gave birth
-
స్టార్ హీరోయిన్‌కి కూతురు పుట్టింది.. ఎంత ముద్దుగా ఉందో? (ఫొటోలు)
-
ఇంట్లోనే ప్రసవించిన మహిళ.. బిడ్డను బాత్రూం బకెట్లో పెట్టి..
తిరువనంతపురం: కేరళ అలప్పుజలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ నిండు గర్భిణి ఇంట్లోనే ప్రసవించింది. దీంతో ఆమెకు తీవ్ర రక్తస్రావమైంది. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో తన బిడ్డను ఓ వస్త్రంలో చుట్టి బాత్రూంలోని బకెట్లో పెట్టి ఆస్పత్రికి వెళ్లింది. ఇంట్లో బకెట్లో ఉన్న బిడ్డను కాపాడాలని వైద్యులను కోరింది. ఆస్పత్రి అధికారులు వెంటనే ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించారు. నవజాత శిశువును కాపాడాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పోలీసులు హుటాహుటిన బయల్దేరి వెళ్లారు. బాత్రూంలో బకెట్లో ఉన్న పసికందును బయటకు తీసుకొచ్చారు. తక్షణమే చెన్నగూర్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. శిశువు బరువు 1.3 కీజీలు ఉన్నట్లు తెలిపారు. శిశువును ఆస్పత్రిలో చేర్చిన అనంతరం బాగోగులు చూసుకునే బాధ్యతను పథానంతిట్ట చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు పోలీసులు. వలంటీర్ల సహకారంతో మెరుగైన చికిత్స కోసం చిన్నారిని కొట్టాయం మెడికల్ ఆస్పత్రికి తరలించారు. అయితే మహిళ ప్రసవించినప్పుడు ఆమె చుట్టుపక్కల ఎవరూ లేనట్లు తెలుస్తోంది. తీవ్ర రక్తస్రావం కావడంతో బిడ్డను పట్టుకునే శక్తి లేక బకెట్లోనే పెట్టి చెన్నగూర్ ఆస్పత్రికి వెళ్లి అడ్మిట్ అయింది. జరిగిన విషయాన్ని అక్కడి అధికారులకు చెప్పింది. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఆరోగ్యంగానే ఉన్నట్లు సమాచారం. చదవండి: ప్రియుడ్ని చంపి ముక్కలు ముక్కలుగా నరికిన ప్రియురాలు.. 400 కిలోమీటర్లు తీసుకెళ్లి బీచ్‌లో.. -
నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన నమీబియా చీతా.. ఫొటోలు వైరల్..
భోపాల్: గతేడాది నమీబియా నుంచి మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్కుకు తీసుకొచ్చిన చీతాల్లో ఒకటి నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. కీడ్ని సమస్యతో ఈ పార్కులోని సషా అనే చీతా చనిపోయిన మూడు రోజులకే మరో చీతా ప్రసవించడం గమనార్హం. తల్లి, నాలుగు చీతా కూనలకు సంబంధించిన ఫోటో, వీడియోను కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ ట్విట్టర్లో షేర్ చేశారు. Congratulations 🇮🇳 A momentous event in our wildlife conservation history during Amrit Kaal! I am delighted to share that four cubs have been born to one of the cheetahs translocated to India on 17th September 2022, under the visionary leadership of PM Shri @narendramodi ji. pic.twitter.com/a1YXqi7kTt — Bhupender Yadav (@byadavbjp) March 29, 2023 దేశంలో అంతరించిపోయిన చీతాల సంఖ్యను పెంచేందుకు ఆఫ్రికా నుంచి 8 చీతాలను గతేడాది సెప్టెంబర్‌లో ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా తీసుకొచ్చారు. వీటీలోనే ఒకటి చనిపోయింది. మిగతావి ఆరోగ్యంగా ఉన్నాయి. ఈ 8 చీతాల తర్వాత దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలను కూడా భారత్‌కు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇవి క్వారంటైన్లో ఉన్నాయి. త్వరలోనే విడుదల చేస్తారు. చదవండి: రాజస్థాన్ హై కోర్టు కీలక తీర్పు.. 71 మంది చనిపోయిన పేలుళ్ల కేసు నిందితులు నిర్దోషులుగా విడుదల.. -
నాంపల్లి రైల్వేస్టేషన్లో మహిళ ప్రసవం
నాంపల్లి: హైదరాబాద్ రైల్వేస్టేషన్లో ఓ మహిళ పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. ఈ సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం..ఉత్తరప్రదేశ్ మహరాజ్ గంజ్, బూస్పేర్ ప్రాంతానికి చెందిన గర్భిణి ఆసియా ఖాతూన్, భర్త అసబుద్దీన్‌తో కలిసి గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో సొంతూరుకు వెళ్లేందుకు సిద్ధమై నాంపల్లి రైల్వే స్టేషన్‌లోని ప్లాట్ఫారం–3 మీద రైలు కోసం వేచి చూస్తున్నారు. ఇంతలోనే ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. అక్కడే విధుల్లో ఉన్న జీఆర్పీ ఆర్పీఎఫ్ పోలీసులు ఈ విషయం గమనించారు. అంబులెన్స్‌లో నిలోఫర్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈలోపే ఆమె మూడు కిలోల బరువున్న మగబిడ్డకు జన్మనిచ్చింది. మహిళా కానిస్టేబుల్ కళ్యాణి.. ఆసియా ఖాతూ న్ వెంట ఉండి అన్ని రకాల సేవలు అందించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. -
నడిరోడ్డుపై మహిళ ప్రసవం.. మహబూబ్‌నగర్‌లో హృదయవిదారక ఘటన
జడ్చర్ల టౌన్: సాధారణంగా ఇంటి దగ్గరో.. ఆస్పత్రిలోనో ప్రసవించాల్సిన ఓ నిండు గర్భిణి.. ఇటు కుటుంబసభ్యులు పట్టించుకోక.. అటు ఆస్పత్రికి వెళ్లేందుకు భయపడి చివరికి నడిరోడ్డుపైనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మహబూబ్‌నగర్ జిల్లా బాదేపల్లిలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న ఈ హృదయవిదారక ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం ఆవంచకు చెందిన యాదమ్మ నిండు గర్భిణి కావడంతో పదిరోజుల క్రితం బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లింది. అయితే విధుల్లో ఉన్న ఓ స్టాఫ్‌నర్సు వద్ద డబ్బులు దొంగిలించిందంటూ ఆమెను మందలించి పంపించారు. దీంతో పురిటి నొప్పులు వస్తున్నా ఆమె ఆస్పత్రికి వెళ్లేందుకు భయపడి పరిసరాల్లోనే తిరగాడింది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి గాంధీ విగ్రహం వెనకాల ఉన్న షట్టర్ల వద్ద నిలిపి ఉంచిన మోటార్‌సైకిల్‌ను అడ్డుగా చేసుకుని మూడేళ్ల కొడుకుతో కలిసి నిద్రించింది. నొప్పులు రావడంతో అక్కడే బిడ్డకు జన్మనిచ్చింది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఖాజామోయిన్ అనే వ్యక్తి తన మోటార్‌సైకిల్ తీసుకెళ్లేందుకు రాగా.. ప్రసవించిన మహిళ కనిపించింది. వెంటనే ఆయన 108కు సమాచారం ఇచ్చినా.. వాహనం రాలేదు. దీంతో ఆయన ఆటోలో తల్లీబిడ్డను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ విధుల్లో ఉన్న స్టాఫ్‌నర్సు ఈమె దొంగ అని.. ఎందుకు తెచ్చారని నిలదీసిందని ఖాజామోయిన్ చెప్పారు. దీనిపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేయడంతో లోపలికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించారు. నాలుగో ప్రసవం.. రోడ్డుపైనే ప్రసవించిన యాదమ్మ స్వగ్రామం మిడ్జిల్ మండలం చిల్వేరు. మొదటి భర్త వెంకటయ్యకు ఇద్దరు సంతానం కాగా పిల్లలతో కలిసి అతను హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. అతడిని వదిలేసిన బాధితురాలు తిమ్మాజిపేట మండలం ఆవంచకు చెందిన జంగయ్యతో ఉంటోంది. ప్రస్తుతం జంగయ్య కూడా పట్టించుకోకపోవడంతో మూడేళ్ల కుమారుడితో కలిసి జడ్చర్లలో పేపర్లు ఏరుతూ జీవనం సాగిస్తోంది. ఉన్నతాధికారుల ఆరా.. మహిళ రోడ్డుపైనే ప్రసవించిన ఘటన సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కావడంతో వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఆరా తీశారు. ఆస్పత్రికి రాకుండానే బయటే ప్రసవించిందని, తల్లీబిడ్డ క్షేమంగానే ఉన్నారని సూపరింటెండెంట్ సోమశేఖర్ ఉన్నతాధికారు లకు సమాచారం ఇచ్చారు. ఈ నెల 15న ఆస్పత్రికి వచ్చిన సదరు మహిళ తమ సిబ్బంది డబ్బులు దొంగిలించిందని, ఈ విషయమై పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు. యాదమ్మను ఆస్పత్రికి రావద్దని చెప్పలేదని, డబ్బులు దొంగతనం చేసినందుకు భయపడి ఆస్పత్రికి రాకపోయి ఉండొచ్చని చెప్పారు. -
వీడియోకాల్‌లో డాక్టర్ సూచనలు.. గర్భిణికి ప్రసవం చేసిన నర్సులు.. శిశువు మృతి
సాక్షి, చెన్నై: ఆస్పత్రిలో విధులకు రాకుండా వీడియో కాల్ ద్వారా నర్సుల సాయంతో ఓ గర్భిణికి డాక్టర్ ప్రసవం చేయించే ప్రయత్నం చేశాడు. శిశువు మరణించడం, తల్లి పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఆగమేఘాలపై పెద్దాస్పత్రికి తరలించారు. మధురాంతకంలో ఈ ఘటన మంగళవారం పెద్ద వివాదానికి దారి తీసింది. వివరాలు.. మదురాంతకం సునాంబేడు అండార్ కుప్పం గ్రామానికి చెందిన మురళి(36) ఎలక్ట్రిషియన్. ఆయన భార్య పుష్ప (33) రెండోసారి గర్భం దాల్చింది. అప్పటి నుంచి వీరు ఇల్లిడు గ్రామంలోని ఆరోగ్య కేంద్రంలో వైద్య పరీక్షలు చేయించుకుంటూ వస్తున్నారు. పురిటి నొప్పులు రావడంతో పుష్పను సోమవారం సాయంత్రం ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. ఈ సమయంలో అక్కడ వైద్యులు లేరు. ఉన్న ముగ్గురు నర్సులో ఆమెను అడ్మిట్ చేశారు. గంట తర్వాత క్రమంగా నొప్పులు అధికం కావడంతో ప్రసవం చేయడానికి నర్సులు సిద్ధమయ్యారు. అయితే, బిడ్డ తల బయటకు రాకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. దీంతో వైద్యుడిని సంప్రదించగా వీడియో కాల్ సాయంతో ప్రసవం చేసే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. రక్తస్రావం అధికం కావడంతో 108 ద్వారా పుష్ప, శిశువును మధురాంతకం ఆస్పత్రికి తరలించారు. అయితే, మార్గం మధ్యలో శిశువు మరణించింది. పుష్ప పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో శిశువు మరణించిన సమాచారం అందించడం, వీడియో కాల్ ద్వారా నర్సులు ప్రసవం చేసిన వ్యవహారం వెలుగులోకి రావడంతో పుష్ప బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మంగళవారం ఉదయం మధురాంతకం వద్ద జాతీయ రహదారిపై బైఠాయించారు. ఎక్కడి వాహనాలు అక్కడే ఆగడంతో పోలీసులు రంగంలోకి దిగి సముదాయించారు. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై ఆరోగ్యశాఖ విచారణకు ఆదేశించింది. చదవండి: ‘చిన్న చిన్న తప్పులు చేశాను’..అంటూ సెల్ఫీ వీడియో తీసుకొని -
భర్త జ్ఞాపకంగా బిడ్డ.. ఐవీఎఫ్ పద్ధతిలో పండంటి మగశిశువుకు జన్మ
సాక్షి, వరంగల్: వారికి పెళ్లై తొమ్మిదేళ్లయ్యింది. పిల్లలు లేకపోవడంతో ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. చివరికి ఐవీఎఫ్ పద్ధ తిలో గర్భం కోసం భార్యాభర్తలి ద్దరూ తమ కణాలను కూడా భద్ర పరిచారు. దురదృష్టవ శాత్తు భర్త కోవిడ్‌తో మరణించారు. ఆయన జ్ఞాపకమైన బిడ్డ కోసం భార్య హైకోర్టుకు వెళ్లారు. కోర్టు అనుమతి తెచ్చుకుని పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ అరుదైన ఘటన వరంగల్‌లో చోటుచేసు కుంది. వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లాలో ఫ్యూరిఫైడ్ వాటర్ వ్యాపారం చేసుకుంటున్న కుమార్(32), ప్రేమ(పేరు మార్చాం)లకు తొమ్మిదేళ్ల క్రితం పెళ్లైంది. కానీ పిల్లలు లేకపోవడంతో... 2020లో వరంగల్‌లోని ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్‌ను సంప్రదించారు. ఫెర్టిలిటీ సెంటర్ స్పెషలిస్ట్, క్లినికల్ హెడ్ డాక్టర్ జలగం కావ్యరావు పర్యవేక్షణలో ఐవీఎఫ్ చికిత్స తీసుకున్నారు. ఈ క్రమంలో ఆమె అండం, అతని శుక్రకణాలను భద్రపరిచారు. కోవిడ్ సెకండ్ వేవ్‌లో కుమార్‌కు పాజిటివ్ వచ్చింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విష మించడంతో చనిపోయాడు. చదవండి: టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం ఐవీఎఫ్ విధా నంలో పిండ మార్పిడికి భార్యా భర్తలిద్దరి సమ్మతి అవసరం. భర్త చనిపోయిన కారణంగా సమ్మతి కుదరదు కాబట్టి, గత తీర్పులను ఉటంకిస్తూ, ప్రేమ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌ను విచారించిన తెలంగాణ హైకోర్టు... ఫ్రీజింగ్ చేసిన కణాల ఫలదీకరణ, పిండ మార్పిడికి ప్రేమకు అనుమతి ఇచ్చింది. దీంతో ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ వారు ఫ్రోజెన్ యాంబ్రియో ట్రాన్స్ఫర్ ద్వారా ఆమెలోకి పిండం పంపారు. మార్చి 22న ప్రేమ మగ బిడ్డకు జన్మనిచ్చారు. దీంతో ఆమె కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లే కుండా పోయాయి. వరంగల్ ఒయాసిస్ ఫెర్టిలిటీ క్లినికల్ హెడ్–ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ జలగం కావ్యరావు మాట్లాడుతూ.. విధి ఆమెకు అపార మైన నష్టం కలిగించినా, అధునాతనమైన సంతానోత్పత్తి ప్రక్రియతో ప్రేమ జీవితంలో కొత్త ఆశలను చిగురింపచేయగలిగామని అన్నారు. -
తల్లైన తొమ్మిదో తరగతి విద్యార్థిని.. బిడ్డతో కలిపి ఆమెను..
సాక్షి, బొబ్బిలి(విజయనగరం): బొబ్బిలి పట్టణంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక గురువారం రాత్రి మగబిడ్డకు జన్మనిచ్చినట్టు తెలిసింది. దీనిపై గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు పాఠశాలకు శుక్రవారం వచ్చి ఆరా తీసినట్టు సమాచారం. విద్యార్థిని ప్రసవించేంత వరకూ ఆమె కదలికలు, శరీరాకృతిని సిబ్బంది గుర్తించలేకపోవడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బిడ్డతో కలిపి బాలికను కొమరాడ మండలంలోని స్వగ్రామానికి ఆటోలో పంపించినట్టు భోగట్టా. ఈ విషయాన్ని ఆశ్రమ పాఠశాల పీడీ ఎస్బీఎస్ రత్నం వద్ద ప్రస్తావించగా అలాంటిదేమీ లేదని చెప్పారు. వసతి గృహంలో హాజరు పట్టీని, విద్యార్థినులను విచారించి శనివారం చెప్పగలనన్నారు. -
మగబిడ్డకు జన్మనిచ్చిన మహేష్ హీరోయిన్
నటి అమృతా రావు- ఆర్జే ఆన్మోల్ దంపతుల ఇంట్లోకి బుజ్జి పిల్లవాడు అడుగుపెట్టాడు. ఆదివారం ఉదయం అమృతా రావు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో నటి ఇంట్లో ఆనందాలు వెల్లువిరిశాయి. అదే విధంగా సెలబ్రిటీలు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లవెత్తుతున్నాయి. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఆరోగ్యం క్షేమంగా ఉన్నట్లు అమృతా టీం ఒక ప్రకటనలో తెలిపింది. ఇక అమృతా, ఆర్జే ఆన్మోల్ దంపతులకు ఇది మొదటి సంతానం. కాగా గత నెలలో(అక్టోబర్) తాము తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక అమృతారావు, ఆర్జే అన్మోల్ ఏడేళ్ల పాటు ప్రేమించుకుని, 2016లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అత్యంత సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు. చదవండి: తల్లి కాబోతున్న హీరోయిన్! ఇక సినిమాల విషయానికొస్తే.. వివాహ్, ఇష్క్‌విష్క్, మై హూనా వంటి బాలీవుడ్ సినిమాలతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న అమృతా రావు, సూపర్ స్టార్ మహేష్‌బాబు అతిథి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను కూడా పలకరించిన సంగతి తెలిసిందే. ఇక మరాఠా నాయకుడు బాల్ ఠాక్రే జీవితం ఆధారంగా గతేడాది తెరకెక్కిన ఠాక్రే సినిమాలో ఆమె చివరిసారిగా నటించారు. విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ భార్య మీనా పాత్రలో జీవించి ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నారు. ప్రస్తుతం ఆమె బుల్లితెరపై ఓ ప్రముఖ ఛానెల్లో జమ్మీన్ అనే మ్యూజిక్ షోను హోస్ట్ చేస్తున్నారు. View this post on Instagram For YOU it’s the 10th Month... But for US, it's THE 9th !!! 🥳 🥰🕺💃 Surprise Surprise ..Anmol and I are in our NINE'th month Already !! Too excited to share this good news with You my Fans 🤗 And Friends ( sorry had to keep it tucked in my Belly All this long ) But It's True ... the Baby is Coming Soon 😃... An exciting journey for me, @rjanmol27 and our Families... ... Thank you universe 💫 And thank you ALL Keep blessing 😌🙏... #2020baby #2020mom #2020parents A post shared by AMRITA RAO🇮🇳 (@amrita_rao_insta) on Oct 18, 2020 at 9:28pm PDT View this post on Instagram NAVRATRI AND NINE'TH MONTH !! My Dear Instees, I feel blessed to witness my Nine'th month of pregnancy in the auspicious month of Navratri ! These 9 days are dedicated to Goddess Durga and her Nine Avatars. I am entering a New phase of embodying the Avatar of a Mother myself ! I bow to the Highest Female Energy in the Universe 🙏 as I surrender in good faith. May Goddess Durga bless ALL Mother's and Mommy's to be with strength and more power to gracefully carry on with the the many Devine Avatar's that comes along with the territory of motherhood !! 💫🤱🤰🌟 Wishing you ALL on Ashtami #HappyNavratri #navratri2020 A post shared by AMRITA RAO🇮🇳 (@amrita_rao_insta) on Oct 22, 2020 at 9:36pm PDT -
ఒకే కాన్పులో అయిదుగురు శిశువుల జననం
లక్నో : ఒకే కాన్పులో ఓ మహిళ అయిదుగురు శిశువులకు జన్మనిచ్చింది. ఈ ఆశ్చర్య సంఘటన గురువారం ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. సురత్‌గంజ్ ప్రాంతంలోని ఆసుపత్రిలో అనిత అనే మహిళకు ఒకేసారి ఇద్దరు మగపిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు జన్మించారు. ఈ విషయంపై మహిళ భర్త కుందన్ మాట్లాడుతూ..తల్లి, పిల్లలంతా క్షేమంగా ఉన్నారన్నారు. తమ కుటుంబంలో ఇలా జరుగుతుందని ఎప్పుడూ ఊహించలేదని, ఇలా జరగడం ఆశ్చర్యంగా ఉందన్నారు. మెరుగైన చికిత్స కొరకు ప్రస్తుతం వైద్యులు తన భార్యను బారబంకి జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. కాగా మహిళకు ఇది రెండవ సంతానం. మొదటగా ఆమెకు ఓ కొడుకు జన్మించాడు. (తండ్రి మరణంపై రిధిమా భావోద్వేగం..) -
ఫుట్‌పాత్‌పై ప్రసవం
సాక్షి, న్యూఢిల్లీ: భర్త, ఇద్దరు పిల్లలతో రోడ్లపై నివసించే మహిళ దక్షిణ ఢిల్లీలో రోడ్డు పక్కనున్న ఫుట్‌పాత్‌పై ఆడపిల్లను ప్రసవించింది. బారాపులా ప్రాంతంలోనున్న నైట్‌షెల్టర్లలో చోటు లభించకపోవడం వల్ల లక్ష్మి, రోజు కూలీ పనిచేసే ఆమె భర్త బబ్లూ, ఇద్దరు పిల్లలు బుధవారం రాత్రి పుట్‌పాత్‌పై నిద్రపోయారు. ఆ రాత్రి ఆమెకు నొప్పులు వచ్చి బిడ్డను అక్కడే ప్రసవించింది. బిడ్డను ప్రసవించిన 18 గంటల తరువాత కూడా తల్లికి, బిడ్డకు మధ్య ఉండే పేగును కత్తిరించలేదని, దాని వల్ల తల్లికి, బిడ్డకు తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుందని సెంటర్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ అనే ఎన్జీవోకు చెందిన సునీల్‌కుమార్ ఎలీడియా చెప్పారు. నైట్ రెçస్క్యూ టీమ్ అందించిన సమాచారంతో తాము అంబులెన్స్‌ను పిలిచి మహిళను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చేర్చించామని ఆయన చెప్పారు. గర్భిణులు, పాలిచ్చే తల్లుల కోసం ఢిల్లీ ప్రభుత్వం రెండు నైట్ షెల్టర్లు నడుపుతోందని అయితే అయితే వాటి వద్ద ఆపదలో, అవసరంలో ఉన్న వారిని ఆదుకునే, రక్షించే యంత్రాంగం లేదని సునీల్‌కుమార్ చెప్పారు. లక్ష్మి, ఆమె భర్త ఏడు సంవత్సరాలుగా ఢిల్లీ రోడ్లపై నివసిస్తున్నారు. పొట్ట చేత పట్టుకుని జార్ఖండ్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. లక్ష్మి, కొత్తగా పుట్టిన ఆమె కూతురు ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారని, వారికి సరైన ఆరోగ్య సంరక్షణ లభిస్తోందని సునీల్ కుమార్ చెప్పారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, ప్రస్తుతానికి తల్లీ బిడ్డలను షెల్టర్ హోమ్‌కు పంపి తరువాత పాలిచ్చే తల్లుల కోసం నడిపే కేంద్రానికి తరలిస్తామని ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్మెంట్ బోర్డు సభ్యుడు బిపిన్ రాయ్ చెప్పారు. -
ఒకే కాన్పులో మూడు పిల్లలక జన్మనిచ్చిన పులి
-
నడిరోడ్డుపైనే ప్రసవం
విజయవాడ: ఓ నిండు గర్భిణి ప్రసవం కోసం ఆస్పత్రికి వెళుతూ.. నడిరోడ్డుపైనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. విజయవాడ నగరంలోని చిట్టినగర్ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామన ఈ ఘటన జరిగింది. చిట్టినగర్ సొరంగ మార్గం సమీపంలో నివసించే షేక్ గౌసియా (21) అనే మహిళకు పురుటి నొప్పులు మొదలుకావడంతో తల్లితో కలసి సోమవారం తెల్లవారుజామున ఆస్పత్రికి బయల్దేరింది.. అయితే రోడ్డుపై నడచి వెళుతుండగానే నొప్పులు అధికం కావడంతో అక్కడికక్కడే కూలబడిపోయింది. ఇది గమనించిన స్థానిక మహిళలు సాయం అందించేందుకు సిద్ధమయ్యారు. ఇంట్లో ఉన్న చీరలు తెచ్చి గౌసియా చుట్టూ అడ్డంగా పెట్టాంరు. నొప్పుల బాధపడుతున్న ఆమెను ఓదార్చారు. ఓ అరగంట వేదన అనంతరం గౌసియా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉండటంతో అందరికళ్ల వెంబడి ఆనందభాష్పాలు రాలాయి. ఆ తరువాత 108 ఆంబులెన్స్‌కు సమాచారం అందించారు. ప్రస్తుతం గౌసియా, ఆమె కొడుకు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్నారు.