ఒకే కాన్పులో అయిదుగురు శిశువుల జననం | woman Give Birth To Quintuplets At One Birth In Uttar Pradesh | Sakshi
Sakshi News home page

ఒకే కాన్పులో అయిదుగురు శిశువుల జననం

Published Thu, Apr 30 2020 4:52 PM | Last Updated on Thu, Apr 30 2020 5:26 PM

woman Give Birth To Quintuplets At One Birth In Uttar Pradesh - Sakshi

లక్నో : ఒకే కాన్పులో ఓ మహిళ అయిదుగురు శిశువులకు జన్మనిచ్చింది. ఈ ఆశ్చర్య సంఘటన గురువారం ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. సురత్‌గంజ్‌ ప్రాంతంలోని ఆసుపత్రిలో అనిత అనే మహిళకు ఒకేసారి ఇద్దరు మగపిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు జన్మించారు. ఈ విషయంపై మహిళ భర్త కుందన్‌ మాట్లాడుతూ..తల్లి, పిల్లలంతా క్షేమంగా ఉన్నారన్నారు. తమ కుటుంబంలో ఇలా జరుగుతుందని ఎప్పుడూ ఊహించలేదని, ఇలా జరగడం ఆశ్చర్యంగా ఉందన్నారు. మెరుగైన చికిత్స కొరకు ప్రస్తుతం వైద్యులు తన భార్యను బారబంకి జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. కాగా మహిళకు ఇది రెండవ సంతానం. మొదటగా ఆమెకు ఓ కొడుకు జన్మించాడు. (తండ్రి మరణంపై రిధిమా భావోద్వేగం..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement