Beach Sand
-
నల్లగా మారిన విశాఖ సాగర తీరంలోని ఇసుక
-
బీచ్‌లో ఎంజాయ్ చేస్తుండగా ఊహించని షాక్.. భయంతో పరుగో పరుగు
వీకెండ్ కావడంతో ఎంజాయ్ చేసేందుకు పర్యాటకులు బీచ్‌కు వెళ్లారు. ఇంతలో వారికి ఊహించని ప్రతి ఘటన ఎదురైంది. బీచ్‌లో ఉన్న పర్యాటకులను రెండు సముద్ర సింహాలు వెంటపడి మరీ తరిమాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. శాన్ డియాగోలోని లాజోల్లా ప్రాంతంలో ఉన్న ఓ బీచ్‌లో పర్యాటకులు సేద తీరుతున్నారు. నీటిలో ఈత కొడుతూ కోరింతలతో ఎంజాయ్ చేస్తున్నారు. బీచ్‌లో పెద్దగా అరుస్తూ పరుగులు తీశారు. కాగా, అదే సమయంలో అక్కడే రెండు సముద్ర సింహాలు నిద్రపోతున్నాయి. ఇంతలో ఓ మహిళ వాటిని ఫొటోలు తీసుకేందుకు ప్రయత్నించింది. గాఢ నిద్రలో ఉన్న సముద్ర సింహాలను డిస్టర్బ్ చేసింది. దీంతో, రెచ్చిపోయిన సముద్ర సింహాలు ఆవేశంతో మహిళతో పాటుగా అక్కడున్న వారి వెంటపడ్డాయి. బీచ్‌లో పర్యటకులను తరిమాయి. దాడి చేసే ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలో భయపడిన పర్యాటకులు పరుగులు తీశారు. ఇంతలో బీచ్ వద్ద ఉన్న సెక్యూర్టీ సిబ్బంది రంగంలోకి దిగి వాటిని సముద్రంలోకి వెళ్లేలా రూట్ మళ్లించారు. ఎవరూ గాయపడకుండా.. జాగ్రత్తపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయగా ట్రెండింగ్‌లో నిలిచింది. నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. Sea lions fed up, chase beach goers off their turf in La Jolla, California. pic.twitter.com/tC7AvQrj0I — Mike Sington (@MikeSington) July 10, 2022 ఇది కూడా చదవండి: బ్రిటన్ పీఎం రేసులో భారత సంతతి రిషి.. పాత వీడియోతో విమర్శలు -
అరుదైన ఖనిజాల వేటలో ఎన్ఎండీసీ..
♦ బీచ్‌శాండ్, భూగర్భ ఖనిజాలపై దృష్టి ♦ దేశంలో బంగారం శుద్ధి కర్మాగారం ♦ ఆటమిక్ డెరైక్టరేట్‌తో సంప్రదింపులు హైదరాబాద్: మైనింగ్ రంగ దిగ్గజం ఎన్ఎండీసీ అరుదైన భూగర్భ ఖనిజాలతో పాటు బీచ్ శాండ్ మైనింగ్‌లోకి కూడా ప్రవేశించనుంది. ఈ భూగర్భ ఖనిజాలు కొన్నింట్లో రేడియోధార్మికత వెలువడే అవకాశం ఉన్నందున ఈ మేరకు అనుమతులకై ఆటమిక్ మినరల్ డెరైక్టరేట్‌ను (ఏఎండీ) సంప్రదించే పనిలో ఉంది. ఇప్పటి వరకు ఎన్ఎండీసీ ఇనుప ఖనిజంతోపాటు కొంతమేర వజ్రాల అన్వేషణలో మాత్రమే నిమగ్నమైంది. ఇక నుంచి అరుదైన ఖనిజాలు, బంగారంతోపాటు బీచ్ శాండ్ తవ్వకాలపైనా దృష్టిసారించనున్నట్టు సంస్థ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. టాంజానియాలో సంస్థకు ఇప్పటికే బంగారు గని ఉంది. దీంతో అక్కడ పైలట్ ప్రాతిపదికన బంగారం శుద్ధి చేసే కేంద్రాన్ని నెలకొల్పాలని ఎన్ఎండీసీ యోచిస్తోంది. ఈ ప్లాంటు ఏర్పాటు పనులను ఒక ఏజెన్సీకి అప్పగించే ఉద్దేశంతో అంతర్జాతీయ స్థాయి సంస్థలను ఈ ఏడాదే ఆహ్వానించనున్నారు కూడా. ఐదారు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని, టెండరు ప్రక్రియ పూర్తయిన తరవాత 12-18 నెలల్లో ప్లాంటులో కార్యకలాపాలు ప్రారంభమవుతాయని సదరు అధికారి వెల్లడించారు. స్టీలు ప్లాంటులో వాటా విక్రయం.. అనుబంధ కంపెనీ అయిన జార్ఖండ్ కొల్హన్ స్టీల్‌లో వాటాను ఎస్పీవీ ద్వారా విక్రయించాలని సంస్థ భావిస్తోంది. స్టీలు ప్లాంటును ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే కంపెనీకి ఈ వాటాను అమ్మాలని ఎన్ఎండీసీ నిర్ణయించింది. ఇనుప ఖనిజం సరఫరా, గనుల నిర్వహణకు ఎన్ఎండీసీ పరిమితం కానుంది. జార్ఖండ్ ప్రభుత్వం స్థలాన్ని సమకూరుస్తుందని, అనుమతులను తాము సంపాదిస్తామని మైనింగ్ దిగ్గజం వెల్లడించింది. ఈ స్టీలు ప్లాంటుకు తాము ఎటువంటి మొత్తాన్ని పెట్టుబడి చేసే ఉద్ధేశం లేదని సంస్థ ఉన్నతాధికారి స్పష్టం చేశారు. -
సర్కార్ కు హైకోర్టులో చుక్కెదురు
ట్రైమెక్స్ మైనింగ్ కార్యకలాపాల నిలిపివేతపై స్టే సాక్షి, హైదరాబాద్: శ్రీకాకుళం జిల్లాలో ట్రైమెక్స్ శాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ చేపట్టిన బీచ్ శాండ్ తవ్వకాల నిలిపివేత వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఈ జిల్లాలోని గార మండలం వత్సవలస, తోనంగి పరిధిలోని 387 ఎకరాల్లో అనుమతులు లేకుండా బీచ్ శాండ్ తవ్వకాలు చేపట్టి, అక్రమ ఎగుమతులు చేశారంటూ ట్రైమెక్స్ మైనింగ్ కార్యకలాపాలను నిలిపేస్తూ రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన మెమో అమలుపై తాత్కాలిక స్టే విధించింది. ప్రభుత్వం ఎత్తిచూపిన ఉల్లంఘనలను సరిదిద్దుకునేందుకు నిబంధనల ప్రకారం 60 రోజుల నోటీసును జారీ చేయనందున మెమో అమలును నిలిపేస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. తదుపరి విచారణను జూన్‌కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. -
కాకినాడలో బీచ్ శాండ్ ధెరపి