సింహం పిల్లను తెచ్చుకుని మరీ వెడ్డింగ్‌ ఫొటోషూట్‌ | Pakistani Couple Backlash After Poses With Lion Cub In Wedding Photoshoot | Sakshi
Sakshi News home page

సింహం పిల్లను తెచ్చుకుని మరీ వెడ్డింగ్‌ ఫొటోషూట్‌

Published Sat, Mar 13 2021 5:59 PM | Last Updated on Sat, Mar 13 2021 10:06 PM

Pakistani Couple Backlash After Poses With Lion Cub In Wedding Photoshoot - Sakshi

ఇస్లామాబాద్‌: ఇటీవల కాలంలో వెడ్డింగ్‌, ప్రీ వెడ్డింగ్‌ ఫొటోషూట్‌ భిన్నంగా జరుపుకోవాలని చూస్తున్నారు. ఇందుకోసం ప్రముఖ వెడ్డింగ్‌ స్టూడియోలకు కాంట్రాక్ట్‌ ఇచ్చి ఫొటోషూట్‌ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నారు. ఇలా రకరకాల ప్రయోగాలు చేసి కొంతమంది అందరి చేత జౌరా అనిపించుకుంటుంటే మరి కొందరూ విమర్శల పాలవుతున్నారు. తాజాగా పాకిస్తాన్‌కు చెందిన ఓ జంట కూడా సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌కు గురైంది. సింహం పిల్లను అద్దెకు తెచ్చుకుని ఫొటోషూట్‌ జరుపుకుంది. చివరకు అది బెడిసి కొట్టడంతో నెటిజన్లు, జంతు ప్రేమికుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది ఈ కొత్త జంట. వివరాలు.. పాకిస్తాన్‌కు చెందిన ఓ జంట ఇటీవల వివాహం జరుపుకుంది. తమ వెడ్డింగ్‌ ఫొటోలను ప్రత్యేకంగా ఉండేందుకు పాకిస్తాన్‌లోనే పేరొందిన ప్రముఖ వెడ్డింగ్‌ ఫొటోస్టూడియోను సంప్రదించింది.

దీంతో ఆ స్టూడియో ఆధినంలో ఉన్న సింహం పిల్లకు మత్తు ఇచ్చి నూతన వధువరుల మధ్య ఉంచి ఫొటోషూట్‌ నిర్వహించారు. అనంతరం ఈ ఫొటోలు, వీడియోలను తమ ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా షేర్‌ చేశారు. అది చూసి పాకిస్తాన్‌కు చెందిన సెవ్‌ ది వైల్డ్‌ అనే ఎన్‌జీవో సంస్థ కొత్త జంట, స్టూడియో నిర్వహకులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫొటోషూట్‌ కోసం సింహం పిల్లకు మత్తు ఇచ్చి దానిని హింసించడం సరైనది కాదని వెంటనే వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పంజాబ్‌ వన్యప్రాణుల సంరక్షణ శాఖకు ఫిర్యాదు చేసింది. ఇలాంటి వేడుకులకు సింహం పిల్లను ఎలా అద్దెకు ఇస్తారని ప్రశ్నిస్తూ స్టూడియో ఆధ్వర్యంలో ఉన్న దానిని రక్షించాల్సిందిగా కోరింది. అంతేగాక నెటిజన్ల నుంచి కూడా విపరీతమైన ట్రోల్స్‌ రావడంతో సదరు ఫొటో స్టూడియో ఈ ఫొటోలను తమ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా నుంచి తొలిగించింది. 

చదవండి: 
కోవిడ్‌ టీకా: పడిపడి నవ్విన పోలీసు అధికారి 
నిద్రపోతున్న మహిళను చనిపోయిందనుకుని..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement