పాట్నాలో హైటెన్షన్‌.. అసలేం జరిగిందంటే.. | Tension In Patna Continues Amid School Incident Latest News | Sakshi
Sakshi News home page

పాట్నాలో హైటెన్షన్‌.. అసలేం జరిగిందంటే..

Published Fri, May 17 2024 1:22 PM | Last Updated on Fri, May 17 2024 1:33 PM

Tension In Patna Continues Amid School Incident Latest News

బీహార్‌ రాజధాని పాట్నా నిరసనలతో అట్టుడికిపోతోంది. కోపంతో ఊగిపోతున్న కొందరు నడివీధుల వెంట చేరి చేతికి దొరికిన వస్తువుల్ని కాలుస్తున్నారు. ఆ ఆగ్రహావేశాలకు కారణం.. ఓ ప్రైవేట్‌ పాఠశాలలో చిన్నారి అనుమానాస్పద రీతిలో చనిపోవడం.  

పాట్నాలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఓ విద్యార్థి అనుమానాస్పదరీతిలో చనిపోవడం, ఆ విషయాన్ని దాచేందుకు స్కూల్‌ సిబ్బంది యత్నించడం ఉద్రిక్తతలకు దారి తీసింది. బాధిత కుటుంబానికి అండగా తోడైన ఓ కులం.. పాట్నాలో నిరసనలకు దిగింది. రోడ్లపై మంటలు పెట్టి.. సత్వర న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తోంది.  

టినీ టాట్‌ అకాడమీ స్కూల్‌లో చదివే చిన్నారి.. గురువారం స్కూల్‌ ట్యూషన్‌ అయ్యాక కూడా ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనతో స్కూల్‌కు వచ్చారు. అయితే పాఠశాల సిబ్బంది  పొంతన లేని సమాధానం ఇవ్వడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. బలవంతంగా స్కూల్‌లోకి అర్ధరాత్రి దాకా వెతికారు.

చివరకు.. ఈ వేకువ ఝామున 3గం. ప్రాంతంలో స్కూల్‌ ఆవరణలోని డ్రైనేజీలో ఆ చిన్నారి మృతదేహం కనిపించింది. దీంతో ఆగ్రహావేశాలకు లోనైన కుటుంబ సభ్యులు స్కూల్‌కు నిప్పటించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్కూల్‌కు చేరుకుని  ఉద్రిక్తతలను అదుపులోకి తెచ్చే యత్నం చేశారు. ఎస్పీ చంద్రప్రకాష్‌ స్వయంగా ఈ కేసు దర్యాప్తు చేపట్టారు.

 

స్కూల్‌లోకి వెళ్లిన చిన్నారి.. తిరిగి బయటకు వెళ్లిన సీసీటీవీ ఫుటేజీల్లో నమోదు అయ్యింది. దీంతో ఆ అవరణాలోనే చిన్నారి మృతి చెందినట్లు నిర్ధారించుకున్నాం. అయితే చిన్నారి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని ఎస్పీ అంటున్నారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని, సిబ్బంది మృతదేహాన్ని దాచే యత్నం ఎందుకు చేసిందో తేలాల్సి ఉందన్నారు. మరోవైపు ఉద్రిక్తతలు విస్తరించకుండా పోలీస్‌ బలగాలను మోహరించినట్లు తెలిపారాయన. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement