అహ్మదాబాద్: గుజరాత్‌లో గీర్ అడవిలో వలలో చిక్కిన ఓ సింహం పిల్లను ఆటవీ సిబ్బంది రక్షించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీనియర్ ఆటవీ శాఖ అధికారి రమేష్ పాండే శుక్రవారం షేర్ చేసిన ఈ వీడియో చూసి నెటిజన్లంత సదరు సిబ్బందిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రాణాలకు ప్రమాదమని తెలిసిన ఈ సింహాన్ని రక్షించిన వారి ధైర్యానికి ఫిదా అవుతూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ వీడియోలో రాజూలకు చెందిన ఆటవీ సిబ్బంది, ఫీల్డ్ రిసెచ్చర్స్ వలలో ఓ సింహం పిల్ల చిక్కడం గమనించి దాన్ని రక్షించే ప్రయత్నం చేశారు.
అయితే అది వలలో చిక్కుకోవడంతో అది గంభీరంగా అరవడం మొదలు పెట్టింది. అయితే ఈ పిల్ల సింహం తల్లి సంఘటన స్థలానికి సమీపంలోనే మిగతా పిల్లతో ఉండటం కూడా వారు గమనించారు. అయినప్పటికి ఈ సింహం పిల్లను రక్షించాలని వారు నిర్ణయించుకున్నారు. దీంతో దాన్ని అణచి పట్టి ఆ నలుగురు సిబ్బంది కలసి సింహం పిల్లను వల నుంచి తప్పించారు. దీంతో అది అడవిలోకి పరుగులు తీసింది. కాగా ఈ వీడియోకు ఇప్పటి వరకు 28వేలకు పైగా వ్యూస్, వందల్లో లైక్స్, కామెంట్స్ వచ్చాయి. ‘ఎంతో గుండె ధైర్యం ఉంటే తప్ప ఇలాంటి సాహసాలు చేయలేరు. నిజంగా వీరు రియల్ హీరోలు’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Forest staffs and field researchers in Rajula, Greater Gir (Gujrat) heard a roar and found a lion cub trapped in net. Lioness with other cubs was sitting nearby. To avoid strangulation of cub they put their lives at risk and freed the cub. Salute to our green guards.@CentralIfs pic.twitter.com/sHloH9bb1J
— Ramesh Pandey (@rameshpandeyifs) March 4, 2021
చదవండి: మినీ ట్యాంక్‌బండ్‌లో మొసలి
సోషల్ మీడియాలో రచ్చ: సీక్రెట్‌గా లోగో మార్చిన అమెజాన్
Comments
Please login to add a commentAdd a comment