
జిరాఫీని ఒక్కసారిగా ఆరు సింహాలు ముట్టడించాయి
ఓ జిరాఫీ ప్రదర్శించిన ధైర్యం ఎందరికో స్ఫూర్తి కలిగించేలా ఉంది. ఆకలితో ఉన్న ఆరు సింహాలు వెంటపడుతన్నా... నాలుగు గంటల పాటు వాటితో పోరాడిన జిరాఫీ చివరకు తన ప్రాణాలను దక్కించుకుంది. సౌతాఫ్రికాలోని ఓ ప్రైవేటు నేచర్ రిజర్వ్‌లో జరిగిన ఈ ఘటనను సఫారీ గైడ్ ఎమిలీ వైటింగ్ తన కెమెరాలో బంధించాడు. తన జీవితంలో ఇలాంటి ఘటనను చూడలేదని ఎమిలీ పేర్కొన్నారు.
జిరాఫీని ఒక్కసారిగా ఆరు సింహాలు ముట్టడించాయి. అందులో ఒక్క సింహం అయితే.. జిరాఫీ వీపుపైకి ఎక్కి గట్టిగా కోరకడం ప్రారంభించింది. మరో సింహాం దాని కాలును తీవ్రంగా గాయపర్చింది. అయితే వాటి నుంచి తప్పించుకోవడానికి జిరాఫీ తీవ్రంగా ప్రయత్నించింది. తన కాలితో వాటిని భయపెడుతూ పోరాటం కొనసాగించింది. చివరకు నాలుగు గంటల పాటు ధైర్యంగా పోరాట పటిమను ప్రదర్శించి తన ప్రాణాలను నిలబెట్టుకుంది. ఈ ఘటనలో జిరాఫీ తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది.