ఈ రాశి వారి నూతన ఉద్యోగయోగం.. కీలక నిర్ణయాలు | Today Telugu Horoscope On December 28th, 2024: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారి నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు.

Published Sat, Dec 28 2024 5:33 AM | Last Updated on Sat, Dec 28 2024 9:49 AM

Daily Horoscope On 28th December 2024 In Telugu

    గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం, తిథి: బ.త్రయోదశి రా.2.53 వరకు తదుపరి చతుర్దశి, నక్షత్రం: అనూరాధ రా.10.05 వరకు తదుపరి జ్యేష్ఠ, వర్జ్యం: తె.4.03 నుండి 5.43 వరకు (తెల్లవారితే ఆదివారం), దుర్ముహూర్తం: ఉ.6.31 నుండి 8.01 వరకు, అమృతఘడియలు: ఉ.10.40 నుండి 12.24 వరకు, శనిత్రయోదశి

సూర్యోదయం :    6.33
సూర్యాస్తమయం    :  5.30
రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుండి 3.00 వరకు

మేషం: కుటుంబంలో చికాకులు. అనుకోని ధనవ్యయం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృషభం: నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు అనుకూలిస్తాయి. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపార లావాదేవీలు పురోగతిలో సాగుతాయి. వస్తులాభాలు.

మిథునం: కాంట్రాక్టులు లభిస్తాయి. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం.  చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి.

కర్కాటకం: పనుల్లో స్వల్ప ఆటంకాలు. దూరప్రయాణాలు. బంధువుల ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. ధనవ్యయం. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

సింహం: వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆస్తి  వ్యవహారాలలో చికాకులు.

కన్య: ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. సోదరులు, మిత్రులతో వివాదాల పరిష్కారం. శుభవార్తలు వింటారు. ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లు. లక్ష్యాల సాధనలో ముందడుగు.

తుల: వ్యయప్రయాసలు. పనుల్లో నిదానంగా సాగుతాయి. శ్రమాధిక్యం. ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్య సమాచారం అందుతుంది. వృత్తి, వ్యాపారాలు కొంత మందగిస్తాయి.

వృశ్చికం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. బాకీలు అందుతాయి. కుటుంబసమస్యల పరిష్కారం. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సొగుతాయి.

ధనుస్సు: బంధువుల నుంచి ఒత్తిడులు. దూరప్రయాణాలు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. శ్రమాధిక్యం. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగించవచ్చు.

మకరం: నూతనోత్సాహం. ఆర్థిక ప్రగతి. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహార విజయం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.

కుంభం: మిత్రుల నుంచి శుభవార్తలు. రావలసిన సొమ్ము అందుతుంది. పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మీనం: సన్నిహితులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. వ్యాపార లావాదేవీలు నత్తనడనకన సాగుతాయి. ఉద్యోగయత్నాలలో స్వల్ప ఆటంకాలు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement