
పెంపుడు కుక్కలు విశ్వాసానికి మారుపేరుగా చెబుతుంటారు. ఒక్కసారి వాటిని మచ్చిగ చేసుకుంటే ఆపదల నుంచి తమ యజమానులను రక్షించేందుకు తమ ప్రాణాలను సైతం పణంగా పెడతాయి. ఇందుకు నిదర్శనంగా నిలిచే ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. గుజరాత్‌లో రెండు వైపులా సింహాలు, కుక్కల పోటాపోటీగా తలపడ్డాయి. చివరకు ఏం జరిగిందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..
ఆమ్రేలి సావర్‌కుండ్లాలోని ఓ గోశాలలో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రాంతానికి సమీపంలోనే గిర్ నేషనల్ పార్క్ ఉంది. దీంతో ఆ అడవి నుంచి క్రూర జంతువులు ఈ ప్రాంతంలోకి తరచూ చొరబడుతుంటాయి. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి రెండు పెద్ద సింహాలు గోశాల వైపు వచ్చాయి. గేటు వద్దకు వచ్చిన సింహాలను లోపల ఉన్న కుక్కలు గమనించి మెరిగాయి. గేటు అవతల ఉన్నది సింహాలైనా సరే.. ఏమాత్రం తగ్గకుండా వాటిని లోపలకి రాకుండా అడ్డుకున్నాయి.
అటు సింహాలు కూడా కుక్కలను చూసి గాండ్రించాయి. అయినా కుక్కలు ఏమాత్రం వెనక్కకు తగ్గకుండా సింహాల పైకి దూకుతుంటాయి. ఈ క్రమంలో సింహాల పంజా దెబ్బకు గేటు తెరుచుకుంటుంది. అయితే అప్పటికే భయపడిపోయిన సింహాలు.. అక్కడి నుంచి వాటి దారిన అవి వెళ్లిపోతాయి. కుక్కల అరుపులు విన్న ఓ వ్యక్తి అక్కడికి వచ్చి గేట్‌కు మళ్లీ గడి పెట్టి వెళ్లిపోయాడు.ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.
2 dogs fight with lions in Gujrat #viralvideo pic.twitter.com/SPPZq7MnJI
— Daily Facts🩵 (@JohnJafar36) August 14, 2024