికే కాదు, జంతువులకూ అపురూపమే. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ శివారులోని జంతు ప్రదర్శన శాలలో దృశ్యమిది. రోజుల వయసున్న పిల్ల జిరాఫీ పాలు తాగుతున్న దృశ్యం. ఇది ప్రేమికుల రోజున పుట్టిందట. దాని ఒంటిపై మూడు చోట్ల హృదయాల గుర్తులున్నాయట. నిజంగా పులిని చూసినట్లే! ఈ చిత్రంలోని టీవీ ఎంత అద్భుతమైన పిక్చర్ క్లారిటీని ఇస్తుందంటే... లైవ్‌లో చూసినట్లే అనుభూతి చెందుతాం. దక్షిణా కొరియా రాజధాని సియోల్‌లో శాంసంగ్ కంపెనీ సినిమా స్క్రీన్‌లాగా వంపు తిరిగిన ‘యుహెచ్డీ’ టీవీలను ఇటీవల విపణిలోకి వదిలింది. అత్యద్భుతమైన పిక్చర్ క్వాలిటీతో, ఇంట్లో ఏ మూలన కూర్చున్నా అత్యంత నాణ్యమైన సౌండ్స్‌తో ఒక థియేటర్ అనుభూతిని కల్పిస్తాయి ఈ టీవీలు. వీటిల్లో ఒకేసారి వివిధ ఛానళ్లు చూసే అవకాశం ఉంది.