
కన్నడ హీరోయిన్ మిలానా నాగరాజ్‌కి పండంటి పాపాయి పుట్టింది.

ఆ బుజ్జాయికి పరి అని పేరు కూడా పెట్టారు. పూర్తి పేరు బయటపెట్టలేదు.

కూతురిని తొలిసారి ఇంటికి తీసుకొచ్చిప్పుడు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.

కూతురు వీడియో, ఫొటోలని మిలానా తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.

2013 నుంచి హీరోయిన్‌గా మిలానా నాగరాజ్ కన్నడలో సినిమాలు చేస్తోంది

2021లో కన్నడ హీరో డార్లింగ్ కృష్ణని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

వీళ్లిద్దరూ కలిసి పలు సినిమాల్లో హీరోహీరోయిన్లుగా నటించారు.

ఆ తర్వాత రియల్ లైఫ్‌లోనూ హీరోహీరోయినే అనిపించుకున్నారు.

ఈ ఏడాది మార్చిలో తాను ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని మిలానా బయటపెట్టింది.

ఇప్పుడు కూతురికి జన్మనిచ్చింది. దీంతో అందరూ ఫుల్ హ్యాపీ.

మరోవైపు పలువురు నటీనటులు మిలానా కూతురిని చూసి తెగ మురిసిపోతున్నారు.


















