Lion Cub
-
చిన్నదైనా సింహం సింహమే.. ఒక్క గాండ్రింపుతో హడలెత్తించింది..!
పులి, సింహం వంటి క్రూర జంతువులను జూలో దూరం నుండి చూస్తేనే అందంగా ఉంటుంది. వాటిని పట్టుకుని ఫోటో దిగాలంటే అది ఎంత ప్రమాదమో ప్రతి ఒక్కరికి తెలుసు. అవి చిన్న కూనలైనా, పెద్దవైనా ప్రమాదకరమే. కానీ, కొందరు వాటిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాంటి ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. రెండు చిన్న సింహాలను పెంచుకుంటున్నాడు. అయితే, వాటిని దగ్గరి నుంచి తాకేందుకు ప్రయత్నించగా అందులో ఒకటి ముట్టుకోనివ్వలేదు. ఒక్కసారిగా గాండ్రించటంతో ఉలిక్కపడ్డాడు ఆ వ్యక్తి. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి కారుపై కూర్చున్న రెండు సింహం కూనలను తాకుతూ మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించాడు. క్షణాల్లోనే అందులో ఓ కూన కోపంతో ఊగిపోయింది. అతడిపై ఆ సింహం కూన దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఒక్క గాండ్రింపుతో ఉలిక్కిపడి ఒక అడుగు వెనక్కి వేశాడు. ఆ తర్వాత కారుపైకి వెళ్తున్న సింహాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. నెల రోజుల క్రితం ఈ వీడియో షేర్ చేయగా ఇప్పటి వరకు 2,74,000 లైకులు, మూడు మిలియన్లకుపైగా వ్యూస్ వచ్చాయి. View this post on Instagram A post shared by Md Gulzar (@basit_ayan_3748) ఇదీ చదవండి: ఆస్కార్ లెవల్ యాక్టింగ్.. బోనులోని పులిని అడవిలోకి తెచ్చేసరికి! -
అడవిలో బతకకున్నా అడవికి రారాజే.. ఎందుకో తెలుసా?
World Lion Day 2021: ఎంత మాంసాన్ని ఇష్టంగా లాగించే వాళ్లైనా.. సింగిల్ మీల్లో అదీ 40 కేజీల మాంసం తినగలరా? అనే అనుమానం రావొచ్చు. మనుషులకైతే అది అసాధ్యం కాకపోవచ్చు. కానీ, మృగాలకు రారాజుగా పేరున్న సింహానికి అది ఎంతో అలవోకైన పని.. సాక్షి, వెబ్‌డెస్క్: ఎంత ఆకలేసినా.. సింహం గడ్డి తినదనేది సామెత. కానీ, సింహాలు మొక్కల నుంచి తమ దాహం తీర్చుకుంటాయని తెలుసా?. అందుకే కలహారి లాంటి ఎడారుల్లో సైతం సింహాలు మనుగడ కొనసాగించగలవు. టీసమ్మ మెలన్ లాంటి మొక్కల నుంచి నీటిని సేకరించుకోగలవు సింహాలు. World Lion Day సందర్భంగా మృగరాజుల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు.. ►సింహం అనేది బలానికి, క్రూరత్వానికి ప్రతీక. ఆఫ్రికా ఖండపు ఔనత్యానికి అదోక గుర్తు. అలాంటి జీవులు అంతరించిపోయే స్థితికి చేరాయని తెలుసా? ఒకప్పుడు ఆఫ్రికా, ఆసియా, యూరప్ వ్యాప్తంగా సింహాలు ఉండేవి. ఇప్పుడు కేవలం ఆఫ్రికాలోనే సింహాలు ఉన్నాయి. అయితే.. గుజరాత్ ససన్-గిర్ నేషనల్ పార్క్‌లో ఏషియటిక్ సింహాల రక్షణ కోసం కృషి నడుస్తోంది. ఈ పార్క్‌లో సుమారు 350-400 మధ్య సింహాలు ఉన్నాయి. సరిహద్దులోని గ్రామీణ ప్రాంతాల్లో వీటి సంచారం షరా మాములుగా మారిపోయింది. కూనలతో గిర్ సింహం ►సింహం సింగిల్‌గా వస్తుందనేది ఫేమస్ డైలాగ్. కానీ, సింహాలు సంఘ జీవులు. ఇవి బతికేది.. వేటాడేదీ(ఒకటి తరిమితే మిగతావి మిగతా వైపుల నుంచి చుట్టుముట్టడం-అంబూష్ ఎటాక్) గుంపులుగానే. ఒక్కో గుంపులో పదిహేను దాకా సింహాలు ఉంటాయి. గరిష్టంగా 40 దాకా ఉండొచ్చు. మగ సింహాం ఆ గుంపునకు నాయకత్వం వహిస్తుంది. ఆధిప్యత పోరు తర్వాత నాయకత్వ బాధ్యతను స్వీకరించి సరిహద్దుల్ని కాపాడుతుంది. ఆడ సింహాలు వేటాడతాయి. వేటాడిన మాంసాన్ని ముందుగా ముట్టేవి మగ సింహాలే!. ఆఫ్రికన్ సింహాలు ►సింహాలు సిసలైన ఫ్యామిలీమెన్లు. గుంపులోని ఒకదానితో ఒకటి తలలు రుద్దుకోవడం, కూనలతో ఆడడం, సింహాలన్నీ ఐక్యంగా ఉండడం లాంటి ఆప్యాయతలు మాత్రం తారాస్థాయిలో ఉంటాయి. ఆడ సింహాలు కూనల్ని కలిసే పెంచుతాయి. సింహం కూనలు ఏ తల్లి(ఆడ సింహం) నుంచైనా పాలు తాగుతాయి. ‘ఫ్యామిలీ సెంట్’తో తమ హద్దులోని సింహాలు కలిసి కట్టుగా బతుకుతుంటాయి కూడా. ►గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుందనేది కేవలం డైలాగ్ మాత్రమే. కానీ, ఒరిజినల్‌గా సింహం నుంచి వచ్చే గర్జన.. సుమారు ఐదు మైళ్ల దూరం దాకా వినబడుతుంది. బిగ్ క్యాట్ జాతుల్లో గుంపుగా గర్జించేవి సింహాలు మాత్రమే. ఇక రకరకాల సమయాల్లో వాటి కమ్యూనికేషన్ రకరకాల శబ్దాలతో ఉంటుంది. ►అడవికి రాజనే బిరుదు ఉన్నప్పటికీ.. సింహం బతికేది పచ్చిక బయళ్లు, మైదానాల్లోనే. అడవుల్లో బతకడానికి సింహం అస్సలు ఇష్టపడదు. సింహాల గురించి చెప్పే క్రమంలో.. ఏదో అతిశయోక్తితో ఆఫ్రికన్లు ఈ పదం పుట్టించారు. సో.. కింగ్ ఆఫ్ జంగిల్ అనేది సహేతుకం కాదేమో!. ఇక సింహం గంటకు యాభై మైళ్ల వేగంతో పరిగెత్తగలదు. నడిచేటప్పుడు దాని కాలి మడమ నేలను తాకదు. ►చీకట్లో సైతం వేటాడగలిగే సత్తా సింహాల సొంతం. తుపానుల సమయంలో ఉరుముల శబ్దాలకు జంతువులు హడలిపోతుంటే.. ఆ భయాన్ని ఆసరాగా తీసుకుని వేటాడడం సింహాలకు మాత్రమే ఉన్న నైజం. ►ఈ భూమ్మీద సైబీరియన్ పెద్దపులి తర్వాత సైజులో పెద్దది సింహమే. మగ సింహం బరువు సగటున 190 కేజీలు, ఆడ సింహం బరువు 126 కేజీల దాకా ఉంటుంది. నాలుగు రోజులకొకసారి నీటిని తాగగలిగే ఓపిక ఉన్న సింహాలు.. దొరికితే రోజూ నీరు తాగుతాయి. కానీ, తిండి లేకుండా మాత్రం ఉండలేవు. తమ శరీరంలో పాతిక శాతం అంటే.. సుమారు 40 కేజీల మాంసాన్ని ఒక్కసారిగా తినేయగలవు ఇవి. ►సింహం పళ్లు మాత్రమే కాదు.. నాలుక మీద ఉండే ‘పాపిలే’ అనే పదునైన మచ్చలు ఎముకల నుంచి మాంసాన్ని లాగేయడానికి సాయపడ్తాయి. అలాగే రోజూ ఆకలి తీర్చుకునేందుకు సగటున ఒక మగ సింహానికి 8 కేజీలు, ఆడ సింహానికి ఐదున్నర కేజీల మాంసం అవసరం పడుతుంది. ఏనుగులు, జీబ్రాలు, అడవి దున్నలు మాత్రమే కాదు.. ఎలుకలు, పక్షులు, కుందేళ్లు, తాబేళ్లలాంటి చిన్న జీవులను సైతం వీటి వేటకు బలవుతుంటాయి. ►ఈ భూమ్మీద మిగిలిన సింహాల సంఖ్య 23,000 మాత్రమే(లెక్కల ప్రకారం). ఏనుగులతో పోలిస్తే(4,15,000లకు పైనే) మృగరాజుల సంఖ్య చాలా తక్కువ. చరిత్రలో సింహాల గురించి ఎంతో ప్రశస్తి ఉండేది. మూడు తరాలుగా వీటి సంఖ్య 40 శాతం తగ్గిపోయింది. వాతావరణ మార్పులు, వేట, పశు సంపదను రక్షించుకునే క్రమంలో సింహాలను ఎక్కువగా చంపేస్తున్నారు. ►ఇవాళ వరల్డ్ లేజీ డే. ఈ సందర్భంగా సింహం రోజులో 20 గంటల దాకా పడుకునేందనే విషయం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి కదా. -
సింహం పిల్లను తెచ్చుకుని మరీ వెడ్డింగ్ ఫొటోషూట్
ఇస్లామాబాద్: ఇటీవల కాలంలో వెడ్డింగ్, ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ భిన్నంగా జరుపుకోవాలని చూస్తున్నారు. ఇందుకోసం ప్రముఖ వెడ్డింగ్ స్టూడియోలకు కాంట్రాక్ట్ ఇచ్చి ఫొటోషూట్ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నారు. ఇలా రకరకాల ప్రయోగాలు చేసి కొంతమంది అందరి చేత జౌరా అనిపించుకుంటుంటే మరి కొందరూ విమర్శల పాలవుతున్నారు. తాజాగా పాకిస్తాన్‌కు చెందిన ఓ జంట కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్‌కు గురైంది. సింహం పిల్లను అద్దెకు తెచ్చుకుని ఫొటోషూట్ జరుపుకుంది. చివరకు అది బెడిసి కొట్టడంతో నెటిజన్లు, జంతు ప్రేమికుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది ఈ కొత్త జంట. వివరాలు.. పాకిస్తాన్‌కు చెందిన ఓ జంట ఇటీవల వివాహం జరుపుకుంది. తమ వెడ్డింగ్ ఫొటోలను ప్రత్యేకంగా ఉండేందుకు పాకిస్తాన్‌లోనే పేరొందిన ప్రముఖ వెడ్డింగ్ ఫొటోస్టూడియోను సంప్రదించింది. దీంతో ఆ స్టూడియో ఆధినంలో ఉన్న సింహం పిల్లకు మత్తు ఇచ్చి నూతన వధువరుల మధ్య ఉంచి ఫొటోషూట్ నిర్వహించారు. అనంతరం ఈ ఫొటోలు, వీడియోలను తమ ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా షేర్ చేశారు. అది చూసి పాకిస్తాన్‌కు చెందిన సెవ్ ది వైల్డ్ అనే ఎన్జీవో సంస్థ కొత్త జంట, స్టూడియో నిర్వహకులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫొటోషూట్ కోసం సింహం పిల్లకు మత్తు ఇచ్చి దానిని హింసించడం సరైనది కాదని వెంటనే వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పంజాబ్ వన్యప్రాణుల సంరక్షణ శాఖకు ఫిర్యాదు చేసింది. ఇలాంటి వేడుకులకు సింహం పిల్లను ఎలా అద్దెకు ఇస్తారని ప్రశ్నిస్తూ స్టూడియో ఆధ్వర్యంలో ఉన్న దానిని రక్షించాల్సిందిగా కోరింది. అంతేగాక నెటిజన్ల నుంచి కూడా విపరీతమైన ట్రోల్స్ రావడంతో సదరు ఫొటో స్టూడియో ఈ ఫొటోలను తమ ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి తొలిగించింది. @PunjabWildlife does your permit allow for a lion cub to be rented out for ceremonies?Look at this poor cub sedated and being used as a prop.This studio is in Lahore where this cub is being kept.Rescue him please pic.twitter.com/fMcqZnoRMd — save the wild (@wildpakistan) March 7, 2021 చదవండి: కోవిడ్ టీకా: పడిపడి నవ్విన పోలీసు అధికారి నిద్రపోతున్న మహిళను చనిపోయిందనుకుని.. -
‘ఇలాంటి సాహసం చేయాలంటే ఎంతో గుండె ధైర్యం కావాలి’
అహ్మదాబాద్: గుజరాత్లో గీర్ అడవిలో వలలో చిక్కిన ఓ సింహం పిల్లను ఆటవీ సిబ్బంది రక్షించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీనియర్ ఆటవీ శాఖ అధికారి రమేష్ పాండే శుక్రవారం షేర్ చేసిన ఈ వీడియో చూసి నెటిజన్లంత సదరు సిబ్బందిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రాణాలకు ప్రమాదమని తెలిసిన ఈ సింహాన్ని రక్షించిన వారి ధైర్యానికి ఫిదా అవుతూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ వీడియోలో రాజూలకు చెందిన ఆటవీ సిబ్బంది, ఫీల్డ్ రిసెచ్చర్స్ వలలో ఓ సింహం పిల్ల చిక్కడం గమనించి దాన్ని రక్షించే ప్రయత్నం చేశారు. అయితే అది వలలో చిక్కుకోవడంతో అది గంభీరంగా అరవడం మొదలు పెట్టింది. అయితే ఈ పిల్ల సింహం తల్లి సంఘటన స్థలానికి సమీపంలోనే మిగతా పిల్లతో ఉండటం కూడా వారు గమనించారు. అయినప్పటికి ఈ సింహం పిల్లను రక్షించాలని వారు నిర్ణయించుకున్నారు. దీంతో దాన్ని అణచి పట్టి ఆ నలుగురు సిబ్బంది కలసి సింహం పిల్లను వల నుంచి తప్పించారు. దీంతో అది అడవిలోకి పరుగులు తీసింది. కాగా ఈ వీడియోకు ఇప్పటి వరకు 28వేలకు పైగా వ్యూస్, వందల్లో లైక్స్, కామెంట్స్ వచ్చాయి. ‘ఎంతో గుండె ధైర్యం ఉంటే తప్ప ఇలాంటి సాహసాలు చేయలేరు. నిజంగా వీరు రియల్ హీరోలు’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. Forest staffs and field researchers in Rajula, Greater Gir (Gujrat) heard a roar and found a lion cub trapped in net. Lioness with other cubs was sitting nearby. To avoid strangulation of cub they put their lives at risk and freed the cub. Salute to our green guards.@CentralIfs pic.twitter.com/sHloH9bb1J — Ramesh Pandey (@rameshpandeyifs) March 4, 2021 చదవండి: మినీ ట్యాంక్‌బండ్‌లో మొసలి సోషల్ మీడియాలో రచ్చ: సీక్రెట్‌గా లోగో మార్చిన అమెజాన్ -
సింహం ఘటనపై దేశాధ్యక్షుడి ఆగ్రహం!
మాస్కో : కొందరు దుండగులు సింహం కూన కాళ్లు విరిచేసి, హింసలు పెడుతూ అమానుషంగా ప్రవర్తించిన ఘటనపై దేశాధ్యక్షుడు వ్లాదమిర్ పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సింబపై దారుణానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వివరాల్లోకి వెళితే.. రష్యాలోని డెగాస్తాన్ ప్రాంతంలో వారాల పిల్లగా ఉన్నప్పుడే సదరు సింహాం కూనను తల్లినుంచి వేరు చేశారు దుండగులు. అనంతరం రష్యన్ బీచులలోని టూరిస్టులతో ఫొటోలకు ఫోజివ్వటానికి దాన్ని వాడుకునేవారు. అంతేకాకుండా సింహం కూనను తీవ్ర చిత్రహింసలకు గురిచేశారు. అది పెద్దదైన తర్వాత తమనుంచి పారిపోయే అవకాశం ఉంటుందని భావించి సింబ రెండు కాళ్లు విరిచేశారు. ( సింహాలు కూడా ఉహించని ట్విస్ట్! ) శస్త్ర చికిత్స అనంతరం కోలుకున్న సింహం కూన అది దారుణ స్థితిలో నడవటానికి కూడా ఇబ్బంది పడుతున్నా టూరిస్టులతో ఫొటోలు దింపటం మాత్రం మానలేదు దుండగులు. దాని ఆరోగ్యం కొద్దికొద్దిగా క్షీణిస్తూ వచ్చింది. తీవ్రంగా కొట్టడంతో శరీరంపై పలు చోట్ల గాయాలు కూడా అయ్యాయి. వెన్నెముకకు దెబ్బ తగలటంతో చావుకు దగ్గరపడింది. అయితే సింబ పరిస్థితిని గుర్తించిన కొంతమంది వ్యక్తులు.. దుండగుల నుంచి దాని రక్షించి మెరుగైన వైద్యం చేయించారు. ప్రస్తుతం అది కోలుకుంటోంది.. అడుగులో అడుగు వేస్తూ నడవగలుగుతోంది. ప్రస్తుతం సింహం కూనకు సంబంధించిన న్యూస్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. -
సింహం పిల్లను ఎత్తుకుపోయిన కొండముచ్చు
-
సింహం పిల్లను ఎత్తుకుపోయిన కొండముచ్చు
జోహన్నెస్‌బర్గ్ : ఈ ఫోటోల్లో సింహం పిల్లను ఎత్తుకుపోతున్న కొండముచ్చును చూశారు కదా! అది ఆ కూనను చెట్టుపైకి తీసుకెళ్లి అటూ ఇటూ తిప్పింది. తన సొంత బిడ్డతో ఆడుకున్నట్లే దానితోనూ సరదాగా ఆడుకుంది. అరుదైన ఈ సంఘటన దక్షిణాఫ్రికాలోని క్రూగర్ నేషనల్ పార్క్‌లో ఈ నెల 1న చోటుచేసుకుంది. ఇలాంటి అసాధారణ ఘటనను తన 20 ఏళ్ల సర్వీసులో ఎన్నడూ చూడలేదని పార్క్రేంజర్కుర్ట్ షుల్జ్ పేర్కొన్నారు. ఆ తర్వాత ఆ కొండముచ్చు ...ఆ సింహం పిల్లను ఏం చేసిందో తెలియదని చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
బావిలో సింహం.. వీడియో వైరల్
అహ్మదాబాద్: జనవాసాల మధ్యకు వచ్చి ప్రమాదవశాత్తు బావిలో పడిన సింహం పిల్లను రెస్య్కూటీం బయటకు తీసిన వీడియో ఇప్పడు వైరల్ అయింది. ఈ ఘటన గుజరాత్ గిర్ సోమ్నాథ్లోని అమ్రాపుర్ గ్రామంలో చోటు చేసుకుంది. నీళ్లకోసం వచ్చిందో లేక దారితప్పి వచ్చిందో కానీ రెండెళ్ల సింహం పిల్ల గ్రామ సమీపంలోని 80 అడుగుల లోతు బావిలో గత శుక్రవారం పడిపోయింది. ఆ మరునాడు (శనివారం) ఉదయం గుర్తించిన గ్రామస్థులు అటవీ శాఖకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన రెస్య్కూటీం ముందుగా బావిలోకి ఓ అధికారి బోను సహాయంతో వెళ్లి సింహం పిల్లకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడు. ఆ తర్వాత తాళ్ల సహాయంతో సింహం పిల్లను బయటకు తీసి బోనులో బంధించారు. ఈ వీడియోను ఏఎన్ఐ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. సింహం పిల్లకు ఎలాంటి గాయాలు కాలేదని, ఆరోగ్యంగా ఉందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. అనంతరం దాన్ని అటవీ ప్రాంతంలో వదిలేసినట్లు పేర్కొన్నారు.