cubs
-
నల్లగొండ జిల్లా చింతపల్లిలో చిరుత కలకలం
-
చనుగొండ్లలో చిరుత పిల్లల సంచారం.. భయాందోళనలో గ్రామస్తులు
సాక్షి, నంద్యాల జిల్లా: డోన్ మండలం చనుగొండ్ల గ్రామంలోని కొండల్లో చిరుత పిల్లలు సంచరిస్తున్నాయి. చిరుత పిల్ల రైతుల కంట పడింది. చనుగొండ్ల గ్రామానికి ఆనుకొని కొండ ప్రాంతం ఉండటంతో చిరుత పిల్లను చూసి గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. తల్లి చిరుత ఎప్పుడు గ్రామంలోకి వస్తుందోనని భయభ్రాంతులు చెందుతున్నారు.గతంలో చిరుత వెంకటాపురం గ్రామ సమీప కొండ గుహల్లో నివాసాలు ఏర్పరచుకొని రాళ్ల మధ్యలో ఉంటూ అటుగా వెళ్లే పశువులపై దాడి చేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. కొండ ప్రాంతానికి అనుకొని ఇల్లు ఉండటం వలన గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. -
3 పిల్లలకు జన్మనిచ్చిన ‘జ్వాల’.. కునోలో చీతా కూనల సందడి
మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులో చీతాల సంఖ్య పెరుగుతోంది. తాజాగా నమీబియా నుంచి తీసుకొచ్చిన ఆడ చీతా ‘జ్వాల’ మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర అటవీ, పర్యావరణం, వాతావరణ మార్పులశాఖ మంత్రి భూపేంధ్ర యాదవ్ పేర్కొన్నారు. ‘కునోలోకి కూన చీతాలు వచ్చేశాయ్..జ్వాల అనే నమీబియా చీతా మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ఆశ అనే చీతా రెండు కూనలకు జన్మనిచ్చిన కొద్ది వారాలకే ఈ సంఘటన జరిగింది. దేశంలోని వన్యప్రాణుల సంరక్షణ కోసం పనిచేసేవారు, జంతు ప్రేమికులకు ఇది గుడ్ న్యూస్. భారత వన్యప్రాణులు వృద్ది చెందుతున్నాయి’ అంటూ ట్వీట్ చేశారు. తల్లి వద్ద ఆడుకుంటున్న కూన చీతలకు సంబంధించిన ఓ క్యూట్ వీడియోను షేర్ చేశారు. 2023 మార్చిలో జ్వాలా చీతా నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే, వాటిలో ఒకటి మాత్రమే ప్రాణాలతో బయటపడింది. కొత్తగా పుట్టిన ఈ మూడు పిల్లలతో కలిపి కునో నేషనల్ పార్క్‌లో మొత్తం చిరుతల సంఖ్యను 20కి చేరింది. కునో నేషనల్ పార్క్‌లో చీతాల మరణాలు కూడా ఎక్కువవుతున్నాయి. ప్రాజెక్టు చీతాలో భాగంగా తీసుకొచ్చిన శౌర్య అనే చీత జనవరి 16న మృతిచెందిన విషయం తెలిసిందే. ఉదయం 11 గంటలకు శౌర్య అస్వస్థతకు గురవ్వడం గమనించినట్లు అదనపు చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, కునోలోని లయన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ తెలిపారు. వెంటనే దానికి వైద్యం అందించగా కుదుటపడిందని చెప్పారు, కానీ కాసేపటికే మళ్లీ బలహీనపడి వైద్యానికి స్పందించలేదని, అనంతరం ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. చదవండి: విషాదం: రామజపంతో కుప్పకూలిన ‘హనుమాన్’ Kuno’s new cubs! Namibian Cheetah named Jwala has given birth to three cubs. This comes just weeks after Namibian Cheetah Aasha gave birth to her cubs. Congratulations to all wildlife frontline warriors and wildlife lovers across the country. May Bharat’s wildlife thrive… pic.twitter.com/aasusRiXtG — Bhupender Yadav (@byadavbjp) January 23, 2024 ఇక 2022 సెప్టెంబరు 17న ప్రాజెక్టు చీతా’లో భాగంగా మొదటి బ్యాచ్‌లో ఎనిమిది నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి చిరుతలను కునో నేషనల్ పార్క్‌లో తన పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన విషయం తెలిసిందే. రెండో బ్యాచ్‌లో 2023 ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలను కునోకు తీసుకొచ్చారు. అయితే మొత్తం 20 చీతాల్లో 8 చనిపోయాయి. ఇప్పటి వరకు మొత్తం 10 చీతాలు( ఏడు పెద్దవి, మూడు కూనలు) మరణించాయి. ఇదిలా ఉండగా గత 75 ఏళ్ల తర్వాత చీతాలు తిరిగి భారత్ గడ్డపై అడుగు పెట్టాయి. -
తిరుపతి ఎస్వీ జూ పార్క్ లో పులిపిల్ల మృతి
-
నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన నమీబియా చీతా.. ఫొటోలు వైరల్..
భోపాల్: గతేడాది నమీబియా నుంచి మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్కుకు తీసుకొచ్చిన చీతాల్లో ఒకటి నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. కీడ్ని సమస్యతో ఈ పార్కులోని సషా అనే చీతా చనిపోయిన మూడు రోజులకే మరో చీతా ప్రసవించడం గమనార్హం. తల్లి, నాలుగు చీతా కూనలకు సంబంధించిన ఫోటో, వీడియోను కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ ట్విట్టర్లో షేర్ చేశారు. Congratulations 🇮🇳 A momentous event in our wildlife conservation history during Amrit Kaal! I am delighted to share that four cubs have been born to one of the cheetahs translocated to India on 17th September 2022, under the visionary leadership of PM Shri @narendramodi ji. pic.twitter.com/a1YXqi7kTt — Bhupender Yadav (@byadavbjp) March 29, 2023 దేశంలో అంతరించిపోయిన చీతాల సంఖ్యను పెంచేందుకు ఆఫ్రికా నుంచి 8 చీతాలను గతేడాది సెప్టెంబర్‌లో ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా తీసుకొచ్చారు. వీటీలోనే ఒకటి చనిపోయింది. మిగతావి ఆరోగ్యంగా ఉన్నాయి. ఈ 8 చీతాల తర్వాత దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలను కూడా భారత్‌కు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇవి క్వారంటైన్లో ఉన్నాయి. త్వరలోనే విడుదల చేస్తారు. చదవండి: రాజస్థాన్ హై కోర్టు కీలక తీర్పు.. 71 మంది చనిపోయిన పేలుళ్ల కేసు నిందితులు నిర్దోషులుగా విడుదల.. -
పెద్దపులికి వాసనను గుర్తించే శక్తి అమోఘం
ఆత్మకూరు రూరల్: కర్ణుడి చావుకు వంద కారణాలన్నట్లుగా నల్లమలలో తల్లి పులి నుంచి తప్పిపోయిన కూనలను తిరిగి తల్లి వద్దకు చేర్చే ప్రక్రియ విఫలంకావడానికి ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి. తల్లి చాటున సహజంగా వేట నేర్చుకుని నల్లమల అభయారణ్యంలో పంజా విసరాల్సిన పులి కూనలు జూపార్క్ ఎన్క్లోజర్లలో శిక్షణ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వారం రోజుల క్రితం నల్లమలలో పులి కూనల పునరేకీకరణ యత్నం విఫలమయ్యేందుకు అటవీ అధికారుల అభద్రతాభావమేనని స్పష్టంగా కనిపిస్తోంది. పర్యావరణ పిరమిడ్‌లో అగ్రసూచి అయిన పులి సంరక్షణ అత్యంత కీలకం. ఈ విషయంలో అటవీ శాఖ ఎంతో బాధ్యతాయుతమైన విధి నిర్వహణగా పరిగణిస్తోంది. ఇందులో విఫలమైన అధికారులు పూర్తిగా బాధ్యత వహించాల్సి వస్తోంది. ఈ భయంతోనే పులి కూనలను తల్లి వద్దకు చేర్చడంలో ఎలాంటి రిస్క్ తీసుకోలేదని తెలుస్తోంది. పిల్లలను అందుబాటులో ఉంచి తల్లి చెంతకు చేరేలా చేయాల్సిన అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరించారు. ముందు పులిని వెతికి ఆ తరువాత పిల్లలను దాని వద్దకు చేర్చాలనే ప్రమాద రహిత, నింపాది చర్యలకు ప్రాధాన్యత నిచ్చారు. పులి సంరక్షణలో ఎంతో అనుభవమున్న హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ (హెటికోస్)సభ్యులు ఈ పద్ధతిపై విమర్శలు చేస్తున్నారు. సుమారు 2 కి.మీ వలయం పరిధిలో తన కూనలతో పెద్దపులి పర్యవేక్షణ చేయ గలదు. అయితే కూనలు కొద్దిగా నీరసించి పోవడంతో వాటికేమైనా అవుతుందేమోన్న భయంతో అధికారులు ప్రమాద రహిత మార్గంలో యత్నించి విఫలమైనట్లు తెలుస్తోంది. తొలిరోజున పెద్ద గుమ్మడాపురం సమీపంలో తల్లి పులి టీ108 గాడ్రింపులు వినపడ్డాయి. అలాగే సమీపంలో పులి పాదముద్రలు కనిపించాయి. సమీపంలోని ముసలిమడుగు గ్రామ సమీపంలో రోడ్డు దాటుతూ పులి కనిపించింది. అక్కడికి పులికూనలను తీసుకు వెళ్లి తల్లి కోసం ప్రయతి్నంచి ఉంటే తల్లి ఒడి చేరే అవకాశాలు ఎక్కువగా ఉండేది. మీడియా కారణంగా పులి కూనల విషయం వెలుగులోకి రావడం, గుమ్మడాపురం గ్రామస్తులే కాకుండా ఇతర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అలాగే కొందరు మీడియా ప్రతినిధులు అటవీ ప్రాంతంలో సంచరించడంతో ఆ అలికిడికి తల్లి పులి ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోడంతో కూనలు తిరుపతి జూకు తరలించాల్సి వచ్చిందని చెప్పవచ్చు. పులి కూనలు పంజా విసిరేదెలా..! పులి కూనలు ఏకారణంగానైనా జూలో పరాన్నజీవిగా మారితే ఇక అవి కనీసం కోడి పిల్లను కూడా వేటాడే శక్తిని కూడా కోల్పోతాయి. ఎన్టీసీఏ మార్గదర్శకాల మేరకు నాలుగు పులి కూనలను తిరుపతి జూకు తరలించారు. అయితే ఇన్–సీటు ఎన్‌క్లోజర్‌లో ఉంచిన పులికూనలు కౌమార దశకు రాగానే అక్కడ సహజ ఆవరణలోనే వాటికి వేట నేర్పి ఆపై అడవిలో వదిలేస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే వేటపై శిక్షణ సాధ్యమేనా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒక వేళ అలా ప్రయతి్నంచినా అడవుల్లో అత్యంత వేగంగా పరిగెత్తి గడ్డితినే వన్య ప్రాణులను జూ పోషిత పులులు వేటాడలేక ఆహారం కోసం సమీప గ్రామాల్లోకి వచ్చే ప్రమాదం ఉంటుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పెద్దపులికి ఘ్రాణ శక్తి అపారం పెద్దపులికి వాసనను గుర్లించే శక్తి అమోఘం. ఒకరకంగా పులి వాసనలను గుర్తించడం ద్వారా తన వేట, తన రక్షణను మొత్తం మీద జీవన విధానాన్నే రూపొందించుకుంటుంది. తన కూనలను వదలి వేటకు వెళ్లినపుడు గరిష్టం రెండు కి.మీ. పరిధి నుంచి కూడా వాటితో సంబంధం కలిగి ఉంటుంది. తనదైన తరంగ ధైర్ఘ్యంలో శబ్దాలు చేస్తూ కూనలను పర్యవేక్షించగలదు. అందుకే సాధారణంగా కూనలు తల్లి పులితో ఎప్పుడూ తప్పి పోవు. – ఇమ్రాన్ సిద్దిఖి, డైరెక్టర్, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ (హెటికోస్) -
పులి పిల్లలకు అడవి పాఠాలు.. జూలో రెండేళ్ల పాటు చేసేది ఇదే..
సాక్షి, అమరావతి: ఆత్మకూరు సమీపంలో తల్లి పులి నుంచి తప్పిపోయిన 4 పులి పిల్లలకు అడవి పాఠాలు నేర్పేందుకు అటవీ శాఖ సమాయత్తమైంది. ఇప్పటికే వాటిని తిరుపతి జూ పార్క్‌లోని ఇన్ సిటు ఎన్‌క్లోజర్(సహజ స్థితిలో ఉండే ఆవరణ)కు చేర్చారు. 100 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ ఎన్‌క్లోజర్ ఇప్పటివరకు ఖాళీగా ఉంది. ఇందులో పెరిగే జంతువులను చూసేందుకు సందర్శకులకు అనుమతి ఉండదు. అడవి మాదిరిగానే దీన్ని ఉంచుతారు. సహజంగా అడవిలో జంతువులు ఎలా ఉంటాయో ఈ ఎన్‌క్లోజర్‌లో పులి పిల్లల్ని కూడా అలాగే ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్టీసీఏ(నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ) మార్గదర్శకాల మేరకు పులి పిల్లలకు అక్కడ శిక్షణ ఇవ్వనున్నారు. పరీక్షల్లో పాసైతేనే అడవిలోకి.. దొరికిన నాలుగు ఆడ పులి పిల్లల వయసు 60 రోజులుగా నిర్ధారించారు. రెండేళ్ల వయసు వచ్చే వరకు వాటిని ఈ జూలోనే ఉంచుతారు. కానీ.. వాటిని జూలోని మిగతా జంతువుల్లా కాకుండా అడవిలో ఉన్నట్లు జీవించేలా చూస్తారు. 45–60 రోజుల పులి పిల్లలకు మేక పాలు, చికెన్ సూప్ ఆహారంగా ఇస్తారు. 61వ రోజు నుంచి ఉడికించిన చికెన్ ముక్కలు పెడతారు. 75–90 రోజుల మధ్య ఎముకతో పూర్తిగా ఉడికించిన చికెన్ అందిస్తారు. 90–105 రోజుల మధ్య సగం ఉడికిన చికెన్, 105–120 రోజుల మధ్య పచ్చి చికెన్, 120–150 రోజుల మధ్య గొడ్డు మాంసం సూప్, చికెన్‌తో కలిపి ఇస్తారు. 6 నెలల తర్వాత పూర్తి పచ్చి గొడ్డు, కోడి మాంసాన్ని ఆహారంగా అందిస్తారు. ఒక సంవత్సరం తర్వాత అవి వేటాడి ఆహారాన్ని సంపాదించుకునే ఏర్పాట్లు చేస్తారు. ఇందుకోసం కొన్ని జంతువులను వాటికి తెలియకుండానే ఎన్‌క్లోజర్‌లోకి వదులుతారు. నాలుగు పిల్లలు ఎన్ని జంతువులను ఎలా వేటాడాయనే విషయాలను నమోదు చేస్తారు. ఇంకా అడవిలో ఎలా జీవించాలనే దానిపై కొన్ని పరీక్షలు పెడతారు. సంవత్సరం తర్వాత నుంచి మనుషులు వాటికి కనపడకుండానే పరిశీలిస్తారు. ఈ అంశాలన్నింటినీ పరిశీలించి అడవిలో ఒంటరిగానైనా అవి వేటాడి జీవించగలవని నిర్ధారణ అయితే రెండు సంవత్సరాల తర్వాత వాటిని అడవిలో వదులుతారు. ఇందుకోసం వాటికి కొన్ని పరీక్షలు కూడా పెడతారు. వాటిలో పాస్ అయితేనే అడవిలో వదిలే అవకాశం ఉంటుంది. తల్లి పిల్లల్ని ఎందుకు వదిలేస్తుందంటే.. పులి పిల్లలు వైకల్యంతో పుట్టినా.. బలహీనంగా ఉన్నా.. గాయాలై నడవలేకపోయినా.. తల్లి అనారోగ్యంతో ఉన్నా.. లేక వేట/నీటి కోసం వెళ్లినప్పుడు తప్పిపోయినా తల్లి పులి పిల్లల్ని వదిలేస్తుందని ఎన్టీసీఏ చెబుతోంది. ఆత్మకూరు ఘటనలో పులి తన పిల్లల్ని సురక్షితమని భావించిన చోట ఉంచి వేట కోసమో లేదా నీళ్ల కోసమో వెళ్లి ఉండవచ్చని భావిస్తున్నారు. సాధారణంగా పులి పిల్లలు అటవీ శాఖకు దొరికితే వెంటనే వాటిని జూ పార్క్‌కు తరలిస్తారు. కానీ.. ఆత్మకూరు సమీపంలో దొరికిన పులి పిల్లల్ని వెంటనే కాపాడగలిగిన అటవీ శాఖ తల్లి పులి గాండ్రింపులు వినపడటం, పిల్లల కోసం వచ్చినట్టు నిర్ధారణ కావడంతో దానికి జత చేసేందుకు ప్రయత్నించింది. తల్లి పులి వద్దకు వెళ్లేందుకు వాటిని వదిలినా ఎండ తీవ్రతతో అవి వదిలిన చోటే వెనక్కి వచ్చేశాయి. తల్లి పులి ఉనికి కోసం పులి ఆవాస ప్రాంతంలో 50 కెమేరా ట్రాప్‌లు అమర్చి గస్తీ నిర్వహించారు. పిల్లల్ని తల్లి దగ్గరకు చేర్చేందుకు అటవీ శాఖాధికారులు ఎంత ప్రయత్నించినా వీలు కాలేదు. మనుషుల తాకిడి పిల్లలపై ఉండటంతో తల్లి పులి వాటిని స్వీకరించడం లేదని స్పష్టమవడం, ఒకవేళ తల్లి పులి వద్దకు వాటిని చేర్చినా పిల్లలు మనుగడ సాగిస్తాయా లేదో స్పష్టత లేకపోవడంతో వాటిని తిరుపతిలోని ఇన్–సిటు ఎన్‌క్లోజర్‌కు తరలించారు. గతంలో పులి పిల్లలు దొరికినా అవి బతికిన ఘటనలు లేవు. ఐదేళ్ల క్రితం ఇలాగే నల్లమలలో 3 పులి పిల్లలు దొరికినా తిరుపతి నుంచి వెటర్నరీ డాక్టర్లు వచ్చేసరికి అవి చనిపోయాయి. కానీ ఇప్పుడు వెంటనే ఆత్మకూరు నుంచి డాక్టర్లు వెళ్లడంతో చికిత్స అందించి బతికించగలిగారు. డాక్టర్లు వెళ్లే సమయానికి నాలుగింటిలో రెండింటికీ రక్తస్రావం అవుతున్నట్లు గుర్తించారు. సకాలంలో వెళ్లడంతో వాటిని కాపాడగలిగారు. రెండేళ్లు శిక్షణ ఇస్తాం ఎన్టీసీఏ మార్గదర్శకాల ప్రకారం పులి పిల్లల్ని ఇన్–సిటు ఆవరణలో రెండేళ్లు శిక్షణ ఇస్తాం. అవి అడవిలో బతకగలవని నిర్ధారణ అయ్యాక వాటిని నల్లమలలో ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటాం. పులి పిల్లల్ని సంరక్షించడంలో క్రియాశీలకంగా వ్యవహరించాం. అవి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాయి. – ఆర్.శ్రీనివాసరెడ్డి, ప్రాజెక్టు టైగర్ సర్కిల్ ఏసీఎఫ్ (అసిస్టెంట్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్) -
మదర్ టైగర్ సెర్చ్ ఆపరేషన్ విఫలం..
సాక్షి, నంద్యాల: మదర్ టైగర్ సెర్చ్ ఆపరేషన్ విఫలమైంది. బుధవారం రాత్రి తల్లిపులితో కలపడానికి పులి కూనలను అధికారులు ఫారెస్ట్‌కు తరలించారు. ఈ క్రమంలో తల్లి పులి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది. అయితే, తల్లి పులి కోసం అటవీ శాఖ అధికారులు రాత్రంతా శ్రమించినా ఫలితం దక్కలేదు. రాత్రంతా వేచి చూసినా తల్లి పులి రాకపోవడంతో పులి కూనలను ఆత్మకూరు క్యాంప్‌కు తరలించారు. కాగా, రాత్రంతా పులి సంచరించిన ప్రాంతాల్లో కూనలను ఉంచి, కృత్రిమ శబ్దాలు చేస్తూ తల్లి పులి జాడ కోసం వెతికారు. మిగతా ప్రాంతాల్లో ట్రాప్ కెమెరా, ప్లగ్ మార్క్ ఆధారాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు -
చిన్నదైనా సింహం సింహమే.. ఒక్క గాండ్రింపుతో హడలెత్తించింది..!
పులి, సింహం వంటి క్రూర జంతువులను జూలో దూరం నుండి చూస్తేనే అందంగా ఉంటుంది. వాటిని పట్టుకుని ఫోటో దిగాలంటే అది ఎంత ప్రమాదమో ప్రతి ఒక్కరికి తెలుసు. అవి చిన్న కూనలైనా, పెద్దవైనా ప్రమాదకరమే. కానీ, కొందరు వాటిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాంటి ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. రెండు చిన్న సింహాలను పెంచుకుంటున్నాడు. అయితే, వాటిని దగ్గరి నుంచి తాకేందుకు ప్రయత్నించగా అందులో ఒకటి ముట్టుకోనివ్వలేదు. ఒక్కసారిగా గాండ్రించటంతో ఉలిక్కపడ్డాడు ఆ వ్యక్తి. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి కారుపై కూర్చున్న రెండు సింహం కూనలను తాకుతూ మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించాడు. క్షణాల్లోనే అందులో ఓ కూన కోపంతో ఊగిపోయింది. అతడిపై ఆ సింహం కూన దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఒక్క గాండ్రింపుతో ఉలిక్కిపడి ఒక అడుగు వెనక్కి వేశాడు. ఆ తర్వాత కారుపైకి వెళ్తున్న సింహాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. నెల రోజుల క్రితం ఈ వీడియో షేర్ చేయగా ఇప్పటి వరకు 2,74,000 లైకులు, మూడు మిలియన్లకుపైగా వ్యూస్ వచ్చాయి. View this post on Instagram A post shared by Md Gulzar (@basit_ayan_3748) ఇదీ చదవండి: ఆస్కార్ లెవల్ యాక్టింగ్.. బోనులోని పులిని అడవిలోకి తెచ్చేసరికి! -
వైరల్: సింబా.. ఎంత ముద్దుగా ఉన్నావ్రా.. క్యూట్
Lion cub playing with his mother: బిడ్డకు తల్లి స్పర్శ, ఆమె ఒడిలో దొరికే లాలింపు మరెక్కడా దొరకదు. ప్రతీ బిడ్డకు మొదటి ఫ్రెండ్ కూడా అమ్మే.. ఆటపాటలు, ముద్దులు, మురిపాలు.. ఇలా ప్రతీ విషయంలోనూ అమ్మ తర్వాతే ఎవరైనా. మనుషులైనా, జంతువులైనా ఇందుకు అతీతం కాదు. అలాంటి అనిర్వచనీయమైన మాతృ ప్రేమ, తల్లీబిడ్డల బంధానికి అద్దం పట్టే సింహాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇసుకలో తల్లి చెంత సేద తీరుతున్న బుజ్జి సింహం.. గారాం చేస్తూ.. మెల్లిగా నడుచుకుంటూ వెళ్లి కాస్త దూరంగా పడుకుంటుంది. ఇంతలో అక్కడికి చేరిన సివంగి.. దానిని ముద్దాడుతూ, నవ్విస్తూ అక్కున చేర్చుకుంటుంది. ఆగష్టు 10న వరల్డ్ లయన్ డే సందర్భంగా భారత అటవీ శాఖ అధికారి సురేందర్ మెహ్రా ట్విటర్లో షేర్ చేశారు. అరుదైన జాతి అంతరించిపోకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తుచేశారు. ఇక ఆయనతో ఏకీభించిన నెటిజన్లు.. ‘‘రేయ్.. సింబా.. ఎంత ముద్దుగా ఉన్నావ్రా. నీ అరుపులు, నవ్వు.. అల్లరి చేష్టలు చూస్తుంటే ముచ్చటేస్తుంది. సో క్యూట్’’ అంటూ ఫిదా అవుతున్నారు. చదవండి: Kinnaur Landslide: 13 శవాలు వెలికితీత.. ఇంకా శిథిలాల కింద? It’s not just the number of a particular wild species that is important..! More important is how we keep this population healthy and secure their natural habitat at landscape level..#WorldLionDay 🦁@GujForestDept @moefcc @CentralIfs pic.twitter.com/YJYxRh3c2C — Surender Mehra IFS (@surenmehra) August 10, 2021 -
చెరుకు తోటలో.. 5 చిరుత పులి పిల్లలు
పూణే : మహారాష్ట్రలోని ఓ పంటపొలాల్లో 5 చిరుత పులి పిల్లల మృతదేహాలు లభ్యమయ్యాయి. పూణేలోని జూనార్‌లో ఆలాసరి గ్రామంలో బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని ఓ చెరుకు తోటలో పంటకోయడానికి వచ్చిన కూలీలు 5 చిరుత పులి పిల్లల మృతదేహాలను గుర్తించారు. 'పొలంలోని చెత్తను ఒక్కచోటుకి తెచ్చి కాల్చమని యజమాని చెప్పారు. చెత్తను ఒక్క చోట తెచ్చి వేస్తుండగా అందులో ఐదు చిరుత పులి పిల్లల మృతదేహాలు ఉన్నట్టు ఓ మహిళా కూలి గుర్తించింది' అని పొలంలో పని చేయడానికి వచ్చిన వ్యక్తి చెప్పాడు. -
బాల నేరస్థులుగా గుర్తించి వదిలేశారు!
గుజరాత్ లో ముగ్గురిని చంపిన ఘటనలో మూడు సింహాలను అరెస్టు చేసిన ఘటనలో రెండింటిని బాల నేరస్తులుగా గుర్తించిన అధికారులు వాటిని ప్రొబేషన్ లో వదిలేసేందుకు నిర్ణయించారు. ముగ్గురు గ్రామస్థులను చంపిన కేసులో గుజరాత్ గిర్ నేషనల్ పార్కులోని మూడు సింహాలకు తీవ్రమైన పనిష్మెంట్ ఇచ్చేందుకు సన్నాహాలు చేశారు. వాటికి జీవిత ఖైదును విధించేందుకు సిద్ధం చేశారు. అందులో భాగంగా వాటిని అబ్జర్వేషన్ లో ఉంచారు. కాగా దోషులుగా భావించిన మూడు సింహాల్లో రెండు చిన్న పిల్లలని తెలుసుకున్న అధికారులు జువైనల్స్ గా గుర్తించి వాటికి శిక్షను లేకుండా చేశారు. గుజరాత్ అభయారణ్యంలో ముగ్గురు మనుషులను చంపి తిన్న సింహాలకు జీవిత ఖైదు వేసేందుకు అధికారులు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే వీటిలో రెండు బాల నేరస్తులని గుర్తించారు. ఓ మగ సింహం మనిషిని చంపి తినగా, మిగిలినవి అది మిగిల్చిన మాంసాన్ని మాత్రమే తిన్నాయని గమనించిన గుజరాత్ ఫారెస్ట్ డిపార్ట్ మెంట్, వాటికి ప్రొబేషన్ ఇచ్చి తిరిగి సాసన్ గ్రామానికి దగ్గరలోని అడవుల్లో వదిలేయాలని నిశ్చయించింది. అయితే ఆరెండు సింహాలూ అడవిలో ఒకదానికి ఒకటి కలవకుండా ఉండేట్లు చేసి వాటి ప్రవర్తనను కొంతకాలం పరిశీలిస్తామని ఫారెస్ట్ అధికారి ఏపీ సింగ్ తెలిపారు. గత మూడు నెల్ల కాలంలోనే అంబార్ది ప్రాంతంలో నిద్రిస్తున్న వారిపై దాడికి దిగుతున్న సింహాలు ముగ్గురిని హతమార్చడంతో పోలీసులు విషయాన్ని సీరియస్ గా తీసుకొని, మొత్తం 17 సింహాలను అదుపులోకి తీసుకున్నారు. అయితే వాటిలో మూడింటిని దోషులుగా తేల్చినా, వాటిలో రెండు బాల నేరస్తులుగా గుర్తించి వాటిని అడవుల్లో వదిలేందుకు సిద్ధం చేశారు. -
రాజస్థాన్ అడవుల్లో పులిపిల్లలు..
న్యూఢిల్లీః ప్రపంచ వ్యాప్తంగా పెద్ద పులుల సంఖ్య తగ్గుతున్న తరుణంలో పర్యాటకులకు పులిపిల్లలు కనిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. వన్యప్రాణ ప్రేమికులకు, అధికారులకు ప్రత్యేక వార్తగా మారింది. ఇండియాలో క్రమంగా పులుల సంఖ్య పెరగడంపై అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాజస్థాన్ లోని రణతంబోర్ టైగర్ రిజర్వ్ లో పర్యటనకు వెళ్ళిన కొందరు పర్యాటకులకు రెండు పులి పిల్లలు కనిపించాయి. దీంతో వన్యప్రాణ ప్రేమికులు సహా అధికారులు అనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఓ శుభ పరిణామంగా భావిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద పులుల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో ఇండియాలోని రాజస్థాన్ రణతంబోర్ రిజర్వ్ అడవుల్లో పులి కూనలు కనిపించడంతో అధికారులు సంబరాలు జరిపారు. పార్కులోని జోన్ 5 కు చెందిన కచిడా ఏరియాలోని ధకడా ప్రాంతంలో టూరిస్టులు ఈ పులి పిల్లలను కనుగొన్నారు. ఈ పిల్లలకు సుమారు రెండు మూడు నెలల వయసు ఉంటుందని, వీటి తల్లి రిజర్వ్ లో నివసిస్తున్న టి-73 అయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అంతేకాక ఆ పెద్దపులి మరిన్ని పిల్లలను కూడ కని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. జోన్ లో అత్యంత ఎక్కువమంది సందర్శించిన పులిగా పేరుతెచ్చుకున్న... అకాసుందరి పేరుగల టి-17 కు పుట్టిన ఆడపులే టి-73 అని, ఇప్పుడు ఈ టి-73 కూడ ముద్దులొలికే పులి కూనలను కనడం ఎంతో ఆనందంగా ఉందని అధికారులు చెప్తున్నారు. దీనికి తోడు తాను ఉండేందుకు ఈ ప్రాంతాన్ని ఎంచుకుని, ఇక్కడే నివసిస్తున్న మొదటి ఆడపులి ఈ టి-73 అని, చాలా కాలం తర్వాత ఇక్కడే ఈ పులి పిల్లలను పెట్టడం వన్యప్రాణ ప్రేమికులకు నిజంగానే శుభవార్త అని అధికారులు అంటున్నారు. ఈ అభయారణ్యంలో మరిన్ని ఆడ పులులు పిల్లలు పెట్టి ఉండొచ్చని వాటిని కూడ గుర్తిస్తామని తెలిపారు.