ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణ 12వ రోజుకి చేరింది. పౌరుల తరలింపు ప్రక్రియ కోసం కొద్దిగంటలు కాల్పుల విరమణ ప్రకటించింది రష్యా సైన్యం. ఈలోపు పౌరుల తరలింపు వేగవంతం చేసింది ఉక్రెయిన్ సైన్యం. ఇక ఈ యుద్ధంలో నేను సైతం అంటూ ఉక్రెయిన్ సాధారణ పౌరులు కదనరంగంలోకి దూకారు. వాళ్లకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు రోజూ ఇంటర్నెట్‌లో కనిపిస్తున్నాయి. తాజాగా.. సోషల్ మీడియాలో అలాంటి ఒక వీడియో వైరల్ అవుతోంది.
సైనిక దుస్తుల్లో ఉన్న ఇద్దరు.. తోటి సైనికుల మధ్యే వివాహం చేసుకున్నారు. ఉక్రెయిన్‌కు చెందిన లెస్యా, వలెరీ.. ఇద్దరూ కీవ్ స్పెషల్ ట్రూప్ 112వ బెటాలియన్‌లో వలంటీర్లుగా పని చేస్తున్నారు. తాజాగా వీళ్లిద్దరి వివాహం జరగ్గా.. తోటి యుద్ధవీరులు వాళ్లకు పుష్ఫగుచ్ఛాలు ఇచ్చి సత్కరించారు. అందులో ఓ సైనికుడు ఉక్రెయిన్ సంగీత పరికరం వాయిస్తూ.. ఆ జంటను దీవించడం చూడొచ్చు.
Volunteers from one of the 112th Battalions of the Kyiv Special Troop Brigade got married.
— Ukraine Update 🇺🇦 (@Ukrain_War) March 6, 2022
Lesya and Valeriy have been together for twenty years and have an 18-year-old daughter, but they still haven't had time to get married. #Ukraine pic.twitter.com/R9ms9WhpUT
జర్మన్ న్యూస్ అవుట్‌లెట్ బ్లిడ్‌కు చెందిన పౌల్ అనే రిపోర్టర్ ఆ వీడియోను షేర్ చేయడంతో వైరల్ అయ్యింది. విశేషం ఏంటంటే.. లెస్యా, వలెరీలు కొత్త జంట కాదు. ఇరవై ఏళ్లుగా సహజీవనంలో ఉన్నారు. ఈ జంటకు 18 ఏళ్ల కూతురు కూడా ఉంది. కూతురిని సేఫ్ షెల్టర్‌లో ఉంచి ఈ ఇద్దరూ ఇలా కీవ్ బెటాలియన్‌లో చేరిపోయారు. అసలే యుద్ధం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అందుకే సమయం లేదనే ఉద్దేశంతో ఇప్పుడు పెళ్లితో అధికారికంగా ఒక్కటయ్యారు. ఉక్రెయిన్‌కు చెందిన ఈ ఇద్దరు యుద్ధ భూమిలోనే ఇలా ఒక్కటవ్వడం ఆకట్టుకుంటోంది ఇప్పుడు.
Comments
Please login to add a commentAdd a comment