సాక్షి, నంద్యాల జిల్లా: డోన్ మండలం చనుగొండ్ల గ్రామంలోని కొండల్లో చిరుత పిల్లలు సంచరిస్తున్నాయి. చిరుత పిల్ల రైతుల కంట పడింది. చనుగొండ్ల గ్రామానికి ఆనుకొని కొండ ప్రాంతం ఉండటంతో చిరుత పిల్లను చూసి గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. తల్లి చిరుత ఎప్పుడు గ్రామంలోకి వస్తుందోనని భయభ్రాంతులు చెందుతున్నారు.
గతంలో చిరుత వెంకటాపురం గ్రామ సమీప కొండ గుహల్లో నివాసాలు ఏర్పరచుకొని రాళ్ల మధ్యలో ఉంటూ అటుగా వెళ్లే పశువులపై దాడి చేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. కొండ ప్రాంతానికి అనుకొని ఇల్లు ఉండటం వలన గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment