Lion cub playing with his mother: బిడ్డకు తల్లి స్పర్శ, ఆమె ఒడిలో దొరికే లాలింపు మరెక్కడా దొరకదు. ప్రతీ బిడ్డకు మొదటి ఫ్రెండ్ కూడా అమ్మే.. ఆటపాటలు, ముద్దులు, మురిపాలు.. ఇలా ప్రతీ విషయంలోనూ అమ్మ తర్వాతే ఎవరైనా. మనుషులైనా, జంతువులైనా ఇందుకు అతీతం కాదు. అలాంటి అనిర్వచనీయమైన మాతృ ప్రేమ, తల్లీబిడ్డల బంధానికి అద్దం పట్టే సింహాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇసుకలో తల్లి చెంత సేద తీరుతున్న బుజ్జి సింహం.. గారాం చేస్తూ.. మెల్లిగా నడుచుకుంటూ వెళ్లి కాస్త దూరంగా పడుకుంటుంది. ఇంతలో అక్కడికి చేరిన సివంగి.. దానిని ముద్దాడుతూ, నవ్విస్తూ అక్కున చేర్చుకుంటుంది. ఆగష్టు 10న వరల్డ్ లయన్ డే సందర్భంగా భారత అటవీ శాఖ అధికారి సురేందర్ మెహ్రా ట్విటర్‌లో షేర్ చేశారు. అరుదైన జాతి అంతరించిపోకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తుచేశారు. ఇక ఆయనతో ఏకీభించిన నెటిజన్లు.. ‘‘రేయ్.. సింబా.. ఎంత ముద్దుగా ఉన్నావ్‌రా. నీ అరుపులు, నవ్వు.. అల్లరి చేష్టలు చూస్తుంటే ముచ్చటేస్తుంది. సో క్యూట్’’ అంటూ ఫిదా అవుతున్నారు.
చదవండి: Kinnaur Landslide: 13 శవాలు వెలికితీత.. ఇంకా శిథిలాల కింద?
It’s not just the number of a particular wild species that is important..!
— Surender Mehra IFS (@surenmehra) August 10, 2021
More important is how we keep this population healthy and secure their natural habitat at landscape level..#WorldLionDay 🦁@GujForestDept @moefcc @CentralIfs pic.twitter.com/YJYxRh3c2C
Comments
Please login to add a commentAdd a comment