
సాక్షి, నంద్యాల: మదర్ టైగర్ సెర్చ్ ఆపరేషన్ విఫలమైంది. బుధవారం రాత్రి తల్లిపులితో కలపడానికి పులి కూనలను అధికారులు ఫారెస్ట్‌కు తరలించారు. ఈ క్రమంలో తల్లి పులి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది.
అయితే, తల్లి పులి కోసం అటవీ శాఖ అధికారులు రాత్రంతా శ్రమించినా ఫలితం దక్కలేదు. రాత్రంతా వేచి చూసినా తల్లి పులి రాకపోవడంతో పులి కూనలను ఆత్మకూరు క్యాంప్‌కు తరలించారు. కాగా, రాత్రంతా పులి సంచరించిన ప్రాంతాల్లో కూనలను ఉంచి, కృత్రిమ శబ్దాలు చేస్తూ తల్లి పులి జాడ కోసం వెతికారు. మిగతా ప్రాంతాల్లో ట్రాప్ కెమెరా, ప్లగ్ మార్క్ ఆధారాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు