పీక్కుతింటున్నా.. 5 గంటల పాటు ఓపికగా  | Watch Video How Giraffe Stands 5 Hours After Attacked By Lions | Sakshi
Sakshi News home page

పీక్కుతింటున్నా.. 5 గంటల పాటు ఓపికగా 

Published Wed, Apr 29 2020 11:23 AM | Last Updated on Wed, Apr 29 2020 8:58 PM

Watch Video How Giraffe Stands 5 Hours After Attacked By Lions - Sakshi

జోహన్నెస్‌బర్గ్‌ : మనం ఏ పనైనా సరే ఓపికతో ఎదురుచూస్తే ఫలితం తప్పకుండా వస్తుంది. అయితే అన్నిసార్లు ఈ ప్రయత్నం సఫలం కాకపోవచ్చు. అయితే ఒక జిరాఫి మాత్రం 5గంటల సేపు ఓపికగా నిలబడి తన ప్రాణాలను దక్కించుకొంది. ఇంతకీ 5 గంటల సేపు అది ఏం చేసిందో తెలుసా.. ఒక సింహాల గుంపు దాని దాడి చేసి పీక్కుతుంటున్నా ఏమి అనకుండా అలాగే ఓపికగా నిల్చుండిపోయింది.  ఎంతసేపటికి ఆ జిరాఫి సింహాలకు తలొగ్గకపోవడంతో చేసేదేం లేక అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఈ ఘటన దక్షిణాఫ్రికాలోని క్రూగర్‌ జాతీయ పార్కులో చోటుచేసుకుంది. ఈ వీడియోనూ ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌ అధికారి నవీద్ ట్రంబూ తన ట్విటర్‌లో షేర్‌ చేశారు.(గ్ర‌హాంత‌ర‌వాసులపై మ‌రోసారి చ‌ర్చ లేపిన వీడియో)

'ఈ వీడియో మనందరికి ఒక పాఠంగా నిలుస్తుంది. తనపై క్రూరంగా దాడికి పాల్పడుతున్న సింహాలకు జిరాఫి ఏ మాత్రం బెదరకుండా 5 గంటల పాటు ఓపికగా నిల్చుంది. చివరకు ఎంతకీ లొంగకపోవడంతో సింహాలు జిరాఫిని వదిలేసి వెళ్లిపోయాయి.అందుకే మనం ఏదైనా సాధించాలంటే ఓపిక ఎంత అవసరమో జిరాఫి చూపించిందంటూ' పేర్కొన్నాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోనూ 11వేలకు పైగా వీక్షించగా, వేల కొద్ది లైక్స్‌ వస్తున్నాయి. 'ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు' .. 'ప్రాణం మీదకు వస్తున్న జిరాఫి ఓపికగా నిలబడినందుకు ఇదే మా సలాం' అంటూ  తమదైన శైలిలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. (ఫోన్‌కు మూడుముళ్లు వేసిన వ‌రుడు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement