Project Cheetah
-
ప్రాజెక్ట్ చిరుత.. పరాజిత
భారతదేశంలో అంతరించిపోయిన చిరుత జాతులను పునరుజ్జీవింపజేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రాజెక్ట్ చిరుత’ (ప్రాజెక్ట్ చీతా) ప్రశ్నార్థకంగా మారింది. అడవిలో వదిలిన చిరుతల్లో జీవించి ఉన్న ఒకే ఒక చిరుత పవన్ కొద్దినెలల క్రితం మృతి చెందడంతో ఈ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. వన్యప్రాణి ప్రేమికుల ఆనందోత్సాహాల మధ్య 2022 సెప్టెంబర్ 22న ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా ఆఫ్రికాలోని నమీబియా నుంచి ప్రత్యేక విమానంలో తీసుకొచ్చిన 8 చీతాలను కునో జాతీయ పార్కులో విడిచిపెట్టారు. వాటిలో మొట్టమొదటిది పవన్. ఆఫ్రికన్ చీతాలు సాధారణంగా 10 నుంచి 12 సంవత్సరాలపాటు అడవిలో జీవిస్తాయి. కానీ.. పవన్ ఆరేళ్ల వయసులోనే బతకలేక చనిపోయింది. దీంతో చీతా ప్రాజెక్టు మనుగడపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. – సాక్షి, అమరావతిసరైన సంరక్షణా చర్యలు లేవా! పవన్ మృతి చెందిన తర్వాత మిగిలి ఉన్న చీతాలన్నింటినీ ఎన్క్లోజర్లు, అడవిలా తీర్చిదిద్దిన ప్రాంతాల్లో ఉంచి వాటి ఆరోగ్యాన్ని సంరక్షిస్తున్నారు. మోడీ ప్రభుత్వం చేపట్టిన వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాల్లో చీతా ప్రాజెక్టు అతి పెద్దది. దేశంలోని చాలా వన్యప్రాణుల ప్రాజెక్టులకు సంబంధించిన నిధులను ఈ ప్రాజెక్టుకు మళ్లించి సుమారు 58 మిలియన్ డాలర్లను ఖర్చు పెట్టారు. అయితే, శాస్త్రీయ అధ్యయనం, సరైన సంరక్షణ చర్యలు లేకపోవడం వల్లే అత్యంత ఖరీదైన ఈ ప్రాజెక్టు విఫల దశలో ఉన్నట్టు చెబుతున్నారు. సరైన ప్రణాళిక, అవగాహన లేకుండా చీతాలను ఆఫ్రికా నుంచి తీసుకురావడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడినట్టు వన్యప్రాణుల నిపుణులు పేర్కొంటున్నారు. ఇలా చేసి ఉంటే.. ఆఫ్రికన్ చీతాలకు అనువుగా ఉండే అడవులను మొదట సిద్ధం చేసి ఆ తర్వాత వాటిని తీసుకురావాల్సి ఉంది. కానీ.. ముందే వాటిని తీసుకువచ్చి ఆ తర్వాత కునో జాతీయ పార్కు అందుకు అనువైనదని భావించి అందులో వదిలారు.కానీ.. కునో పార్కు వాటికి సరైన ఆవాసం కాదని తేలింది. అందుకే చీతాలు అందులో జీవించలేకపోయాయి. దీంతో కొన్ని గడ్డి మైదానాల్లోని ఫెన్సింగ్‌లు, క్యాప్టివ్ బ్రీడింగ్‌పై ఆధారపడ్డారు. కేవలం ప్రచారం కోసం పాకులాడడం తప్ప నిబద్ధత లోపించడంతో వన్యప్రాణుల ప్రాజెక్టులకు సంబంధించి భారతదేశం పరువు అంతర్జాతీయంగా మసకబారింది. అత్యంత వేగం చిరుతల ప్రత్యేకతచిరుతలు అత్యంత వేగంగా పరిగెత్తే జంతువులు. మూడు సెకన్లలోనే గంటకు 110 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం వీటి ప్రత్యేకత. 1967 వరకూ ఇవి మన దేశంలోనూ ఉన్నాయి. వాటి ఆవాసాలు కుచించుకుపోవడం, అడవులు తగ్గిపోవడం, వేటాడటం, సింహాలు, పులులు, చిరుతలు వాటి ఆహారం కోసం పోటీ పడుతుండడంతో క్రమేపీ అవి దేశంలో అంతరించిపోయాయి. ఇన్ఫెక్షన్లు, గాయాలతో.. దేశంలో వీటిని మళ్లీ పునరుజ్జీవింపచేసేందుకు నమీబియా, కెన్యా, దక్షిణాఫ్రికా సహా పలు ఆఫ్రికన్ దేశాలతో కేంద్ర ప్రభుత్వం దౌత్య మార్గాల్లో సంప్రదింపులు జరిపింది. ఇందుకోసం 2021లో ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి మన అడవుల్లో చీతాల పునరుత్పత్తిని ప్రారంభించి అడవిలో వాటి జనాభాను పెంచాలని భావించింది. అయితే.. తీసుకువచ్చిన చీతాలను అడవిలో వదిలిన తర్వాత అవి ప్రాణాంతకమైన సెప్టిసిమిమా వంటి ఇన్ఫెక్షన్ల బారిన పడ్డాయి. మరికొన్ని ప్రమాదాల వల్ల గాయాలపాలయ్యాయి. దీంతో వాటిని ఎన్‌క్లోజర్లలోనే ఉంచి పర్యవేక్షించారు. ప్రభుత్వం చీతా ప్రాజెక్టు చేపట్టిన లక్ష్యాన్ని సాధించాలంటే పర్యావరణ వ్యవస్థలో భాగమైన గడ్డి భూముల అడవుల్లో మనుగడ సాగిస్తేనే ఉపయోగం ఉంటుంది. అలాంటి వాతావరణం లేకపోవడంతో అడవిలో స్వేచ్ఛగా తిరుగుతూ మిగిలిన ఏకైక చీతా పవన్ మృతి చెందింది. అంతకుముందు 12 చీతాలు కూడా ఇలాగే మృత్యువాతపడ్డాయి. ప్రస్తుతం కునో నేషనల్ పార్కులో 12 చీతాలు, మరో 12 పిల్ల చీతాలు ఎన్క్లోజర్లలో ఉన్నాయి. వాటిని అడవిలోకి వదిలితే అవి బతుకుతాయో లేదోననే అనుమానాలు, భయాలతో వాటిని అక్కడే ఉంచి సంరక్షిస్తున్నారు. ఇలా సంరక్షణలో ఉన్న చీతాల వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని నిపుణులు చెబుతున్నారు. -
కునో నేషనల్ పార్క్‌లో మరో నమిబియా చీతా మృతి
భోపాల్: ‘ప్రాజెక్టు చీతా’లో భాగంగా నమిబియా దేశం నుంచి తీసుకువచ్చిన మరో చితా ‘శౌర్య’ మధ్య ప్రదేశలోని కునో నేషనల్ పార్క్‌లో మృతి చెందింది. మంగళవారం 3.17 నిమిషాలకు ‘శౌర్య’ చీతా మరణించినట్లు ప్రాజెక్టు చీతా డైరెక్టర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. చీతా మృతికి సంబంధించిన కారణాలు తెలియరాలేదని అన్నారు. చీతాకు పోస్ట్ మార్టం చేసి మరణించడాకి గల కారణాన్ని చెబుతామని అన్నారు. ఈరోజు(మంగవారం) ఉదయం నుంచి శౌర్య చీతా చాలా తీవ్ర ఆందోళనకరంగా అస్వస్థతతో ఉన్నట్లు కునో నేషనల్ పార్క్ సిబ్బంది గమనించింది. వెంటనే అధికారులు, పార్క్ సిబ్బంది స్పందించి చీతాకు చికిత్స అందిస్తూ పర్యవేక్షించారు. చీతాకు సీపీఆర్ కూడా అందించారు. కానీ, దురదృష్టవశాత్తు చీతా ‘శౌర్య’ మరణించిందని తెలిపారు. Today, on 16th January, 2024 around 3:17 PM, Namibian Cheetah Shaurya passed away...Cause of death can be ascertained after Post Mortem: Director Lion Project pic.twitter.com/ISc2AlCNcy — ANI (@ANI) January 16, 2024 ప్రధాన మంత్రి జన్మదినం సందర్భంగా ‘ప్రాజెక్టు చీతా’లో భాగంగా సెప్టెంబర్ 17, 2022న నమిబియా నుంచి 8 చీతాలు తీసుకువచ్చి కునో నేషనల్ పార్క్‌లో వదిలిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఫిబ్రవరి 18, 2023న మరో 12 చీతాలను దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చి కునో పార్క్‌లో విడిచిపెట్టారు. ఇప్పటివరకు ‘శౌర్య’తో మొత్తం 10 చీతాలు మృతి చెందటం గమనార్హం. చదవండి: ఆప్ మంత్రి వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఓవైసీ విమర్శలు -
కునో నేషనల్ పార్క్ లో మరో చీతా మృత్యువాత..
-
జవాబివ్వాల్సిన చిరుత ప్రశ్నలు!
దాదాపు ఏడు దశాబ్దాల క్రితం దేశంలో అంతరించిపోయిన వన్యప్రాణుల్ని మళ్ళీ పెంచిపోషించే ప్రయత్నం. పదినెలల క్రితం ఆర్భాటంగా మొదలైన ప్రాజెక్ట్. నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి 20 చీతాలను తీసుకువచ్చారు. గత సెప్టెంబర్ నుంచి ‘ప్రాజెక్ట్ చీతా’కు జరిగినంత హంగామా అంతా ఇంతా కాదు. కానీ, మధ్యప్రదేశ్‌లోని కూనో జాతీయోద్యానంలో విడిచి పెట్టాక 4 నెలల్లో 8 చీతాలు మరణించడం ఈ యత్నంలోని లోపాలను ఎత్తిచూపుతోంది. ప్రాజెక్ట్‌ను అమలు చేస్తున్న ‘జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ’ మాత్రం ప్రకృతి సహజ కారణాలతోనే ఈ చీతాలన్నీ చనిపోయాయంటోంది. ఆ మాట శాస్త్రీయంగా లేదు. నిపుణులు లేవనెత్తిన ప్రశ్నలే అందుకు సాక్ష్యం. చీతాల కదలికలు తెలుసుకొనేందుకు మెడకు బిగించిన రేడియో ఫ్రీక్వెన్సీ కాలర్ల వల్ల వాటికి గాయమై, అక్కడ క్రిములు చేరాయనీ, అదే తాజా మరణానికి దారి తీసిందన్న మాటలు ఆందోళన రేపుతున్నాయి. ప్రాజెక్ట్ చీతా భవితవ్యం, శాస్త్రీయత సందేహాస్పదమవుతున్నాయి. నిజానికి 2009లో జైరామ్ రమేశ్ పర్యావరణ మంత్రిగా ఉన్నప్పుడే ఈ చీతాల పునరావాస ఆలోచన జరిగింది. గత ఏడాది అది ఆచరణలోకి వచ్చింది. ఈ సెప్టెంబర్‌తో ప్రాజెక్ట్ చీతాకు ఏడాది పూర్తి కానుంది. నిరుడు సరిగ్గా ఆ సమయంలోనే నమీబియా నుంచి 8 చీతాలు భారత్‌కు చేరాయి. ఆ పైన ఈ ఫిబ్రవరిలో మరో 12 చీతాలను దక్షిణాఫ్రికా నుంచి ప్రభుత్వం రప్పించింది. దాదాపు 35 చీతాలతో అవి స్వయం సమృద్ధమయ్యే దాకా రానున్న దశాబ్దకాలంలో ఏటా 5 నుంచి 10 చీతాల్ని తేవాలన్నది యోచన. తొలి ఏళ్ళలో ఈ ప్రయోగం పెద్ద విజయం సాధించకపోవచ్చని ఆది నుంచీ అనుకుంటున్నదే. అది కాక అసలీ ప్రాజెక్ట్ ఏర్పాటులోనే ప్రాథమిక లోపాలున్నాయని విమర్శకుల వాదన. వేగంగా పరుగులు తీసే చీతాలకు కూనో ప్రాంతం సరిపోదన్నది ఒకటైతే, వాటిని దీర్ఘకాలం క్వారంటైన్లో ఉంచడం వల్ల ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా సిద్ధపడే సామర్థ్యం దెబ్బతింది. మానసికంగా సర్దుకుపోవడమూ సమస్య అయింది. అలా అవి సులభంగా బలి అవుతున్నాయి. తెచ్చిన చీతాలకు తోడు కొత్తగా ఇక్కడ పుట్టిన నాలుగింటిలో 3 కూనలు చనిపోయాయి. గాయం కథలో శాస్త్రీయత లేదని ప్రభుత్వం అంటున్నా, ఈ అంశాలపై విచారించి, మిగిలిన చీతాలన్నిటికీ పూర్తిస్థాయి శారీరక పరీక్షలు చేయాలని నిపుణుల సంఘం సిఫార్సు చేయడం గమ నార్హం. స్వేచ్ఛగా తిరిగేవాటిని పట్టి, కాలర్లు తీసేసి, ఈ పరీక్షలు చేయడం శ్రమతో కూడిన పని. సమ యమూ చాలానే పడుతుంది. అప్పుడు కానీ, ప్రాజెక్ట్ చీతా భవితవ్యం తేలదు. చీతాల కోసం అసలు మనం ఎంచుకున్న కూనో ఉద్యానమే చిన్నదని నమీబియా నిపుణులు కుండబద్దలు కొట్టారు. ఆఫ్రికా లాంటి దేశాల్లో ఒక్కొక్క చీతా వేటాడి తినడానికీ, తిరగడానికీ సగటున 100 చదరపు కి.మీ.ల విశాల ప్రాంతం ఉంటుంది. కానీ, మన ‘కూనో జాతీయోద్యానం’లో సగటున మూడు చీతాలకు కలిపి 100 చదరపు కి.మీ.ల జాగాయే ఉంది. అలాగే, చీతా స్వేచ్ఛగా సంచరించడానికీ, ఆహార సేకరణ, పునరుత్పత్తికీ నిర్నిరోధమైన 1600 చదరపు కి.మీ.ల పైగా విస్తీర్ణం కావాలి. కూనో జాతీయోద్యానం మొత్తం వైశాల్యం చూసినా 750 చదరపు కి.మీ.లే! ఎలా చూసినా దేశంలో చీతాల పునఃప్రవేశానికి విస్తీర్ణం సరిపోని ఈ ఉద్యానాన్ని ఎందుకు ఎంచుకున్నారనేది బేతాళ ప్రశ్న. నమీబియా, దక్షిణాఫ్రికాల్లో చీతాలు చుట్టూ కంచె ఉన్న రిజర్వుల్లో ఉంటే, మన దగ్గర వాటిని కంచెలేని సహజమైన, అరణ్య వాతావరణంలో పెరగనివ్వాలని యోచన. కూనో జాతీయోద్యానంలోకి వదిలిన చిరుతలు కొన్ని ఆ పరిధిని దాటి, జనావాసాల్లోకి జొరబడిన వార్తలొచ్చాయి. ఇది పోనుపోనూ మనిషికీ, వన్యప్రాణులకూ మధ్య ఘర్షణకు దారి తీయవచ్చు. ప్రాజెక్ట్ చీతాకు రూపకల్పన చేస్తున్నప్పుడు ఈ సంగతులేవీ లెక్కలోకి తీసుకోకపోవడం ఆశ్చర్యకరమే! అధికారులు మాత్రం కూనో రిజర్వ్‌లో కావాల్సినంత స్థలం, చీతాలకు తగినంత ఆహారం ఉన్నాయంటున్నారు. మధ్యప్రదేశ్‌లోనే గాంధీసాగర్లో రెండో రిజర్వ్‌ను అభివృద్ధి చేసి, చీతా పునరావాస కేంద్రం స్థాపిస్థామని చెబుతున్నారు. అవన్నీ నిజమైతే మంచిదే. కానీ, పెద్ద పులులు, చిరుతలతో పోలిస్తే చీతాలు మహా సున్నితం. అడవిలో అవి తీవ్రంగా గాయపడే ప్రమాదం ఎక్కువ. ప్రస్తుతానికి మన దగ్గర వీటికి సింహాలు, చిరుత పులుల నుంచి పోటీ లేదు గనక కొంత నయం. కాలగతిలో ఇవి మన పరిస్థితులకు అలవాటు పడి భారత్‌ను తమ కొత్త ఆవాసంగా మారుస్తాయేమో చూడాలి. అరణ్యాల్లో చీతా కూనలు బతికేరేటు 10 శాతమేనట! అంతే శాతం పెరిగిపెద్దవుతాయి. కాబట్టి మరణాలు సహజమేనని ప్రభుత్వ వాదన. కానీ ఇప్పటిదాకా కూనోలో చనిపోయిన చీతాల్లో ఒక్కటి మినహా అన్నీ పూర్తి అరణ్యంలో కాక ఒక చ.కి.మీ. విస్తీర్ణంలో పెట్టిన ‘బోమస్’ అనే ప్రత్యేక ఎన్క్లో జర్లలో ఉన్నవే. కాబట్టి, లోతుగా పరిశీలన చేయాలి. తక్షణమే ప్రాజెక్ట్ చీతా నుంచి పాఠాలు నేర్చు కోవాలి. జరిగిన పొరపాట్లను గుర్తించి, వాస్తవాలను ప్రజాక్షేత్రంలో పంచుకోవడం మరీ అవసరం. తద్వారా సంబంధిత నిపుణులతో పరిష్కారాలు కనుగొనవచ్చు. చీతాల నిర్వహణలో స్థానిక నైపుణ్యం లేదు గనక నిర్ణీత నిపుణుల అనుభవాన్ని ఆసరా చేసుకోవాలి. అలా కాక రోగాన్ని దాచిపెట్టి, వైద్యం చేస్తే ఫలితం లేకపోగా, వికటించే ప్రమాదం ఉంది. చీతాల పునరావాసం, పునరు త్పత్తి సవ్యంగా సాగాలంటే అధికారులు భేషజాలు వదలాలి. లేదంటే, మొదటికే మోసం వస్తుంది. అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిన తొలి ఖండాంతర చీతా పునరావాస ప్రాజెక్ట్ అర్ధంతరంగా అంతిమ అధ్యాయానికి చేరుకుంటుంది. అలా జరగరాదంటే చిరుత ప్రశ్నలకు శాస్త్రీయమైన జవాబు కావాలి! -
కునో పార్కులో మరో చిరుత మృతి.. ఇక మిగిలినవి పదే!
భోపాల్: నమీబియా నుంచి భారత్‌కు తీసుకొచ్చిన చిరుత పులులలో మరొకటి(సూరజ్) శుక్రవారం మృత్యువాత పడింది. గడిచిన ఐదు నెలల్లో ఇప్పటివరకు మొత్తం 7 చిరుత పులులు చనిపోగా సూరజ్ మృతితో ఆ సంఖ్య ఎనిమిదికి చేరింది. దాని వయసు నాలుగు సంవత్సరాలు. ప్రాజెక్ట్ చీతాలో భాగంగా ఆఫ్రికా నుంచి తీసుకొచ్చిన చిరుత పులులు ఒక్కొక్కొటిగా మృత్యువాత పడుతూ వచ్చాయి. నాలుగు రోజుల క్రితం మగ చిరుత తేజాస్ చనిపోయిన సంఘటన మరిచిపోక ముందే సూరజ్ చనిపోవడం కునో జాతీయవనం వర్గాలను కలవరపెడుతోంది. సూరజ్ మరణానికి కారణాలు ఏమిటనేది ఇంకా తెలియాల్సి ఉంది. అంతకుముందు ఆడ చిరుత సియాయ(జ్వాల) నాలుగు చిరుత కూనలకు జన్మనివ్వగా అందులో రెండు చనిపోయిన సంగతి తెలిసిందే. అవి డీహైడ్రేషన్ కారణంగా చనిపోయాయని జాతీయ వనం సిబ్బంది తెలియజేశారు. తేజాస్ మాత్రం కొట్లాటలో గాయపడి చనిపోయింది. సూరజ్ మరణంతో ఆఫ్రికా నుంచి తీసుకొచ్చిన చిరుతల్లో మొత్తం ఎనిమిది చనిపోగా కూనో నేషనల్ పార్కులో ప్రస్తుతం పది చిరుతలు మాత్రమే మిగిలున్నాయి. ఇది కూడా చదవండి: చితిలో సగం కాలిన శవాన్ని తిన్న తాగుబోతులు.. -
చితికి చేరుతున్న చీతాలు.. ‘ప్రాజెక్ట్ చీతా’పై కొత్త కమిటీ
భోపాల్: భారత్‌లో అంతరించిపోయిన చీతాల సంతతిని పెంచేందుకు నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి చీతాలను తీసుకొచ్చిన కార్యక్రమంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. మధ్యప్రదేశ్‌లోని కూనో జాతీయ వనంలో చీతాలు వరసబెట్టి మృత్యుబాట పడుతున్నాయి. ఇప్పటి వరకు విదేశాల నుంచి భారత్‌కు చీతాల తరలింపు ప్రాజెక్ట్ చేపట్టిననాటి నుంచి మూడు చీతాలు, మూడు చీతా కూనలు ప్రాణాలు కోల్పోయాయి. కేవలం రెండున్నర నెలల వ్యవధిలోనే మొత్తం మరణాల సంఖ్య ఆరుకు పెరిగింది. చీతాల మరణాలు ఆందోళకరంగా మారడంతో.. ప్రాజెక్ట్ చీతా అమలును పర్యవేక్షించేందుకు జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో కూడిన కొత్త స్టీరింగ్ కమిటీని కేంద్రం నియమించింది. 11 మంది సభ్యులతో కూడిన చిరుత ప్రాజెక్ట్ స్టీరింగ్ కమిటీని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఏర్పాటు చేసింది. దీనికి గ్లోబల్ టైగర్ ఫోరమ్ సెక్రటరీ జనరల్ రాజేష్ గోపాల్ చైర్మన్‌గా ఉన్నారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శితో సమావేశం అనంతరం దీనిని ఏర్పాటు చేశారు. చదవండి: తప్పిపోయిన 'ఆశ'.. ప్రాజెక్టు చీతా బృందంపై గ్రామస్థుల దాడి కొత్తగా ఏర్పడిన కమిటీ మధ్యప్రదేశ్‌ల్లో ప్రవేశ పెట్టిన చీతాల పురోగతిని అంచనా వేసి పర్యవేక్షిస్తుంది. వాటి మనుగడపై ఎన్టీసీఏకు పలు సూచనలు అందించనుంది. అలాగే ఎకో టూరిజం కోసం చిరుత ఆవాసాలను తెరవడంపై కూడా నిర్ణయం తీసుకోనుంది. సంబంధిత నిబంధనలను సిఫారసు చేయనుంది. ఈ కమిటీ రెండు సంవత్సరాల పాటు కొనసాగనుంది. ప్రస్తుతం కునో నేషనల్ పార్క్ ప్రస్తుతం 18 చిరులు, ఒక కూన చిత ఉంది. కాగా నమీబియా నుంచి తీసుకొచ్చేటపుడే మూత్రపిండ సంబంధ వ్యాధితో బాధపడుతున్న సాశా అనే చీతా మార్చి 27న చనిపోయింది. తర్వాత దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన ఉదయ్ అనే చీతా ఏప్రిల్ 13న మరణించింది. దక్షిణాఫ్రికా నుంచి తెచ్చిన దక్ష అనే మరో చీతా కలయిక కోసం మరో మగ చీతాతో జరిగిన పోరాటంలో తీవ్ర గాయాలపాలై ఈనెల తొమ్మిదో తేదీన తుదిశ్వాస విడిచింది. డీహైడ్రేషన్.. గత ఏడాది సెప్టెంబర్‌లో నమీబియా నుంచి తీసుకొచ్చిన సియాయా అనే ఆడ చీతాకు జ్వాల అని నామకరణం చేసి కూనో నేషనల్ పార్క్‌లో వదిలిపెట్టారు. అది మార్చి నెలలో నాలుగు కూనలకు జన్మనిచ్చింది. కాగా సూర్యప్రతాపం కారణంగా కూనో వనంలో పగటిపూట వేడి దాదాపు 47 డిగ్రీల సెల్సియస్‌గా ఉండటంతో డీహైడ్రేషన్ కారణంగా మే 23న తొలి కూన మృత్యువాత పడింది. దీంతో వాటిని వేరే చోటుకు తరలించాలని అధికారులు భావించారు. ఆలోపే గురువారం మరో రెండు కూనలు మరణించాయి. వాస్తవానికి ఆ రెండింటినీ ప్రత్యేక సంరక్షణలో ఉంచామని అయినా కాపాడలేకపోయామని, నాలుగో కూనను అత్యంత జాగ్రత్తగా చూసుకుంటున్నామని పర్యవేక్షక బృందం గురువారం ప్రకటించింది. -
తప్పిపోయిన 'ఆశ'.. ప్రాజెక్టు చీతా బృందంపై గ్రామస్థుల దాడి
మధ్యప్రదేశ్ కునే నేషనల్ పార్క్‌లో ప్రాజెక్ట్ చీతా బృందంపై గ్రామస్థులు దాడి చేశారు. రక్షిత ప్రాంతం నుంచి తప్పిపోయిన చీత 'ఆశ' కోసం అధికారుల రాత్రి వేళలో గస్తీ నిర్వహించింది. ఈ క్రమంలో దారిదోపిడి దొంగలు అనుకుని స్థానిక గ్రామస్థులు ఆ బృందంపై దాడి చేశారు. ప్రాజెక్టు చీతాలో భాగంగా మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో చీతాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో చీత ఆశ రక్షిత ప్రాంతం నుంచి బయటకు తప్పిపోయింది. చీత మెడకు కట్టిన జీపీఎస్ ట్రాకర్‌ను గమనిస్తూ ఫారెస్ట్ అధికార బృందం రాత్రి వేళలో గస్తీ నిర్వహిస్తోంది. బురఖేడా గ్రామ సమీపంలో చీత కోసం వెతుకుతున్నారు. గ్రామం చుట్టూ అప్పటికే నాలుగు సార్లు తిరిగారు. అయితే పశువులను దొంగలించిన ఘటనలు ఇటీవల ఆ గ్రామంలో జరిగిన నేపథ్యంలో.. చీత కోసం గాలిస్తున్న అధికారులను దొంగలని స్థానికులు భావించారు. అంతేగాక వారు ధరించిన దుస్తులు కూడా వారి అనుమానాలను మరింత పెంచాయి. దీంతో రాళ్లతో, కర్రలతో చీతా బృందంపై దాడి చేశారు గ్రామస్థులు. ఈ ఘటనలో నలుగురు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. అటవీ శాఖ వాహనం కూడా పాడైపోయింది. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. చదవండి: రూ.లక్ష ఫోన్ కోసం డ్యామ్‌లో నీటిని ఎత్తిపోశాడు.. తీరా చూస్తే.. -
Project Cheetah: చీతాల మరణం ఊహించిందే!
న్యూఢిల్లీ: కునో నేషనల్ పార్క్‌లో చీతాల మనుగడ సాధ్యమేనా?.. ప్రాజెక్ట్ చీతాను కేంద్రం ప్రారంభించినప్పుడు చాలామంది మేధావులు వ్యక్తం వేసిన ప్రశ్న ఇది. అయితే.. కేంద్రం ఈ ప్రాజెక్టును సవాల్‌గా తీసుకుంది. ప్రతిష్టాత్మకంగా దాదాపు వంద కోట్ల ఖర్చుతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తోంది. సౌతాఫ్రికా, నమీబియా నుంచి భారత్‌కు రప్పించిన 20 చీతాలను నెలల పాటు పర్యవేక్షించి.. కునోలోకి వదిలింది. కానీ, అంతా సవ్యంగా సాగిపోతుందనుకున్న సమయంలో.. నెల వ్యవధిలోనే రెండు చీతాలు కన్నుమూశాయి. ఆ రెండూ ఇన్ఫెక్షన్లతోనే కన్నుమూశాయన్న అటవీ అధికారులు ప్రకటించారు. అయితే ఈ పరిస్థితిపై సౌతాఫ్రికా అటవీ శాఖ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలపైనే కునో అధికారులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. సౌతాఫ్రికా ఫారెస్ట్, ఫిషరీస్, ఎన్విరాన్మెంట్ విభాగం(DFFE).. మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్క్‌లో సంభవించిన చీతాల మరణంపై స్పందించారు. ఈ ప్రాజెక్టును చేపట్టినప్పుడే.. మరణాలను తాము ఊహించామని వారంటున్నారు. అందుకు వాతావరణ మార్పులే ప్రధాన కారణంగా భావించవచ్చని చెబుతున్నారు. ► ప్రాజెక్ట్ చీతాలో భాగంగా.. నమీబియా, సౌతాఫ్రికా నుంచి భారత్ చీతాలను తెప్పించుకుంది. ఆ రీలొకేటింగ్ టైంలోనే మేం ఈ పరిస్థితిని అంచనా వేశాం. సాధారణంగా వాతావరణ మార్పులను ఒక్కోసారి అవి తట్టుకోలేవు. విపరీతమైన మార్పుల కారణంగానే అవి చనిపోవచ్చు. అలా కునోలో చీతాల మరణాలు మేం ఊహించినవే అని తెలిపారు. అయితే ఏదైనా జబ్బు పడి అవి చనిపోతున్నాయా?, సాధారణ ఇన్ఫెక్షన్లతోనే చనిపోతున్నాయా? అనేద ఇంకా తేలాల్సి ఉంది. ► భారత్ చేపట్టిన ప్రాజెక్ట్ చీతా.. ఒక రిస్కీ ఆపరేషన్. పైగా ప్రస్తుతం అది ఇంకా క్రిటికల్ ఫేజ్‌కు చేరుకుంది. ఎందుకంటే చీతాలు ఇప్పుడు పరిమిత ప్రాంతంలో లేవు. అవి సంచరించే సరిహద్దులు పెరిగిపోయాయి. కాబట్టి, ఎప్పటికప్పుడు వాటి ఆరోగ్యం గురించి పర్యవేక్షించడం వాటి సంరక్షకులకు కష్టతరంగా మారొచ్చు. అదే విధంగా వాటికి అయ్యే గాయాల్ని కూడా పర్యవేక్షించడం కష్టమే అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ► సౌతాఫ్రికాలో చీతాలను భారీ ఎన్‌క్లోజర్‌లో ఉంచుతారు. రోజుకు రెండుసార్లు వాటిని పరిశీలిస్తారు. ఒకవేళ అడవిలో ఉంటే.. బృందాలు వాటిని అనుసరిస్తూ ఎప్పటికప్పుడు వాటిని పర్యవేక్షిస్తుంటాయి. కానీ, కునో ప్రాంతం ఫెన్సింగ్ రక్షిత ప్రాంతం కాదు. అంతేకాదు.. చీతాలకు పోటీగా చిరుతలు, తోడేళ్లు, ఎలుగు బంట్లు, హైనాలు సంచరిస్తుంటాయి. వాటి నుంచి కూడా ముప్పు పొంచి ఉండొచ్చు. ► వివిధ రకాల వాతావరణాల్లో వివిధ రకాల జంతువులను పరిరక్షించడం అతి పెద్ద సవాల్. చీతాల సంరక్షణ మరింత సంక్లిష్టంతో కూడుకున్నది. ఆవాసానికి అలవాటుపడితేనే అవి మనుగడ సాగించగలవని, అప్పటి వరకు వాటిని దగ్గరగా పర్యవేక్షించడమే మంచిదని కునో అధికారులకు సౌతాఫ్రికా అటవీ అధికారులు సూచిస్తున్నారు. ► అయితే ఈ ప్రకటనపై కునో అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. ► ప్రాజెక్ట్ చీతా చేపట్టిన టైంలోనే.. కునో పార్క్ చీతాల సంచారం, వేటకు సరిపోదని కొందరు నిపుణులు అభిప్రాయపడ్డారు. చీతాలకు బదులు త్వరగా, ఎక్కువగా అంతరించి పోయే ప్రమాదం ఉన్న జంతువులను పరిరక్షించే ప్రాజెక్టును చేపట్టడం మేలని సూచిస్తున్నారు. గిర్ జాతీయ పార్కు నుంచి కొన్ని సింహాలను.. కునో పార్కులో ప్రవేశపెడితే బాగుంటుందని కొందరు సూచించారు కూడా. ఇదీ చదవండి: భారత్ శాంతి మంత్ర