కప్ప మిణుగురును మింగితే : వైరల్ వీడియో | frog swallows firefly? Rare video gives the answer | Sakshi
Sakshi News home page

కప్ప మిణుగురును మింగితే: వైరల్ వీడియో

Published Fri, Sep 11 2020 5:05 PM | Last Updated on Fri, Sep 11 2020 5:36 PM

frog swallows firefly? Rare video gives the answer - Sakshi

సాక్షి, ముంబై: సోషల్ మీడియా అనేకవింతలకు విశేషాలకు నెలవు. ఆటవిడుపుగా, అసక్తికరంగా ఉండే ఇలాంటి వీడియోలు నెటిజనులను  విపరీతంగా ఆకట్టుకుంటాయి. తాజాగా ఎపుడూ చూడని ఒక వింత వీడియో వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఒక కప్ప మిణుగురును మింగితే.. ఎలా ఉంటుంది.. ఆ మిణుగురు పురుగు  కప్ప పొట్టలో మిణుకు మిణుకుమంటూ కనిపిస్తే..ఎలాంటి ఉంటుంది. సరిగ్గా ఇలాంటి వీడియోనే ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. 14 సెకన్ల వీడియోను నేచర్ ఈజ్ లిట్ ట్వీట్ చేసిన తర్వాత సంచలనంగా మారిపోయింది. 60.8 లక్షల కంటే ఎక్కువ వ్యూలు, 4.3 వేల లైక్‌లను సంపాదించింది. దీనికి మించిన యూజర్లు కామెంట్లు, పిట్ట కథలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఒక ట్విటర్ యూజర్ మాయ ఏంజెల్‌తో పోలుస్తూ.. మనలో ఉన్న వెలుగును ఎవరూ చంపలేరు అంటూ ఒకరు, బీకన్ లైటు వెలుగుతున్న విమానంలా ఉందని మరొకరు కామెంట్ చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement