wedding photo shoot
-
ఫొటోషూట్‌లో లైట్స్.. కెమెరా.. యాక్షన్.. ప్రస్తుతం జరుగుతోంది ఇదే
ఈ పదాలను సినిమా షూటింగ్లో నిత్యం వింటుంటాం. కానీ ఫొటోషూట్లోనూ ఈ పదాలు వినిపిస్తే కొంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ప్రస్తుతం జరుగుతోంది అదే. డ్రోన్, క్రేన్ షాట్స్‌తో సినిమా షూటింగ్‌ను తలపించేలా నగర శివారులో ఫొటోషూట్ చేయడం ట్రెండ్‌గా మారింది. చాలా మంది ఫొటోషూట్‌ను సినిమా షూటింగ్ అనే భ్రమపడుతున్నారు. దానికి సినిమా షూటింగ్ తరహాలో చేయడమే కారణమంటున్నారు ఫొటోగ్రాఫర్లు. అందుకే ఫొటోషూట్‌ను ఈ తరహాలో చేస్తున్నామని స్టుడియో నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఫొటోగ్రఫీపై ఆసక్తి (ఫొటోనాసక్తి) ఉన్న యువత తమ పనితనానికి మెరుగులు దిద్దుకుంటూ ఫొటోనాసక్తిని ఉపాధిగా మలుచుకుంటున్నారు. సాక్షి, హైదరాబాద్: గతంలో పెళ్లిళ్లు, పేరంటాలకు మాత్రమే ఫొటోలు తీయించుకునేవారు. ప్రస్తుతం పెళ్లితో పాటు ప్రీ–వెడ్డింగ్, పోస్ట్–వెడ్డింగ్ ఫొటోషూట్లకు ఆసక్తి చూపిస్తున్నారు. ఫొటోగ్రాఫర్ స్వయంగా వెళ్లి తీయలేని యాంగిల్స్‌లో కూడా ఫొటోలను తీసే అవకాశం డ్రోన్ షాట్స్, క్రేన్ షాట్స్‌తో ఏర్పడుతోంది. అంతేకాకుండా సినిమా పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ ఆ వీడియోలను సినిమా పాటల తరహాలో ఎడిటింగ్ చేయించుకుంటున్నారు. అపురూపమైన ఈ ఫొటోలు, వీడియోలను కరిజ్మా, క్యాన్వేరా ఆల్బామ్, డీవీడీలలో పొందు పరిచి అందజేస్తున్నారు. సినిమా షూటింగ్ తరహాలో ఫోటో షూట్ రూ.70వేల నుంచి రూ.3.5లక్షల వరకు.. ఫొటోగ్రఫీలో వస్తున్న కొత్త ట్రెండ్లను నగర ప్ర జలు ఆహ్వానిస్తుండటంతో ఈ రంగంలోకి వచ్చే వారికి ఉపాధి లభిస్తోంది. ప్రీ–వెడ్డింగ్, పోస్ట్–వెడ్డింగ్ ఫొటోషూట్లతో కలుపుని సినిమా ఫొటో గ్రఫీ, వీడియో క్యాన్వేరా, ఎల్ఈడీ స్క్రీన్స్, క్యాన్డెట్ ఫొటోగ్రఫీ ఆల్బంతో సహా మొత్తం క్వాలిటీని బట్టి దాదాపు రూ.70 వేల నుంచి రూ.3.5లక్షల వరకు ఫొటోగ్రాఫర్లు తీసుకుంటున్నారు. జవహర్‌నగర్‌లో 200 స్టూడియోలు, 3 కలర్‌ల్యాబ్‌లు ఫొటోగ్రఫీలో కొత్త ట్రెండ్లు రావడంతో పాటు మార్కెట్ రోజురోజుకు విస్తరించడంతో ఫొటోగ్రఫీ రంగంవైపు రావడానికి నేటితరం జవహర్‌నగర్ యువత ఆసక్తి చూపుతున్నారు. దానినే ఉపాధిగా మలుచుకుంటున్నారు. 15 ఏళ్ల క్రింద జవహర్‌నగర్ పరిసర ప్రాంతాలలో 5 నుంచి 10 ఫొటో స్టూడియోలు ఉండేవి. కానీ ప్రస్తుతం దాదాపు 200 వరకు ఫొటోస్టూడియోలు, 3 కలర్‌ల్యాబ్‌లు ఉన్నాయి. తక్కువ ఖర్చులోనే.. తక్కువ ఖర్చులోనే సినిమాను తలపించే రీతిలో అన్ని కోణాల్లో దశ్యాలను చిత్రీకరిస్తున్నాం. ఎక్కువ శాతం క్రేన్ షాట్స్ తీయాలని వినియోగదారులు కోరుతున్నారు. సీజన్లో గిరాకీ బాగుండటంతో ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నాం. – శ్రీకాంత్‌యాదవ్, జవహర్‌నగర్ ఎంతో మందికి ఉపాధి.. ఫొటో రంగంలోకి యువత రావడానికి ఇష్టపడుతున్నారు. నూతన టెక్నాలజీ ద్వారా షాట్స్ తీయడమే కాకుండా వారికి అనుకున్న రీతిలో ఫొటోఆల్బమ్ తీసి ఇస్తున్నాం. అంతే కాకుండా ఎంతో మంది ఉపాధిని కూడా పొందున్నారు. – సంపత్, అంబేడ్కర్‌నగర్ -
అరెరే ఎంతపనాయే.. బెడిసికొట్టిన వెడ్డింగ్ ఫోటోషూట్.. ఫోటోలు వైరల్
ప్రస్తుత కాలంలో ఫోటో షూట్లు సర్వసాధారణం అయిపోయాయి. వివాహాలు, పుట్టినరోజు, ఫంక్షన్లు ఇలా ఏ వేడుక అయినా ఫోటోషూట్ మరింత అందాన్ని తీసుకొస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలోని మధుర క్షణాలను భవిష్యత్తులో జ్జాపకంగా మలుచుకునేందుకు ఏకైక మార్గం ఫోటోలు, వీడియోలే.. ముఖ్యంగా ప్రతి జంట పెళ్లికి ముందు వెడ్డింగ్ షూట్లు నిర్వహించుకుంటున్నారు, మంచి లొకేషన్, క్యాస్టూమ్స్‌తో ఫోటోలు, వీడియోలకు రెడీ అవుతున్నారు. తాజాగా కజకిస్థాన్‌కు చెందిన ఓ జంట ఇలాగే ఆలోచించి వెడ్డింగ్షూట్ ఏర్పాటు చేసుకున్నారు. అయితే అద్భుతంగా ఊహించుకున్న వీరి ఫోటో షూట్ అంతే లెవల్లో బెడిసికొట్టింది. అసలేం జరిగిందంటే.. మురత్ జురాయేవ్, కమిల్లా అనే వధూవరులు పెళ్లి దుస్తుల్లో అందంగా ముస్తాబై ఫోటోషూట్ కోసం అవుట్డోర్ లొకేషన్‌కు వెళ్లారు. బ్లాక్ అండ్ వైట్ సూట్లో కెమెరాకు పోజులిస్తుండగా.. ప్రమాదవశాత్తూ కాలుజారి బురద గుంటలో పడిపోయారు. దీంతో వధువు తెలుపు రంగు గౌన్ అంతా బురదతో నిండిపోయింది. ఇక ఇక చేసేందేం లేక జరిగింది తల్చుకొని నవ్వూతూ అక్కడి నుంచి తిరగొచ్చేశారు. చదవండి: వైరల్: ఫోటోలో చిరుత ఎక్కడుందో గుర్తుపట్టండి.. కష్టంగా ఉందా? అయితే బురదలో పడిన దృశ్యాలను సైతం వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించాడు. వీటిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. వీటిని చూస్తుంటే అనుకోకుండా బురదలో పడినట్లుగా కనిపించడం లేదు. కావాలనే బురదలో తీసుకున్నట్లు ఎంతో చక్కగా ఉన్నాయి. బురదలో పడిన సమయంలో ఇద్దరి ముఖాల్లో హావాభావాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. చదవండి: రాకాసి పీత!.. గోల్ఫ్ స్టిక్‌ని చెకోడీలు విరిచినట్లు పటపట విరిచేసింది! View this post on Instagram A post shared by 𝐀𝐒𝐊𝐀𝐑 𝐁𝐔𝐌𝐀𝐆𝐀 (@bumagaz) -
సింహం పిల్లను తెచ్చుకుని మరీ వెడ్డింగ్ ఫొటోషూట్
ఇస్లామాబాద్: ఇటీవల కాలంలో వెడ్డింగ్, ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ భిన్నంగా జరుపుకోవాలని చూస్తున్నారు. ఇందుకోసం ప్రముఖ వెడ్డింగ్ స్టూడియోలకు కాంట్రాక్ట్ ఇచ్చి ఫొటోషూట్ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నారు. ఇలా రకరకాల ప్రయోగాలు చేసి కొంతమంది అందరి చేత జౌరా అనిపించుకుంటుంటే మరి కొందరూ విమర్శల పాలవుతున్నారు. తాజాగా పాకిస్తాన్‌కు చెందిన ఓ జంట కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్‌కు గురైంది. సింహం పిల్లను అద్దెకు తెచ్చుకుని ఫొటోషూట్ జరుపుకుంది. చివరకు అది బెడిసి కొట్టడంతో నెటిజన్లు, జంతు ప్రేమికుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది ఈ కొత్త జంట. వివరాలు.. పాకిస్తాన్‌కు చెందిన ఓ జంట ఇటీవల వివాహం జరుపుకుంది. తమ వెడ్డింగ్ ఫొటోలను ప్రత్యేకంగా ఉండేందుకు పాకిస్తాన్‌లోనే పేరొందిన ప్రముఖ వెడ్డింగ్ ఫొటోస్టూడియోను సంప్రదించింది. దీంతో ఆ స్టూడియో ఆధినంలో ఉన్న సింహం పిల్లకు మత్తు ఇచ్చి నూతన వధువరుల మధ్య ఉంచి ఫొటోషూట్ నిర్వహించారు. అనంతరం ఈ ఫొటోలు, వీడియోలను తమ ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా షేర్ చేశారు. అది చూసి పాకిస్తాన్‌కు చెందిన సెవ్ ది వైల్డ్ అనే ఎన్జీవో సంస్థ కొత్త జంట, స్టూడియో నిర్వహకులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫొటోషూట్ కోసం సింహం పిల్లకు మత్తు ఇచ్చి దానిని హింసించడం సరైనది కాదని వెంటనే వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పంజాబ్ వన్యప్రాణుల సంరక్షణ శాఖకు ఫిర్యాదు చేసింది. ఇలాంటి వేడుకులకు సింహం పిల్లను ఎలా అద్దెకు ఇస్తారని ప్రశ్నిస్తూ స్టూడియో ఆధ్వర్యంలో ఉన్న దానిని రక్షించాల్సిందిగా కోరింది. అంతేగాక నెటిజన్ల నుంచి కూడా విపరీతమైన ట్రోల్స్ రావడంతో సదరు ఫొటో స్టూడియో ఈ ఫొటోలను తమ ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి తొలిగించింది. @PunjabWildlife does your permit allow for a lion cub to be rented out for ceremonies?Look at this poor cub sedated and being used as a prop.This studio is in Lahore where this cub is being kept.Rescue him please pic.twitter.com/fMcqZnoRMd — save the wild (@wildpakistan) March 7, 2021 చదవండి: కోవిడ్ టీకా: పడిపడి నవ్విన పోలీసు అధికారి నిద్రపోతున్న మహిళను చనిపోయిందనుకుని.. -
పిచ్చి పీక్స్‌కు వెళ్లడం అంటే ఇదే!
తిరువనంతపురం: రిషి కార్తికేయన్, లక్ష్మి.. కేరళకు చెందిన నవ దంపతులు. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో సెప్టెంబరు 16న అతికొద్ది మంది సమక్షంలో ఇరు వర్గాల పెద్దలు వీరి వివాహ తంతు జరిపించారు. కరోనా నిబంధనల నడుమ, పెద్దగా హడావుడి లేకుండా పెళ్లి ఎలాగూ సింపుల్‌గా జరిగింది కాబట్టి, పోస్ట్- వెడ్డింగ్షూట్ అయినా కాస్త వెరైటీగా ప్లాన్ చేసుకోవాలనుకున్నారు ఈ కొత్తజంట. అనుకున్నదే తడవుగా ఫొటోగ్రాఫర్ అయిన తమ స్నేహితుడితో ఈ ఆలోచనను పంచుకున్నారు. ప్రకృతి అందాలతో కనువిందు చేస్తున్న ఇడుక్కిలోని తేయాకు తోటలను ఇందుకు వేదికగా ఎంచుకున్నారు. తమ మధ్య ప్రణయ బంధాన్ని ప్రతిబింబించేలా ఫొటోలు తీయించుకున్నారు.(చదవండి: నా ఒడి నింపే వేడుక..ఇప్పుడేంటి!?) ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ, ఎప్పుడైతే తమ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారో, అప్పటి నుంచి రిషి, లక్ష్మిల మీద ట్రోలింగ్ మొదలైంది. తెల్లటి వస్త్రంతో తమను తాము కప్పుకొని, పరుగులు తీస్తున్నట్లుగా సినిమాటిక్ స్టైల్లో తీసిన ఫొటోలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘అసలు ఇదంతా ఏమిటి? ఇలాంటి ఫొటోలతో ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు. ఇంతకీ మీరు దుస్తులు ధరించారా? పిచ్చి పీక్స్ వెళ్లడం అంటే ఇదే. పెళ్లి తాలూకూ మధుర జ్ఞాపకాలు దాచుకునేందుకు ఇంతకంటే మార్గం దొరకలేదా’’ అంటూ చురకలు అంటిస్తున్నారు. ఇక ఈ విషయంపై స్పందించి వధువు లక్ష్మి.. ‘‘ఆఫ్- షోల్టర్ టాప్స్ ధరించే వాళ్లకు ఇది కొత్తగా ఏమీ అనిపించకపోవచ్చు. అయినా మేం ఏం తప్పుచేశామని ఇలా నిందిస్తున్నారు. చూసే కళ్లను బట్టే ఉంటుంది’’అంటూ విమర్శలకు బదులిచ్చారు. -
వెడ్డింగ్ వీడియో: తప్పిన ప్రమాదం