వీకెండ్ కావడంతో ఎంజాయ్ చేసేందుకు పర్యాటకులు బీచ్‌కు వెళ్లారు. ఇంతలో వారికి ఊహించని ప్రతి ఘటన ఎదురైంది. బీచ్‌లో ఉన్న పర్యాటకులను రెండు సముద్ర సింహాలు వెంటపడి మరీ తరిమాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. శాన్ డియాగోలోని లాజోల్లా ప్రాంతంలో ఉన్న ఓ బీచ్‌లో పర్యాటకులు సేద తీరుతున్నారు. నీటిలో ఈత కొడుతూ కోరింతలతో ఎంజాయ్ చేస్తున్నారు. బీచ్‌లో పెద్దగా అరుస్తూ పరుగులు తీశారు. కాగా, అదే సమయంలో అక్కడే రెండు సముద్ర సింహాలు నిద్రపోతున్నాయి. ఇంతలో ఓ మహిళ వాటిని ఫొటోలు తీసుకేందుకు ప్రయత్నించింది. గాఢ నిద్రలో ఉన్న సముద్ర సింహాలను డిస్టర్బ్ చేసింది. దీంతో, రెచ్చిపోయిన సముద్ర సింహాలు ఆవేశంతో మహిళతో పాటుగా అక్కడున్న వారి వెంటపడ్డాయి.
బీచ్‌లో పర్యటకులను తరిమాయి. దాడి చేసే ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలో భయపడిన పర్యాటకులు పరుగులు తీశారు. ఇంతలో బీచ్ వద్ద ఉన్న సెక్యూర్టీ సిబ్బంది రంగంలోకి దిగి వాటిని సముద్రంలోకి వెళ్లేలా రూట్ మళ్లించారు. ఎవరూ గాయపడకుండా.. జాగ్రత్తపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయగా ట్రెండింగ్‌లో నిలిచింది. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
Sea lions fed up, chase beach goers off their turf in La Jolla, California. pic.twitter.com/tC7AvQrj0I
— Mike Sington (@MikeSington) July 10, 2022
ఇది కూడా చదవండి: బ్రిటన్ పీఎం రేసులో భారత సంతతి రిషి.. పాత వీడియోతో విమర్శలు
Comments
Please login to add a commentAdd a comment