కీపింగ్ చేస్తూ సూపర్ క్యాచ్ పట్టిన హర్భజన్ సింగ్.. వీడియో వైరల్‌.. | Harbhajan Singh Celebrates After Taking Catch In Gully Cricket | Sakshi
Sakshi News home page

Harbhajan Singh: కీపింగ్ చేస్తూ సూపర్ క్యాచ్ పట్టిన హర్భజన్ సింగ్.. వీడియో వైరల్‌..

Published Fri, Nov 19 2021 9:50 AM | Last Updated on Fri, Nov 19 2021 3:14 PM

 Harbhajan Singh Celebrates After Taking Catch In Gully Cricket - Sakshi

Harbhajan Singh Celebrates After Taking Catch In Gully Cricket: భారత  వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పడు అభిమానుల కోసం ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూనే ఉంటాడు. అయితే ఓ అసక్తికరమైన వీడియోను  హర్భజన్  ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ఆ వీడియోలో అంత ఆసక్తికరం ఏముందంటే.. తన ఇంటికి సమీపంలో హర్భజన్ గల్లీ క్రికెట్ ఆడాడు.

మీరు అనుకున్నట్టు బ్యాటర్‌గానో, బౌలర్‌గానో కాదు.. ఈ సారి టర్బోనేటర్ వికెట్‌ కీపర్‌ అవతారం ఎత్తాడు. వికెట్‌ కీపింగ్‌ చేయడమే కాకుండా ఒక క్యాచ్‌ కూడా పట్టాడు. అది ఇప్పడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. కాగా ఈవీడియోకు  భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కామెంట్రీ చెప్పడం గమనార్హం. ఈ వీడియోపై నెటజన్లు స్పందిస్తూ.. సింగ్‌ ఈజ్‌ కింగ్‌ అని, పాకిస్తాన్‌ వికెట్‌ కీపర్‌ కమ్రాన్ అక్మాల్ కంటే బాగా కీపింగ్ చేస్తున్నావ్ అని కామెంట్‌ చేస్తున్నారు.

చదవండి: Mahela Jayawardene: శ్రీలంక కోచ్‌గా మహేల జయవర్ధనే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement