బావిలో సింహం.. వీడియో వైరల్
బావిలో సింహం.. వీడియో వైరల్
Published Wed, Jul 12 2017 11:01 AM | Last Updated on Thu, Oct 4 2018 6:03 PM
అహ్మదాబాద్: జనవాసాల మధ్యకు వచ్చి ప్రమాదవశాత్తు బావిలో పడిన సింహం పిల్లను రెస్య్కూటీం బయటకు తీసిన వీడియో ఇప్పడు వైరల్ అయింది. ఈ ఘటన గుజరాత్ గిర్ సోమ్‌నాథ్‌లోని అమ్రాపుర్ గ్రామంలో చోటు చేసుకుంది. నీళ్లకోసం వచ్చిందో లేక దారితప్పి వచ్చిందో కానీ రెండెళ్ల సింహం పిల్ల గ్రామ సమీపంలోని 80 అడుగుల లోతు బావిలో గత శుక్రవారం పడిపోయింది. ఆ మరునాడు (శనివారం) ఉదయం గుర్తించిన గ్రామస్థులు అటవీ శాఖకు సమాచారం అందించారు.
రంగంలోకి దిగిన రెస్య్కూటీం ముందుగా బావిలోకి ఓ అధికారి బోను సహాయంతో వెళ్లి సింహం పిల్లకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడు. ఆ తర్వాత తాళ్ల సహాయంతో సింహం పిల్లను బయటకు తీసి బోనులో బంధించారు. ఈ వీడియోను ఏఎన్‌ఐ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. సింహం పిల్లకు ఎలాంటి గాయాలు కాలేదని, ఆరోగ్యంగా ఉందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. అనంతరం దాన్ని అటవీ ప్రాంతంలో వదిలేసినట్లు పేర్కొన్నారు.
Advertisement
Advertisement