వ్యక్తిపై సింహాల దాడి
బెంగళూరు: బెంగళూరులోని బన్నేర్గట్ట బయాలజికల్ పార్క్లో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ పార్క్లోని జంతువుల సంరక్షణను చూసుకునే శ్రీకృష్ణ అనే వ్యక్తిపై రెండు సింహాలు దాడి చేసి, మెడపట్టి ఈడ్చుకెళ్లి తీవ్రంగా గాయపరిచాయి. వాటికి వ్యాక్సినేషన్ చేసేందుకు వెళ్లగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ వెటర్నరీ డాక్టర్, మరో ముగ్గురు సహాయకులతోకలిసి శ్రీకృష్ణ సింహాలకు వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు లోపలికి వెళ్లారు. వీరిలో ఒకరు వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు ఏర్పాటుచేసిన గేటుకాకుండా మరో గేటు తెరవడంతో అవి ఒక్కసారిగా శ్రీకృష్ణపై దాడి చేసి ఈడ్చుకెళ్లాయి. అక్కడే ఉన్న మిగతా జంతు సంరక్షకులంతా రంగంలోకి దిగి 10 నుంచి పది హేను నిమిషాలపాటు కష్టపడి అతడిని వాటి నుంచి తప్పించారు. అనంతరం అక్కడే ఉన్న అపోలో ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే తీవ్రంగా గాయాలపాలైన శ్రీకృష్ణ ప్రాణాలకోసం పోరాడుతున్నాడు.