lions attack
-
చిన్నదైనా సింహం సింహమే.. ఒక్క గాండ్రింపుతో హడలెత్తించింది..!
పులి, సింహం వంటి క్రూర జంతువులను జూలో దూరం నుండి చూస్తేనే అందంగా ఉంటుంది. వాటిని పట్టుకుని ఫోటో దిగాలంటే అది ఎంత ప్రమాదమో ప్రతి ఒక్కరికి తెలుసు. అవి చిన్న కూనలైనా, పెద్దవైనా ప్రమాదకరమే. కానీ, కొందరు వాటిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాంటి ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. రెండు చిన్న సింహాలను పెంచుకుంటున్నాడు. అయితే, వాటిని దగ్గరి నుంచి తాకేందుకు ప్రయత్నించగా అందులో ఒకటి ముట్టుకోనివ్వలేదు. ఒక్కసారిగా గాండ్రించటంతో ఉలిక్కపడ్డాడు ఆ వ్యక్తి. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి కారుపై కూర్చున్న రెండు సింహం కూనలను తాకుతూ మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించాడు. క్షణాల్లోనే అందులో ఓ కూన కోపంతో ఊగిపోయింది. అతడిపై ఆ సింహం కూన దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఒక్క గాండ్రింపుతో ఉలిక్కిపడి ఒక అడుగు వెనక్కి వేశాడు. ఆ తర్వాత కారుపైకి వెళ్తున్న సింహాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. నెల రోజుల క్రితం ఈ వీడియో షేర్ చేయగా ఇప్పటి వరకు 2,74,000 లైకులు, మూడు మిలియన్లకుపైగా వ్యూస్ వచ్చాయి. View this post on Instagram A post shared by Md Gulzar (@basit_ayan_3748) ఇదీ చదవండి: ఆస్కార్ లెవల్ యాక్టింగ్.. బోనులోని పులిని అడవిలోకి తెచ్చేసరికి! -
గేదెలపై పెద్దపులి పంజా
కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో రెండు రోజులుగా పులి బీభత్సం సృష్టిస్తోంది. ఈ మేరకు మండలంలోని ఒడిపిలవంచ సమీపంలో ఓ ఆవుదూడను చంపిన పెద్దపులి.. తాజాగా ఆ గ్రామానికి సమీపంలోని వీరాపూర్ అటవీ ప్రాంతంలో గేదెల గుంపుపై దాడి చేసి దున్నను ఎత్తుకెళ్లింది. గుమ్మాళ్లపల్లికి చెందిన ఓదేలు అనే పశువుల కాపరి అదే గ్రామానికి చెందిన పలువురు రైతుల గేదెలను మేత కోసం సమీపంలోని వీరాపూర్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. గేదెలు మేత మేస్తున్న క్రమంలో హఠాత్తుగా పులి గేదెల గుంపుపైకి దూసుకువచ్చినట్లు పశువుల కాపరి తెలిపాడు.పులి దాడిని గమనించి ఓదేలు భయంతో గ్రామంలోకి పరుగులు తీశాడు. జరిగిన సంఘటనపై ప్రజాప్రతినిధుల ద్వారా అటవీశాఖ అధికారులు, పోలీసులకు గ్రామస్తులు సమాచారం అందించారు. డీఎస్పీ బోనాల కిషన్, సీఐ రంజిత్‌రావు, ఎఫ్డీఓ వజ్రారెడ్డి, ఎఫ్ఆర్వో స్వాతి సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. గేదెల మందలోనుంచి రాజయ్య అనే రైతుకు చెందిన దున్నపోతును పులి ఎత్తుకెళ్లినట్లు ఓదేలు చెప్పాడు. ఘటనా స్థలంలో రక్తం మరకలు, పులి పాదాల గుర్తులను అధికారులు సేకరించారు. పులి ఆచూకీని గుర్తించడానికి అటవీశాఖ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కాగా, పులి సంచరిస్తున్న నేపథ్యంలో ఎవరూ అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని డీఎస్పీ బోనాల కిషన్, అటవీశాఖ అధికారులు గ్రామస్తులకు సూచించారు. -
ఆరు సింహాలతో.. నాలుగు గంటల పోరాటం..
-
ఆరు సింహాలతో.. నాలుగు గంటల పోరాటం..
ఓ జిరాఫీ ప్రదర్శించిన ధైర్యం ఎందరికో స్ఫూర్తి కలిగించేలా ఉంది. ఆకలితో ఉన్న ఆరు సింహాలు వెంటపడుతన్నా... నాలుగు గంటల పాటు వాటితో పోరాడిన జిరాఫీ చివరకు తన ప్రాణాలను దక్కించుకుంది. సౌతాఫ్రికాలోని ఓ ప్రైవేటు నేచర్ రిజర్వ్‌లో జరిగిన ఈ ఘటనను సఫారీ గైడ్ ఎమిలీ వైటింగ్ తన కెమెరాలో బంధించాడు. తన జీవితంలో ఇలాంటి ఘటనను చూడలేదని ఎమిలీ పేర్కొన్నారు. జిరాఫీని ఒక్కసారిగా ఆరు సింహాలు ముట్టడించాయి. అందులో ఒక్క సింహం అయితే.. జిరాఫీ వీపుపైకి ఎక్కి గట్టిగా కోరకడం ప్రారంభించింది. మరో సింహాం దాని కాలును తీవ్రంగా గాయపర్చింది. అయితే వాటి నుంచి తప్పించుకోవడానికి జిరాఫీ తీవ్రంగా ప్రయత్నించింది. తన కాలితో వాటిని భయపెడుతూ పోరాటం కొనసాగించింది. చివరకు నాలుగు గంటల పాటు ధైర్యంగా పోరాట పటిమను ప్రదర్శించి తన ప్రాణాలను నిలబెట్టుకుంది. ఈ ఘటనలో జిరాఫీ తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. -
ఒక్కడి ఆలోచన.. మృగరాజులకు వణుకు
నైరోబీ: అది ఆఫ్రికన్ దేశం కెన్యాలోని నైరోబీ నేషనల్ పార్క్. ఆధునికతకు.. అటవీక జీవనానికి మధ్యగా నలిగిపోయే కిటెన్‌గెలా అనే ఓ చిన్ని గ్రామం. ఆ మధ్యలో ఓ చిన్న నదీపాయ. దీంతో పక్కనే ఉన్న సఫారీ నుంచి జంతువులు తరచూ ఆ గ్రామాన్ని ఆనుకుని ఉన్న పచ్చిక బయళ్లకు వస్తుంటాయి. వాటిల్లో ఆవుల మందను వేటాడే సింహాలు కూడా ఉంటాయి. కానీ, అక్కడి ప్రజల విన్నూత ఆలోచనకు మృగరాజులు తోకి ముడిచి వెనక్కి చిత్తగిస్తుంటాయి. ఆ ఆలోచన వెనుక ఉన్న బుర్ర మాత్రం రిచర్డ్ టురెరె(18) కుర్ర కాపరిది. సూటిగా కథలోకి వెళ్తే... మాసయి తెగకు చెందిన రిచర్డ్ 9 ఏళ్ల వయసులో చదువుకు పుల్‌స్టాప్ పెట్టి తండ్రికి తోడుగా పశువులను మేపటం ప్రారంభించాడు. తన కళ్ల ముందే ఆవులను సింహాలు కబళిస్తున్న ఉదంతాలు అతనిలో భయాన్ని పొగొట్టేవి. ఇదిలా ఉంటే రిచర్డ్ 11 ఏట.. తమ మందలోని 9 ఆవులను వారం రోజుల్లో సింహాల మంద పొట్టనబెట్టుకున్నాయి. ఆర్థికంగా తీరని నష్టం కలగటంతో తల్లి కుంగిపోగా.. తన బుర్రకు పదును పెట్టడం రిచర్డ్ ఆరంభించాడు. సింహాలను తరిమేందుకు భయంకరంగా ఉన్న కాకి బొమ్మను తన వెంట తీసుకెళ్లేవాడు. కానీ, ఆ ఐడియా వర్కవుట్ కాలేదు. ఇదిలా ఉంటే ఓ రోజు రాత్రి టార్చ్ లైట్‌తో వెళ్తున్న సమయంలో సింహాలు ఎలాంటి దాడులకు పాల్పడపోగా.. ఆ వెలుతురికి భయంతో పరుగులు తీశాయి. అంతే వెంటనే అతని మెదడులో ఓ ఆలోచన మెరిసింది. తన తల్లి అపురూపంగా చూసుకునే రేడియోను బద్ధలు కొట్టి.. ఓ ఎల్ఈడీ బల్బు సాయంతో లైటింగ్ వ్యవస్థను రూపొందించాడు. సింహాలు దాడులకు వచ్చిన సమయంలో వాటిని వెలిగిలించటం.. అవి భయంతో పరుగులు తీయటం... మొత్తానికి ఈ ఐడియా బాగా వర్కవుట్ అయ్యింది. నాలుగేళ్ల తర్వాత అతని పరిశోధనకు పెటెంట్ హక్కులు దక్కాయి. కెన్యాలో యంగెస్ట్ పెటెంట్‌గా రిచర్డ్‌గా గుర్తింపు దక్కింది. అంతేకాదు 2013లో కాలిఫోర్నియాలో జరిగిన టెడ్ సదస్సులో ‘అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా’ లాంటి దిగ్గజాల మధ్య ప్రసంగించే అవకాశం రిచర్డ్‌కు లభించింది. దీంతోపాటే బ్రూక్ హౌస్ స్కూల్ అతనికి స్కాలర్షిప్ కూడా ఇచ్చింది. అయితే లయన్ లైట్స్ పెటెంట్ ఉన్నప్పటికీ.. ఆ ఆలోచన చుట్టుపక్కల పాకటంతో మరికొందరు ఇదే పద్ధతిని అవలంభించారు. ఆ తర్వాత ప్రభుత్వాలు కూడా రిచర్డ్‌ను పట్టించుకోవటం మానేశాయి. దీంతో అతని జీవితం మళ్లీ వెనక్కి వచ్చేసింది. ప్రస్తుతం అతని వయసు 18 ఏళ్లు. పశువులను మేపుకుంటూనే జీవనం కొనసాగిస్తున్నాడు. అలాగని ప్రయోగాలకు అతను దూరం కాలేదు. ప్రస్తుతం ఏనుగులకు సంబంధించిన ఓ ప్రాజెక్టులో బిజీగా ఉన్నాడంట. ‘లయన్ లైట్స్ 2.0’ వ్యవస్థను ఇన్స్టాల్ చేయటానికి ఖరీదు రెండు వందల డాలర్లు ఖర్చు అవుతుంది. ఇందులో సగం ఓ ఎన్డీవో సంస్థ అందిస్తుండగా.. ఇంకా సగం కాపరులే భరించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు 750 లయన్ లైట్ సిస్టమ్‌లు ఆ ఊరు చుట్టు పక్కల ఉన్నాయి. అయితే ఇంకా ఎక్కువ సంఖ్యలో వాటి అవసరం ఉందని రిచర్డ్ అంటున్నాడు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం సాయం చేయాలని చాలా కాలం నుంచే అతను విజ్ఞప్తి చేస్తున్నాడు. తన కొడుకు కంటే మేధావులు ఈ దేశంలో ఎందో ఉన్నారని, ప్రభుత్వాలు సరైన తోడ్పాటు-ప్రోత్సాహం అందిస్తే వారంతా అద్భుతాలు సృష్టిస్తారని రిచర్డ్ తల్లి వెరోనికచ్ చెబుతున్నారు. -
గేదె కొమ్ములతో సింహాన్ని ఎత్తి కొట్టింది
-
ఎత్తి కొడితే.. ఎగిరి పడింది..
దక్షిణాఫ్రికా: ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం మానవత్వం అనిపించుకుంటుంది. కానీ నేటి కాలంలో మానవత్వం మాట దేవుడెరుగు..! కనీసం ఇతరులకు కీడు తలపెట్టకుండా ఉంటే చాలు. ఈ విషయంలో పశుపక్ష్యాదులు మినహాయింపు. ఎవరైనా ఆపదలో ఉన్నారంటే అవి స్పందిస్తాయి. సహాయం కోసం అర్థిస్తున్న వాళ్లకు చేయూతనందిస్తాయి. తక్షణం స్పందించి వాటికి తోచిన రీతిలో ఇతర మూగ జీవాలకు తోడుగా నిలుస్తాయి. సింహాల బారిన పడి క్షణాల్లో ప్రాణాలు కోల్పోయే స్థితిలో ఉన్న ఓ భారీ సైజు బల్లిని ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఓ గేదె కాపాడింది. తుపాను వేగంతో అక్కడికి చేరుకుని ఆ సింహాల గుంపుని చెండాడింది. ఈ సంఘటన క్రూగర్ జాతీయ పార్కులో ఇటీవల చోటుచేసుకుంది. సింహాల గుంపు ఆ బల్లిని పీక్కు తినేందుకు సిద్ధమౌతున్న వేళ ఆ గేదె చాకచక్యంగా దాన్ని రక్షించింది. క్షణం ఆలస్యమైనా ఆ బల్లి ప్రాణాలు హరీమనేవే. అందుకనే కోపం పట్టలేని గేదె ఒక్క ఉదుటున బల్లిని తన కాలికింద తొక్కిపట్టిన సింహం మీదకి దుమికింది. అపాయం నుంచి బల్లి బయటపడగానే తన రెండు కొమ్ములతో ఆ సింహాన్ని ఎత్తి కొట్టింది. గాల్లో గింగిరాలు తిరుగుతూ కింద పడిన ఆ సింహం కుయ్యో, ముర్రో అంటూ అక్కడ్నుంచి జారుకోగా, మిగతా సింహాలు కూడా దాన్ని అనుసరించాయి. పార్కుని సందర్శిస్తున్న స్యూన్ ఎలోఫ్ అనే వ్యక్తి ఈ సాహస కృత్యాన్ని తన కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. -
వ్యక్తిపై సింహాల దాడి
బెంగళూరు: బెంగళూరులోని బన్నేర్‌గట్ట బయాలజికల్ పార్క్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ పార్క్‌లోని జంతువుల సంరక్షణను చూసుకునే శ్రీకృష్ణ అనే వ్యక్తిపై రెండు సింహాలు దాడి చేసి, మెడపట్టి ఈడ్చుకెళ్లి తీవ్రంగా గాయపరిచాయి. వాటికి వ్యాక్సినేషన్ చేసేందుకు వెళ్లగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ వెటర్నరీ డాక్టర్, మరో ముగ్గురు సహాయకులతోకలిసి శ్రీకృష్ణ సింహాలకు వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు లోపలికి వెళ్లారు. వీరిలో ఒకరు వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు ఏర్పాటుచేసిన గేటుకాకుండా మరో గేటు తెరవడంతో అవి ఒక్కసారిగా శ్రీకృష్ణపై దాడి చేసి ఈడ్చుకెళ్లాయి. అక్కడే ఉన్న మిగతా జంతు సంరక్షకులంతా రంగంలోకి దిగి 10 నుంచి పది హేను నిమిషాలపాటు కష్టపడి అతడిని వాటి నుంచి తప్పించారు. అనంతరం అక్కడే ఉన్న అపోలో ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే తీవ్రంగా గాయాలపాలైన శ్రీకృష్ణ ప్రాణాలకోసం పోరాడుతున్నాడు.