చంద్రబాబు సర్కార్‌ పేదలకు ఏం చేసింది?: ఎమ్మెల్యే తాటిపర్తి | YSRCP MLA Tatiparthi Chandrasekhar Comments On Chandrababu Naidu Over Super Six, More Details Inside | Sakshi
Sakshi News home page

చంద్రబాబు సర్కార్‌ పేదలకు ఏం చేసింది?: ఎమ్మెల్యే తాటిపర్తి

Published Sun, Jan 5 2025 3:30 PM | Last Updated on Sun, Jan 5 2025 4:21 PM

Ysrcp Mla Tatiparthi Chandrasekhar Comments On Chandrababu

సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌ మండిపడ్డారు. ఆదివారం ఆయన వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు సర్కార్‌ పేదలకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో విచ్చలవిడిగా దోపిడీ జరుగుతుంది. నారా లోకేష్‌ సకల శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్‌సీపీపై నారా లోకేష్‌ విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

‘‘ఉద్యోగులకు ఇప్పటివరకు జీతాలు ఇవ్వలేదు. విద్యా శాఖలో లోకేష్‌ ఏం సంస్కరణలు చేశారో చెప్పాలి. స్కూళ్లలో డిజిటల్‌ క్లాసులు జరుగుతున్నాయా?. ఇంగ్లీష్‌ మీడియంపై దుష్ప్రచారం చేస్తున్నారు. కూటమి నేతలు చెప్పే మాటలకు.. చేసే పనులకు పొంతన ఉందా?. వైఎస్సార్‌సీపీ హయాంలో అన్ని స్కూళ్లలో డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లు ఏర్పాటు చేశాం. గవర్నమెంట్‌ బడుల్లో చదివే విద్యార్థులు అంటే చంద్రబాబు ప్రభుత్వానికి చిన్నచూపు’’ అంటూ చంద్రశేఖర్‌ దుయ్యబట్టారు.

ఇదీ చదవండి: ఉద్యోగులపై కూటమి సర్కార్‌ కక్ష సాధింపు: వెంకట్రామిరెడ్డి

‘‘రాష్ట్రంలో చీటింగ్ ప్రభుత్వం పాలన చేస్తోంది. ఒక్క కేబినెట్ మీటింగ్‌లో కూడా ప్రజా సంక్షేమ పథకాల ఊసులేదు. లక్షా 19 వేల కోట్లు అప్పు చేసి ఏం చేశారో చెప్పటం లేదు. అధికారంలోకి రాకముందు ఎన్నో చెప్పి, ఇప్పుడు ఒక్కటీ అమలు చేయడం లేదు. ఎమ్మెల్యేలు, మంత్రులు దోపిడీ చేస్తూ ప్రజల గురించి ఆలోచించటం మానేశారు. లోకేష్  మంత్రి అయ్యాక విద్యాశాఖ భ్రష్టు పట్టింది. ఈ రోజు వరకు టీచర్లకు జీతాలు కూడా ఇవ్వలేకపోయారు. ప్రభుత్వ స్కూళ్ల మీద ఖర్చు పెట్టటం తప్పు అని ఎల్లోగ్యాంగ్ మాట్లాడుతోంది

..ఇంగ్లీషు మీడియాన్ని పేద పిల్లలకు దూరం చేశారు. లోకేష్ మాత్రం విదేశాల్లో ఇంగ్లీషు మీడియం చదివారు, మా పేదలకు మాత్రం ఇంగ్లీషును దూరం చేస్తున్నారు. చంద్రబాబుకే సంపద సృష్టి తప్ప పేద ప్రజలకు కాదని తేలిపోయింది. దళితులంటే చంద్రబాబుకు చిన్నచూపు. దళిత ఉద్యోగులు, అధికారుల మీద కక్షకట్టి చర్యలు తీసుకుంటున్నారు. లోకేష్‌కి మిడిమిడి జ్ఞానం. అందుకే విశాఖకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏం చేయలేదంటూ మాట్లాడుతున్నారు. రైల్వే జోన్ కోసం స్థల సేకరణ నుండి వాల్తేరు డివిజన్ సాధించటం వరకు వైఎస్సార్‌సీపీనే పోరాటం చేసి సాధించింది. విశాఖకు మెట్రో రైలు డీపిఅర్‌ని సిద్ధం చేసింది మా ప్రభుత్వమే. అనేక సాఫ్ట్‌వేర్ కంపెనీలు, పరిశ్రమలు మా హయాంలోనే వచ్చాయి. చంద్రబాబు ప్రభుత్వం గీతం యూనివర్శిటీతో భూములను కబ్జా చేయించింది

..రాజధానిలో తాత్కాలిక భవనాలను నిర్మించి దోపిడీ చేసింది చంద్రబాబు ప్రభుత్వం. దేశం మొత్తం మీద పెట్రోలు ధర చిత్తూరు జిల్లాలోనే అధికంగా ఉంది. చంద్రబాబు సొంత జిల్లాలోనే అధికంగా ధర ఉందంటే అయన పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల్లోకి వచ్చి చూస్తే వారి ఆగ్రహం ఎలా ఉందో తెలుస్తుంది’’ అని చంద్రశేఖర్‌ చెప్పారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement