దక్షిణాఫ్రికా నుంచి యుద్ధ విమానాల్లో భారత్‌కు వచ్చిన 12 చీతాలు.. | 12 Cheetahs From South Africa Arrive In Madhya Pradesh | Sakshi
Sakshi News home page

దక్షిణాఫ్రికా నుంచి యుద్ధ విమానాల్లో భారత్‌కు వచ్చిన 12 చీతాలు..

Published Sat, Feb 18 2023 2:11 PM | Last Updated on Sat, Feb 18 2023 2:12 PM

12 Cheetahs From South Africa Arrive In Madhya Pradesh - Sakshi

భోపాల్‌: దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు 12 చీతాలు వచ్చాయి. వాయుమార్గం ద్వారా యుద్ధ విమానాల్లో మధ్యప్రదేశ్ గ్వాలియర్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌కు వీటిని తీసుకొచ్చారు. అనంతరం కునో నేషనల్ పార్కుకు హెలికాప్టర్లలో తరలించారు. ఈ 12 చీతాల్లో ఐదు మగవి కాగా.. ఏడు ఆడవి. 

మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యావద్ ఈ చీతాలను కునో నేషనల్ పార్క్ క్వారంటైన్ ఎన్‌క్లోజర్లలో విడుదల చేశారు. భారత వన్యప్రాణుల చట్టం ప్రకారం విదేశాల నుంచి వచ్చిన జంతువులు 30 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలి.

భారత్‌లో అంతరించిపోతున్న చీతాల సంఖ్యను పెంచేందుకు ఆఫ్రికా దేశాలతో భారత్ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే గతేడాది సెప్టెంబర్‌లో 8 చీతాలు నమీబియా నుంచి భారత్‌కు వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ తన పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17న వీటిని కునో నేషనల్ పార్కులో విడుదల చేశారు.  తాజాగా వచ్చిన చీతాలతో కలిపి కునో నేషనల్ పార్కులో మొత్తం చీతాల సంఖ్య 20కి చేరింది.
చదవండి: బ్రెడ్‌ కోసం లొట్టలు వేస్తున్న భారతీయులు.. నెలకు ఏకంగా రూ.800 వరకు ఖర్చు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement