ఎవరికైనా సరే.. నకుల సహదేవుల్లా కవలలు పుట్టడం తెలుసు. మహా అయితే ముచ్చటగా ముగ్గురో, ఇంకా అయితే నలుగురు పుట్టడం వరకు విన్నాం. కానీ ఏకంగా ఒకే కాన్పులో పంచపాండవులను కనేసిందా తల్లి!! బీహార్లోని నవాడా జిల్లాలో గల ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఈ చిత్రం చోటుచేసుకుంది.
అయితే... పుట్టిన ఐదుగురు బిడ్డల్లో ముగ్గురు మాత్రం పుట్టిన కొద్ది సేపటికే ప్రాణాలు కోల్పోయారు. ఒక అబ్బాయి, మరో అమ్మాయి మాత్రం బరువు తక్కువ ఉన్నా ప్రాణాలు నిలబెట్టుకోగలిగారు. అంబికా గ్రామానికి చెందిన ఈ మహిళ ఆరోగ్యం భేషుగ్గా ఉన్నట్లు ఆమెను పరీక్షిస్తున్న వైద్యులు తెలిపారు. ఐదుగురు పిల్లలు పుట్టడంతో చూసేందుకు చాలామంది గ్రామస్థులు ఆస్పత్రి వద్దకు క్యూకట్టినా.. వైద్యులు మాత్రం వారిని అనుమతించలేదు.
ఒకే కాన్పులో ఐదుగురు పిల్లలు!!
Published Sat, Sep 21 2013 7:05 PM | Last Updated on Thu, Apr 4 2019 4:44 PM
Advertisement
Advertisement