బెంగళూరు : బెంగళూరులోని బన్నర్‌ఘట్టా బయోలాజికల్ పార్కులో శనివారం విషాదం చోటుచేసుకుంది. పార్క్‌లో కేర్‌టేకర్‌గా పనిచేస్తున్న అంజి(41) అనే వ్యక్తిపై రెండు తెల్ల పులి పిల్లలు దాడి చేయడంతో మరణించాడు. ఆ ఉద్యోగి ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన వెంటనే ఆ పిల్లలు దాడి చేసి ఈడ్చుకెళ్లి చంపేశాయి.
అవి దాడి చేసే సమయంలో అంజి తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ అవి వెంబడించి దారుణంగా చంపేశాయి. పార్కు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పోలీసుల అసహజ మరణం కింద కేసు నమోదు చేశారు. కేర్‌టేకర్ మరణించినట్లు పార్క్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతోష్ కుమార్ తెలిపారు.
రాయల్ బెంగాల్ టైగర్స్ దాడిలో ఇటీవల తెల్లపులి మరణించిన విషయం తెలిసిందే. బెంగుళూరుకు సమీపంలో ఈ బన్నర్‌ఘట్టా జాతీయ పార్కు ఉంది. 1970లో ఈ పార్కును ప్రారంభించారు. 1974లో ఈ పార్కును జాతీయ పార్క్‌గా ప్రకటించారు. ఈ పార్క్ దాదాపుగా 260 కిలో మీటర్ల మేర విస్తరించి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment