
పులి, సింహం వంటి క్రూర జంతువులను జూలో దూరం నుండి చూస్తేనే అందంగా ఉంటుంది. వాటిని పట్టుకుని ఫోటో దిగాలంటే అది ఎంత ప్రమాదమో ప్రతి ఒక్కరికి తెలుసు. అవి చిన్న కూనలైనా, పెద్దవైనా ప్రమాదకరమే. కానీ, కొందరు వాటిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాంటి ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. రెండు చిన్న సింహాలను పెంచుకుంటున్నాడు. అయితే, వాటిని దగ్గరి నుంచి తాకేందుకు ప్రయత్నించగా అందులో ఒకటి ముట్టుకోనివ్వలేదు. ఒక్కసారిగా గాండ్రించటంతో ఉలిక్కపడ్డాడు ఆ వ్యక్తి. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి కారుపై కూర్చున్న రెండు సింహం కూనలను తాకుతూ మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించాడు. క్షణాల్లోనే అందులో ఓ కూన కోపంతో ఊగిపోయింది. అతడిపై ఆ సింహం కూన దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఒక్క గాండ్రింపుతో ఉలిక్కిపడి ఒక అడుగు వెనక్కి వేశాడు. ఆ తర్వాత కారుపైకి వెళ్తున్న సింహాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. నెల రోజుల క్రితం ఈ వీడియో షేర్ చేయగా ఇప్పటి వరకు 2,74,000 లైకులు, మూడు మిలియన్లకుపైగా వ్యూస్ వచ్చాయి.
ఇదీ చదవండి: ఆస్కార్ లెవల్ యాక్టింగ్.. బోనులోని పులిని అడవిలోకి తెచ్చేసరికి!
Comments
Please login to add a commentAdd a comment