
సాక్షి,ప్రకాశం జిల్లా : యర్రగొండపాలెం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌కి పోలీసులు నోటీసులు అందించారు. ఎక్స్ వేదికగా నారా లోకేష్‌పై పెట్టిన పోస్టింగ్‌తో పాటు ఎన్నికల సమయంలో పెట్టిన నాలుగు కేసులకు సంబంధించి ఎర్రగొండపాలెం ఎస్సై చౌడయ్య నోటీసులు ఇచ్చారు.
ఈ నోటీసులపై ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా.. ఎన్నికుట్రలు చేసినా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను నొక్కేయాలనే కుట్రతోనే వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై విచ్చలవిడిగా కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. అయినప్పటికీ కూటమి ప్రభుత్వంపై తమ పోరాటం ఆగదని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment