Bannerghatta Park
-
బస్సులోకి ఎక్కేందుకు చిరుత ప్రయత్నం
బెంగళూరు: బన్నెర్ఘట్టలోని నేషనల్ పార్క్‌లో పర్యాటకులకు ఊహించని ఘటన ఎదురైంది. చిరుత ఒకటి సఫారీ బస్సు కిటికీ గుండా ఎక్కడానికి ప్రయతి్నంచడంతో పర్యాటకులంతా కేకలు వేశారు. మొదట భయపడ్డా.. తరువాత దాన్ని చూసి మంత్రముగ్ధులయ్యారు. కొద్దిసేపు ప్రయత్నించిన చిరుత.. ఆ తరువాత ప్రయత్నాన్ని విరమించుకుని నెమ్మదిగా తన ఆవాసం వైపు నడుచుకుంటూ వెళ్లింది. ఆదివారం జరిగిన ఈ ఘటన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వన్యప్రాణులను దగ్గరగా చూసేందుకు సఫారీ డ్రైవర్ ముందుకు రావడంతో ఈ ఘటన చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. సఫారీ వాహనాలన్నింటికీ మెష్ విండోస్ ఉన్నాయని, ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని వెల్లడించారు. Come, let's meet face-to-face. 🐆 A leopard at Bannerghatta National Park recently jumped onto the window of a jungle safari bus, creating a moment of both awe and fear for the passengers inside. The wild cat’s sudden appearance startled everyone, as it leaped onto the bus… pic.twitter.com/YqDI265CS2— Karnataka Portfolio (@karnatakaportf) October 6, 2024 -
ప్రమాదకర అంటువ్యాధి.. 15 రోజుల్లో ఏడు చిరుత కూనలు మృతి
బెంగళూరు: కర్ణాటకలో చిరుత పిల్లల మరణాలు కలకలం రేపుతున్నాయి. తీవ్రమైన అంటువ్యాధి సోకి బెంగళూరులోని బన్నెరఘట్ట బయోలాజికల్ పార్క్‌లో ఏడు చిరుత కూనలు మృతిచెందాయి. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే అంటువ్యాధి ‘ఫీలైన్ పాన్ల్యూకోపెనియా బారిన పడి 15 రోజుల వ్యవధిలోనే 8 పిల్లలు మరణించినట్లు పార్క్ అధికారులు మంగళవారం వెల్లడించారు. అధికారుల వివరాల ప్రకారం.. ఆగస్టు 22న తొలిసారి ఈ వైరస్ బయటపడినట్లు తెలిపారు. 15 రోజుల్లోనే ఎనిమిది చిరుత పిల్లలకు వైరస్ సోకి చనిపోయినట్లు పేర్కొన్నారు. సఫారీ ప్రాంతంలో తొమ్మిది కూనలను వదిలిపెట్టగా వాటిలో నాలుగు వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. రెస్క్యూ సెంటర్లో ఉండే మరో మూడింటికి కూడా అంటువ్యాధి సోకి చికిత్స పొందుతూ మరణించాయన్నారు. మరణించిన ఏడు పిల్ల చిరుతల వయసు మూడు నుంచి ఎనిమిది నెలల లోపు ఉంటుందని పేర్కొన్నారు. అన్నీ కూనలకు వ్యాక్సినేషన్ చేయించినప్పటికీ వైరస్ సోకి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. చదవండి: జమ్మూకశ్మీర్ ఎన్కౌంటర్: లష్కరే తోయిబా కమాండర్ హతం అయితే ప్రస్తుతం వైరస్‌లో నియంత్రణలో ఉందని.. గత 15 రోజులలో ఎలాంటి మరణాలు సంభవించలేదని, వెటర్నటీ డాక్టర్లో చర్చలు జరిపి వైరస్ కట్టడికి అవసరమైన చర్యలన్నీ తీసుకున్నామని చెప్పారు. అలాగే జంతు ప్రదర్శనశాలలో పరిశుభ్రత చర్యలు చేపట్టామని రెస్క్యూ సెంటర్ పూర్తిగా శానిటైజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఫీలైన్ పాన్ల్యూకోపెనియా అనే అంటువ్యాధి పిల్లి జాతికి చెందిన పార్వేవైరస్ వల్ల కలుగుతుందని.. ఈ వైరస్ ప్రభావం కూనలపై ఎక్కువగా ఉంటుందని చెప్పారు. దీని బారిన పడితే.. జీర్ణవ్యవస్థ పూర్తిగా ప్రభావితమవుతుందని పేర్కొన్నారు. తీవ్రమైన విరేచనాలు, వాంతులు డీహైడ్రేషన్ లక్షణాలు కనిపిస్తాయని చివరికి మరణానికి దారితీస్తుందన్నారు. ఇది వేగంగా వ్యాపిస్తుందని, వ్యాధి సోకిన నాలుగైదు రోజుల్లో జంతువు చనిపోతుందని తెలిపారు. -
ఎట్టకేలకు ఆ ఎలుగుబంటి కోలుకుంది
సాక్షి, బెంగళూరు : ఎలుగు బంటి ఎంత బలంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దానికి కోపం వచ్చిందంటే చీల్చిపారేస్తుంది. అలాంటి ఎలుగుబంటిని బంధించి తమ ఆధీనంలో ఉంచుకొని కోతిలాగా ఆడించి, డ్యాన్స్‌లు చేయించి డబ్బు సంపాధించుకునే కొన్ని ప్రత్యేక తెగలు ఉన్నాయి. అదృష్టం కొద్ది వణ్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం అలాంటి ఎలుగు బంటులకు విముక్తిని కలిగించి వాటికి పునరావాసం ఏర్పాటు చేసే ప్రాజెక్టుకు ఒకటి ప్రారంభమైంది. దీంతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 628 ఎలుగుబంట్లకు స్వేచ్ఛను ఇచ్చినట్లయింది. అలా దేశంలో ఒకరి చేతిలో బందీగా ఉండి డ్యాన్సులు వేసే చివరి ఎలుగుబంటికి విముక్తి కలిగించి నేటికి ఏడేళ్లు. ఈ సందర్భంగా దాదాపు చిన్నతనం నుంచి నానా ఇబ్బందులు పడి, గాయాలపాలై మానిసిక స్థితి కూడా దెబ్బతిన్న రాజు అనే ఎలుగుబంటి స్వేచ్ఛను పొందిన ఏడేళ్ల సందర్భంగా ఇప్పుడిప్పుడే తన సహజ స్థితిని పొందుతోంది. 2009లో కర్ణాటకలోని చిక్కా హరావలి అనే ప్రాంతంలో రాజును విడిపించారు. ప్రస్తుతం బన్నేర్‌ఘట్టా ప్రాంతంలో దానికి అయిన గాయాలకు చికిత్సను అందించడంతోపాటు దానికున్న సహజ సిద్ధ స్వభావం తిరిగొచ్చేలా ప్రయత్నిస్తున్నారు. ఈ ఎలుగుకు వైద్యం చేసిన డాక్టర్లు స్పందిస్తూ కలందర్ అనే కమ్యూనిటికి చెందిన వారు దానిని బంధించి చెప్పరాని విధంగా టార్చర్ పెట్టారని, దాని చర్మం లోపలి నుంచి కాలుతున్న సన్నటి తీగను కుచ్చి దానికి ఒక తాడును కట్టి ఎలుగును తమ నియంత్రణలో పెట్టుకున్నారని వివరించారు. దానిని ఆడించాలనుకున్న ప్రతిసారి ఆ తీగకు కట్టిన తాడు లాగడంతో ఆ నొప్పికి ఆ ఎలుగు చెప్పినట్లు చేసేదని, ఆ క్రమంలో దానికి అంతర్గతంగా చాలా గాయాలు అయ్యాయని అన్నారు. ప్రస్తుతం ఆ ఎలుగు కోలుకుంటుందని వివరించారు. -
మనిషిని ఈడ్చుకెళ్లి చంపిన పులి పిల్లలు
బెంగళూరు : బెంగళూరులోని బన్నర్‌ఘట్టా బయోలాజికల్ పార్కులో శనివారం విషాదం చోటుచేసుకుంది. పార్క్‌లో కేర్‌టేకర్‌గా పనిచేస్తున్న అంజి(41) అనే వ్యక్తిపై రెండు తెల్ల పులి పిల్లలు దాడి చేయడంతో మరణించాడు. ఆ ఉద్యోగి ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన వెంటనే ఆ పిల్లలు దాడి చేసి ఈడ్చుకెళ్లి చంపేశాయి. అవి దాడి చేసే సమయంలో అంజి తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ అవి వెంబడించి దారుణంగా చంపేశాయి. పార్కు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పోలీసుల అసహజ మరణం కింద కేసు నమోదు చేశారు. కేర్‌టేకర్ మరణించినట్లు పార్క్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతోష్ కుమార్ తెలిపారు. రాయల్ బెంగాల్ టైగర్స్ దాడిలో ఇటీవల తెల్లపులి మరణించిన విషయం తెలిసిందే. బెంగుళూరుకు సమీపంలో ఈ బన్నర్‌ఘట్టా జాతీయ పార్కు ఉంది. 1970లో ఈ పార్కును ప్రారంభించారు. 1974లో ఈ పార్కును జాతీయ పార్క్‌గా ప్రకటించారు. ఈ పార్క్ దాదాపుగా 260 కిలో మీటర్ల మేర విస్తరించి ఉంది. -
వ్యక్తిపై సింహాల దాడి
బెంగళూరు: బెంగళూరులోని బన్నేర్‌గట్ట బయాలజికల్ పార్క్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ పార్క్‌లోని జంతువుల సంరక్షణను చూసుకునే శ్రీకృష్ణ అనే వ్యక్తిపై రెండు సింహాలు దాడి చేసి, మెడపట్టి ఈడ్చుకెళ్లి తీవ్రంగా గాయపరిచాయి. వాటికి వ్యాక్సినేషన్ చేసేందుకు వెళ్లగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ వెటర్నరీ డాక్టర్, మరో ముగ్గురు సహాయకులతోకలిసి శ్రీకృష్ణ సింహాలకు వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు లోపలికి వెళ్లారు. వీరిలో ఒకరు వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు ఏర్పాటుచేసిన గేటుకాకుండా మరో గేటు తెరవడంతో అవి ఒక్కసారిగా శ్రీకృష్ణపై దాడి చేసి ఈడ్చుకెళ్లాయి. అక్కడే ఉన్న మిగతా జంతు సంరక్షకులంతా రంగంలోకి దిగి 10 నుంచి పది హేను నిమిషాలపాటు కష్టపడి అతడిని వాటి నుంచి తప్పించారు. అనంతరం అక్కడే ఉన్న అపోలో ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే తీవ్రంగా గాయాలపాలైన శ్రీకృష్ణ ప్రాణాలకోసం పోరాడుతున్నాడు.