భోపాల్: ‘ప్రాజెక్టు చీతా’లో భాగంగా నమిబియా దేశం నుంచి తీసుకువచ్చిన మరో చితా ‘శౌర్య’ మధ్య ప్రదేశలోని కునో నేషనల్ పార్క్‌లో మృతి చెందింది. మంగళవారం 3.17 నిమిషాలకు ‘శౌర్య’ చీతా మరణించినట్లు ప్రాజెక్టు చీతా డైరెక్టర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. చీతా మృతికి సంబంధించిన కారణాలు తెలియరాలేదని అన్నారు. చీతాకు పోస్ట్ మార్టం చేసి మరణించడాకి గల కారణాన్ని చెబుతామని అన్నారు.
ఈరోజు(మంగవారం) ఉదయం నుంచి శౌర్య చీతా చాలా తీవ్ర ఆందోళనకరంగా అస్వస్థతతో ఉన్నట్లు కునో నేషనల్ పార్క్ సిబ్బంది గమనించింది. వెంటనే అధికారులు, పార్క్ సిబ్బంది స్పందించి చీతాకు చికిత్స అందిస్తూ పర్యవేక్షించారు. చీతాకు సీపీఆర్ కూడా అందించారు. కానీ, దురదృష్టవశాత్తు చీతా ‘శౌర్య’ మరణించిందని తెలిపారు.
Today, on 16th January, 2024 around 3:17 PM, Namibian Cheetah Shaurya passed away...Cause of death can be ascertained after Post Mortem: Director Lion Project pic.twitter.com/ISc2AlCNcy
— ANI (@ANI) January 16, 2024
ప్రధాన మంత్రి జన్మదినం సందర్భంగా ‘ప్రాజెక్టు చీతా’లో భాగంగా సెప్టెంబర్ 17, 2022న నమిబియా నుంచి 8 చీతాలు తీసుకువచ్చి కునో నేషనల్ పార్క్‌లో వదిలిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఫిబ్రవరి 18, 2023న మరో 12 చీతాలను దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చి కునో పార్క్‌లో విడిచిపెట్టారు. ఇప్పటివరకు ‘శౌర్య’తో మొత్తం 10 చీతాలు మృతి చెందటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment