tatiparthi
-
చంద్రబాబు సర్కార్ పేదలకు ఏం చేసింది?: ఎమ్మెల్యే తాటిపర్తి
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. ఆదివారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు సర్కార్ పేదలకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో విచ్చలవిడిగా దోపిడీ జరుగుతుంది. నారా లోకేష్ సకల శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్సీపీపై నారా లోకేష్ విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.‘‘ఉద్యోగులకు ఇప్పటివరకు జీతాలు ఇవ్వలేదు. విద్యా శాఖలో లోకేష్ ఏం సంస్కరణలు చేశారో చెప్పాలి. స్కూళ్లలో డిజిటల్ క్లాసులు జరుగుతున్నాయా?. ఇంగ్లీష్ మీడియంపై దుష్ప్రచారం చేస్తున్నారు. కూటమి నేతలు చెప్పే మాటలకు.. చేసే పనులకు పొంతన ఉందా?. వైఎస్సార్సీపీ హయాంలో అన్ని స్కూళ్లలో డిజిటల్ క్లాస్ రూమ్‌లు ఏర్పాటు చేశాం. గవర్నమెంట్ బడుల్లో చదివే విద్యార్థులు అంటే చంద్రబాబు ప్రభుత్వానికి చిన్నచూపు’’ అంటూ చంద్రశేఖర్ దుయ్యబట్టారు.ఇదీ చదవండి: ఉద్యోగులపై కూటమి సర్కార్ కక్ష సాధింపు: వెంకట్రామిరెడ్డి‘‘రాష్ట్రంలో చీటింగ్ ప్రభుత్వం పాలన చేస్తోంది. ఒక్క కేబినెట్ మీటింగ్‌లో కూడా ప్రజా సంక్షేమ పథకాల ఊసులేదు. లక్షా 19 వేల కోట్లు అప్పు చేసి ఏం చేశారో చెప్పటం లేదు. అధికారంలోకి రాకముందు ఎన్నో చెప్పి, ఇప్పుడు ఒక్కటీ అమలు చేయడం లేదు. ఎమ్మెల్యేలు, మంత్రులు దోపిడీ చేస్తూ ప్రజల గురించి ఆలోచించటం మానేశారు. లోకేష్ మంత్రి అయ్యాక విద్యాశాఖ భ్రష్టు పట్టింది. ఈ రోజు వరకు టీచర్లకు జీతాలు కూడా ఇవ్వలేకపోయారు. ప్రభుత్వ స్కూళ్ల మీద ఖర్చు పెట్టటం తప్పు అని ఎల్లోగ్యాంగ్ మాట్లాడుతోంది..ఇంగ్లీషు మీడియాన్ని పేద పిల్లలకు దూరం చేశారు. లోకేష్ మాత్రం విదేశాల్లో ఇంగ్లీషు మీడియం చదివారు, మా పేదలకు మాత్రం ఇంగ్లీషును దూరం చేస్తున్నారు. చంద్రబాబుకే సంపద సృష్టి తప్ప పేద ప్రజలకు కాదని తేలిపోయింది. దళితులంటే చంద్రబాబుకు చిన్నచూపు. దళిత ఉద్యోగులు, అధికారుల మీద కక్షకట్టి చర్యలు తీసుకుంటున్నారు. లోకేష్‌కి మిడిమిడి జ్ఞానం. అందుకే విశాఖకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏం చేయలేదంటూ మాట్లాడుతున్నారు. రైల్వే జోన్ కోసం స్థల సేకరణ నుండి వాల్తేరు డివిజన్ సాధించటం వరకు వైఎస్సార్సీపీనే పోరాటం చేసి సాధించింది. విశాఖకు మెట్రో రైలు డీపిఅర్ని సిద్ధం చేసింది మా ప్రభుత్వమే. అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు, పరిశ్రమలు మా హయాంలోనే వచ్చాయి. చంద్రబాబు ప్రభుత్వం గీతం యూనివర్శిటీతో భూములను కబ్జా చేయించింది..రాజధానిలో తాత్కాలిక భవనాలను నిర్మించి దోపిడీ చేసింది చంద్రబాబు ప్రభుత్వం. దేశం మొత్తం మీద పెట్రోలు ధర చిత్తూరు జిల్లాలోనే అధికంగా ఉంది. చంద్రబాబు సొంత జిల్లాలోనే అధికంగా ధర ఉందంటే అయన పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల్లోకి వచ్చి చూస్తే వారి ఆగ్రహం ఎలా ఉందో తెలుస్తుంది’’ అని చంద్రశేఖర్ చెప్పారు. -
PAC ఛైర్మన్ ను ప్రతిపక్షానికే ఇవ్వాలి
-
PAC పదవిలో కూడా రాజకీయమా? కూటమి నిర్ణయంపై ఎమ్మెల్యే చంద్రశేఖర్
-
పీఏసీ చరిత్రలో ఇవాళ చీకటి రోజు: ఎమ్మెల్యే చంద్రశేఖర్
సాక్షి, తాడేపల్లి: పీఏసీ చరిత్రలో ఇవాళ చీకటి రోజుగా నిలిచిందని.. ప్రతిపక్షానికి రావాల్సిన పీఏసీ పదవిని రాకుండా అడ్డుకున్నారంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రభుత్వం చేసే ఖర్చులపై పీఏసీ నిఘా ఉంటుందనే ఇలాంటి కుట్ర చేశారన్నారు.ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది. అందుకే పీఏసీ ఛైర్మన్ పదవిని ప్రతిపక్షానికే ఇస్తారు. 1985-86లో టీడీపీకి 30 సీట్లే వచ్చినప్పటికీ ఏరాసు అయ్యపరెడ్డికి పీఏసీ ఛైర్మన్ ఇచ్చారు. వంద సంవత్సరాల పీఏసీ చరిత్రలో గొప్ప గొప్ప వ్యక్తులు ఛైర్మన్‌గా వ్యవహరించారు. తగిన సంఖ్యా బలం లేకపోయినా పీఏసీ ఛైర్మన్‌గా ఇచ్చారు. బోఫార్స్ కుంభకోణం కూడా ఇదే పీఏసీ బయట పెట్టింది. స్పెక్ట్రం స్కాంని కూడా పీఏసీ ఛైర్మన్ మురళీ మనోహర్ జోషి బయటకు తీశారు. కోల్గేట్ కుంభకోణం వంటి అనేక అంశాలను పీఏసీనే బయటకు తీసింది’’ అని చంద్రశేఖర్ గుర్తు చేశారు.‘‘అలాంటి వ్యవస్థను ఏపీలో లేకుండా చేయాలని చంద్రబాబు చూస్తున్నారు. అప్పుడు అడ్డూ అదుపు లేకుండా స్కాంలు చేయొచ్చని భావిస్తున్నారు. ప్రతిపక్షానికి పదవి ఇవ్వనప్పుడు నామినేషన్ల వ్యవహారం ఎందుకు తెచ్చారు?. మా పార్టీ తరపున నామినేషన్ వేయటానికి వెళ్తే ఒక్క అధికారి కూడా అక్కడ లేరు. మూడు గంటలసేపు అక్కడ కూర్చోపెట్టి అవమానపరిచారు. మా హయాంలో ప్రతిపక్షానికే పీఏసీ ఛైర్మన్ పదవి ఇచ్చాం. హుందాగా మేము వ్యవహరించాం. కానీ అలాంటి హుందాతనం కూటమి ప్రభుత్వంలో లేదుఇదీ చదవండి: ‘లోకేష్ సీఎం కాకూడదనేది ఎవరి ఆలోచనా?’..పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చూస్తే చంద్రబాబుకు భయం.. అందుకే ఆయనకి పీఏసీ ఛైర్మన్‌గా రాకుండా అడ్డుకున్నారు. మూడు కమిటీల్లో ఒక్కదానికి కూడా ప్రతిపక్ష సభ్యులను లేకుండా చేశారు. తద్వారా అడ్డగోలుగా దోపిడీ చేయాలని భావించారు. చివరికి పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో కూడా పీఏసీ ఛైర్మన్ పదవిని ప్రతిపక్షానికే ఇచ్చారు. తాలిబన్లు మాత్రమే ఆ పదవిని వారి దగ్గర పెట్టుకున్నారు. టీడీపీ ప్రభుత్వం కూడా తాళిబన్ల బాటలోనే నడుస్తోంది. రాష్ట్రాన్ని తాలిబన్ల బాటలో నడిపిస్తున్నారు. దళిత నేతలకు రాష్ట్రంలో రక్షణలేదు. నందిగం సురేష్‌ని మూడు నెలలుగా జైలులో పెట్టి వేధిస్తున్నారు. నాపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. మాదిగలపై ఇలాంటి వివక్ష తగదు’’ అని చంద్రశేఖర్ పేర్కొన్నారు. -
ఏపీలో YSRCP నాయకులపై కూటమి సర్కారు వేధింపులు
-
ఎవరు ప్రశ్నిస్తే వాళ్లపై అక్రమ కేసులు పెడుతున్నారు: Tatiparthi Chandrasekhar
-
సంపద సృష్టిస్తానన్న బాబు అప్పులు సృష్టిస్తున్నాడు..!
-
కష్టాలను అధిగమించి ప్రత్యర్థితో పోరాడి గెలిచిన తాటిపర్తి
యర్రగొండపాలెం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 15 సంవత్సరాలుగా నిజాయతీగల కార్యకర్తగా పనిచేసిన తాటిపర్తి చంద్రశేఖర్‌కు ఫలితం దక్కింది. మంగళవారం జరిగిన కౌంటింగ్‌లో ఎమ్మెల్యేగా ఆయన ఘన విజయం సాధించారు. సింగరాయకొండలో సామాన్య కార్యకర్తగా పనిచేస్తున్న ఆయనను గుర్తించిన ఆ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి యర్రగొండపాలెం(ఎస్సీ) టికెట్ ఇచ్చి గౌరవించారు. ఆ గౌరవాన్ని నిలుపుకోవటానికి నియోజకవర్గానికి కొత్త అభ్యర్థి అయినా గ్రామ స్థాయి కార్యకర్త నుంచి మండల స్థాయి నాయకుల వరకు ఆయన కలుపుకొనిపోయారు. నాయకుల మధ్య ఉన్న వర్గ విభేదాలను ఆయన ఎంతో సహనంతో పరిష్కరించగలిగారు. అందరినీ సమన్వయ పరచడంలో ఆయన అనేక కష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది. అనతి కాలంలోనే నియోజకవర్గంలో ఉన్న సమస్యలను తెలుసుకొని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వచ్చారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న నీటి సమస్యను వెనువెంటనే పరిష్కరించగలిగారు. అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లను తన సొంత నిధులతో మరమ్మతులు చేయించి ఆయా ప్రాంత ప్రజల మన్ననలు పొందారు. ప్రత్యర్థి టీడీపీ వర్గానికి చెందిన వారు అడుగడుగునా పెట్టిన కష్టాలను ఎదుర్కొంటూ ఆయన ఎన్నికల్లో ముందుకు సాగారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి టీడీపీ నేతలు వైఎస్సార్ సీపీ చేస్తున్న కార్యక్రమాలకు అభ్యంతరం చెప్తూ ఆర్వోకు ఫిర్యాదు చేయడం, కేసులు నమోదు చేయించడం లాంటి కష్టాలను సైతం అధిగమించి ప్రత్యర్థితో పోరాడిన ఆయనను నియోజకవర్గ ప్రజలు 5,477 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. తన స్వగ్రామమైన సింగరాయకొండలో చేసిన స్వచ్ఛంద సేవలు ఈ ఎన్నికల్లో బాగా పనిచేశాయని చెప్పవచ్చు. తాటిపర్తి చంద్రశేఖర్ వదిన, జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షురాలు వనజ, ఆయన భార్య భాగ్యసీమ చౌదరి, కుమార్తె ఆకాంక్ష ఇంటింటికీ తిరిగి చేసిన ప్రచారం నియోజకవర్గ ప్రజలు గుర్తించి వారికి తగిన ఫలితాన్ని అందించారు. వైఎస్సార్ సీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, బూత్ కన్వీనర్లు, సచివాలయాల కన్వీనర్లు ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవటానికి తమ స్థాయికి మించి కష్టపడ్డారని చెప్పవచ్చు. -
తాటిపర్తిలో రేషన్‌షాపు సీజ్
తాటిపర్తి(పెద్దాపురం) : విజిలెన్స్ అధికారులు సోమవారం తాటిపర్తి, తిరుపతి గ్రామాల్లో దాడులు నిర్వహించారు. తాటిపర్తిలో బీవీ చక్రావతికి చెందిన రేషన్ షాపు నం.44లో విజిలెన్స్ డీసీటీఓ బి.రత్నకుమార్, విజిలెన్స్ తహసీల్దార్ గోపాలరావు, పీసీ స్వామి తనిఖీలు నిర్వహించారు. నిర్ణీత స్టాకు కంటే 55 క్వింటాళ్లు (110 బస్తాలు) బియ్యం తక్కువగా ఉండడాన్ని గుర్తించారు. నిర్వాహకులపై 6ఏ కేసు నమోదు చేసి, దుకాణాన్ని సీజ్ చేశారు. తిరుపతిలో స్టాకు సక్రమంగా ఉందని అధికారులు తెలిపారు.