భోపాల్: ఆఫ్రికా ఖండం నుంచి భారత్‌లో అడుగుపెట్టిన చీతాలు ఒక్కొక్కటిగా మృత్యుదేవత దిశగా అడుగులేస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లోని కూనో జాతీయవనంలో ఉన్న మగ చీతా తేజస్ మంగళవారం కన్నుమూసిందని అధికారులు వెల్లడించారు. దీంతో గత నాలుగు నెలల్లో మరణించిన చీతాల సంఖ్య ఏడుకు పెరిగింది. నాలుగేళ్ల వయసు ఉన్న తేజస్‌ను ఈ ఏడాది ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చారు. మరణించిన ఏడు చీతాల్లో నమీబియా చీతా జ్వాలకు జన్మించిన మూడు చీతా కూనలూ ఉన్నాయి.
దీంతో గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన చీతాల పునర్‌ఆగమన కార్యక్రమం నిర్వహణపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ‘వాటిల్లో అవి ఆధిపత్యం కోసం చేసుకున్న ఘర్షణల్లో గాయపడటం వల్లే తేజస్ మరణించి ఉంటుంది. మరణించేనాటికి ఇది ఇంకా ఎన్‌క్లోజర్‌లోనే ఉంది’ అని వైల్డ్‌లైఫ్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ జేఎస్ చౌహాన్ అంచనావేశారు. రెండు మగ చీతాలను అడవిలోకి వదిలేసిన మరుసటి రోజే ఇలా ఒకటి మరణించడంపై వన్యప్రాణి ప్రేమికులు ఆవేదన వ్యక్తంచేశారు.
చదవండి: ప్రాజెక్ట్ చీతా.. కొత్త పరేషాన్
Comments
Please login to add a commentAdd a comment