ట్రోలర్స్‌కు మంచు విష్ణు హెచ్చరిక | Manchu Vishnu Serious Comments On Social Media Trolls On Actors In The Name Of Dark Comedy | Sakshi
Sakshi News home page

నటీనటులను ట్రోల్‌ చేసేవారికి మంచు విష్ణు హెచ్చరిక

Published Wed, Jul 10 2024 8:32 PM | Last Updated on Thu, Jul 11 2024 1:15 PM

Manchu Vishnu Comments On Social Media Trolls

సోషల్ మీడియా కీచకుడు ప్రణీత్‌ హనుమంతును పోలీసులు అరెస్ట్‌ చేశారు. కొన్నేళ్లుగా తన స్నేహితులతో వీడియో చాటింగ్‌ చేస్తూ అసభ్యకర మాటలతో రెచ్చిపోతున్న ప్రణీత్‌ హనుమంతు తీరుపై టాలీవుడ్‌ హీరో సాయి దుర్గ తేజ్‌ మొదటిసారి రియాక్ట్‌ అయ్యాడు. ఆయన తీరును తప్పుబడుతూ ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులకు సోషల్‌ మీడియా ద్వారా విషయాన్ని షేర్‌ చేశారు. దీంతో ఈ విషయం నెట్టింట వైరల్‌ అయింది. ఇలాంటి చిల్లర కామెంట్లు చేస్తున్న వ్యక్తుల గురించి తాజాగా 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు.

సోషల్ మీడియాలో  డార్క్ కామెడీ పేరుతో నటీనటులపై ట్రోలింగ్ చేస్తూ ఎవరైనా వీడియోలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంచు విష్ణు తెలిపారు. ప్రపంచంలో తెలుగు వాళ్లకు మంచి పేరు ఉంది. కానీ ఈ మధ్య కొంత మంది సోషల్ మీడియాలో  డార్క్ కామెడీ, ఫన్నీ ట్రోలింగ్ వీడియోలతో  చెడ్డ పేరు తీసుకొస్తున్నారని ఆయన అన్నారు. కామెడీ పేరుతో ఇలాంటి వీడియోలు చేయడం సరికాదని విష్ణు సూచించారు. 

ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్‌ చేసే వాళ్లపై సైబర్ సెక్యూరిటీ వాళ్లకు పిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఇకనుంచి సోషల్‌ మీడియాలో ఉన్న వారందరూ తమ తీరును మార్చుకోవాలని మంచు విష్ణు కోరారు. సోషల్‌ మీడియాలో ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులకు  మంచు విష్ణు అప్పీల్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement