బస్సులోకి ఎక్కేందుకు చిరుత ప్రయత్నం | Bannerghatta National Park tourists scream in terror as leopard leaps onto safari bus | Sakshi
Sakshi News home page

బస్సులోకి ఎక్కేందుకు చిరుత ప్రయత్నం

Published Tue, Oct 8 2024 10:59 AM | Last Updated on Tue, Oct 8 2024 1:15 PM

Bannerghatta National Park tourists scream in terror as leopard leaps onto safari bus

బెంగళూరు: బన్నెర్‌ఘట్టలోని నేషనల్‌ పార్క్‌లో పర్యాటకులకు ఊహించని ఘటన ఎదురైంది. చిరుత ఒకటి సఫారీ బస్సు కిటికీ గుండా ఎక్కడానికి ప్రయతి్నంచడంతో పర్యాటకులంతా కేకలు వేశారు. మొదట భయపడ్డా.. తరువాత దాన్ని చూసి మంత్రముగ్ధులయ్యారు. కొద్దిసేపు ప్రయత్నించిన చిరుత.. 

ఆ తరువాత ప్రయత్నాన్ని విరమించుకుని నెమ్మదిగా తన ఆవాసం వైపు నడుచుకుంటూ వెళ్లింది. ఆదివారం జరిగిన ఈ ఘటన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. వన్యప్రాణులను దగ్గరగా చూసేందుకు సఫారీ డ్రైవర్‌ ముందుకు రావడంతో ఈ ఘటన చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. సఫారీ వాహనాలన్నింటికీ మెష్‌ విండోస్‌ ఉన్నాయని, ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని వెల్లడించారు.   

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement