quintuplets
-
ఒకే కాన్పులో అయిదుగురు శిశువుల జననం
లక్నో : ఒకే కాన్పులో ఓ మహిళ అయిదుగురు శిశువులకు జన్మనిచ్చింది. ఈ ఆశ్చర్య సంఘటన గురువారం ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. సురత్‌గంజ్ ప్రాంతంలోని ఆసుపత్రిలో అనిత అనే మహిళకు ఒకేసారి ఇద్దరు మగపిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు జన్మించారు. ఈ విషయంపై మహిళ భర్త కుందన్ మాట్లాడుతూ..తల్లి, పిల్లలంతా క్షేమంగా ఉన్నారన్నారు. తమ కుటుంబంలో ఇలా జరుగుతుందని ఎప్పుడూ ఊహించలేదని, ఇలా జరగడం ఆశ్చర్యంగా ఉందన్నారు. మెరుగైన చికిత్స కొరకు ప్రస్తుతం వైద్యులు తన భార్యను బారబంకి జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. కాగా మహిళకు ఇది రెండవ సంతానం. మొదటగా ఆమెకు ఓ కొడుకు జన్మించాడు. (తండ్రి మరణంపై రిధిమా భావోద్వేగం..) -
ఒకే కాన్పులో ఐదుగురు ఆడ పిల్లలు
చత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో మనితా సింగ్ అనే 25 ఏళ్ల గర్భవతి ఒకే కాన్పులో ఐదుగురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. సిజేరియన్ అవసరం లేకుండా సహజసిద్ధంగా ఐదుగురుకి ఒకే కాన్పులో జన్మనివ్వడం తన కెరీర్లో ఇదే మొదటిసారని డాక్టర్ టెకమ్ తెలిపారు. కేవలం 26 వారాలకే తల్లి మనితా సింగ్‌కు శనివారం నొప్పులు రావడంతో అంబికాపూర్ అస్పత్రికి తీసుకొచ్చారు. ఉదయం 11 గంటలకు ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చిందని, ఆ తర్వాత అరగంటకు నలుగురు ఆడబిడ్డలను ప్రసవించిందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. తాము ఎప్పుడు స్కానింగ్ చేయించలేదని, కడుపులో ఒకే బిడ్డ పురుడుపోసుకుందని భావించామని తండ్రి మనిష్ తెలిపారు. రెండేళ్ల క్రితం ఓ బాబు పుట్టి పోయాడని, ఆ బాధ నుంచి పూర్తిగా కోలుకోలేదని, ఆ నష్టాన్ని పూడ్చేందుకే దేవుడు ఏకంగా ఐదుగురు సంతానాన్ని ఒకేసారి ఇచ్చి ఉంటాడని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఐదుగురు పిల్లలను అల్లారుముద్దుగా చూసుకుంటానని, వారికి మంచి భవిష్యత్తు ఇచ్చేందుకు కృషి చేస్తానని ఆయన చెప్పారు. ఐదుగురు బిడ్డలు ప్రిమెచ్యూర్‌గా పుట్టారని, వారంతా కిలోన్నర చొప్పున బరువున్నారని డాక్టర్లు తెలిపారు. వారంతా ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ వారిలో ఎంతమంది బతుకుతారో చెప్పలేమని, అయితే ప్రతి బిడ్డను బ్రతికించేందుకు తాము శాయశక్తులా ప్రయత్నిస్తామని వారు తెలిపారు. -
ఒకే కాన్పులో ఐదుగురు ఆడపిల్లలు!
దేశంలోనే తొలిసారిగా.. పంజాబ్‌లో ఓ మహిళ ఒకే కాన్పులో ఐదుగురు అమ్మాయిలకు జన్మనిచ్చింది. భటిండా సమీపంలోని భుచో అనే పట్టణంలో కుల్దీప్ కౌర్ (32) అనే మహిళ ఈ ఐదుగురు ఆడ పిల్లలను కంది. ఆమె భర్త ఓ రైతు. ఈ కేసు బాగా సంక్లిష్టమైనది కావడంతో ఎవరూ కాన్పు చేసేందుకు సిద్ధం కాలేదని, ఆమె పరిస్థితి ప్రమాదకరంగా ఉందని కాన్పు చేసిన గైనకాలజిస్టు డాక్టర్ హర్కిరణ్ కౌర్ చెప్పారు. కడుపులో ఐదుగురు బిడ్డలతో.. కేవలం 5 గ్రాముల హెమోగ్లోబిన్‌తో ఆమె వచ్చింది. తొలుత స్కానింగులో నలుగురు పిల్లలే ఉన్నట్లు కనిపించినా, తీరా బయటకు వచ్చేసరికి ఐదుగురు అయ్యారు. కుల్దీప్తో పాటు ముగ్గురు కూతుళ్లు కూడా క్షేమంగానే ఉన్నా.. మరో ఇద్దరి పరిస్థితి మాత్రం అంత బాగోలేదు. ఏడోనెలలోనే డెలివరీ కావడంతో వాళ్లు కేవలం 850 గ్రాములు మాత్రమే బరువున్నారని, అందువల్ల వాళ్లను 24 గంటలూ పర్యవేక్షిస్తూ జాగ్రత్తగా చూసుకుంటున్నామని డాక్టర్ కౌర్ చెప్పారు. కాగా, సుఖ్‌పాల్ సింగ్, కుల్దీప్లకు ఇప్పటికే ఇద్దరు కూతుళ్లున్నారు. ఇప్పుడు పుట్టినవాళ్లతో కలిపి మొత్తం ఏడుగురు కూతుళ్లవుతారు. పేదరికంలో ఉన్నా కూడా.. ఇప్పుడు ఈ ఐదుగురు కూతుళ్లకు కూడా జన్మనివ్వాలనే వాళ్లు నిర్ణయించుకున్నారు. కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలిస్తేనే అబార్షన్ చేయించే ఈ రోజుల్లో.. ఇలా ఏడుగురిని పెంచేందుకు కూడా సిద్ధం కావడం ప్రశసంనీయమని వైద్యులు అంటున్నారు. -
ఒకే కాన్పులో ఐదుగురు పిల్లలు!!
ఎవరికైనా సరే.. నకుల సహదేవుల్లా కవలలు పుట్టడం తెలుసు. మహా అయితే ముచ్చటగా ముగ్గురో, ఇంకా అయితే నలుగురు పుట్టడం వరకు విన్నాం. కానీ ఏకంగా ఒకే కాన్పులో పంచపాండవులను కనేసిందా తల్లి!! బీహార్‌లోని నవాడా జిల్లాలో గల ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఈ చిత్రం చోటుచేసుకుంది. అయితే... పుట్టిన ఐదుగురు బిడ్డల్లో ముగ్గురు మాత్రం పుట్టిన కొద్ది సేపటికే ప్రాణాలు కోల్పోయారు. ఒక అబ్బాయి, మరో అమ్మాయి మాత్రం బరువు తక్కువ ఉన్నా ప్రాణాలు నిలబెట్టుకోగలిగారు. అంబికా గ్రామానికి చెందిన ఈ మహిళ ఆరోగ్యం భేషుగ్గా ఉన్నట్లు ఆమెను పరీక్షిస్తున్న వైద్యులు తెలిపారు. ఐదుగురు పిల్లలు పుట్టడంతో చూసేందుకు చాలామంది గ్రామస్థులు ఆస్పత్రి వద్దకు క్యూకట్టినా.. వైద్యులు మాత్రం వారిని అనుమతించలేదు.