![Viral video: Giraffe Eating Grass in Different Style - Sakshi](/styles/webp/s3/article_images/2020/10/15/ji.gif.webp?itok=pO-ghaAg)
మీరు జిరాఫీ గడ్డి తినే విధానాన్ని ఎప్పుడైనా చూశారా? అబ్బో దాంట్లో ఏముంది చాలా సార్లు చూశాం అనుకుంటున్నారా. అయితే ఇప్పుడు మీరు చూడబోయే వీడియో మిమ్మల్ని ఆశ్చర్యపోయేలా చేయకతప్పదు. ఎందుకంటే జిరాఫీ సాధారణంగా తన పొడుగాటి మెడను వంచి గడ్డిని తింటుంది. అయితే 7 సెకన్ల నిడివిగల ఈ వీడియోలో మాత్రం ఒక జిరాఫీ భిన్నంగా కాళ్లను విడిగా జరిపి మెడను వంచి గడ్డిని తింటోంది.
ఈ వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారి మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్‌లు ఎవరికి తోచినట్లు వారు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. ఇది మ్యానుఫక్చర్ డిఫెక్ట్ ఏమో అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, వాళ్ల పీటీ టీచర్ దీన్ని చూసి నిజంగా గర్వ పడతారు అని మరో వ్యక్తి వ్యాఖ్యానించారు. ఇక ఐఎఫ్‌ఎస్ ఆఫీసర్ సుధారామన్ కూడా ఈ వీడియోను షేర్ చేస్తూ ఈ జిరాఫీ వ్యాయమం చేయకుండా గడ్డి తింటోంది అంటూ కామెంట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment