సాక్షి, బెంగళూరు : ఎలుగు బంటి ఎంత బలంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దానికి కోపం వచ్చిందంటే చీల్చిపారేస్తుంది. అలాంటి ఎలుగుబంటిని బంధించి తమ ఆధీనంలో ఉంచుకొని కోతిలాగా ఆడించి, డ్యాన్స్‌లు చేయించి డబ్బు సంపాధించుకునే కొన్ని ప్రత్యేక తెగలు ఉన్నాయి. అదృష్టం కొద్ది వణ్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం అలాంటి ఎలుగు బంటులకు విముక్తిని కలిగించి వాటికి పునరావాసం ఏర్పాటు చేసే ప్రాజెక్టుకు ఒకటి ప్రారంభమైంది. దీంతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 628 ఎలుగుబంట్లకు స్వేచ్ఛను ఇచ్చినట్లయింది. అలా దేశంలో ఒకరి చేతిలో బందీగా ఉండి డ్యాన్సులు వేసే చివరి ఎలుగుబంటికి విముక్తి కలిగించి నేటికి ఏడేళ్లు.
ఈ సందర్భంగా దాదాపు చిన్నతనం నుంచి నానా ఇబ్బందులు పడి, గాయాలపాలై మానిసిక స్థితి కూడా దెబ్బతిన్న రాజు అనే ఎలుగుబంటి స్వేచ్ఛను పొందిన ఏడేళ్ల సందర్భంగా ఇప్పుడిప్పుడే తన సహజ స్థితిని పొందుతోంది. 2009లో కర్ణాటకలోని చిక్కా హరావలి అనే ప్రాంతంలో రాజును విడిపించారు. ప్రస్తుతం బన్నేర్‌ఘట్టా ప్రాంతంలో దానికి అయిన గాయాలకు చికిత్సను అందించడంతోపాటు దానికున్న సహజ సిద్ధ స్వభావం తిరిగొచ్చేలా ప్రయత్నిస్తున్నారు. ఈ ఎలుగుకు వైద్యం చేసిన డాక్టర్లు స్పందిస్తూ కలందర్ అనే కమ్యూనిటికి చెందిన వారు దానిని బంధించి చెప్పరాని విధంగా టార్చర్ పెట్టారని, దాని చర్మం లోపలి నుంచి కాలుతున్న సన్నటి తీగను కుచ్చి దానికి ఒక తాడును కట్టి ఎలుగును తమ నియంత్రణలో పెట్టుకున్నారని వివరించారు. దానిని ఆడించాలనుకున్న ప్రతిసారి ఆ తీగకు కట్టిన తాడు లాగడంతో ఆ నొప్పికి ఆ ఎలుగు చెప్పినట్లు చేసేదని, ఆ క్రమంలో దానికి అంతర్గతంగా చాలా గాయాలు అయ్యాయని అన్నారు. ప్రస్తుతం ఆ ఎలుగు కోలుకుంటుందని వివరించారు.
ఎట్టకేలకు ఆ ఎలుగుబంటి కోలుకుంది
Published Tue, Dec 19 2017 10:21 AM | Last Updated on Tue, Dec 19 2017 10:21 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment