భోపాల్: గతేడాది నమీబియా నుంచి మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్కుకు తీసుకొచ్చిన చీతాల్లో ఒకటి నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. కీడ్ని సమస్యతో ఈ పార్కులోని సషా అనే చీతా చనిపోయిన మూడు రోజులకే మరో చీతా ప్రసవించడం గమనార్హం. తల్లి, నాలుగు చీతా కూనలకు సంబంధించిన ఫోటో, వీడియోను కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.
Congratulations 🇮🇳
— Bhupender Yadav (@byadavbjp) March 29, 2023
A momentous event in our wildlife conservation history during Amrit Kaal!
I am delighted to share that four cubs have been born to one of the cheetahs translocated to India on 17th September 2022, under the visionary leadership of PM Shri @narendramodi ji. pic.twitter.com/a1YXqi7kTt
దేశంలో అంతరించిపోయిన చీతాల సంఖ్యను పెంచేందుకు ఆఫ్రికా నుంచి 8 చీతాలను గతేడాది సెప్టెంబర్‌లో ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా తీసుకొచ్చారు. వీటీలోనే ఒకటి చనిపోయింది. మిగతావి ఆరోగ్యంగా ఉన్నాయి. ఈ 8 చీతాల తర్వాత దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలను కూడా భారత్‌కు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇవి క్వారంటైన్‌లో ఉన్నాయి. త్వరలోనే విడుదల చేస్తారు.
చదవండి: రాజస్థాన్ హై కోర్టు కీలక తీర్పు.. 71 మంది చనిపోయిన పేలుళ్ల కేసు నిందితులు నిర్దోషులుగా విడుదల..
Comments
Please login to add a commentAdd a comment