రోజులు గడుస్తున్న కొద్దీ ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం మరింత ముదురుతోంది. ఒకవైపు రష్యాపై అగ్రదేశాలు ఆంక్షలతో విరుచుకుపడుతున్నా రష్యా వెనకడుగు వేయడం లేదు. కీలకమైన రాజధాని కీవ్, రెండో పెద్ద సిటీ ఖార్కివ్‌లను చేజిక్కించుకునేందుకు దూకుడుగా వ్యవహరిస్తోంది. మరోవైపు ముప్పేట చుట్టుముట్టి దాడులతో భయపెడుతున్నా ఉక్రెయిన్ తలొగ్గడం లేదు. రష్యన్ సైనికులను ఉక్రెయిన్ తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. అయితే రష్యా దాడితో వేలాది మంది పౌరులు కీవ్, ఇతర సిటీల్లో మెట్రోస్టేషన్లు, షెల్టర్లు, బేస్‌మెంట్లు, కారిడార్లలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడుపుతున్నారు.
ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణలో ఇప్పటి వరకు ఎన్నో హృదయ విదారక దృశ్యాలు వెలుగు చూస్తున్నాయి. తినడానికి తిండి లేక ఎన్నో కుటుంబాలు ఆకలితో ఆలమటిస్తున్నాయి. తాజాగా అలాంటి ఓ దృశ్యం ప్రపంచ ప్రజల చేత కన్నీరు పెట్టిస్తోంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధంతో నెలకొన్న దారుణ పరిస్థితుల్లో.. బాలుడు ఆకలికి తట్టుకోలేక గడ్డి తింటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కన్నవారికి దూరమై, ఓదార్చేవారు లేక ఆకలి దహించడంతో కంటికి కనిపించిన గడ్డినే ఆహరంగా తీసుకున్నాడు. చిన్నారి దయనీయ పరిస్థితి ప్రతి ఒక్కరిని కలచి వేస్తోంది.
చదవండి: Russia Ukraine War: భారీ ఎదురుదెబ్బ.. రష్యన్ మేజర్ జనరల్ హతం
Syrian child surviving on grass pic.twitter.com/gxJfLWvOaD
— Tariq Rafi (@TariqRafi14) March 2, 2022
అయితే ఈ బాలుడు ఏ దేశానికి చెందినవాడో తెలియరాలేదు. ఈ దృశ్యాలు ఉక్రెయిన్‌లోనే చోటుచేసుకున్నాయని కొందరు కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు మాత్రం ఆ ఘటన సిరియా యుద్ధ సమయంలో జరిగిందని చెప్తున్నారు. సిరియా యుద్ధ సమయంలోని పాత వీడియోనే మరోసారి వైరల్ అయిందని దాని తాలూకు లింక్స్ షేర్ చేస్తున్నారు. ఏదేమైనా ఉక్రెయిన్‌లో ఈ యుద్ధం మరికొన్ని రోజులు కొనసాగితే బాంబుల విధ్వంసం కంటే ఆకలితో చనిపోయేవారే అధికంగా ఉంటారేమోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అణ్యం పుణ్యం తెలియని చిన్నారులు ఏం పాపం చేశారని వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment