భోపాల్: మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్క్‌లో మరో చీతా కన్నుమూసింది. ఆదివారం ఉదయం అస్వస్థతకు గురైన చీతా.. సాయంత్రం కన్నుమూసినట్లు అధికారులు ప్రకటించారు. నెల వ్యవధిలో ఇది రెండో చీతా మరణం.
సౌతాఫ్రికా నుంచి ఫిబ్రవరిలో 12 చీతాలను భారత్‌కు రప్పించిన సంగతి తెలిసిందే. ఇందులో ఆరేళ్ల వయసున్న ఉదయ్ అనే చీతా ఆదివారం కన్నుమూసింది. రెగ్యులర్ చెకప్‌లో భాగంగా అది అస్వస్థతతో కనిపించిందని, మత్తు మందు ఇచ్చి బంధించి చికిత్స అందిస్తుండగా అది సాయంత్రం మరణించింది అధికారులు తెలిపారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చాకే అది ఎందుకు మరణించిందో తెలుస్తుందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.
మార్చి నెలలో కిడ్నీ ఇన్‌ఫెక్షన్‌తో ఐదేళ్ల వయసున్న నమీబియన్ చీతా షాషా కన్నుమూసిన సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ చీతా కోసం నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి 20 చీతాలను కేంద్ర ప్రభుత్వం రప్పించింది. ఇందులో రెండు మరణించగా.. 18 మిగిలాయి ఇప్పుడు.
Comments
Please login to add a commentAdd a comment