న్యూఢిల్లీ: ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మరింత వేగవంతం చేసింది. ఆపరేషన్ గంగా కార్యక్రమంలో ఇప్పటి వరకు 18 వేల మంది భారత్‌కు తిరిగొచ్చినట్లు కేంద్ర విదేశాగశాఖ వెల్లడించింది. గురువారం 17 విమానాల్లో 3,726 మంది స్వదేశానికి వస్తున్నట్టు పేర్కొంది. గత 24 గంటల్లో 3 వేల మంది భారతీయులు 15 విమానాల ద్వారా ఉక్రెయిన్ నుంచి వచ్చారని తెలిపారు. ఆపరేషన్ గంగా కార్యక్రమంలో 30 విమనాల ద్వారా 6,400 మందిని ఇండియాకు తీసుకొచ్చినట్లు తెలిపారు.
అయితే భారత్‌కు చేరిన విద్యార్థులను కేంద్ర మంత్రులు, అధికారులు స్వయంగా విమనాశ్రయానికి వెళ్లి స్వాగతం పలుకుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఉక్రెయిన్ నుంచి భారత్‌కు తిరిగొచ్చిన ఓ విద్యార్థి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. యుద్ధ వాతావరణం నుంచి పౌరులను రక్షించేందుకు సరైన సమయంలో చర్యలు చేపట్టనప్పుడు.. గులాబీలు అందించడం అర్థరహితమని కొట్టిపారేశాడు. బిహార్‌లోని మోతీహరి ప్రాంతానికి చెందిన దివ్యాన్షు సింగ్ అనే విద్యార్థి ఉక్రెయిన్‌లోయుద్దం మొదలైన తరువాత హంగేరి మీదుగా గురువారం మధ్యాహ్నానికి ప్రత్యేక విమానంలో ఇండియా చేరాడు. అయితే ఢిల్లీ విమానాశ్రంలో దిగిన తరువాత అతనికి గులాబీ అందించి అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఓ జాతీయ మీడియా.. మీకు భారత ఎంబసీ ఏ విధంగా సహకరించిందని ప్రశ్నించగా.. దివ్యాన్షు ఘాటుగా బదులిచ్చాడు.
చదవండి: Viral Video: ఉక్రెయిన్‌లో ఘోరం..? ఆకలికి తాళలేక గడ్డితింటున్న బాలుడు?
‘క్రెయిన్ సరిహద్దు దాటి హంగేరిలోకి అడుగుపెట్టిన తర్వాతే మాకు సాయం లంభించింది. అంతకు ముందు ఎలాంటి సహాయం లేదు.. మేము అన్నీ ఏర్పాటు మా సొంతంగానే చేసుకున్నాం.. పది మంది కలిసి ఓ గ్రూప్‌గా ఏర్పడి రైలు ఎక్కాం.. ఆ రైలు కూడా కిక్కిరిసిపోయింది. కానీ స్థానికులు మాకు చాలా సహాయం చేశారు. మా పట్ల ఎవరూ అనుచితంగా ప్రవర్తించలేదు.. అయితే పోలెండ్ సరిహద్దుల్లో కొంత మంది విద్యార్థులు వేధింపులు ఎదుర్కొన్నది నిజమే. దీనికి మన ప్రభుత్వానిదే బాధ్యత.. సరైన సమయంలో సరైన చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటి సమస్యలు ఎదుర్కొనేవాళ్లం కాదు’ అని దివాన్షు సింగ్ తెలిపారు.
ఇక తన చేతిలో ఉన్న గులాబీని పట్టుకుని ‘‘ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి మాకు గులాబీ ఇచ్చారు.. దీని అర్థం ఏమిటి? దీనితో మనం ఏమి చేస్తాం? అక్కడ మాకు ఏదైనా జరిగితే మా కుటుంబాలు ఏం చేస్తాయి.. సరైన సమయంలో స్పందించి ఇతర దేశాలను అనుసరించి రోడ్‌మ్యాప్ రూపొందించి ఉంటే ఇన్ని ఆటంకాలు ఉండేవి కావు’ అని పేర్కొన్నారు. సరైన సమయంలో ప్రభుత్వం చర్యలు తీసుకుని ఉంటే ప్రస్తుతం పూలు అందజేసే అవసరం ఉండేది కాదు అని దివ్యాన్షు వెల్లడించారు.
చదవండి: ఉక్రెయిన్‌కు పెరిగిపోతున్న మద్దతు, రష్యాకు కోలుకోలేని దెబ్బ!!
Comments
Please login to add a commentAdd a comment