న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాల రాకతో మన దేశంలో వన్యప్రాణుల వైవిధ్యానికి మరింత ఊతం లభించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. చీతాల రాకపై కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ చేసిన ట్వీట్‌ను మోదీ ఆదివారం తన ట్విట్టర్ ఖాతాలో ట్యాగ్ చేశారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో ‘ప్రాజెక్టు చీతా’ మరో మైలురాయికి చేరుకుందని భూపేంద్ర యాదవ్ తన ట్వీట్‌లో వెల్లడించారు. దక్షిణాఫ్రికా నుంచి ప్రత్యేక విమానంలో రప్పించిన 12 చీతాలను శనివారం మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులో క్వారంటైన్ ఎన్‌క్లోజర్‌లో చేర్చిన సంగతి తెలిసిందే.
లద్ధాఖ్‌లో జీవనం మరింత సులభతరం
కేంద్ర పాలిత ప్రాంతమైన లద్ధాఖ్‌లో ప్రజల జీవనాన్ని మరింత సులభతరంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తోందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. 4.1 కిలోమీటర్ల పొడవైన షిన్‌కున్ లా సొరంగం నిర్మాణానికి రూ.1,681.51 కోట్లు కేటాయించడానికి కేంద్రం అంగీకరించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తూ లద్ధాఖ్ ఎంపీ జామ్‌యాంగ్ సెరింగ్ చేసిన ట్వీట్‌ను మోదీ ట్యాగ్ చేశారు.
ఛత్రపతి ధైర్యసాహసాలు స్ఫూర్తిదాయకం
మరాఠా సామ్రాజ్య వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ ప్రదర్శించిన ధైర్యసాహసాలు, ప్రజలకు అందించిన సుపరిపాలన మనకు స్ఫూర్తిదాయకమని ప్రధాని మోదీ కొనియాడారు. ఈ మేరకు ఆదివారం ట్వీట్ చేశారు. శివాజీ జయంతి సందర్భంగా మోదీ ఘనంగా నివాళులరి్పంచారు.
Comments
Please login to add a commentAdd a comment